🙏శ్రీ శారదా శ్యామ సందేశం🙏

 శ్రీ శారద శ్యామ సందేశం: 1 Jan

పని చేయుముదేవుని నామమును ఉచ్చరించుముసత్గ్రంథములను చదువుము. పోటీలనువంతులనుకీచులాటలనుఅసూయలను మానితే దేవుడు కాపాడును

Work, Chant the God's name, read divine stories. If you stop Comparisons, bets, quarrels, jealousy, God will save you. 

శ్రీ శారద శ్యామ సందేశం: 2 Jan

దైవముగురువు నీతోనే ఉండి నిరంతరం నిన్ను గమనిస్తూనీ మాటలనాలకిస్తూనిన్ను హెచ్చరిస్తూ ఉంటారు. కనుక నిరంతరం ఆనందంగా ఉండాలంటే మేలుకో. గురు బోధనలు మరువకఎరుకజాగరూకతతో ఉండుము.

God and Guru are with you andl constantly watching you, listening to your words and warning you. So wake up if you want to be happy forever. Don't forget the teachings of Guru, be aware and alert. 

శ్రీ శారద శ్యామ సందేశం: 3 Jan

మానవాళిసంసారసాగరమును గురూపదేశమనే బలమైన నావలో కూర్చొనిఅభ్యాస బలముపురాకృత సంస్కారములు అనే గాలిచే త్రోయబడి గురువనే సారంగుచే నడుపబడిదాటించబడతారు.

Humankind seated in a strong ship of Guru's Doctrine that guides us in the ocean of kinship. By the Driven essence of the Guru, with the wind of learning strength, mythical rituals, we will be crossed. 

శ్రీ శారద శ్యామ సందేశం: 4 Jan

సాయి దేవుని అనుగ్రహమును పొందెడి మార్గములోమన బుద్ధులనుఆచరణలనుజీవితములను తన పరము చేసుకుని నడిపించమని ఆర్తితో సాయినే ప్రార్థించండి.

On the way to obtain the blessings of Lord Sai. With intensity Pray to Lord Sai that "Guide us our Mind, Practices, Lives by taking it as yours"

శ్రీ శారద శ్యామ సందేశం: 5 Jan

మన ఉద్దేశము మరియు ఆసక్తి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండటం చాలా అవసరం. సత్యముసన్మార్గము నుండి గతి తప్పినచో మన భవిష్యత్తు దయనీయమగును.

Our intention and interest are always changing.  Therefore it is very important to keep testing them at all times.  Our future will be pitiful if we stray from the path of truth and righteousness.

శ్రీ శారద శ్యామ సందేశం: 6 Jan

భగవంతుడు/గురువు గురించి భావన ఇలా ఉండాలి. మీ నామము ఎప్పుడూ పలుకుతూ ఉండనీవు తండ్రి. నాకు తమోగుణము రాకుండా చేయి తండ్రి. అందరిలో మీరు ఉన్నారు అనే భావన దృఢముగా కలిగించు తండ్రి.

This is how the perception towards God/Guru should be. Divine Father, may your name always be Chanted. Father, please help me not to get Tamogun (Darkness). Father strengthen the sense that you are in everyone.

శ్రీ శారద శ్యామ సందేశం: 7 Jan

అణకువ కలిగియుండు. నీ ప్రార్ధన మేఘంలా దూసికొనివెళ్ళి దైవ సింహాసనం చేరుతుంది.

Have humility. Your prayer will move like a cloud to reach the divine throne.

శ్రీ శారద శ్యామ సందేశం: 8 Jan

అదృష్టం దైవమేదురదృష్టము దైవమే కావున ఆ ఎరుకతో కృతజ్ఞుడవై ఉండి ప్రశాంతతను పొందుము.

Luck is divine, misfortune is also divine so with consciousness be thankful and get the peace.

శ్రీ శారద శ్యామ సందేశం: 9 Jan

సమగ్ర దైవ భక్తిలోనే అత్యున్నత స్వేచ్ఛ కూడి ఉంటుంది. నీ సాధనను దైవంతో ఆరంభించిదైవంతోనే ముగించు.

The inclusive divine devotion has Emancipation. Begin your practice with God and end with God.

శ్రీ శారద శ్యామ సందేశం: 10 Jan

అపారమైనఅనంతమైన ఆనందాన్ని పొందుటకు ప్రకృతిని పరిశీలించుటపరిశీలనల నుండి పాఠములు నేర్చుకొనుటవాటిని అనుభవమునకు తెచ్చకొనుటయే మార్గములు.

Observing nature, learning lessons from observations, and bringing them to experience are ways to gain enormous, infinite happiness.

శ్రీ శారద శ్యామ సందేశం; 11 Jan

నీవు పరిశుద్ధంగా ఉండాలనుకుంటే మనోవాక్కాయ కర్మలయందు నిర్మలంగా ఉండు. నీ అంతరాత్మ ప్రబోధాన్ని మాత్రమే అనుసరించు.

If you want to be pure, be serene in your mind, words and deeds.  Only follow your conscience.

శ్రీ శారద శ్యామ సందేశం: 12 Jan

నీవింకా ఇంద్రియ సుఖములనుజిహ్వ చాపల్యమును కోరుకుంటున్నావాఅలాగైతే నీవు దైవ తత్త్వమును తెలిసికొనజాలకబ్రహ్మీ భూతస్థితిని అనుభవింపజాలవు.

Are you still longing for sensual pleasures and tongue pleasure? If so, until you know the divine philosophy, you will not experience the divine transcendental state. 

శ్రీ శారద శ్యామ సందేశం: 13 Jan

మహాత్ముల దగ్గర మన ఇష్టాయిష్టాలు వదిలిపెట్టాలి. అన్ని నీవే అని పడి ఉండాలి. ఏ భావమూ లేకుండా గురువు దగ్గరకు వెళ్తే ప్రశ్నించకుండానే అన్ని సమాధానాలు వస్తాయి.అప్పుడు అవి గ్రహించే శక్తి ఉండాలి. ధ్యానముపూజ చేస్తే ఆ సమాధానం గ్రహించే శక్తి వస్తుంది.

We must leave our likes and dislikes near sages. Everything is there, stay there. Without any feeling if you go to the Guru without questioning, all the answers will come. You need comprehension power to understand. If you meditate and worship, you will get the power to comprehend that answer.

శ్రీ శారద శ్యామ సందేశం: 14-Jan

ఉచ్ఛ్వాస-నిశ్వాసలకు అనుగుణంగా భగవన్నామము మనసులో చెపుతూ చెవులతో వింటూ ఉండాలి.

According to the inhalation and exhalation Divine Name should chant in mind and listen with ears. 

శ్రీ శారద శ్యామ సందేశం: 15 Jan

ఒకే స్థలములోఒకే సమయములో ప్రతిరోజు ధ్యానము చేసుకునేందుకు ప్రయత్నించాలి.

In the one place, at the same time,  try to meditate every day. 

శ్రీ శారద శ్యామ సందేశం: 16 Jan

సాయి తాతయ్య ఎదురుగా కూర్చునిసాయి తాతయ్య కళ్లనుంచి శక్తి వస్తుందనిఆ శక్తి మన తలనుండి కాలి దాకా ప్రసరించిందనిఆ శక్తి మన చుట్టూ రక్షణ కవచంలాగా ఉంది అనుకొని ధ్యానము చేయాలి.

Sit infront of Sai Baba and meditate, thinking that the energy transmits from Sai Baba's eye's, that energy radiates from our head to our toes, and that energy is like a protective shield around us. 

శ్రీ శారద శ్యామ సందేశం: 17 Jan

బొట్టు పెట్టుకునే స్థానంలో కానీహృదయ స్థానంలో కానీ గురు పాద పద్మాలను చూస్తూ బొడ్డు దగ్గర నుండి (మనసులో) నామము చెప్తూవింటూ ఆ నామాన్ని పాదాల మీద పెడుతున్నట్లుగా ఊహించుకుంటూ మొదటిలో సాధకులు ధ్యానాన్ని సాధన చేయాలి.

First of all the practitioners, from the blob point or from the heart place looking at the lotus feet of Guru. From the belly (the heart) Chant the name, listen the name. Imagine our chanted name kept on the lotus feet should practice meditation. 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18-Jan

భవిష్యత్తును గురించి బాధపడకుండా దైవ సంకల్పానికి మనల్ని మనం సమర్పించుకొనుటయే అత్యున్నత జ్ఞానము.

The highest wisdom is to submit ourselves to the Divine Will, without worrying about the future. 

శ్రీ శారద శ్యామ సందేశం: 19 Jan

మహాత్ముని వద్ద కానీ లేదా గురువు వద్ద కానీ తరచూ కొంత సమయం గడుపుచుండుట వల్ల నీ ఆధ్యాత్మిక పథం నీ అర్హతనుబట్టి ఉన్న తమౌతుంది.

Spending time oftenly with Mahatma or Guru that will enhance your spiritual path according to your merit.

శ్రీ శారద శ్యామ సందేశం: 20 Jan

సారము లేనిమిక్కిలి ఆలోచనలు మానవశక్తిని నశింపచేస్తాయి. నిరంతర కృషి మిక్కిలి ఆలోచనలను తగ్గించగానిష్కల్మషమైన భక్తిఆలోచనల సారమును పెంపొందించును.

Essenceless, extreme thoughts destroy human power. Continuous effort minimizes the extreme thoughts, while cultivating pure devotion will increases the essentials in thoughts.

శ్రీ శారద శ్యామ సందేశం: 21 Jan

గాలి మేఘాలను కలుపుతుందిఅదే గాలి మళ్ళీ వాటిని చెదరగొడుతుంది. అదే విధంగా మనస్సు మనుష్యుల బంధానికీమోక్షానికీ కారణమవుతోంది.

The wind connects the clouds, and the same wind scatters them again. In the same way the heart is causing the bondage and salvation of human beings.

శ్రీ శారద శ్యామ సందేశం: 22 Jan

నీళ్ళ వల్ల దేహం శుభ్రపడుతుంది. జ్ఞానం వల్ల మేధస్సు వికసిస్తుంది. సత్యం వల్ల మనస్సు ఉద్దీపిస్తుంది. అహింసవల్ల ఆత్మ ఉజ్జ్వలనమవుతుంది. విద్య యొసగును వినయంబుదైవానికి శరణుచెందుపతనంగాకు.

Water cleanses the body.  Wisdom develops Mind. Truth stimulates the heart.  Non-violence enlightens the soul. Education enhances humbleness. Don't fall, surrender to God.

శ్రీ శారద శ్యామ సందేశం: 23 Jan

ప్రేమసేవక్షమ గుణములతో ప్రపంచమును జయించగలరు. క్రోధముఈర్ష్యఅసూయద్వేషముఅసంతృప్తులతో తమ మనుషులను/మనసులను కూడా జయించలేరు. కదాకాదా?

Can conquer the world with the qualities of love, service and forgiveness.  Can't even conquer their own people / minds with anger, jealousy, envy, hatred, dissatisfaction. Yes! Isn't?

శ్రీ శారద శ్యామ సందేశం: 24 Jan

అంతటా భగవంతుని చూడగలిగే ప్రయత్నమే నిజమైన సాధన.

The endeavours to see the God everywhere is the real exercise. 

శ్రీ శారద శ్యామ సందేశం: 25 Jan

ఓర్పుహృదయపూర్వక ప్రేమదైవిక లక్షణములుమంచి ఆలోచనలుదైవము/గురువు యందు నమ్మకము మరియు ఆత్మవిశ్వాసములతో మనము ప్రపంచమునే జయించవచ్చు. ఇవన్నీ లేనప్పుడు మనము ఏమీ సాధించలేము.

With patience, heartful love, divine qualities, good thoughts, faith and self-confidence in God/Teacher we can conquer the world. Without all this we can achieve nothing. 

శ్రీ శారద శ్యామ సందేశం: 26 Jan

ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేననిప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించిమంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును.

Patience need to comes from believing in one's favorite God/Guru, and everything that happens is with their Will for our Welfare. Acquiring wisdom to perceive the good in everything, Can discern the Concent of God/Guru philosophy. 

శ్రీ శారద శ్యామ సందేశం: 27 Jan

యోగాభ్యాసముల వలన శరీరము బాగా ఉంటుంది. ఆ అభ్యాసముతోకూడా భగవన్నామమును జతపరచుకొనుట లాభదాయకము.

Yoga exercises keep the body well. With that practice, associate with divine name chanting it is beneficial.

శ్రీ శారద శ్యామ సందేశం: 28 Jan

ఎవ్వరూ శాశ్వతంగా బాధపడరు. ప్రతివారూ అనాధలేదైవ నివాసమే అందరి అనాధశరణాలయం. నిన్ను దరిజేర్చుకొమ్మని దైవాన్ని పట్టుకుని ప్రార్థించు.

No one will suffer forever. Everyone is an orphan, and God's abode is everyone's orphanage. Hold on to God and pray He will guide you.

శ్రీ శారద శ్యామ సందేశం: 29 Jan

ఆలోచనారహితమయిన స్థితిగలిగినపుడే శాంతివిశ్రాంతి. గురువును ఆశ్రయించివిశ్వసించిఆయన చెప్పిన దానిని విజ్ఞతతో చేస్తూచేయడం కర్తవ్యంగా భావిస్తూగురువును శంకించకుండా 12 సంవత్సరములు పడిఉంటే ఆ స్థితి వస్తుంది.

Peace and Relaxation is in the state of thoughtlessness. Rely on the Guru, trusts him, wisely do what he says, feels it is your duty to do so. 12 years without doubting , believe Guru, you will be in that state.

శ్రీ శారద శ్యామ సందేశం: 30 Jan

బాహ్య ఆడంబరములు లోకుల కొరకే గానీ మరెందుకూ కొఱగావు. నిరాడంబరమగు అంతఃకరణము నందుండి పెల్లుబికెడి ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్న వదనుడై పలుకుతాడు.

External luxuries are only for worldly people but not for anything else. From the modest intuition, at the call of love, SriGuru becomes pleasent and speaks with joy.

శ్రీ శారద శ్యామ సందేశం: 31 Jan

ఏ కార్యక్రమములో కూడా సోమరితనము మహా ప్రమాదకరము.

Laziness in any event is extremely dangerous.

శ్రీ శారద శ్యామ సందేశం: 1 Feb

లోక కోరికలనుఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తేశ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది.

Do not let worldly desires and hopes to  continue, Engage the mind in activities related to the God that bestows bliss, then will experience the grace of Sri Guru.

శ్రీ శారద శ్యామ సందేశం: 2 Feb

ఇవ్వడానికి అలవాటుపడితే అందులో వున్న ఆనందం మరెందులోనూ ఉండదని అనిపిస్తుంది. (స్వార్థ రహితంగా)

If you are accustomed to giving, the joy in it seems to be unmatched anywhere else (Unselfishly).

శ్రీ శారద శ్యామ సందేశం: 3 Feb

నీ గురు పాద పద్మములపై దృఢ దృష్టి నిలుపు. అమృత పానానందము కొరకై భక్తి ప్రపత్తులతో వారి పవిత్ర నామ సంకీర్తనం గావించు.

Keep a firm eye on the lotus feet of your Guru. For the sake of Elixir-Enjoyment, Sing their holy name hymn with Devotional Discipline. 

శ్రీ శారద శ్యామ సందేశం: 4 Feb

గురుకృప: తల్లి స్తన్యము వచ్చినట్లు. తల్లి పాలు రావాలని - అనుకోదు కదా! అదే విధంగా గురుకృప కూడా అర్హత కలిగి ఉంటే దానికై అదే వస్తుంది.

Guru's Grace: Like a mother's breast has come. She don't want mother's milk to come - right! Similarly, Guru's Grace also comes for the same if it is worthy. 

శ్రీ శారద శ్యామ సందేశం: 5 Feb

మోసేవాడువుండగా మనకెందుకు భయముదిగులుఆ సమయములో మనమేమి చేయాలో- ఆయనే మన చేత చేయిస్తాడు. మనము చేయవలసిందల్లా - అన్నీ ఆయనకు నివేదించుకోవడమే!

Why do we fear and worry when there is someone who carries it? At that time, what should we do, that, he will make us do it. All we have to do is report everything to Him! In, w

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Feb

ప్రాతఃకాలమున 4 గంటలకు బ్రాహ్మీముహూర్తమున నిదురలేచిమనోప్రార్థన చేసికాలకృత్యములు తీర్చుకొని, 5 గంటల నుండి సాధన మొదలు పెట్టవలెను.

In the Early-morning at 4'o clock on Brahmimuhurth wake up, perform physiologically pray, complete timely-deeds, from 5'o clock start practicing. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 7 Feb

ప్రార్థన - ప్రాతః స్మరణగురుపాదుకాస్తవముగురుగీతదక్షిణామూర్తి శ్లోకములుదత్తస్తవములింగాష్టకంవిష్ణు సహస్రనామ స్తోత్రముధ్యానముస్తోత్రం చేయవలెను.

Prayer -  Morning Chant, 'Gurupada astakam', 'Guru Gita', Dakshinamoorthy hymns, 'Dattastavamu', 'Lingashtakam', "Vishnu Sahasranama Stotramu", Meditation, "Stotram" should be done. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Feb

ప్రదక్షిణ - గుడి ప్రదక్షిణము లేదా బృందావన ప్రదక్షిణము చేయవలెను. శక్తి వంచన లేకుండా పూర్తి చేయలేనివారు మనోభావనతో ప్రదక్షిణం చేయవలెను.

Divine Circling (Pradakshina) - Do the circling around the temple or around the Brindavana. Those who cannot do with physical potential, can done with psychological perception. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Feb

నిర్ణీత సమయంలో ఒక గంట మౌనం పాటించాలి. మిగతా 23 గంటలలో అవసరమైన వరకే మాట్లాడుటకోపము లేకుండా వినయముగా మాట్లాడుటగౌరవముశాంత స్వభావంతో ఉండుటఇతరులను గురించి మాట్లాడకుండుటఅనవసర విషయములలో జోక్యము చేసుకోకుండా ఉండుట - సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.

At the scheduled time, one hour silence should be followed. The rest of the 23 hours speak when its need. Speak humbly without anger, being respectful, calm in nature, not talking about others, not interfering in unnecessary things. It is Practice compatible path to follow. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Feb

శరీరారోగ్యమునకుశక్తికొరకు మితాహారము తీసుకొనుటభగవంతుడికి నివేదన చేసినది భుజించుటఆహారం తీసుకొనునప్పుడు మౌనముగా కానీ భగవన్నామముతో గానీ ఆహారమును తీసుకొనుటతయారుచేయనప్పుడు దైవ నామముతోనే చేయుటభోజనము చేయునప్పుడు భగవంతుని నోట్లో పెడుతున్నట్లుగా భావించుట - సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.

For physical health, energy.. take diet food, offer to God, Eat in silence or with chanting name. Take food in the name of God, feel that you are putting in the God's mouth. It's the practice compatible path to follow. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Feb

బ్రహ్మచర్యము - నిరంతరము భగవంతుని విషయములతో చరించుట బ్రహ్మచర్యము.

Celibacy - Celibacy is the constant contact with the things of God. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Feb

త్యాగము - పోటీలువంతులుకీచులాటలు లేకుండా భగవంతుని సేవగా భావించాలి. పోటీలువంతులుకీచులాటలు మానుటయే త్యాగము.

Sacrifice - Without competition, shares, and shouts, should be feel as service of the God. Leaving competition, shares, and shouts is called the sacrifice. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Feb

దానము - పాత్రతనెరిగి దానము చేయవలయును. శక్తి వంచన లేకుండా దానము చేయాలి.

Donation - Donate by understanding Role, Donate without the deception of energy. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Feb

నిర్ణీత సమయంలో నామజపము చేయునప్పుడు ఉచ్ఛ్వాస-నిశ్వాసములతో పాటు నామము చేస్తూచెవులతో వింటూకళ్ళతో ఆయన రూపాన్ని చూస్తూ నామము చెయ్యాలి. నామము చేయునప్పుడు ఉత్తర దిక్కుగా గానీతూర్పు దిక్కుగా కూర్చొని చేయాలి. జపము చేయునప్పుడు భగవత్ శక్తి మనలో పూర్తిగా ఆవహించినట్లుగా భావన చేసుకోవాలి.

At the scheduled time, while performing Chanting, name should be chant with inhalations and exhalations. Listen it ears, see his form with eyes. When chanting sit in the north or east direction. While chanting feel that the Divine power is fully absorbed in us. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Feb

దినచర్యప్రార్థనప్రదక్షిణమితభాషణంసాత్వికాహారముబ్రహ్మచర్యముత్యాగముదానముసేవనామము చేస్తూ మిగతా సమయంలో నిద్రపోకుండా (పగటిపూట) సత్గంధపారాయణమహాత్ముల చరిత్రలు చదువుట సాధనానుకూలమునకు అనుసరించవలసిన మార్గము.

Daily Deeds, Prayer, Divine Circling, moderate speaking, Diet food, Celibacy, Sacrifice, Donation, Service, Chanting rest of the time (during the day), Legends Recitation, Reading the histories of the sages is the practice compatible path to follow. 

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Feb

సాయంకాలము - దేవుని పూజతులసి పూజప్రదక్షిణం

Evening- God worship, Tulasi Worship, Divine Circling. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Feb

రాత్రి పడుకునే ముందు నిస్పక్షపాతంగా దినచర్య రాసుకొనిఆత్మ పరిశీలన చేయాలి. మరునాడు చేసుకోవలసిన కార్యక్రమములు నిర్ణయించుకోవాలి. ఈ కార్యక్రమములు క్రమంగా చేసుకునేందుకై ఆరోగ్యమునుశక్తిని ఇవ్వమని శ్రీ సద్గురు దేవని ప్రార్ధిస్తూ నిద్రించాలి. ఓమ్ శ్యామ చరణం శరణం మమ.

Before going to bed at night, Impartially one should  write the daily deeds and take Self-examination. For the next day decide what activities to do. In order to do these activities for health and energy. Pray SriGuru with "Om Shyaama charanam charanam charanam mama" and sleep. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Feb

నిరంతరము జరిగే ప్రతి కార్యక్రమము ఒక సాధన (అది పని కానీనామము కానీ)

Every activity that happens Constantly is a Divine Practice (whether it is work or Chat).

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Feb

మనస్ఫూర్తిగా భగవన్నామస్మరణము భక్తితో చేస్తూ ఉంటే - భగవంతుడే నీకు అండదండగా తోడు-నీడగా ఉంటాడు. సమర్థ సద్గురు రూపములో భగవంతుడు అవతరిస్తాడు. కావునసమర్థ సద్గురువు మనకు లభించినమరొక దైవమును సేవించవలసిన అవసరం లేదు. ఆరాధనఅర్చననామస్మరణముఆత్మసమర్పణము అన్నీ గురువునకే. శ్రీ గురువు మాత్రమే జీవిని తరింపచేయగల సమర్థుడు. శ్రీ గురు కృప పొందగలిగేలా కృషి మాత్రము తీవ్రముగా మనము చేస్తూఓర్పుతో ఉండాలి.

Wholeheartedly Chanting divine name with devotion means God only will be your companion and shadow. God incarnates in the form of Competent Guru. Therefore, we do not have to worship another deity.... Worship, archana, Chanting name, Self-surrender do all to the Guru. Sri Guru is the only one who can drive away us. Work hard and be patient so that we can get the grace of Sri Guru.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Feb

అహంకారం శాశ్వత ధర్మాలనుసత్సంగాన్ని అనుమతించదు మరియు దుఃఖాన్ని కలిగిస్తుంది. నిరహంకారం బలాన్నిధైర్యాన్నిసమగ్ర తృప్తిని ఆహ్వానిస్తుంది.

Arrogance does not allow eternal virtues, True Companionship and causes misery. Selflessness invites strength, courage, and inclusive satisfaction.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Feb

నైతికమనేదిమనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము - భౌతికమైనది మరియు ఇంద్రియాధీనమునశించేది. 

ఆనందము - పారమార్ధికమైనదిఇంద్రియాతీతముశాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు.

Morality is not a theory that tells us how to make ourselves happy.  It tells us how we deserve to experience happiness.  

Gleefulness - material and sensual, perishable.  

Happiness - transcendental, phenomenonal, eternal.  So remember God and pray. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Feb

విశ్వాసమును నీకు కలిగించేదే నీ గురువు. ఆయననే సదా అంటిపెట్టుకో - నీ రక్షణను ఆయనే వహిస్తాడు.

Your Guru is the one who instills faith in you. Always stick to him - He will protect you. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Feb

మనది”లోని “మది”ని నశింపజేసుకొనుటకే సాధనలన్నీ. సాధనలు సద్గురు కృపను పొందగల అర్హతను అందిస్తాయి. ఆ తర్వాత మిగిలేది శూన్యమైన శూన్యమే.

All practices are there to destroy "Psyche" in "Ours". Practices give us the eligibility to obtain the grace of Sadguru. After that all that remains is a void of emptiness. 

శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Feb

అనుకున్నది జరగడంలేదుజరుగుతున్నది అనుకోవడం లేదు. జరిగేదానికి అనుగుణంగా మనం బ్రతుకులు లాగుతుంటాము. దీనికి కారణంమన జీవితానికి గమ్యమేమిటో మనకు తెలియకపోవడమే. కావునజీవిత ధ్యేయముగమ్యము నిర్ణయించుకుంటే దానికి అనుగుణంగా గమనం సాగుతుంది. ధ్యేయముగమ్యము మంచివైతే - ఆనందముచెడు అయితే - దుఃఖము కలుగక తప్పదు.

What is expected that is not happening, what is happening that was not in thought. We live according to what happens. The reason for this is because we don't know the purpose of our life. Therefore, if we decide the purpose of life and destination, the journey will go according to it. If destination is Good - happiness , Bad means- sadness is inevitable. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Feb

సత్యధర్మధైర్యతృప్తినియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/గురు కృపకు పాత్రులు.

Those who live according to truth, virtues,, courage, rules regulations, without causing problems to others are deserve for the grace of God/Guru. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Feb

మనం మన అవసానదశకై ఇప్పటినుండే గురువుల సలహాలను అనుసరిస్తూసరైన ఆధారాలను ఆలోచించి తయారు చేసుకొని ఉండాలి. లేకపోతే మనం దైవానుగ్రహాన్నిఅనాయాస మరణాన్ని ఎలా ఆశించగలము

For our final destination, we must follow the Guru's advice from now on, and think and prepare with the proper evidence. If not how can we expect a divine life, euthanasia death?  

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Feb

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Feb

ఈ జన్మలో అనారోగ్యంఇబ్బందులు అనుభవించుటకు బాహ్య శత్రువులు కారణం అయి ఉండవచ్చును. అంతర్గత శత్రువులుఈ జన్మకే కాక భవిష్యత్ జన్మలకు కూడా మహా ప్రమాదకరమైనవి.

External enemies may be the cause to experience illness and hardship in this life.  Internal enemies are very dangerous not only for this birth but also for future births.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Feb

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Mar

ఏ పని చేస్తున్నాఏ ఆలోచనలో సర్వాంతర్యామి ఉన్నా ఆ సద్గురువు మనలను తదేకంగా గమనిస్తున్నారు అనే భావన ఉండాలి. ఆయన ప్రతిరూపం మనసులో చూసుకోవాలి. ఆయనతో చెప్పుకోవాలి. ఆయన సమాధానం చెప్పినట్టు భావించుకోవాలి.

Whatever we are doing, Whatever omnipresent is thinking, We must have the feeling that the Guru is watching over us.  His replica must be kept in mind.  Have to say to him.  Assume he answered. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Mar

ధ్యానం చేసే ముందరప్రార్ధన చేసే ముందరభగవంతుడు ఎక్కడో ఉన్నాడని భావించకూడదు. నా లోనే ఉన్నాడు అని భావించాలి. నా హృదయ నివాసినా మనో నివాసి - నా లోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు అని తలచవలెను.

Before meditating, before praying, don't think God is somewhere else. Assume that God is in me. The inhabitant of my heart- The inhabitant of my mind- The God is in me feel that.

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Mar

ఉదయం సాయం సంధ్య వేళలలో కొలది నిమిషాలు ఏ ఆలోచన లేకుండా ఉండాలి. ఏకాగ్రతగా ధ్యానం చేయాలి. సాధనను నెమ్మదిగా మొదలు పెట్టుకుంటే ప్రేమకరుణతత్వపు పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది.

During Morning and Evening twilight times, spend few minutes without any thought. Concentrately meditate. If you start practicing slowly, you will have a fuller understanding of love and compassion. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Mar

మానవులు మాటలకు లొంగుతారుభగవంతుడు భక్తికి లొంగుతారుమహాత్ములు మనసులోని సత్భావనలకు లొంగుతారు. భావం పటిష్టంగా ఉండాలి చలించ కూడదు. తల్లిదండ్రుల పై భావం ఎప్పటికీ ఒకేలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి.

Humans will surrender to words, God will surrender to devotion, great people will surrender to the true'feelings in the heart.‌ The feeling should be firm and consistent. Like our feelings on parents, like that our feelings should be there. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Mar

నిద్ర నుండి లేచునప్పుడునిద్ర పోవుటకు ముందు - తల్లి తండ్రులుపంచ భూతములుసద్గురువుసత్పురుషులుదైవములను భక్తితో స్మరించిన శ్రేయస్సు కలుగును.

When you wake up from sleep, Before going to sleep,  remembering the Parents, Five Nature Elements, Guru, True-Spirits, God with devotion means welfare attains. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Mar

నామము పాప పర్వతాలను పగలగొడుతుంది. నామము దేహ బంధాలను తొలగిస్తుంది. నామము దుర్వాసనను సమూలముగా పెరికి వేస్తుంది. నామము కాలుని కంఠాన్ని దునిమి వేసి జనన మరణాల నుండి తప్పిస్తుంది. శ్రద్ధగా నామ స్మరణ చేస్తే అప్రయత్నంగా కష్టాలు తొలగిపోతాయి.

The Chant can breaks the mountains of sin. The Chant removes the bonds of the body. The Chant, vanishes stench completely. The Chant will purge voice, feet and escape from births and deaths. If carefully chant, all troubles will go effortlessly. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Mar

బాధలో కానీఆనందంలో కానీ శరీరము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నూ హృదయపూర్వకముగా భగవంతుని ప్రార్థించవలెను.

Whether in sorrow or in happiness or in any circumstance of the body, wholeheartedly we should pray to God . 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Mar

మనస్సుశరీరముఇంద్రియములు నిరంతరం భగవంతుని తలుచుకోవాలి.

The Heart, Body, Senses constantly must think of God. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Mar

ప్రతికూల ఆలోచనలు వస్తే రెండు అక్షరములు నామము మనసులో గట్టిగా చెప్పుకోవాలి. ఉదాహరణకు రామ రామ.

If you get negative thoughts, recite two letters name (Telugu) loudly in your mind. For example Rama Rama (రామ). 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Mar

మనము మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎదుటివారి తప్పులుచెడులోపాలు చూడకుండా ఉండాలి.

If we want to have peace of mind, we should not see the mistakes, badness and defects of others.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Mar

ఇతర జీవులు మన జీవిత సంఘటనలకు కారకులని మనము భావించినఆ భావనలు కోట్లాది జన్మలను (ఆగామి) తెచ్చిపెట్టును.

If we think that other creatures are responsible for our life events, those feelings will bring billions of births. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Mar

నిద్ర లేచిన తర్వాత నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి ఎందుకు లేచానుఏమి చేయాలిఎలా చేయాలిఏ విషయం కోసం.

After waking up, four questions to ask ourself . Why did I wake up, what to do, how to do, for what reason. 

 

.శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Mar

మీ ప్రవర్తనను బట్టి నా ప్రతిస్పందన ఉంటుంది.

My response will depend on your behavior.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Mar

పురాకృతసుకృతంవల్లనుదైవానుగ్రహంవల్లను ఉత్తమమగు గురువు సాంగత్యం లభిస్తుంది. అలాంటి గురువును అనుసరించడం పుణ్యాత్ములైన శిష్యుల కర్తవ్యం.

Due to antique great works and Divine blessings, You will get the best companionship of the Guru. It is the duty for virtuous disciples to follow such a Guru.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Mar

సదా పరులకు ఉపకారము చేయుచుండువారికి భగవత్కృప సులభ సాధ్యము.

Those who always helps others, God's grace is easy for them. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Mar

ఉన్నదానిని పొమ్మనకులేనిదాన్ని రమ్మనకు. మొత్తం దీనిలోనే వుంది.

Don't miss what is there, don't ask for what is not there. The whole thing is in it.. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Mar

ధర్మ మార్గం అవలంబకుంటే ధర్మమే కాపాడి సంరక్షించును. అధర్మ మార్గం అవలంబకుంటే అదియే శిక్షించి భక్షించును.

If one adopts the path of Virtue, Virtues itself protects and preserves. If one follows the path of unvirtues that only will punish and eat you. 

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Mar

అప్పుడే జననమొందిన శిశువునకు అహంకారముకోరికలనే సంస్కారములు ఉండనందున దాని సంరక్షణ బాధ్యతలను తల్లి చూచుకుంటుంది. ఆ శిశువే ఎదిగాక తన అహంకారముకోరికల సంస్కారముల వల్ల తల్లికి దూరమవుతుంది. అలానే దైవం/గురువు పట్ల నీ ప్రవర్తన ఎటులోఆయన ప్రతిస్పందన అటులనే ఉంటుంది.

Newborn baby doesn’t have the culture of ego and desires. So mother take cares of their responsibilities to protect them. As the child grows older, their ego and desires will lead them away from mother. Similarly based your attitude towards the God/Guru, responses will be there.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Mar

విజయం పొందడానికి నీవు స్థిరమైన పట్టుదలనుబలమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. అలాంటి శక్తిని పొందికష్టపడితే నీవు గమ్యం చేరగలుగుతావు.

To succeed you must have consistent perseverance and strong willpower. Get that energy and work hard, you will reach there. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Mar

చేసే ప్రతి పని భగవంతునిదే అనే భావం ఉండాలి. ఈ శరీరంమనస్సుబుద్ది అనునవి అర్హత సంపాదించుకుంటే గురువు దారి చూపిస్తాడు.

Feel that, Every work belongs to God. If this body heart mind are eligible Guru shows route 

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Mar

ఆరోగ్యంగా ఉన్న శరీరానికి 6 గంటల నిద్ర చాలు.

For a healthy body, 6 hours sleep is enough. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Mar

పాక్షిక శరణాగతి అయినా చేయాలి. ఉదాహరణ:కాఫీతో మొదలుపెట్టండి. కాఫీవాళ్ళు ఇచ్చే దాకా అడగకూడదు. ఎక్కువ ఇచ్చినాతక్కువ ఇచ్చినా ఇన్ని ఇచ్చారుఅన్ని ఇచ్చారు అని అనకూడదు. చక్కెర ఎక్కువతక్కువ అనకూడదు. ఈ ఒక్కటి అయినా ఆయనకు ఇవ్వవలెను.

Partial surrender should be done. Example: Start with coffee. Do not ask Coffee until they give. Do not say Give more, give less, only this much. Sugar should not be high or low. Atleast this should be given to him. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Mar

ఆశఆశయం వైపు ధ్యాసధ్యేయం వైపు ఉండాలి.

Aspiration towards Aim, Attention towards Ambition should be there. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Mar

ఓ మాయ దేవత! నీవు కరుణించి మమ్మలను శ్రీగురు చెప్పిన మార్గంలో నడిపించు అని ప్రార్థించాలి. మాయకు తలవంచి ఆమెకు నమస్కారం చేయాలి.

Ohh goddess of illusion! have mercy on us and lead us in the path that Sri Guru has told. Pray her, Bow your head infront of her illusion and Salute her. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Mar

అన్నం ఆయనేబియ్యం ఆయనేఅన్నీ ఆయనేఅంతటా ఆయనే అన్న భావన రావాలి.

He is the Food, He is the Rice, He is Everything, He is Everywhere. This feeling should come.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Mar

చపాతీ పిండి లాగానలిగి అగ్నికి కాల్చబడితే కానీ చపాతీ కాదు. అలాగే మనము కూడా బాగా నలిగితే కానీ సాధనలో పైకి రాలేము.

Like wheat flour, Crushed and fire baked flour become Chapati. Like If we are also crushed well then can get up in practice. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Mar

సాధన విషయములో నడక పనికిరాదు. పరిగెత్తాలి.

In practice, Walking is useless, Have to run. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Mar

బుద్ధి వికసించిన సదసత్ వివేకము ఉదయించును. సదసత్ వివేకము వలన వినయము లభించును. వినయము వలన సూక్ష్మ గ్రాహక శక్తి అంచెలంచెలుగా పెంపొందును. సూక్ష్మ గ్రాహక శక్తి వలన సారాసార విచారణ కలుగును. సద్విచారణ వలన విషయ వాసనల విశ్లేషణ జరుగును.

Wisdom will rise when intelligence blossoms. With Wisdom Humility will obtain. Humility will slowly enhances the micro-perceptiveness. Micro-perceptiveness causes an absolute inquiry. Due to indeed inquiry "Subject Odor Analysis" is done. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Mar

యాద్భావం తద్భవతి 

సద్భావం సద్భవతి 

దుర్భావం దుర్భవతి 

నభావం నభవతి.

What we think, that will happen

Good Thoughts, Good Results

Bad thoughts, Bad Results

No thoughts, No results 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Mar

జిత రసే జితే సర్వం

నాలుకను అదుపులో ఉంచుకొనవలెను.

"Jita rase jite sarvam" (Who conquers the tongue, can conquer everything).  The tongue should be kept under control.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 31 Mar

నామరూపగుణతత్వము చేత భగవంతుణ్ణి చింతించాలి.

By name, form, character and philosophy, should ponder the God 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Apr

అనవసరమగు ఆందోళనలతోఆలోచనలతో మానవులు సహజముగా అంతరంగాన్ని కలుషితమొనర్చుకుంటారు. అవసరమేదో - అనవసరమేదోసబబేదో- బేసబబేదో బేరీజు వేసుకుంటూ - తన పాత్ర ఏమిటో చూసుకుంటూ నడవడంతో - సహజంగా అనేక ఆలోచనలు అంతమౌతాయి.

With unnecessary worries and thoughts, humans naturally contaminate the inner intimacy. Assess whether it is necessary or unnecessary, right or wrong. As one walks by looking at role, naturally many thoughts will end. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Apr

కర్మలు చేయుటయే కృష్ణార్పణ పద్ధతి. ఒకేసారి ఇట్లు చేయుట సాధ్యం కాదు కాన సాధకుడు అభ్యాసం ద్వారా దానిని సాధింపవలెను. ఇట్లు చేయుటలో మనసు ఎదురు తిరిగినచో దానిని గురు నామ స్మరణతో వశము చేసుకోవలెను.

Doing karma is the method of offering Krishna. It is not possible to do this at once, but the achiever has to do it through practice. Whenever the mind goes against in doing this, it has to be conquered by chanting Guru's name. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Apr

అందరినీ ప్రేమగా చూడాలి అంటే ఎదుటి వారిలోని దోషాలుతప్పులు మనం ఎత్తి చూపకుండా వారిలోని మంచిని గమనిస్తే అతనిలో భగవంతుని చూడగలుగుతాము.

To see all with love means instead of pointing others faults and mistakes, see the good in them, then we can see God in them. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Apr

మామూలు మానవునికి నిద్రమరపు ఒక వరం. సాధకునికి అవి శాపం.

For a normal human Sleep and forgetfulness is a boon, and its a curse for a practitioner. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Apr

గురు బోధనలపై నిర్భయత్వంతో కూడిన నమ్మకముదృఢ విశ్వాసము అనేవి సత్యాన్వేషికి ప్రాథమిక గుణములు.

On Guru's teachings Bold Belief and firm faith are the basic qualities of a truth seeker. 

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Apr

విజయం అనేది ప్రకృతిలో ఆకస్మికంగా లభించేది కాదు. అది ఎంతో జాగరూకతతో పొందదగినది.

Success is not something that happens suddenly in nature. It can be obtained with Great Vigilance. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Apr

ఏకాగ్రత పరిపక్వతకుపరిపక్వత స్థైర్యానికీస్థైర్యము విజయానికివిజయం ఆనందమునకు అనుసంధానములు.

Concentration for Maturity, Maturity for Stability, Stability for Success, Success for Happiness are the interlinks. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Apr

భావన చెదరకుండా చూసుకోవాలి. భావనలు పవిత్రంగా ఉండాలి.

Make sure that Feeling is not scattered. Feeling must be sacred. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Apr

మనలోని లక్షణాలను పరీక్షించడానికి ఇతరుల రూపంలో ఆ పరమాత్మ వచ్చి వివిధ రకాలుగా అంటే కోపంవిసుగు లాంటివి మాట్లాడి మనలను ప్రేరేపిస్తారు. అప్పుడు మనలను మనం పరిశీలించుకోని ఆ లక్షణాలు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.

To test our qualities, God comes in the form of others and speaks in various ways like anger and frustration to stimulate us. Then we should examine ourselves and try to get rid of those qualities.  

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Apr

ప్రతి దానిని సాక్షిగా చూడాలి. సృష్టికర్త నడిపిస్తున్నాడు అనే భావంతో ఉంటే సాక్షిగా చూడడం వస్తుంది. ప్రతి పనిలో ఆ పరమాత్మను తలుచుకొంటూ అతనిపై ధ్యాస ఉంచిననేను-నాది అనే భావన దూరమవుతుందిఆ పరమాత్మ దగ్గరవుతాడు.

Each must be viewed as witness. "Creator is leading" with this feel, witness view will come. In every work by remembering Focus on God, then the feeling of me-mine will go away, Supreme Spirit will come closer‌. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Apr

ఏ నామము చేసుకుంటున్నాము అని కాదు దాని మీద భావం సరిగ్గా ఉండాలి.

It is not about which name we are chanting, but the feeling on that should be right. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Apr

నీ గురించి నీవు ఆలోచించుకో లేదా భగవంతుని గురించి ఆలోచించు. అంతేకానీ మూడో వ్యక్తి గురించి అనవసరంగా నీవు ఆలోచించవద్దు.

Think of yourself or think of God. And don't think about the third person unnecessarily. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Apr

సాధనలో పురోగతి లేదు అంటే మనకు స్వీయ నియంత్రణ లేదు అని అర్థము. ఇంద్రియాల మాట వింటే స్వీయ నియంత్రణ ఉండదు.

In practice no progress means we have no self-control. If listen to the senses word, there is no self-control. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Apr

వ్యక్తిని వ్యక్తిగా కాక వ్యక్తిలోని శక్తిని యుక్తిగా గుర్తెరింగి రక్తిని కలిగించుకుని అనురక్తి పెంపొందించుకొనుటయే భవ బంధ విముక్తికి మార్గము.

Rather than seeing Person as Person, Maneuverly recognise the strength in that person and Cause affection and increase it. It's the liberation path from bondage. 

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Apr

గురువుమంత్రముసాధన వ్యక్తిగతము.

Guru, Mantra, Practice are personal. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Apr

ధ్యానం చేసేటప్పుడు మన లోపల నాభి నుండి పెద్ద ధ్వనితో హోరుగా నామం వస్తున్నట్లుఅది మన చెవులలో నుండి కూడా వస్తున్నట్లు భావించుకోవాలి.

While meditating, we should feel that the name is coming out loudly from our navel, and it is also coming from our ears. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Apr

కష్టాలు వస్తే ఆ కష్టాలను భరించే శక్తి ఇవ్వండి అని భగవంతుని ప్రార్ధించాలి.

When hardships come, pray to God to give the strength to bear those hardships. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Apr

మనిషికి జంతువుకు మధ్యనున్న ప్రధాన భేదం వాటి ఏకాగ్రతాశక్తి యందలి భేదమే. ఏ కార్య విజయమైనా ఏకాగ్రత యొక్క ఫలితమే.

The main difference between man and animal is the difference in their concentration. The success of any endeavor is the result of concentration. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Apr

ఎవరైనా రండి అని పిలిచినప్పుడు వస్తాను అని చెప్పి వెళ్లకపోతే మాట తప్పిన వారు అవుతాము. వచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అని చెప్పాలి.

When someone calls to come, by saying will come, and if we didn't go, we will called as breached ones. So say that I will definitely try to get there. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Apr

సాధన ఎక్కువగా చెయ్యాలి అనుకునే వాళ్ళు నిద్రబద్దకాన్ని జయించాలి.

Those who want to do more practice should conquer sleep and laziness. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Apr

ధైర్యం నీ బలం. బలహీనతలు నీ మృత్యువు.

Courage is your strength. Weaknesses are your death. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 22 Apr

ప్రతీ శబ్దములోను నామం వినగలగాలి. ఉదాహరణకు: ఫ్యాన్రైలు,..

Name should be heard in every sound. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Apr

చెడు ఆలోచనలను ఎక్కువసార్లు అనుకుంటే ఆ చెడు ఆలోచనలకు బలం చేకూరుతుంది. అందుకని చెడు ఆలోచనలు మనసునందు కానీబాహ్యము నందు కానీ అనుకోకూడదు . 

If you think bad thoughts more often, those bad thoughts will be strengthened. So bad thoughts should not be thought of in the mind and exterior. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 24 Apr

పూజజపముభజనధ్యానముఏదైనా హృదయపూర్వకముగా మనసుపెట్టి చెయ్యాలి. లక్ష్యాన్ని అనుకోకుండా పైవన్నీ చేస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు. ఇతరుల కోసం చేయకూడదు అని నిర్ణయం తీసుకోవాలి.

Pooja, chanting, bhajan, meditation, anything should be done wholeheartedly. If you do all the above without knowing the target, it will not be much useful. Decision should be taken not to do for others. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 25 Apr

మనలో సద్గుణాలు రావడం ఎలా అనే భావన నిరంతరం చెయ్యాలి. టీవీలో పనికి రాని ప్రోగ్రాములుచెత్త సినిమాలువార్తాపత్రికలు చూడడంచదవడం వల్ల చెత్తను అంటే దుర్గుణాలను మరలలోపలికి వేసుకుంటున్నాము. అందువల్ల వాటికి దూరంగా ఉండాలి. మనం చేసే సాధన అంతా దుర్గుణాలను పోగొట్టుకోడానికే.

We should always think about how to get virtues in ourselves. Watching and reading useless TV shows, crap movies, newspapers, are putting us back into the bad qualities of garbage. So stay away from them. All the practice we do is to get rid of bad qualities. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 26 Apr

మార్జాల కిశోర న్యాయము - శరణాగతి తత్వము.

Cat law -Surrendering Philosophy. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Apr

వెయ్యి అశ్వమేథ యాగములకన్న సత్యం గొప్పది.

The truth is greater than a thousand horse sacrifices.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Apr

సాధనలో అడ్డంకులు వస్తాయి. బుద్ధిని ఉపయోగించిఆలోచించి బయట పడాలి. బుద్ధికి బాగా పదును పెట్టాలి.

Obstacles come in practice. Use the mind, by thinking should come outside. The intellect must be well sharpened. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Apr

ఆరోగ్యం బాగా లేనప్పుడు శరీర భ్రాంతి ఉందా లేక భగవంతుని తలుస్తున్నామా లేదా అని గమనించాలి. కాలుకి దెబ్బ తగిలితే అమ్మఅయ్యా అనక 'సాయిఇంతకుముందు నేను ఎవరికో దెబ్బ తగిలేటట్టు చేశానేమో అందుకే ఇప్పుడు నాకు తగిలింది అనుకోవాలి.

When one is not feeling well, one should observe whether the body has hallucinations or is thinking of God. If I get hit in the leg, instead of Calling mother and father, Say 'Sai', and feel that, I might have made someone hurt before, that is why I am hurt now. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 30 Apr

'లక్ష్యం లేని జీవితం తూటా లేని తుపాకి వంటిది.

లక్ష్యం: 

1. కోటానుకోట్ల జన్మ పరంపరల నుండి విముక్తి పొందడం

2. ఆనందంగా ఉండడం.

3. భగవంతుని చేరడం.

ఇలా ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి.

‘A life without a goal is like a Gun without a bullet.

Goal: 

1. To liberate the Kotanukot birth line

2. Being happy.

3. Joining God.

Aim for something like this.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 1 May

బుద్ధికి స్వేచ్ఛనివ్వాలి. ఆహార విహార వ్యవహారాల విషయంలో బుద్దికి స్వేచ్ఛను ఇస్తే అది మనలను ఎలా నడుచుకోవాలో మనకు చెప్తుంది. బుద్ధి ‘నిర్ణీతఅయినప్పుడు మనసుకు స్వేచ్చ ఉండదు. అప్పుడు న్యాయంగా ధర్మబద్ధంగా చేస్తాము.

The mind must be freed. Giving the mind freedom in the matter of Food, Excursion, affairs tells us how to behave.  When the mind is ‘determined’ the Heart has no freedom. Then we will do it fairly righteously. 

శ్రీ శారాద శ్యామ సందేశం: 2 May

హారతి - నాలుగు వేళలలో మన యొక్క ఆర్తులనుతప్పులనుఏమి పాడు పనులు చేసాము అని ప్రార్థించాలి.

శ్రీ శారాద శ్యామ సందేశం: 3 May

భగవంతుని నమ్ముకున్న వారికి కష్టాలు ఆనందంగా ఉంటాయి. మామూలు వారికి కష్టాలు కష్టాలుగా ఉంటాయి. నమ్మకం ముదిరితే విశ్వాసం అవుతుంది.

Those who believe in God are happy with hardships. For ordinary people the hardships are hardships. Faith becomes trust as it matures. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 4 May

ఈ దేహము సద్గురువుది అని నిరంతరం చింతన చేయాలి. తినడంతాగడం అతనికే చేయిస్తున్నట్లు భావించాలి.

This body belongs to Guru should have this constant thought. Eating and drinking should be considered as doing to himself. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 5 May

గురువు లేక ఎవరూ దేనినీ సాధించలేరు. వారి వారి అర్హతలను బట్టి గురువు అర్థము అగును. పరబ్రహ్మమే గురువుగా అవతరించిననూజీవుల యొక్క సంస్కారములను బట్టిఆలోచనలుభావాలకు అనుగుణంగా భగవత్ శక్తి వారి వారికి ఆయా విధములుగా అర్థం అగుచుండును.

No one can achieve anything without a Guru. According to their qualifications, they will understand Guru. Even though Parabrahma himself became a guru, Beings accordance to their rites, thoughts and feelings in that ways God power will understand to them. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 6 May

భక్తి - విశ్వాసము చాలా ముఖ్యము. ఇవి ఓర్పునిస్తాయి. ఓర్పు లేకపోతే విశ్వాసం సన్నగిల్లినట్లే కనుక భక్తి విశ్వాసములు విడువరాదు.

Devotion - Faith is very important. These are the ones that gives patience. If there is no patience, faith will weaken, so devotion and faith should not be abandoned. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 7 May

సాధన నిరంతర ప్రయాణం. గమ్యం చేరే వరకు వెనుతిరిగి చూడరాదు. గమ్యము ఎంత దూరం ఉందో తెలియదు. గమ్యం చేరిన తర్వాత మిగిలినది ప్రారబ్దం మాత్రమే. మహాత్ములు ప్రారబ్దం అనుభవిస్తూ ఆగామి రాకుండా చూసుకుంటారు. చివరకు ఏమీ మిగలదు.

Practice is a continuous journey. Don't look back until you reach your destination. Not sure how far the destination is. Once the destination is reached, the rest is only the Experience. The Mahatmas feel the onset and take care of the future. In the end nothing is left. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 8 May

ఎదుటి మనిషిలో ఏ తప్పు మనకు కనిపిస్తుందో ఆ తప్పు మనలో ఉంది అని అర్థం.

Whatever mistake we see in the other person means that mistake is in us.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 9 May

మహాత్ములు చెప్పిన విషయాలుసూక్తుల ప్రకారం ఆచరించడమే పారాయణం. బుద్ధి వికాసం దీనిపై ఆధారపడి ఉంటుంది. ఈ సూక్తులు ఎల్లప్పుడూ మననం చేయాలి. అప్పుడు అవి బుద్దిలో స్థిరముగా కూర్చుంటాయి. బుద్ధి వికాసానికి భగవంతుడిని స్తుతి చేయాలి.

Recitation is the practice of following the sayings of the sages, the Intellectual development depends on it. These sayings should always be memorized. Then they sit firmly in the mind. Praise the God for the development of the mind.

 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 10 May

కామక్రోధలోభాదులు ప్రకృతిలో సహజం. వీటికి తలవంచి తప్పుకోవాలి. ఎదురు తిరిగితే ప్రవాహంలో చెట్ల వలె కొట్టుకుపోతాము. గడ్డిపోచవలె తలవంచి ఉంటే ప్రవాహం పైనుండి వెళ్ళిపోతుంది.

Lust, anger and greed are natural in nature. You have to bow your head down to these. If we reverse, we will be washed away like trees in a stream. If the head is bent like a grass the flow will go from the top. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 11 May

నిత్య జీవితంలో ప్రతి కార్యక్రమము ధ్యానము లాగా అనుకోవాలి. నడకను ప్రదక్షిణం లాగామాట్లాడుతుంటే స్తోత్రం చేస్తున్నట్లునిద్రలో సమాధిలో ఉన్నట్లు భావించాలి.

In daily life Every activity should be considered as meditation. Walking should be considered as a Divine Circling, while talking should be considered as hymn, while sleeping should be considered as stillness.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 12 May

ఇదే ప్రకృతిఇదే వాతావరణంఇవే పరిస్థితులు - వీటి నుండి బయటపడిన వారు మహాత్ములు. ఈ ప్రపంచం నుండే వారు అన్నీ సాధించారు. వారిది ప్రత్యేక ప్రపంచం కాదు. వారు మనకు ఆదర్శం కావాలి.

This same nature, this same climate, this same conditions - those who have survived from these are the Mahatmas. They have achieved everything from this world. There is no separate world for them. They ought to be our ideals. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 13 May

విశ్వాసముతో ఒక్కసారి చేసిన భగవన్నామమునకు వున్న విలువ - అవిశ్వాసముతో అనేక సార్లు చేసిన దానికన్నా కొన్ని కోట్ల రెట్లు సత్ఫలితమును ప్రసాదించును.

The value of one God's chant done with faith gives good results, and some crores times better than doing many times with unbelief. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 14 May

జీర్ణము కాని ఆహారము దేహానికి విషతుల్యమైనట్లు ఆనందాన్ని ప్రసాదించని ఆచరణ ప్రమాదకరము.

Undigestive food is poisonous to the body, Like that practice that does not give happiness is also dangerous. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 15 May

ఏ పని చేసినా "అవసరమాఅనవసరమా?" అని ప్రశ్నించుకుని చేయాలి. (మాట్లాడేటప్పుడు అయినాసరేఏదైనా కొనేటప్పుడు అయినాసరే)

What ever work we do that should be questioned "Is it necessary?, Is it unnecessary? (Even when talking, when buying anything) 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 16 May

మనుషుల వెంట ఎంత పడితే వారు అంత దూరము అవుతారు. భగవంతుని వెంట ఎంత పడితే భగవంతుడు అంత దగ్గర అవుతాడు.

The more you follow people, they go that far. The more you follow God, God gets that  much closer.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 17 May

నువ్వు ఏమి చేసినా సంపూర్ణంగాక్షుణ్ణంగా చెయ్యి లేదా చేయటానికి ఒప్పుకోకు.

Whatever you do, do it wholeheartedly, thoroughly or don't agree to do. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 18 May

నువ్వు పైకి ఎదగడానికి 7 ముఖ్య విషయాలు: 

1. నీకు ఉన్నదాంట్లో ఇతరులకు చిరు సహాయము.

2. ఓటమిలో కుంగిపోకుండా ప్రయత్నం. 

3. పేదరికంలోనూ నిజాయితీ.

4. మాట తీరులో సరళత్వం. 

5. కోపంలో కూడా సహనం.

6. కష్టాలను తట్టుకునే శక్తి. 

7. ప్రతి మనిషిని గౌరవించడము.

 

7. Respect for every human being.

 1. Little help to others in what you have.

 2. Try not to succumb in defeat.

 3. Be honest even in poverty.

 4. Simplicity in wording.

 5. Patience even in anger.

 6. Strength to endure hardship.

 7. Respecting everyone. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 19 May

డబ్బులు లెక్కపెట్టుకొనేటప్పుడు మాట్లాడతామాలేదు. అన్ని పనులు పక్కన పెట్టి కేవలం డబ్బులు ఎంచుకోవడంలో నిమగ్నమవుతాం. అదే విధంగా భగవన్నామస్మరణ చేయాలి.

Do we talk while counting money? Nope. Putting all the work aside and we just engage in money counting. The God Chant should be commemorated in the same way. 

శ్రీ శారద శ్యామ సందేశం: 20 May

గాలిని తీసుకుని వదలడం జరిగినంత సహజముగా నీకు ఎవరితో లేక దేనితో సంబంధం ఉంటే అది ఆత్మానుబంధం. ఇంద్రియాతీతమగు శ్రీగురు బంధము ఆత్మా నుబంధం. ఎవరితోనైనాదేనితోనైనా ఇంద్రియాతీతమగు బంధం ఉంటే అదే దైవమనే భావనతోపవిత్రముగా కలకాలము కాపాడుకొనుటయే మన కర్తవ్యం.

If you have a relationship with someone or something that is as natural (easy) as taking the breath, it is soul-intimacy. The transcendental bond with Guru is the soul-bond. If there is a transcendental bond with anyone or anything, feel that is God, and It is our duty to keep that sacred for eternity 

శ్రీ శారద శ్యామ సందేశం: 21 May

బాధలో ఉన్న వారి కుటుంబాలకు సానుభూతి చూపించుటకు బదులు మనకు తోచిన సహాయము చేసివారిని కాపాడమని దైవమును వేడుకొనవచ్చును కదా!

Instead of showing sympathy to bereaved families, We can ask God to help us to save them? 

శ్రీ శారద శ్యామ సందేశం: 22 May

శరీరముఇంద్రియములుప్రాణముసంపదలుస్వజనులుబంధువులుఆత్మభార్యభర్త మొదలగునవి. అన్నీ సద్గురు సేవకై ఉపయోగించవలయును.

Body, senses, life, wealth, kinsmen, relatives, soul, wife, husband, etc. All should be used to service for Guru.

శ్రీ శారద శ్యామ సందేశం: 23 May

తృప్తికి మించిన ఆనందము లేదు. అసంతృప్తికి మించిన దుఃఖము లేదు. ఆరోగ్యమునకు మించిన సంపద లేదు. అనారోగ్యమునకు మించిన దరిద్రము లేదు.

There is no happiness beyond satisfaction. There is no sorrow beyond dissatisfaction. There is no wealth beyond health. There is no poverty beyond illness. 

శ్రీ శారద శ్యామ సందేశం: 24 May

మనకేది మంచిదో దైవానికి తెలుసు. కోరికలు లేకుండా మనకు శ్రేయస్కరమైన దానిని అనుగ్రహించమని ఆర్తితో దైవాన్ని ప్రార్ధించి నిశ్చింతగా ఉండండి.

God knows what is best for us. Without desires bless us with what is best for us. Relax by praying to God with intensity.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 25 May

కామక్రోధలోభమోహమదమాత్సర్యాలను అరిషడ్వర్గములందురు. ఇవి బహు ప్రమాదములనునీచజన్మలను కలిగించును. ఎలాగైనా వీటిని విసర్జించవలయును.

Lust, anger, greed, fascination, Ego, jealousy are called Six internal enemies. These can cause multiple accidents and worst births. These should be discarded anyway. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 26 May

ఇతరుల నుండి సహాయమును ఉచితముగా పొందకు. నీకు చేతనైన సహాయముదానములను భగవత్ అర్పణ బుద్ధితో ఇతరులకు చేయుటవలన చెడు నశించును.

Do not seek help for free from others. As you make conscious help and donations to others with the mind of submitting to God, evil will perish. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 27 May

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. భావము బాగుంటే బ్రతుకు భద్రముగా ఉంటుంది. మనసు మంచిదైతే శాంతి తప్పక ఉంటుంది. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు.

If the talk is good, the town is good. Good feeling is safe for life. If the mind is good there must be peace. If there is sun there will be no darkness.

శ్రీ శారద శ్యామ సందేశం: 28 May

తన మనసును ఎవరూ మోసం చేసుకోలేరు. లోకమును మోసం చేస్తే లోకేశ్వరుని స్పందన ఉండును కదా! ఎరుక కలిగి సంస్కారముగా ప్రవర్తించుటయే కర్తవ్యం.

No one can deceive his mind. If the world is deceived, there will be a response from God (Lokeshwar)? It is the duty with consciousness to behave in a decent manner. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 29 May

ఆహారభయనిద్ర అన్ని జీవులకు సమానము. మానవులు బుద్ధిజీవులు. బుద్ధిని ఉపయోగించి సత్య-ధర్మములకు అనుగుణముగా జీవించి తరించాలి.

Food, fear, and sleep are the same for all living beings.  Humans are intellectuals.  We have to use the mind to live in accordance with the truth righteousness.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 30 May

నీటి మీద అలిగి స్నానం చేయకుంటే మన దేహమునకే అనారోగ్యం కలుగును. అలాగే లోకేశ్వరుని మరియు లోకముమీద అలిగినచో మనకే నష్టములు కలుగును కదా!

With angry on water if we do not take a bath, our body will get sick. Like that if we angry on God and World,  for us only there will be losses. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 31 May

దైవమును శరణుజొచ్చి భక్తినివాంఛల రాహిత్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ జీవించడము మంచిది. దైవమే అన్ని ప్రసాదించును కదా! 

It is good to take refuge in God, pray to get devotion and desirelessness. God is the one who provides everything right! 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 1 Jun

చిట్టి చిలకమ్మా : ఓ ప్రాణి జీవాత్మ! 

అమ్మ కొట్టిందా: ప్రకృతి మాత తట్టి లేపుతుంది అటకానీ మనం కొనుక్కోలేము 

తోటకెళ్ళావా?: ఆధ్యాత్మిక తోటకెళ్ళావాబాబాగారి దగ్గరికి వెళ్ళటం లాంటిది) 

పండు తెచ్చావా?: అక్కడ జరిగిన ఆధ్యాత్మిక విషయాలు విని హృదయంలో పెట్టుకుని ఆచరించావా?

గూట్లో పెట్టావా?: ఆ విషయాలు సాధన చేసి హృదయంలో పదిలపరచుకున్నావా

గుటుక్కు మింగావా?: ఆచరించి అవగాహన చేసుకున్నావా

 

శ్రీ శారద శ్యామ సందేశం: 2 Jun

జీవితంలో ప్రతి ఒక్కటి నిర్ణయింపబడి ఉంటుంది. ఉదాహరణకి 9-10 గంటలలోపు గుడికి వెళ్లాలి అని ఉంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు గుడికి వెళ్లి భగవన్నామస్మరణ చేస్తావాలేదా గుడికి వచ్చిన వాళ్లతో లోకాభిరామాయణం చేస్తావా అన్నది మాత్రం నిర్ణయింపబడదు. అది నీవు నిర్ణయం చేయవలసిందే.

Everything in life is determined. An example it would be you to go to the temple in between 9-10'o clock. But at that time in temple you chant name of God? Or whether you will do worldly gossips there. That is not decided. That is for you to decide. 

శ్రీ శారద శ్యామ సందేశం: 3 Jun

మనం పూర్వజన్మలో మనకు మంచి విషయాలు చెప్పేవారు ఎవరూ లేరు అని ఎంతో మధనపడితే ఈ జన్మలో ఇటువంటి అవకాశం వచ్చింది. ఆ విషయాలను విని ఆచరిస్తే నీకు సద్వినియోగం అయినట్లు. అట్లు చేయకపోతే తర్వాత కోట్ల జన్మలెత్తిన అటువంటి సాంగత్యం దొరకదు. మనం చేసుకున్న పుణ్యం కాస్త తరిగిపోతుంది. దాన్ని ఆచరిస్తే మంచి జన్మలకు అవకాశం ఉంటుంది. ప్రతి నిమిషమూ నీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరిస్తూ ఉండాలి. అదే మనకు మార్గం చూపిస్తుంది.

In our previous life, when we were so brewed that, there was no one who could tell us good things. Now Such an opportunity came in this life. If you hear and practice those things, you will benefit. If that is not done, later in birth crores no such association can be found . The virtue we have done will somewhat diminish. Practicing it will lead to better births. You have to remember your favorite divine name every minute. It shows us the way. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 4 Jun

నీతిగాధర్మంగా ప్రేమగా ఉన్న వారి దగ్గరికి భగవంతుడే వస్తాడు. నిత్యమూనిరంతరమూ నామ స్మరణ చేసుకోవాలి. పెద్దలను చూసి పిల్లల ప్రవర్తన ఉంటుంది. శిష్యులు చేసే ప్రతి ప్రక్రియ తమ గురువును ప్రతిబింబింప చేస్తుంది.

God Himself comes to those who have ethics righteous love. The name should be memorized continuously and constantly. There will be children's behavior while looking at adults. Every process that the disciples do reflects their teacher. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 5 Jun

తల్లి తన పని చేసుకోవడానికి పిల్లలు అడ్డం వస్తే బొమ్మలు ఇచ్చి మరిపించి తన పని తాను చేసుకుంటుంది.  బొమ్మలు కాదని తల్లే ఎత్తుకోవాలని ఏడిస్తే చంకలో పెట్టుకుని పని చేస్తుంది. అలాగే మన భర్తపిల్లలుకోరికలువ్యామోహలు మొదలగు వాటి యందు చిక్కుకొనక ఆ పరమేశ్వరుని యందు మనసు నిలిపినచో భగవంతుడు మనకు ముక్తి ప్రసాదించను.

The mother to do her work, she gives toys to children and diverts them. And does her work herself. Not for toys, for mother only if they cry, she works by keeping them in the armpit. Like this if we not entangling our mind on our husband, children, desires, passions and so on,  keep on that God. God will give us salvation. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 6 Jun

చెడును తొలగించుకోమంచి మిగిలించుకో. సద్గురువును సమాశ్రయించు. చెడుమంచి నశించి అందవలసినది అంది పొందవలసినది పొందగలవు. ఆనందదాయకముభగవత్ విభూదులను పొందగలవు.

Eliminate the bad, keep aside the good. Recourse the Guru. The bad and the good perish and will get what you deserve. Happiness, God delights can be obtained. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 7 Jun

సోమరితనము సాధనకు మహమ్మారి. ప్రతిక్షణము భగవన్నామస్మరణతో గడపడమనేది ప్రయత్నిస్తూసత్సంగముసత్పురుషులతో ఉండడం వలన మనకు తెలియకనే ఆనందమార్గంలో పయనిస్తూ శ్రీ గురుని కృపను పొందగలిగే యోగ్యతను పొందుతాము.

Laziness is the disease for achievement. Trying to spend time with the remembrance of the Lord, and by being with True-companionship and virtuous people, without knowing we walk on the path of bliss, we gain the merit of being able to receive the grace of Sri Guru. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 8 Jun

మనము తనను తెలుసుకోలేమని తెలుసుకున్న పరమాత్మతన వారిని ఉద్దరించుటకై తానే ఒక శరీరమును ధరించిమన మధ్య సంచరించితరింపజేస్తారు. కానీఆయన మన మధ్య ఉన్నప్పుడు గుర్తించగలిగే శక్తి కొన్ని కోట్లలో ఏ ఒక్కరికో ఉంటుంది. కరుణామయుడైన శ్రీ గురుడు మన అందరినీ ఆ ఒకనిగా చేయుగాక!

God realised that We don't understand him. To empower his own people he wore a body, wandering among us to enable us. But the power to recognize him when he is among us can be done by one among few crores. May the merciful Sri Guru make us all unified! 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 9 Jun

ఎన్ని శాస్త్రాలుపురాణాలుకావ్యాలుశ్రుతులుస్మృతులువ్యాకరణాదులు చదివి ప్రజలచే అపరిమితమగు మెప్పును పొందగలిగేటట్లు వివరించగలిగినా,  ఉపన్యసించగలిగినారాయగలిగినా,  శ్రీ గురుని యందు త్రికరణశుద్ధితో భక్తి కలిగి వినయంతోఓర్పుతో ఆరాధించిన వారికి శ్రీగురుకృప వలన పొందగలిగే ఆనందము వర్ణనాతీతము. శ్రీ గురుని సంబంధమే నిజమగు సత్సంగము. మిగిలినవన్నీ వ్యర్థములుపతనహేతువులు.

No matter how many sciences, legends, poems, melodies, memories, grammars can be read, in a way infinite way they can be explained, lectured or written.... On Sri Guru who have purely devotion with humility and patience admiring him, by his grace can obtain indescribable joy. The True-companionship (Satsang) is the real relationship with Sri Guru. Everything else is rubbish, and indicators of the falling. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 10 Jun

ప్రతిదినము పడుకునే ముందు ఆ రోజు జరిగిన కార్యక్రమములు జ్ఞాపకము చేసుకొని వ్రాసుకొనవలయును. మరునాడు చేయవలసిన కార్యక్రమములను క్రమపద్ధతిలో నిర్ణయించుకుని వ్రాసుకొనవలయును. వ్రాసుకున్న దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. 

సోమరితనము మహమ్మారి. వ్యాధులకంటే బలమైనది. జన్మనువృత్తినిమిగిలిన అన్ని కార్యక్రమములను సర్వనాశనం చేసిశరీరమునుమనసునుచిత్తమునుబుద్ధిని నశింపచేయుము.

Every day before going to bed you should remember and write down the activities of that day. The next day, the activities to be done should be decided systematically and written down. Behave in accordance with what is written.  

Laziness is the pandemic and Stronger than diseases. It destructs birth, occupation, all other activities and destroys body, mind, memory and intellect.  

శ్రీ శారాదా శ్యామ సందేశం: 11 Jun

సృష్టి కార్యక్రమంలో మనకున్నదంతా ఇతరులకు పంచేటంత వరకు జన్మలు తప్పవు. అందుకే గురువు అర్హత యోగ్యత కలిగిన వారి కొరకు తాపత్రయపడుతూ ఉంటారు. గురువు అనే భావంతో ఎంతమంది శుద్ధిగా విశ్వసించి ఆయన ఆదేశాలను పాటిస్తూ ఉంటారో వారు జన్మరాహిత్యం పొందే వరకు గురువుకు జన్మలు తప్పవు.

In Creation process, births will be there until we share with others all that we have.  That is why the Guru is eagerly waiting for those who are qualified. No matter how many people who are pure believers in the feel of Guru and follow his commands, till their salvation, Guru also takes births. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 12 Jun

తల్లితండ్రిగురువుదైవములను మరిపించి అన్నీ తానేఅన్నింటికీ తానే అనెడి మధురానుభూతిని కలిగించే ఆనందమునుఆత్మస్థైర్యధైర్యములను ప్రసాదించి అపారమగు మనశ్శాంతిని అందించగల వారే మన గురుదేవుడు. అటువంటి వారిని ఆశ్రయించిన తర్వాత వారు చెప్పినది చేయడమే మన కర్తవ్యము. అదే ఆనందమునకు మూలము.

By forgetting the mother, the father, the teacher, the deities and make it all, all by himself and Gurudev causes sweet feelings of bliss, soul-steadfastness, courage and gives us incomprehensible peace of mind. After resorting to such one's. It is our duty to do as they say. It is the source of the happiness. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 13 Jun

అంతరంగము ప్రేమతో నిండినప్పుడు ఆవేదన నివేదనగా మారడమే పూజ.

When the inner being is filled with love, grief changes to gift That is Adoration. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 14 Jun

మాటప్రవర్తనఆలోచన సక్రమంగా ఉండాలిఉంచుకోవాలి . మనసుమాటచేతల్లో ఒకటే ఉండాలి. అంటే త్రికరణశుద్ధి. భగవంతుడిని నమ్ముకుని చెడిపోయినవాడు లేడు. ఆలోచనా విధానం మారితే మాట మారుతుంది. ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. పుణ్యం ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. పాపం ఉంటే చెడు ఆలోచనలు వస్తాయి.

Speech, behavior, and thought have to be and should be kept in order. The mind, the word, the deeds it must be the same. I.e. Three-characteristic-purity. No one was corrupted, by believing in God. The word changes when the way of thinking changes. Talk carefully with everyone. We do not know when we will die. Be careful every moment.  Good ideas come if there is virtue.  If sin is there, then bad thoughts will come. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 15 Jun

బావిలోని నీరు తోడుకోవాలంటే ఆ విధానం తెలుసుండాలి. ఆ విధానం చెప్పే వారు గురువు. అర్హత సంపాదించుకోవాలి. అనుభవంతో తత్వము గురించి తెలుస్తుంది. అమ్మ అంటే ఆకారం కాదు. అది తత్వము. ఇలా భగవంతుని యందు ఉండాలి. 

From well to get water, you need to know the procedure. Those who say that approach are called Guru. Must qualify for that. Knowing the philosophy with experience. Mother does not mean shape. That is the philosophy. This is how we should be near God. 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 16 Jun

మనసు మధ్యన ఉంటుంది. దాని చుట్టూ ఈ శరీరం కవచంలా ఉంటుంది. భగవంతుడికి మనకు మధ్య అడ్డంకులు పాపాలు. మనం ఎందుకు గొప్పవాళ్ళము కాలేక పోతున్నాముఉల్లిగడ్డను పైనుంచి ఒక్కొక్క పొర తీసేస్తే చీవరకు ఏమీ మిగలదు. అలాగే మనలో కూడా కామక్రోధలోభమోహమదమాత్సర్యాలను తొలగించుకుంటే ఏమీ ఉండవు.

The Heart is in the middle. This body is a shield around it. The barriers between us and God are sins. Why we are not becoming can't great? Peel an onion layer by layer then there is nothing in it. Similarly, if we get rid of lust, anger, greed, fascination, ego and jealousy, there will be nothing.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 17 Jun

మనిషికి శత్రువు ఎవరు

నేను-నాది అనేది శత్రువు. ఎవరైనా నీకు బుద్ది లేదు అని తిడితే ఊరుకుంటామాలేదు. మళ్లీ తిరిగినీకే లేదు అంటాము. అలా కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి కదా! అతని రూపంలో నీలో తప్పు తెలుపుతున్నాడని అనుకున్నప్పుడు అతనితో నీకు శత్రుత్వం ఉండదు.

Who is the enemy of man?

I-mine is the enemy. If someone scolds, You don't have mind? You would be calm? No. In reverse we only say that you don't have that. Instead of that, God is omnipresent know! when you think he is pointing out your mistake in his form, then you have no enmity with him. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 18 Jun

మంచి నుంచి చెడుకి వెళ్తే మనసు అంగీకరించదు. ఎప్పుడూ మంచి చేస్తుంటే చెడు చేయలేవు. మంచి చేయకుండా ఉండలేవు. అందువలన చెడు పోతుంది.

if you go from good to bad, mind will not accept. If always doing Good means you can't do Bad. Can't stop doing good. Thus bad will go away. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 19 Jun

వ్యామోహం అంటే శారీరక వ్యామోహం కాదు. తిండి మీదబట్టల మీద ఉన్న వన్నీ వ్యామోహములే. అవన్నీ పరిశీలించుకుంటే చాలు. ఒక్క మెట్టు ఎక్కినా చాలు. మిగతావన్నీ స్వయంచాలకంగా ఎక్కుతాం.

Obsession means not physical obsession, On food, On clothes, on all things are called Obsession. If we examine it all, one step is enough, to automatically climb all steps. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 20 Jun

భగవత్తత్వము గురించి ఆలోచిస్తూ ఉంటే కళ్లు తెరవాలనిపించదు. లీనమైతే ఏడుపొస్తుంది. సాధన మొదలు పెట్టుకుంటే అదే నడిపిస్తుంది. రాని దాని కొరకు రచ్చల పడనేల. తెలుసుకొని అన్నా చేయిచేస్తూ అన్నా తెలుసుకో. ఊరకే చేయొద్దు.

Thinking about God-philosophy, doesn't makes you to open eyes. If immerse, we get crying. if you start practicing, the same only leads you.. Don't worry about unknown thing, do after knowing or while doing know, don't do without purpose. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 21 Jun

పిసినారితనము - ఇది పోగొట్టుకోవాలంటే దానగుణం అలవరచుకోవాలి. ఆ దానం చేయునప్పుడు ఈ డబ్బు వాళ్లకు ఉపయోగమాకాదాఅని ఆలోచించి చేయాలి.

Parsimony: If you want to lose it, you have to adopt charity. When they donating, Is this money useful to them, or not? Should think and do it. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 22 Jun

మోహము - వ్యామోహము - డబ్బునగలుచీరలు ఇన్ని పెట్టుకుని నేనేం చేస్తానుఇన్ని అవసరమాఅనే ప్రశ్నలు వేసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవాలి.

Fascination - What do I do with so much money, jewelry, saris? This much needed? Questions should be asked. It should be used as long as it can useful.  We must criticize ourselves. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jun

ఒక విషయం కొత్తగా తెచ్చి పెట్టుకుంటే పాతది పోతుంది. (మంచిచెడు) - పెట్టెలో 10 రకాల వస్తువులు ఉన్నాయి. దానిలో 2 కొత్తవి చేర్చాలంటే 2 పాతవి బయటికి తీయాలి.

When a new thing is brought in, the old is lost. (Good, bad) - There are 10 types of items in the box.  In order to add 2 new ones in it 2 old ones have to be taken out. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jun

ఎవరైనా బయటి నుంచి వస్తూనే ప్రేమగా పలకరించి మంచి నీళ్లుకాఫీటీలు ఇవ్వాలి. ఏమి అలా ఉన్నావు అని ప్రేమగా అడగాలి. భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే అందరి హృదయాలు గెలవాలి. ఈ నియమాన్ని పెట్టుకుని జీవించటం వలన మంచికి ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. అవకాశం కోసం కాచుకుని ఉండాలి. చేశామని ఉండరాదు. మనిషి సఖ్యతగా ఉండాలి. అర్హత యోగ్యత సంపాదించుకోవాలి.

When someone come from outside greet them warmly and give them good water, coffee, tea. You have to ask lovingly how are they. To have the grace of God means to win the hearts of all. Living by this rule will result in good. Must wait for the opportunity. There should be no feeling of being we did. The man must be in harmony. Must be eligible and qualify. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jun

సమస్త జీవరాశికి సమ్మతమైనదే నిజమైన మతము. పరిపూర్ణ అహింస అసంభవం. అలలు ఉన్న దాంట్లో స్నానం చేస్తే దోషాలు పోతాయి. మీరు ప్రకృతిని గౌరవిస్తూ పోతే ప్రకృతి మనకు సహకరిస్తుంది. దేహ భ్రాంతిప్రాణ భీతి పోవాలంటే సద్గురువును సమాశ్రయించివారు చెప్పినట్లు చేయాలి. ప్రతి పనీ భగవంతుడిదే అనుకుని చేయాలి.

The true religion is the one that is acceptable to all living beings. Absolute nonviolence is impossible. Bathing in a rippled water will get rid from the Errors. If we go by respecting nature, nature will support. In order to get rid of body delusion and fear of life, one should consult a Truthful-Guru and do as he is told. Should feel every work belongs to God and do it. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jun

మానవుడిగా పుట్టడం వలన ఉపయోగం ఏంటిమనము ఎందుకు బతుకుతున్నాముకేవలం తినడమునిద్రపోవడముపిల్లల్ని కనడమువాళ్ళను పెంచడము ఇదేనా మన ధ్యేయంఅలా అయితే జంతువులకుచెట్లకు మనకు తేడా ఏమిటిజంతువులుచెట్లు - అవి అయినా ఇతరులకు ఉపయోగపడుతున్నాయి. మన వల్ల ఎవరికి ఉపయోగంమార్కోనీ రేడియోను కనుగొన్నాడు. ఇట్ల గొప్ప గొప్ప వాళ్లు ప్రజలకు ఉపయోగపడు పనులు చేయిస్తున్నారు కదా! వాళ్ళు చేయగలిగింది మనము ఎందుకు చేయడము లేదువాళ్ళు మనలాంటి మానవలే కదా! మన లక్ష్య ఏమిటిసాయి తాతయ్యరమణ తాతయ్యగారి లాగా మనం ఎందుకు ఉండలేక పోతున్నాముమనం అందరం ఆ భగవంతుడి నుండి వచ్చాము కాబట్టి తిరిగి భగవంతుని చేరవలసిందే. భగవంతుని చేరడం మన లక్ష్యమైనప్పుడు మిగిలిన విషయాల మీద కోరికలుఆశలువ్యామోహాలు ఎందుకువాటివలన ఉపయోగం ఏమిమన లక్ష్యాన్ని చేరుకోలేము కదా! విషయవాసనలను(కోరికల మీద మమకారం) మనంతట మనము తొలగించుకోలేము. గురువు సహాయం లేనిదే వాటి నుండి బయటపడలేము.

What is the use of being born human? Why do we live? Is our goal just to eat, sleep, to give birth to children, and raise them? So what is the difference between us and animals and trees? Animals, trees - they are useful to others though. Who benefits from us? Marconi invented radio. Are these great people doing things that are not useful to the people? Why do not we? Aren't they human beings like us! What is our goal? Why can't we be like Sai Baba and Ramana Maharshi? We all have to come back to God because we came from that God. When our goal is to reach God, why desires, hopes, and obsessions over other things? What is the use of them? Can't reach our goal! We cannot get rid of subjective odors (Fascination on desires) on our own. Without the help of a Guru one cannot get out of them. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jun

ఈ సృష్టిలో వ్యర్థమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కదాని వలన ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. చీమల లాగా నిరంతరం కృషిచేయడంఈగ లాగా ఎప్పుడు బాహ్యంగాఅంతరంగానుపరిశుభ్రంగా ఉండటంకుక్క లాగా విశ్వాసంతో పడి ఉండటంఈ మూడు సాధకునికి ఉండవలసిన ముఖ్యలక్షణములు.

There is nothing waste in this creation. Each one has a use for something. Like ant Constantly working hard, like fly outwardly internally being hygiene, like dog having faith, these three are the hallmarks of the practitioners. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 28 Jun

ఇతరులను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. ఎవరిలో ఏమి ఉందో మనకు తెలియదు. నేను ఇక్కడకు వచ్చాను. ఇంక ఎవరు రాలేదు కదా అని గొప్పగా (అహంకారం) భావించకూడదు. భగవంతుడి సంకల్పం అలా ఉంది. ఆయన అనుగ్రహం వలన వచ్చాము అని భావించాలి. వారికి సమయం వచ్చినప్పుడు వారు వస్తారు. మనం కొన్ని సంవత్సరాలు సాధన చేసినరానిది వారికి కొన్ని రోజుల్లోనే రావచ్చును.

Never underestimate others.  We do not know what is in them. I reached here, no one else has come. So don't feel great (arrogance). That is the will of God. We must think that we came by His grace. They will come when the time comes for them. What we have got in a few years may come to them in a few days.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 29 Jun

చదవటం నీ వంతు. దేవుడు ఏదిస్తే దానిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందే ఇలా ఉండాలిఅలా ఉండాలి అనుకోవడముఅపరిమితమైన దుఃఖానికి కారణమవుతుంది.

It's your turn to read. What God gives you must be willing to do that work. To be like this before, to be supposed to be like that, causes immense grief.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 30 Jun

మనకు ఏది మంచిదో అది భగవంతునికి బాగా తెలుసు కదా! మనకు మంచిదేదో దానిని చేయమనిదానికి విఘ్నములు కలిగించే పని చేయకుండా ఉండేటట్లు చేయమని ఆ తండ్రిని ప్రార్థిస్తే మనకు జరిగేదంతా మన మంచికే అని తెలుస్తుంది. అనేక అనుభవములు కలిగి మనకు ఈ విషయం బాగా అవగాహనకు వస్తుంది.

God knows best what is good for us! If we pray to the Father to do what is good for us and not to do anything that would hinder us, then we will know that everything that happens to us is for our good only. With many experiences we come to understand this very well.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 1 Jul

నీళ్లలో నావ ఉండాలి కానీ నావలో నీరు ఉండకూడదు అని అంటారు. అంటే దానర్థంసంసారంలో నీవు ఉండాలి కానీ నీలో సంసారం ఉండకూడదు అని . తామరాకుపై నీటి బొట్టువలె ఉండు అంటారు. అంటే తామరాకుపై నీరు ఉన్నప్పటికీ ఆ నీరు తామరాకును ఎట్లా అంటుకోదో ఆ విధంగా ఈ సంసారంలో ఉండాలి .

It is said that there should be a boat in the water but there should be no water in the boat. It means that you should be in all things but no things should be in you. It is called like a drop of water on a lotus. That is, even though there is water on the lotus, that water doesn't stick to it, like that you need to be life with all things (Samsara).

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 2 Jul

మానవుడికి తనమీద తనకు ఎప్పటికీ అహంకారంతో కూడిన విశ్వాసం ఉండకూడదు. తన మీద తాను ఆధారపడకూడదు. ఎప్పుడు భగవంతుని మీద ఆధారపడి ఉండాలి. తాను నడవగలనుతాను ఊపిరి పీల్చుకోగలనుతాను చేయగలను అని తన మీద తనకు విశ్వాసం ఉన్నంత వరకు భగవంతుడు ఏమీ చేయడు. తానేమీ చేయలేననిఏమైనా చేయగల శక్తి భగవంతునికిగలదు అని అనుభవంతో తెలుసుకున్నప్పుడేభగవంతునిపై విశ్వాసం కలిగినప్పుడేఆయన మీద ఆధార పడినప్పుడే ఆయన అన్ని చేస్తాడు.

Man should never have an arrogant confidence in himself. Don't rely on yourself. Always depend on God.  God will do nothing when he has belief in himself that he can walk, he can breathe, he can do.. with experience when he know that he can do nothing, then God has the power to do anything. Rely on Him, he does everything for you.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Jul

మోసేవాడు ఉండగా మనకెందుకు భయముదిగులుమనము ఏమిచేయాలో ఆయనే మన చేత చేయిస్తాడు. మనము చెయ్యవలసినదల్లా అన్నీ ఆయనకు నివేదించుకోవడమే. 

Why do we fear and worry when there is a bearer? what we want to do, he will makes us to do. All we have to do is Submitting everything to Him.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Jul

మనము గతంలో ఉన్నట్లు ఇప్పుడులేము. ఇప్పుడున్నట్లు ముందు ముందు ఉండబోము. కనుక వర్తమానాన్ని జాగ్రత్తగా గమనిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహించాలి.

We are not what we used to be in past. We will not be as we are now. So by carefully focusing present we should perform our duty.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Jul

సదా పరులకు ఉపకారము చేయుచుండు వారికి భగవంతుని కృప సులభ సాధ్యము. దురాశఅత్యాశపేరాశ ఇవి దుఃఖ సముద్రమున ముంచును. కలియుగమున సత్యముగానుండుట సకల శుభములను కలిగించును. 

Those who always do good to others, for them God's grace is easy. Greed, covetousness, avarice drown us in the ocean of sorrow. In Kali Yuga, being truthful brings all good things.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Jul

శ్రీ గురుని నీ వానిగా భావించి నీ సర్వస్వమును అర్పించిప్రేమభక్తులతో ఆరాధించు. నీకు సకలము సిద్ధించును.

Consider the Sri Guru as your own, offer your all things, and worship with love and devotion. Everything will prepare for you.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Jul

నీవు నమ్మినది నీకు ఎప్పుడూ మంచినే చెబుతుంది. కావున మరేమీ ఆలోచించక విశ్వాసముతోధైర్యముగాఓర్పుతో ఆచరించు. సన్మార్గుడవై సంచరించుతరిస్తావు. గురువు యొక్క శరీరాన్ని గానీఅలవాట్లను పట్టించుకోకు. ఆయన అందించే సందేశాన్ని పొరపాటు లేకుండా ఆచరించు. అదే ఆనందానికి శాంతికి మార్గము.

What you believe is always good for you. So don't think about anything else and practice with faith, courage and patience. Wander along the right path and you will prosper. Don't care about the Guru's body or habits. Practice his message without fail. That is the path to happiness and peace.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Jul

బాహ్య ఆడంబరములు లోకుల కొరకే గాని మరి ఎందుకూ కొరగావు. నిరాడంబరమగు అంతఃకరణమునందుండిపెల్లుబికే ప్రేమతో పిలిచే పిలుపునకే శ్రీగురుడు ప్రసన్నుడవుతాడు.

External ostentatiousness is only for the sake of the society, And why did you ask?

From inwardness, calling with exploding love will make Sriguru pleasent.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Jul

దిగులుగుబులును కలిగించి చిత్త చాంచల్యమును పెంచినేను కర్తననే భావనను పటిష్టం చేస్తుంది. "నేను" అనే భావన ఉన్నంత వరకు ఆయన ఉన్నాడనే ధైర్యము కలుగదు.

Anxiety and confusion causes increase of restlessness in the mind and strengthens the "I" sense in the doer. As long as there is a sense of "I", there is no courage that He exists.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Jul

సందేశాలను చదవడం వలనఆలోచించడం వలన కొంతవరకైనా మీ దుష్ట సంస్కారములకు కళ్లెం పడింది. లేకుంటే అందరికన్నా మీరే ముందుగా ప్రలోభాలకు లొంగేవారేమో! అందుకే అన్నారు, "శ్రీ గురుదేవుల సన్నిధి ఆనందమునకుశాంతికి పెన్నిధులని.”

By Reading the messages and thinking about it has broken some of your bad habits. Otherwise, you would be the first to succumb to temptation! That is why some said, "Sri Gurudev presence is close to happiness and peace."

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Jul

ఒకరిని నమ్ముకుంటే వమ్ముకాదు మన బ్రతుకు. ఒకరిని వదిలి మరొకరినిఇలా మార్చుకుంటూ అందరితో సంబంధాలు ఉంచుకుంటేచేయవలసినదేదో తెలియదుచేయరానిదీ తెలియదు. చివరకు మనలోని బలహీనమైన సంస్కారములు దైవము ఉన్నాడా అనే సంశయ దశకు కూడా తీసుకువెళ్తాయి. శాంతిఆనందములు నశించి అశాంతిదుఃఖములతో మనమే కాకుండా మన కుటుంబము కూడా అధోగతి చెందుతుంది.

If we trust one, it will not break our life. If leaving one for the other, changing like this in touch with everyone, you don't know what to do and what not to do. Finally, our weak rituals lead us to the stage of doubting the existence of God. Peace and happiness perish and with unpleasantness, grief will degrade not only us, but also our family.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Jul

మహాత్ముల మాట శిలాశాసనము. మానవుల మాట నీటి మాట. మనలను (మన సంస్కారములను గురించి) మనమే చూసుకోవాలి. పుస్తకములుఉపన్యాసములుచర్చలు - అవగాహనఆచరణలు లేనప్పుడు నిరుపయోగములు. పైగా గర్వమునుఅహంకారమును పెంచుతాయి.

The words of the greats are epitaphs. The word of man is the word of water. We have to look after ourselves (about our rituals). Books, lectures, discussions are useless In the absence of awareness and practice. Moreover, it increases pride and arrogance.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Jul

గురువునకు నిజంగా సంపూర్ణ శరణాగతి చేసుకున్న వ్యక్తికి చింతలుకోరికలువిచారములు ఉండనేరవు. అతనికి తన గురు సంకల్పమే తప్ప తన సంకల్పమంటూ ఉండదు.

A truly complete surrender to the Guru has no worries, desires and sorrows. He has only Guru's will, but not his will.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Jun

మనశ్శాంతినిస్సంగముగా జీవిస్తూ చివరకు ముక్తిని పొందడానికి దేవుడు మనకు బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ప్రకృతి ధర్మములను అధ్యయనం చేస్తూ గురు సహాయముతో భావి జీవిత పథకాన్ని రూపొందించుకోవాలి.

To finally attain salvation, Living with Peace of mind, without association, God has given us intellect. With that use intellect , by studying nature's virtues, with the help of Guru formulate a future life plan.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Jul\

Age (అర్హత) వస్తే stage (స్థితి) వస్తుంది. Age రావడం కోసం Sage (గురువు) ని ఆశ్రయించాలి.

Age (eligibility) comes, stage (status) comes. Sage (Guru) should be approached for attaining Age.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Jul

సత్యం చెప్పే వాళ్లు తమ చర్యలను మరీ మరీ సమర్ధించుకోరు. ప్రేక్షకుల వలె చూస్తూ మౌనంగా వుంటారు.

Truth tellers do not justify their actions too much. They watch and remain silent like spectators.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Jul

సమర్ధ సద్గురువే పరబ్రహ్మ. త్రికరణశుద్దిగా సద్గురువునకు ఆత్మ సమర్పణ చేసుకొనుటయే సత్యము అనుభవించుటకు మార్గము.

Capable True Guru is Demiurge. With Trinity-Purity surrender the soul to the Guru. Its the way to experience the truth.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Jul

సేవలను అందుకొనుటకు కాక ప్రతి జీవికి ప్రతి దానికి సేవ చేయడానికే మనము ఈ భూమి మీదకు వచ్చామని అందరూ అనుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాధకు తావుండదు.

There will be no suffering if everyone thinks that we have come on this earth not to receive services but to serve each and every living being.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Jul

సదా సద్గురునికి దాసునిగా వుండటమే మన కర్తవ్యము. దాసుడే ధన్యుడవుతాడు. ఇది సత్యము.

Our duty is to always be a servant of True-Guru. Servent will be blessed. This is the truth.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Jul

సదా నిరంతర హరిగుణ గావో - నిరంతర భగవన్నామ స్మరణముచేతనైనంత దానముసత్సంగము కలియుగమున శ్రేష్ఠములని భాగవతమునందున్నది. ఇష్టమైన నామమును భక్తితోప్రీతితో భజియించుటయే మిగిలినవి. సమకూరుటకు మార్గము.

Always continuous sing Hari characteristics. Constant remembrance of God, as much as possible donation. True-companionship is the best in Kali Yuga. The rest is to chant the beloved name with devotion and love. Way to get along. 

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Jul

అన్ని సాధనలకు ఆరోగ్యకరమైన శరీరముఆరోగ్యకరమైన మనసు అవసరము.

For all practices a healthy body and a healthy mind is necessary

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Jul

నీ అనుభూతులనుఆవేశాలను అణచ వద్దు. ఎవరి వద్ద నీవు స్వేచ్ఛగా మన గలుగుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో.

Do not suppress your feelings and emotions. With whom you are free, with him share the feelings of the heart. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jul

విగ్రహారాధన చేస్తూ పరులను దూషించడము భక్తి కానేరదు. క్షమ - భక్తుని శాశ్వత ఉజ్జ్వల స్వభావము. మనము మంచివారమైతే అంతా మంచిగనే వుంటుంది.

While worshiping idols, blaspheming people is not piety. Forgiveness - the eternal radiant nature of the devotee. If we are good, everything will be good.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 24 Jul

ధనం సంపాదించవచ్చు. వస్తువులు కొనవచ్చు. కాని తల్లిదండ్రులనుసత్పురుషులను కొనలేము. వారి సలహాలు చీకట్లో దీపాల వంటివి. తెలివిగా నిర్ణయం తీసుకో.

Money can be earned. Things can be bought. But parents and True-men cannot be bought. Their advices are like lamps in the dark. Make a wise decision. 

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jul

"ప్రేమపూరిత కరుణ” శాసనాలకన్నా గొప్పది. దానాలుకర్మకాండలకన్నా అదే గొప్పది.

"Loving compassion" is greater than statutes. It is greater than deeds and rituals.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 26 Jul

నది నిస్సంగ భావాన్నిఅంకిత భావాన్ని నమ్రతను బోధిస్తుంది. జీవితం కూడా నది వలెనే అనంత దివ్య మహా సాగరం వైపు ప్రవహిస్తోంది.

The river teaches unsocial feeling, dedication and modesty. Life itself is like a river flowing towards the Infinite Divine Ocean.

 

శ్రీ శారాదా శ్యామ సందేశం: 27 Jul

మతం అంటే దైవ యెడమానవుని యెడ ప్రే8మ తప్ప మరేమీ కాదు. జీవితం అశాశ్వతంకానీ బుద్ధిహీనులు దాన్ని సత్యమని యెంచి దానిలో చిక్కుకొని పోతారు.

Religion is nothing but love for God and Human.  Life is impermanent, but the unintelligent thinks it is true and get caught up in it.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Jul

శారదాశ్యామ విరచిత శ్యామ సందేశం: గురువు ఈ క్రింది వానిని పరీక్షించవచ్చును: నిరహంకారముసత్యసంధతవ్యక్తిత్వముసమయ పాలనమునిస్వార్థమునమ్మకముధైర్యమువిశ్వాసముసహనమునిష్కపటపు ఓర్పుసఖ్యతకోమలత్వముప్రశాంతతశారీరకమానసిక అర్హతకాయకష్టముగ్రహణ శక్తిజాగరూకతఆచరణమునమ్రతశక్తి సామర్థ్యములునిజాయితీసమయోచిత ప్రజ్ఞఎరుకసాహసముసత్వస్వభావముకృతజ్ఞతప్రేమచురుకుదనముపెద్దలయందు గౌరవమువిశాల దృక్పథముకుశాగ్రబుద్ధి మొదలైన గుణముల లక్షణములుసంస్కారములు.

The Guru may test him on the following: Humility, truthfulness, personality, time management, selflessness, trust, courage, faith, patience, sincere endurance, harmony, gentleness, composure, physical, mental fitness, hard work, perceptive power, vigilance, practicality, modesty,  Strength, honesty, timely intelligence, consciousness, adventure, true nature, gratitude, love, activeness, respect for elders, broad perspective, alert mind, etc. characteristics and qualities.

 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 29 Jul

గురువు ఈ క్రింది వాటికి శిక్షణ ఇవ్వవచ్చును: శారీరకమానసిక సంబంధములగు విద్యశుభ్రతబ్రహ్మచర్యముసకలకర్మలుసర్దుబాటుతనముశక్తిఆరోగ్యము కొరకైన ఆహారముసమయోచిత కార్య నిర్వహణ గుణముతీర్థయాత్రలుమహాత్ముల సందర్శనమునిరాడంబర జీవితముఆధ్యాత్మిక ప్రవచనములుగ్రంధ రచననైతిక విలువలకు కట్టుబాటుప్రచారానికి దూరంగా ఉండటముధ్యానమునిర్భయతస్థిరత్వముఅంకితభావంతో కూడిన మానవ సేవాతత్పరత మొదలగునవిమరియు చివరగా గురువు అనుగ్రహంతో ముక్తి . శిష్యుడు తప్పనిసరిగా ఆధ్యాత్మిక తపనసహనం కలిగి ఉండాలి.

The Guru may give training in the following: physical and mental relative education, cleanliness, celibacy, all deeds, adjustment, energy, healthful diet, proper conduct of work, pilgrimages, visits to Mahatmas, humble life, spiritual discourses, writing scriptures, adherence to moral values, Abstention from propaganda, meditation, fearlessness, steadiness, devoted human service, etc., and finally liberation by the Guru's grace. A disciple must have spiritual aspiration and patience.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Jul

ఒక పెద్ద వృక్షము అనేక రకముల ప్రాణులకు ఆశ్రయమిస్తుంది. ఆ ప్రాణులు అక్కడ విశ్వాసముతో రక్షణ పొందుతాయి. గురువు కూడా అలాంటి మహావృక్షమే. మనమంతా వారి ఆశ్రయము పొందగల ప్రాణులము.

A large tree shelters many species of animals. Those souls will be saved there by faith. Guru is also such a great tree. We are all beings who can take their shelter.

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 31 Jul

నీవెవరోఏమి చేస్తున్నావోనీవలన నీకు ఎంత ఉపయోగమోఇతరులకు ఎంత ఉపయోగమో చూచుకుంటూ బ్రతికితేగానీ బ్రతుకుకు అర్థం తెలియదు.

By watching who you are, what you are doing, how useful you are to yourself and how useful you are to others, if you live,  then you know the meaning of life.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: (1 Aug)

ఆచరణాత్మకతతోఅసలైన జిజ్ఞాసతో అందరూ ఆనందమయులుగా మారగలరని తెలిపేదే శ్రీఅవధూతలీల.

God's Messenger magics says that "With practicality and genuine curiosity, everyone can become happy" 

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Aug

వ్యక్తి జీవిత స్వభావం అతని చుట్టూ ఉన్న సమాజంతో అతనికి గల సంబంధాల స్వభావంగా ఉంటుంది.

The nature of an individual's life is the nature of his relations with the society around him.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Aug

ఋణాను బంధము తప్పదు. సద్గురువుతో ఋణానుబంధము పెట్టుకుంటే చక్కగా నడిపిస్తాడు.

Debt relationship is inevitable. If you have a debt relationship with Sadguru, he will guide you well.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Aug

సమర్థ సద్గురువును సమాశ్రయించినమనలోనూమనకు కనిపించని వారిలోనూ నిండి ఉండి అన్ని వేళలలోఅన్ని మార్గములలో జీవులను పరమ శ్రేయోదాయకమగు మార్గమున నడిపించునటుల అనుభవము జరిగి శాంతి సుస్థిరమై ఆనందము అవధులు దాటును.

Those who have surrender to the competent Sadguru... who is present in us and who are invisible to us from them and living beings leads us in the path of supreme beneficence at all times and in all ways. Experiences happens, peace is established and bliss transcends the bounds. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Aug

అనుకునే అందరూ జన్మించడం లేదు. ఉందామనుకున్న వారందరూ ఉండటంలేదు. రావడంపోవడం మన చేతిలో లేదు. పరిమితమగు ఆశ నిస్వార్థమైనది అయితేనెరవేరుతుంది. అపరిమితమగు ఆశదురాశ - పేరాశలుగా మారి స్వార్థపూరితమై దుఖంలో ముంచుతుంది. మునిగినది తెలుసుకోవడం కాదు. వెలుపలికి రావడం తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సహచర్యం మనకెంతో లాభము చేకూర్చుతుంది. వినయమువివేకము అనునయంతో కూడిన భగవత్ కృపను అందిస్తుంది. కోరిక ఏదైనా అనుకోవచ్చు. తీవ్రంగా ప్రయత్నించవచ్చు. కానీ ఫలితం మాత్రం మన చేతిలో లేదనిఆ కార్యక్రమానికి వచ్చిన ఫలితమే మనదనిమనకు మేలు చేకూర్చునని గ్రహించుటే ఆనందానికి ఆది.

Not everyone who thinks is born. All those who wanted to be there are not here. Coming and going is not in our hands. If unselfish limited hope is there means that can fulfilled. Unbridled hope, greed turns into edacity and selfishness and leads to misery. Not to know the sunk. Know how to come out. The companionship of experienced people will benefit us greatly with humility, wisdom, persuasion and God's grace. Desire can be anything try hard. But the beginning of happiness is to realize that the result is not in our hands, the result of the program is ours and will benefit us.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Aug

అంతా యింతే. యింత దానికి అంతెందుకుఅంతెందుకు అని ఊరుకోకు. ఊరుకుంటే ఊరు ఊరుకోదు. ఊరు-పేరులకు తేడా లేదని తెలిసే వరకూ నీకూ నాకూ ఈ తగిలింపులు తప్పవు. తప్పవని నిరుత్సాహ పడకు. తప్పవని తెలిస్తేతప్పించుకోగల శక్తి వస్తుంది. అది వస్తే అంతా ఇంతేనని అవగాహన అనుభవములలో తెలుస్తుంది.

That's it. Why so much for that? 

Don't keep by saying why. If you settle down, the town will not keep you settle down. Until we know that there is no difference between town and name, you and I will have inevitable encounters from attachments. Don't be discouraged for inevitable's.  If you know that you are inevitable, you will have the power to escape. it will be known in the experiences of awareness.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Aug

"నాకు గురువు కావాలి. మిమ్మల్ని గురువుగా పెట్టుకుంటాను." తీవ్రమైన ఆకలైన వాడు ఆహారాన్ని వెతుక్కుంటాడు. అలాగే నిజంగా మనస్ఫూర్తిగా దైవాన్ని తెలుసుకోవాలనిఆయన అనుగ్రహాన్ని పొందాలని ఉంటే సర్వాంతర్యామి అయిన దైవం ఏదో ఒక మార్గము ద్వారా గురువు చెంతకు చేర్చుతాడు.

"I want a Guru. I'll keep you."  He who is very hungry searches for food.  Like that, if you really want to know God with your heart and get His grace, who is omnipresent. God will bring you Guru through some means.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Aug

రూపమేదైనానామమేదైనా తుది శ్వాస వరకు స్మరిస్తూ చేతనైనంత వరకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండటమే మానవ జన్మకు సార్ధకతను కలిగిస్తుంది.

Whatever the form or name is, remembering it till the last breath and praying as much as possible makes human birth meaningful.

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Aug

స్వచ్ఛమైన అపరంజి లాంటి సంస్కారానికి లొంగుతాడు శ్రీగురుడు. భూత దయప్రేమకరుణ కలిగిన మానవుని మహాత్మునిగా తీర్చిదిద్దగలడు.

Sriguru surrenders to pure refined behaviour. a human being with kindness, love and compassion can transform into a Mahatma. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Aug

నీకు చక్కటి అనుభవమును కలిగించి నీ నుంచి దేనినీ కోరకనీ శ్రేయస్సునే కోరేదాన్ని నమ్ముకో. అదే సక్రమముగా మార్గములో నడిపిస్తుంది.

The one who give you a good experience, and wants nothing but your well-being. Trust them. They leads in the right way.

 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Aug

సద్గురువును సమాశ్రయించడం అంటే ఆయన ఆదేశ సందేశములకు అనుగుణముగా నడుచుకుంటూ అన్నింటికీ ఆయనే ధ్యేయమైలక్ష్యమైపరబ్రహ్మమై ఉన్నాడని అనుభూతి పొందడమే.

Those who surrender to Sadhguru means to follow his instructions accordingly feel that.. For everything God is the mission, goal. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Aug

మనలను గురించి ఎవరేమి అనుకున్నా మనము మాత్రము మౌనంగా ఉండాలి. మనలను అందరూ మంచిగా చూడాలని అనుకోవడం వలన శ్రీ సాయి కృపకుకరుణకు దూరమవుతాము.

No matter what anyone thinks about us, we must remain silent.  Because we want everyone to see us as good, we get away from Sri Sai's grace and mercy.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Aug

మనదైనది మన దగ్గర ఉంటుంది. మనది కానిది మన దగ్గర ఉండదు. సాయని సమాఆశ్రయించినతర్వాతనమ్ముకున్నపుడుజరిగేదంతా ఆయన సంకల్పమేఅది మన మేలుకేనని అనుకుని మౌనంగా ఉండాలి. ఎవరిని ఏమీ అనకూడదు.

Our things will be there with us, we cannot have what is not ours.  After taking refuge near Saibaba, believe that whatever happens is His Will and should be silent thinking that it is for our good.  Noone should say anything.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Aug

ఏ పని అయినా ఇది తక్కువఎక్కువ అనుకోకుండా భగవంతుడు మనకు ఆ పని ఇచ్చాడని శ్రద్ధగా చేయాలి. సినిమాలైనా సరే చూసి వాటిలోని మంచిని గ్రహించాలి. మనసు గురుదేవుని ఆధీనముశరీరము భగవంతుని ఆధీనము. భగవంతుని మీద విశ్వాసంతో ఎందరో బాగుపడ్డారు. మనము ఎందుకుగాను బాగుపడము అని సాధన చేయాలి.

Any work which is less or high without much saying, feel that God has given it to us it should be done diligently.

Even it movie one should watch and understand the good in that. The mind belongs to Gurudev and the body belongs to God. Many people got better with faith in God. We have to practice why we don't get better.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Aug

మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటారో మీరు అలా ఉండాలి. ప్రేమవిద్య పెంచే కొద్దీ పెరుగుతాయి.

You should be what your children want you to be.  Love and education will increase as you increase.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 16 Aug

ఏ పని అయినా తెలుసుకొని చేయాలి. లేదంటే చేస్తూచేస్తూ పోవడం వలన అదే తెలుస్తుంది. దేవాలయాలు ప్రశాంతతకుప్రాయశ్చిత్తములకుపశ్చాత్తాపములకు నిలయాలు.

Any work should be done knowingly.  Otherwise it will be known by doing and doing. Temples are abodes of tranquility, Atonements and penitence.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 17 Aug

ఉన్నదానిలో గొప్పతనం చూసుకోవాలి. లేనిదాని కోసం ఆరాటపడకూడదు. అలా చేయడం వలన ఇప్పుడు ఉన్నవి అనుభవించలేములేనివి రావు. రెండింటి చెడ్డవారమవుతాము. ఇప్పుడు ఉన్నవన్నీ ఇంతకు ముందు జన్మలో శ్రమించిన దానివలన వచ్చాయి. ఉన్నదానితో తృప్తి పడకపోతే వచ్చే జన్మలో ఇవి కూడా ఉండవు.

Look for the greatness in what you have. Don't anxiet for what you don't have. By doing so, the present cannot be experienced, and the absent will not come.  Both will be bad. Everything that exists now has come because of our hardwork in previous births. If you are not satisfied with what you have, you will not have these in the next life.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 18 Aug

మంచి ఆలోచనలు వస్తే కొనసాగించాలి. చెడు ఆలోచనలు అయితే అక్కడే ఆపివేయాలి. ఈరోజు భగవన్నామము భక్తితోఎంతసేపు చేశాము అని ప్రశ్నించుకోవాలి.

Good ideas should be continued. Bad thoughts should stop there. Today we should question ourselves how long we have done chanting with devotion to God.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 19 Aug

'ఆలోచన - ధ్యాస: వద్దనుకున్న దాని గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే అది ఇంకా ఎక్కువవుతుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఉపయోగమా కాదాప్రశ్నించుకోవాలి. ఉపయోగం అయితే కొనసాగించు లేదా కట్ చేయి.

Thought- Attention: Don't think about what you don't want.  Thinking like that, makes it even more so. When it comes immediately question it... is this useful or not? If it's useful continue otherwise cut it

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Aug

ప్రతీదానిలో మంచిని చూడాలి. జరిగేదంతా భగవత్సంకల్పం. అహంకారంక్రోధంలో కూడా మంచి చూస్తే చెడు కనిపించదు. మంచి అంటే చెడు లేకుండా ఉండేదిచెడు పోగొట్టేది అని అర్థం.

See the good in everything. Everything that happens because of God's will. If you see the good even in pride and anger, you will not see the bad. Good means the absence of evil, the elimination of evil.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 21 Aug

మనిషి శాంతం చేత కోపాన్నిమంచితనం చేత చెడును జయించాలి.

Humans should conquer anger with peace and evil with goodness.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 22 Aug

పరులకు సాయపడటం అంటే నీకు నీవు సాయపడటమే. పరులకు హాని కలిగించుటనీకు నీవు అసౌకర్యం కలిగించుకొనుటయే. ఒకరికి హాని కలిగించుట నీకు నీవే హాని కలిగించుకొనుట కనుక జాగ్రత్తగా నడుచుకో.

Helping others means helping yourself. To harm others is to cause discomfort to yourself. To harm someone is to harm yourself, so carefully go.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 23 Aug

వృద్ధాప్యంలో నిన్నేది సంతోషపరచగలదో దాన్ని యవ్వనంలోనే సిద్ధం చేసి ఉంచుకో. మరణానంతరం ఉత్తర లోకంలో లేదా మరుజన్మలో నీకేది సంతోషాన్నిస్తుందో దాన్ని ఈ జన్మలోనే సిద్దం చేసి

What make you happy in old age, prepare it in youth. Whatever makes you happy in the afterlife or in the next life, prepare it in this life itself.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 24 Aug

మానవులను వారి వారి స్వభావాన్ని బట్టికర్మలబట్టిమాటలబట్టి అర్థం చేసుకోవచ్చును. ఎవరైతే మనసావాచాకర్మణా ఏకత్వాన్నిసఖ్యతను పొంది ఉంటారో వారే పవిత్రులు.

Humans can be understood by their nature, actions and words. Those who have attained the unity and harmony of mind, word and action are holy.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 25 Aug

నీవు ఇతరుల పట్ల దైవంలా ప్రవర్తిస్తే అందరూ దైవభక్తి పరాయణులు గాను మరియు ప్రతివారు దైవంలాను ప్రవర్తిస్తారు." అనునది సత్యవచనము. మన ఊహలుభయాల ఫలితములే మన బాధలకుఅనారోగ్యములకు కారణములు.

"If you act like a god towards others, everyone will be a stranger to godliness and everyone will act like a god." That is the truth. The results of our imaginations and fears are the causes of our sufferings and illnesses.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 26 Aug

అత్యల్పమైన దానిని ఆనందంగా అనుభవించగలిగితే దేనినైననూ సులభముగా అనుభవించవచ్చును.

If you can experience the least with joy, you can easily experience anything.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 27 Aug

నిలకడైన శ్రమ లేకుండా సంపద లేదు. సంపద లేకుండా శౌర్యంశౌర్యం లేకుండా విజయం లేదు. దయ లేకుండా కీర్తి లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా పరమానందం లేదు.

Without constant hard work there is no wealth. There is no valor without wealth, no victory without valor. There is no glory without grace. Without spiritual knowledge there is no bliss.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 28 Aug

బ్రతికేందుకు ప్రార్థించు. విద్యనేర్చుకొనుటకుబ్రతుకు ఇచ్చుటకై నేర్చుకో. ఇచ్చేది దైవానికివ్వు. దైవం పదింతలు నీకు తిరిగి ఇస్తాడు. కాలం విలువైనది. దాతృత్వము లేదా త్యాగము మరింత విలువైనది.

త్యాగమే దైవముదైవమే ప్రేమప్రేమే విశ్వం. నీవు విశ్వం యొక్క అంశమే. కనుక ఉదారంగా దానం చేయగల అలవాటు చేసుకో. ఇతరులకిచ్చేది నీకు ఇచ్చుకున్నట్లే అవుతుంది.

Pray for Life, to learn education, learn to give life. Give to God. God will repay you tenfold. Time is precious. Charity or sacrifice is more valuable.

Sacrifice is God, God is love, love is the universe. You are an element of the universe. So make it a habit to donate generously. What is given to others is what is given to you.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 29 Aug

తనకు నచ్చింది చేయడం కాకతన కర్తవ్య కర్మను ఇష్టముతో చేయడమే ఆనందముననుభవించుటలో గల రహస్యం.

The secret of happiness is not doing what one likes, but doing one's duty with love.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 30 Aug

ఆలస్యంగా లభించిన ఫలితములు దైవము యొక్క దయవలననే కదా! దీని అర్థము దైవము నీ ప్రార్ధనలను తిరస్కరించినాడని కాదు కదా! తొందరను ఓరిమితో అధిగమించు. ఓరిమియే విజ్ఞ. విజ్ఞులు మాటలతో గాక ఆచరణతో బోధిస్తారు. అంటే వారి బోధలు సజీవ దృష్టాంతాలుగా ఉంటాయి. 

The late results are due to the grace of God! This does not mean that God has rejected your prayers! Overcome haste with patience. The patience is wisdom. Wise one's teach not by words but by deeds. That is, their teachings are living examples.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 31 Aug

జాగ్రత్త! జాగ్రత్త! నీ కర్మలే వెనుతిరిగి నీ నెత్తినే పడతాయి. నీవు చేసిన కర్మల ఫలితములనే నీవు అనుభవించక తప్పదు.

Beware! Beware! Your deeds will backfire on you. You must experience the results of your deeds.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 1 Sep

దేహాన్ని క్షేత్రంగా చెయ్యి. దానిలో ' సత్కర్మలనే విత్తనాలు నాటు. దైవ నామంతో వ్యవసాయం చెయ్యి. నీ హృదయాన్ని కృషివలుని చెయ్యి. దైవం నీ హృదయంలో నాటబడిన సత్కర్మ అనే బీజాలకు అంకురార్పణం చేస్తాడు. అంత నీవు నిర్మాణ ఘనతను పొందుతావు. ఆత్మజ్ఞానం మృత్యుంజయ శక్తినిచ్చి అమరత్వాన్ని పొందచేస్తోంది.

Make the body a field. The seeds of good deeds plant in it. Farm it in the name of God. Make your heart diligent. God germinates the seeds of good deeds planted in your heart. That's how you get constructive glory. Self-wisdom empowers death and attains immortality.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 2 Sep

అందరినీ ప్రేమగా చూడాలి అంటే ఎదుటి వారిలోని దోషాలుతప్పులు మనం ఎత్తి చూపకుండా వారిలోని మంచిని గమనిస్తే అతనిలో భగవంతుని చూడగలుగుతాము. 

To treat everyone with love means that if we observe the good in others without pointing out their faults and mistakes, we will be able to see God in them.

 

శ్రీ శారాద శ్యామ సందేశం: 3 Sep

ఒక్కసారి పారాయణం చేసి దానిలోని ఒక్క మంచినైనా ఆచరణలో పెట్టాలి. సుఖదుఃఖాలలో కూడా గురువు చెప్పింది చేయాలి.

Once you Recite, in that atleast one good put into practice. Even in happiness and sorrow, should do what Guru says.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Sep

మనం ఆచరించకుండా ఎక్కువగా ఎదుటి వారికి చెప్పడం వలన అహంకారం పెరుగుతుంది.

Ego grows when we tell others what we do not practice. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Sep

మనం చేసే పనికి మొత్తం 100 మార్కులు అయితే భావానికి 90 మార్కులు. ఆ పనికి 10 మార్కులుమంచి భావంతో చేస్తే 90 మార్కులు జమ అవుతాయి. నేనే చేయవలసి వచ్చింది. అని విసుగుకోపంతో చేస్తే 90 మార్క్స్ తగ్గుతాయి అవుతాయి.

A total of 100 marks for the work we do while 90 marks for feeling. 10 marks for that work, 90 marks will be credited if done in good faith. If you do it with anger and frustration 90 marks will be reduced. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Sep

భగవంతుని విషయంలో ఒక నిర్ణయం చేసుకొనిపద్ధతి ప్రకారం అనుసరించు వాడు ఒక్కో మెట్టు ఎక్కగలడు.

One who makes a decision about God and follows that consistently, then can grow gradually.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Sep

కొన్ని ముఖ్యమైన విషయాలు చూచుకొని వాటిలో ఒక్కదానినైనను నియమం తప్పకుండా ఆచరించవలెను.

There are some important things to keep in mind and one of them should be practiced regularly. 

        

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Sep

ప్రతి మనిషికి రక్షణ కవచం అనేది ఒకటి ఉంటుంది. మనము ఎక్కువ భజనలునామజపంధ్యానం చేసే కొద్దీ ఆ రక్షణ కవచం బలోపేతం అవుతుంది. కష్టనష్టాలు వచ్చినా మన మనసుకు తాకకుండా కవచం తగిలి వెనక్కి వెళ్లిపోతాయి.

Every man has a protective shield. The more we do chanting, meditation, God 

adoration, the stronger that protective shield becomes. Difficulties come and go by hitting the shield without touching our minds.

       

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Sep

సత్సంగము వలన విచక్షణాది వివేకము సద్బుద్ధి వైపునకు మరల్చును. సద్బుద్ధి సన్మార్గమును సూచించును. సన్మార్గము సత్పురుషుల చెంతకు చేర్చును. సత్పురుషుల సాంగత్యము వలన సద్గురువు లభించును. సద్గురుని సేవలో జీవి తరించును.

Due to Good companionship, the Discretion and discreet shifts towards Right intelligence (Wisdom). Wisdom refers to the right path. Right path leads you to reach good people. Good people leave us near Right Guru. In the service of Guru, life will be blessed. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Sep

108 నామాలు జపించడం, 108 నామాలు రాయడంచిన్న భజన చేయడంధ్యానంఒక్క పేజీ లేదా ఒక పేరా అయినా చదవడంఇలా ఒక్కొక్కటి 5 నిమిషాలు అయినా నియమిత కాలంసంఖ్య చేయాలి. దీని వాళ్ళ మనం దైవంతో క్రమశిక్షణగా అనుసంధానమై ఉంటాము

Daily every 5 minutes at a regular time, Chanting 108 names, writing 108 names, doing small bhajans, meditation, daily reading a single page or a paragraph, should be done. It helps in connecting with God disciplinedly.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Sep

విచారణవిశ్లేషణఆచరణభగవత్కృప ఇవన్నీ ఏ విషయంలో అయినా విజయానికి దారి తీస్తాయి.

Inquiry, analysis, practice, and God's grace all lead to success in any matter. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Sep

భగవంతుడా నీవు ఇచ్చిన జన్మను వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొనేటట్లు చేయి తండ్రి అని ఎప్పుడూ అనుకోవాలి.

Always think that God will make life fulfill which is he has given, without wasting it. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Sep

మనకు ఇతరులు ఎలా ఉపయోగపడతారు అని అనుకుంటే అది వ్యాపారం అవుతుంది. మనం ఎలా ఇతరులకు ఉపయోగపడతామా అని ఆలోచించాలి. అప్పుడది ప్రేమ అవుతుంది.

It will be business if we think about how others can be useful to us. We need to think about how we can be useful to others. Then it becomes love. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Sep

1. నామం జపించడం (జప మాల)

2. 2. నామం రాయడం

3. 3. భజన

4. 4. కీర్తన (బాబా గారి పాటలు) 

5. 5. మౌనం (వాచకమానసిక

6. 6. పుస్తక పఠనం

7. 7. ధ్యానం

8. 8. ప్రాణాయామం

9. 9. యోగాసనం

10. 10. పూజ

11. 11. పాక్షిక శరణాగతి

12. 12. ప్రదక్షిణ (గుడిలో గానీతులసమ్మకు గానీఇంట్లో ఒక పటము చుట్టూ గానీ)

13. 13. సత్సంగము

14. 14. భగవంతునితో మాట్లాడాలిఎలా వుండాలి అనుకుంటున్నావోఏమి చేయాలి అనుకుంటున్నావోఏమి కావాలి అనుకుంటున్నావోఅన్నీ భగవంతునితో మాట్లాడాలిప్రార్థించాలిఅడగాలి. నేను కోరుకుంటున్న కోరికలు మంచిదైతే నాకు ఇవ్వు తండ్రి అని అడగాలి.

పైవన్నీ నియమిత కాలంలోనియమిత సంఖ్యతోటైమ్ టేబుల్ వేసుకుని ఒక వారం ప్రయత్నం చేయండి.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Sep

కోపంఅబద్ధంమొదలగునవి అన్నీ భగవంతునికి చెప్పి చేయాలి.

Anger, lying, etc all. should done after approaching to God. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం:16 Sep

సరైన స్థలంలోసరైన సమయానికిసరైన విషయం గురించి స్వార్ధ రహితమైన మంచి మనిషి ద్వారా ఇవ్వబడినసరైన సలహా అత్యంత విలువైనది.

In the right place, at the right time, the right advice given by a altruistic man is most valuable thing for us. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Sep

ఉచ్ఛ్వాసనిశ్వాసములకు ఎవరికి ఇష్టమైన భగవన్నామాన్ని వారు అనుసంధానం చేసుకొనుట వలన దురలవాట్లుదురాలోచనలుదుర్భాషలు నిదానంగా దూరమవుతాయి.

When we associate our favorite name of God in our inhalation and exhalation, then slowly abusive thoughts, abusive thoughts, and abusive habits will slowly go away. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Sep

అరిషడ్వర్గాలకు లోను కాకుండా శ్రీ గురుదేవుల కృపకరుణప్రేమలను పొందుతూ వారి పాదములకు బుద్ధిని కట్టివేసి వారి సన్నిధిని నిరంతరం అనుభవించాలి.

Instead of succumbing to the "Arishdvargas (Six internal enemies)", one should attain the grace, compassion and love of Sri Gurudeva, Fix the mind to the Guru's feet and constantly experience their presence. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Sep

జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరచుకొని తీవ్రమైన ధ్యాసజిజ్ఞాసతో సద్గురువును ప్రార్ధిస్తే ఆయన అనుగ్రహిస్తాడు.

Gurudev will bless you, if you set a goal for life and pray with intense attention and curiosity. 

      

శ్రీ శారద శ్యామ సందేశం: 20 Sep

ఆనుకున్నది నిజమని భ్రమించక నిజమేదో తెలుసుకో ఇష్టమైన దానికి దూరము గాక తప్పదుఅయిష్టమైన దానిని అనుభవింపక తప్పదు.  దేనిని అసహ్యించుకున్న ఏదోఒక నాటికి వాటిని అనుభవించక తప్పదు. మనసే మనిషికి ప్రధమ శత్రువు.  సచ్చీలమే సర్వేశ్వరుని తెలుసుకొను మార్గము చూప గలదు

Don't think that what you think is true, know what is true without deluding. You must be far away from what you like, you must not experience what you like. Whatever you hate, you will have to experience it. Heart is the first enemy of man, Only the Good character can show the way to know the Lord.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Sep

గురువు యెక్క మార్గ దర్శకంలో విషయాల మంచి చెడ్డలుమనుషులు వారి పనులుపద్ధతుల అందలి మంచి చెడ్డల గురించి మన యొక్క అభివృద్ధి కొరకు చర్చించుకోవడము ఎంతైనా అవసరము.

In the guidance of our Guru, it is necessary to discuss the good and bad of our subjects, actions and methods for our growth.

       

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Sep

భగవన్నామమును స్మరించునపుడు రూపమును ఆలోచనయందు నిలుపుకొనుటరూపమును చూచినపుడు భగవన్నామమును స్మరించుట వలన పోను పోను సదవగాహన కలిగి రూపనామముల భేదభావము నశించును.

When Chanting the name of God, keep the form in thought. When looking at the form, remember name of God. 

This practice makes you to understand that there is no difference between name and form of God (Both are Same). 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Sep

నడిచేటప్పుడు భూమి అదిరేటట్టు నడవకూడదు. నెమ్మదిగ నడవాలి. భూమి అదిరిన బ్రతుకులో బాధలు కలుగును. అలా నడవటం సద్భావనలను అల్పముచేసి దుర్భలత్వమును పెంపొందించును.

Don't Walk Creepyly on mother earth. Creepy steps will disturb life and reduce our good character, and increase bad qualities. Walk slowly on Earth, it shows your concern. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Sep

ఇది అది యనక అన్నీ దానికే నివేదించుఅన్నింటికీ దానినే ప్రార్థించుఆరాధించుచివరకు అదే నీవు అవుతావు ఇదే గమ్యము. 

Without saying this or that, submit all to it. Pray, adore. At last you will be the same and that is your destination. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Sep

సమస్త నామములు నేను నమ్ముకున్న సద్గురునకే అనెడి భావనతో సమర్థ సద్గుర్తువును గాఢంగా విశ్వసిస్తే తరించగలరు.

With deep conviction, when we feel all the names for our beloved Guru , then we can get Rid easily.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Sep

సాధనలో జీవితం ఒక భాగం కావాలి కానీ జీవితంలో సాధన ఒక భాగం కాకూడదు.

Life should be a part of the practice, but practice should not be a part of life.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Sep

నామాన్ని వింటూ వుండాలి. మనం నామం చేస్తూ మనమే వినాలి. ఇలా బాగా రావాలంటేమనం మాట్లాడే అన్ని మాటలూఅన్ని శబ్దాలూ (మంచిచెడు ఏదైనా కానీ) మనమే వినటం సాధన చేయాలి.

Listen the chanting, when you are chanting to listen that. We have to practice listening to all the sounds and all the words (good or bad) that we speak. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Sep

స్నానం చేసేటప్పుడు పవిత్రంగా నామం చేస్తూ. చేయాలి. దేహశుద్ధియే భావ శుద్ధి. పవిత్ర భావంతో నీళ్ళు తీసుకొని "గంగేచ యమునేచ" అనే శ్లోకాన్ని చెప్పుకొని అన్ని నదులను ప్రార్ధించి పసుపుతో గీసి భగవన్నామంతో చేయాలి. ఈ శరీరం భగవంతునిదిదీన్ని పవిత్రంగా దేవాలయం లాగా ఉంచాలి. లేకపోతే ఆయన స్థానానికి భంగం వాటిల్లుతుంది.

While taking a bath, chanting of holy name should be done. "Purity of body is the Purity of mind". Take the water with auspicious feeling, by saying the verse "Gangecha Yamunecha" need to pray all the rivers. by chanting we need to pour turmeric powder into water. And think that "This body is God's Gift", it should be kept holy as a temple. Otherwise God's place will be disrupted.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Sep

భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మౌనంతోభగవన్నామంతో భోజనం చేస్తేతిన్న ఆహారం రక్తంగా మారిఅది సక్రమమైన ఆరోగ్యం ప్రసాదించి బుద్ధిని వికసింపచేస్తుంది. ఆరోగ్యం ఆనందం అని సిద్ధాంతం చెప్పింది.

Don't talk while eating. If we eat in silence and by chanting the name of God, the food will turn into blood, and that gives good health and blossoms our mind. It's the Theory of health happiness.

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Sep

చదివిఆలోచించివదిలించుకోవలసినవి విదిలించి వదిలించుకునిఆచరించవలసిన దానిని ఆచరించడానికి తీవ్రంగా కృషి చేస్తూనిరంతరం మన కృషి సఫలమయ్యేటట్లు అనుగ్రహము వర్షించమనిభగవన్నామస్మరణతో సచ్చింతనతో కాలం గడుపుతూ వుండటం వలన బ్రతుకు ఆనందంగా నడుస్తుంది.

By reading, thinking, getting rid of what needs to be rid of, by striving hard to practice what is to be practiced. 

By praying, God's grace constantly hails on our efforts to succeed. Life will run happily with spending time with chanting and Sachintana (Remembering the truth).

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Oct

శరీరాలు దూరమైనంత మాత్రాన అంతటా నిండియున్న చైతన్యం దూరం కాదు. దేశాలుప్రదేశాలు దూరం కావచ్చు కానీ నిష్కల్మషనిర్మలనిస్వార్ధమగుత్యాగమయమగు ప్రేమ సదా వెన్నంటి వుంటుంది.

Just because the bodies are far away, doesn't mean the consciousness filled in us will go away. Countries and places may be far away from us, but purity, selflessness, sacrificial love will always be there.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Oct

నీకిష్టమైన సద్గురు దైవ నామమును అహరహముధ్యాస ఉండినా లేకున్నా స్మరించడం చివరకు మంచి మార్గంలో నడిపిస్తుంది. 

   

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Oct

సత్సంగముభజనలను క్రమశిక్షణతో నియమబద్ధంగా కొనసాగించడం వలన అంతర్గతమైయున్న భగవత్ శక్తి బహిర్గతమౌతుంది.

Through the practice of Satsanga (Good Companionship) , Bhajans (Chanting) with discipline, the innate God power will be manifested.

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Oct

ఎదుటి వ్యక్తిలో గురువు వున్నాడుమాట్లాడేటప్పుడు "ఆ గురువు తోనే మాట్లాడుతున్నాను" అనే భావన వుండాలి.

There is a Teacher in the other person, while speaking, there should be a feeling that "You are talking to that teacher".

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Oct

ఒక్కటే అనేక రూపాలలో కనిపిస్తూ వుంటుంది. ఆ ఒక్క దానినే అనేక రూపాలలో చూచుకోవాలి. ఇదే ఆనందానికి మార్గం.

The one is visible in many forms. That one has to be seen in many forms. This is the way to happiness. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Oct

ఎన్ని విన్ననూ ఆచరణకు అందినదే అసలైనది.

Than listening much, Receivable for practice is real.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Oct

భావం పవిత్రంగా ఉండాలి. 

నామములో లీనం కావాలి. 

భావంలో లీనమై నామం చేయాలి. 

భావం మీద లీనమైతే శరీరం ఏకాగ్రత కుదురుతుంది.

The feeling should be pure. Immerse in that feeling and chant the name. 

If you immerse on the feeling, the body concentrates.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Oct

కోరిక కలిగినప్పుడు భగవన్నామము చేయాలి.

When a desire Arises, Chant the God's name.

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Oct

నామాన్ని జపించేటప్పుడు భక్తితో నీవే గతి అని జపించాలి.

While chanting, with the devotion feel that God is destiny. 

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Oct

గురు అనే పదమునకు గల అర్ధమును నిరంతరము చింతిస్తూ వుండడము వలన గురుని వ్యక్తిగా గాక మహత్తరమగు శక్తిగా గుర్తించగలిగే యోగ్యత కలిగి గురువు అనుగ్రహంతో సద్గతి లభిస్తుంది. గు అంటే గుణంరు అంటే రూపం.

Etymology of Guru is "Gu" and "Ru" which means Character Form (Character (Gu_nam) Form (Ru_pam)). The constant thought about the meaning of word Guru, make realise that Guru as a divine power not as a person. Then with Gurudev's grace we get competence to reach divine destination. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Oct

మాట్లాడేటప్పుడు బొడ్డు నుంచి మాట్లాడడం నేర్చుకోవాలి. (అంటే మన మాటలలో మృదువైన తీవ్రత ఉండాలి)

Learn to speak from the belly while speaking (That means our words should have soft intensity).

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Oct

మీ దయ వలన నడుస్తున్నాను.చూస్తున్నానురాస్తున్నానుతింటున్నాను. మీ శక్తి వలనే ఇవన్నీ చేస్తున్నాను. నాలో ఉండి మీరే చేయిస్తున్నారు.  ప్రతి చూపుప్రతి మాట మీ దయ వలన మీ శక్తి వలన జరుగుతున్నది (భగవంతునితో సంభాషణ).

By your grace, Walking Watching Writing Eating are going on. Because of your power doing it all. You are doing it by being in me inwardly. Every vision, every word It's happening by your Grace and Energy (Dialogue with God). 

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Oct

గురు శక్తితోనే నేనున్నాననినాలోనే అది ఉన్నదనిఈ సృష్టిలోని ప్రతి అణువునందు ఆ శక్తి అంటర్లీనమై ఉందనికర్మ చక్షువులకు కానరాకుండా ఉన్నదని గ్రహించిచిత్ర విచిత్రములగు కరుణారసపూరితమగు ఆ దివ్య శక్తితో నిరంతరము అనుసంధానమును కొనసాగించుకొనుటయే. తరించుటకు మార్గము.

Realizing that I am with the power of Guru, that it is within me, that power is interlined in every atom of this creation, that it is not visible to the eyes of action (Karma), this is strange picture. The gracefulness of the Guru, is always connected to the divine power. It is the way to get rid of it. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Oct

నిరంతరం మనం చేసే కార్యక్రమం సత్యం వైపుకు భగవంతుని వైపుకు జ్ఞానం వైపుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు సాధనకు అనుకూలంగా చేసుకోవాలి.

The programs we do continuously, is to go towards the truth, the God and the knowledge. All programs should be conducted in favor of practice. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Oct

శరీరం దేవాలయంమనము ఆయన స్వాధీనం అనే భావనతో వుండాలి. అప్పుడు ఆయన రూపమోనామమో మనసులో ఉంటుంది.

The body is a temple, we should be in the feeling of possession under God. Then his (God) form or name will be in the mind.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Oct

నిరంతర భగవత్ ప్రార్ధనమితభాషణంసాత్విక ఆహారముసత్చింతనసత్సంగముసత్పురుషుల సేవ ఆనందమునకు మార్గములు.

Persistent prayer, Smooth talking, Soft food, Good thoughts, Good Companionship, Service to good people are the ways to happiness. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Oct

శ్వాస శ్వాసలో నడుస్తున్నదే విశ్వాసం

(విశ్వాసంలో శ్వాస ఉందిశ్వాసలో విశ్వాసం వుంది)

అంటే మన శ్వాస దైవం మీద విశ్వాసంతో ఉండాలి

Faith runs in the breath of breath

(Faith has breath, breath has faith)

Means Breath should be faithful to God.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Oct

చిత్తశుద్ధికి నామం కంటే సులభమైన సాధనం మరొకటి లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్ధాన్ని పోషిస్తుంది. నామ జపం చేయడానికి స్నానాదులు విధి విధానాలు అవసరం లేదు. నామం పావనమైనది. అఖండ నామ స్మరణ తీరానికి చేరుస్తుంది. నమ్మకం ఉంటే వేరే ఇతర సాధనాలు అవసరం లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది.

Name Chanting is simple medium for purity of mind, Chanting is an ornament to the tongue. Chanting will nourish the entity. 

Bath and other duty procedures are not required for chanting. The Chanting is holy. Whole chanting brings to us shore. You don't need any other tools. The Chanting the name brings salvation. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Oct

అరిషడ్వర్గాలకు లోను కాకుండా శ్రీ గురుదేవుల కృపకరుణప్రేమలను పొందుతూ వారి పాదములకు బుద్దిని కట్టివేసి వారి సన్నిధిని నిరంతరం అనుభవించాలి.

Instead of surrendering to the Arishdvargas (Six internal enemies), One should receive the grace, compassion and love of Sri Gurudeva. By attaching our mind at Guru's feet constantly experience their presence in us. 

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Oct

ఆహారం తినే ముందు ఈ ఆహారం వల్ల బుద్ధి వికసించాలిఆరోగ్యంగా ఉండాలి. ఇందులోని దోషాలు పోగొట్టాలి అనుకుంటూ మౌనంగా తినాలి. అన్నము గురుదేవునికి పెడుతున్నట్టుగా భావించాలి.

Before eating food, feel that this food will make your mind blossom and healthy. Eat silently by thinking of the faults in this should be eliminated. Need to feel as you are giving food to the Guru.

   

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Oct

ఇతరుల వ్యాఖ్యలుఅభిప్రాయములుప్రవర్తన మొదలగునవి పట్టించుకోనవసరం లేదు. మీ పనిని అంకితమైన భక్తితో చేయండి. ప్రతీది విధియుక్తమైనది. భగవంతుని/గురువుని ప్రార్ధించండి. అతనిపై నమ్మకము వుంచిఅత్యంత ఓర్పుతో వుండండి. ఇది అత్యంత కష్టతరమే గానీ అసాధ్యమేమీ కాదు. మనము సంతృప్తిగా వుండాలి. ఈ ప్రపంచంలో మనము దేనినీ తయారు చేయలేము కావున దేనినీ మార్చలేము. మనము మార్చగలిగినది స్వీయ ఆంతరంగికమైన ఆలోచనలు మాత్రమే. భగవంతుడు ఎల్లప్పుడూ కరుణామయుడే.

The comments, opinions, behavior, etc. of others are not much need to acknowledge. Do your work with dedicated devotion, Everything is legitimately obligatory. Pray to God / Guru, put your trust in him and be extremely patient. It's the hardest but nothing is impossible. We have to be satisfied state. We can't make anything in this world so we cannot change anything. The only thing we can change is self intuitive thoughts. God is always merciful.

        

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Oct

మన ఉద్దేశము మరియు ఆసక్తి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండటం చాలా అవసరం. సత్యముసన్మార్గము నుండి గతి తప్పినచో మన భవిష్యత్తు దయనీయమగును.

Our intention and interest are always changing. Therefore it is very important to keep testing them at all times. Our future will be miserable if we stray from the path of truth and righteousness. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Oct

ప్రశాంత మనస్సుతో చేసే ధ్యానముగురు లక్షణముల నిరంతర చింతన నెమ్మదిగ అహంకారాన్ని అదృశ్యము గావిస్తాయి.

Meditation done with a calm mind, the constant contemplation of the Guru's characteristics will make ego disappear slowly. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Oct

మనము అందరము భగవంతుని సంతానమగుట వలనఒకరికి ఒకరు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము. అనంత మైన శక్తి మన లోపలే దాగి ఉంది. నీవు ఏదైనా చేయగలవుఅన్నీ చేయగలవు అని నమ్ము. నువ్వు బలహీనుడివి అన్న ఆలోచన ఎన్నటికీ రానివ్వకు.

Because we are all children of God, we have a close relationship with one other. Infinite power is hidden within us. Believe that you can do anything and everything. Don't let the thought of being weak will come to you.

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Oct

నీ గత దోషాలను విస్మరించు. నీ గురువుల సలహాల మేరకు నిన్ను నీవు సరిదిద్దుకుని ఆత్మ సాక్షాత్కారానికై సాధనలో సాగిపో.

Ignore your past faults. Correct yourself according to the advice of Guru and go in practice for self realization.

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Oct

జ్ఞానానికి ప్రధాన తాళం చెవి ఏకాగ్రత. జ్ఞానం విజయానికి దారి చూపే విశ్వాసాన్ని ఇస్తుంది. ఏకాగ్రత లేనిదే ఏదీ సాధ్యం కాదు.

The prime key for Wisdom is concentration in listening. Wisdom gives confidence that guides to success. Nothing is possible without concentration. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Oct

నీవు తీసుకునే ఆహారం నీ మనస్సుపైనీ కర్మలపై ప్రభావము చూపుతుంది. కనుక జాగ్రత వహించు.

The food you eat has an effect on your mind and your actions. So be careful. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Oct

సద్గురువుతో ఇలా నిరంతరం భావన చేయాలి. వారి పాదాలను పట్టుకున్నట్లుగా లేదా వారు ప్రేమకరుణతో మనలను మన తలను నిమురుతూ ఉన్నట్లుగా భావన చెయ్యాలి. చివరిది చాలా ఉత్తమమైనది.

 

This should be constantly felt with a Sadguru. We should feel like we are holding their feet or they are boggling our heads with love and compassion. The last one was the best.


శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Oct

మనము నమ్మకమువిశ్వాసముసహనములనెడి సంస్కారములు కలిగియున్నగుర్వాశీస్సులు మనపై నిశ్శబ్దంగానే పనిచేస్తాయి. కనుక గురువు ననుసరించుకొని వుండడమే మన కర్తవ్యం.

Our faith, trust, patience cults work silently on us through Guru's blessings. So it is our duty to follow the Guru. 

    

శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Oct

గురువుగురునామముగురుచిత్రపటము సమానంగా శక్తివంతములైనవే కనుక వారి నామమును ప్రేమతోనుకృతజ్ఞతతోను జపించు. ఏ విధముగా నంటే "ఆ నామము నీకు స్వంతమైనదినీవు దానికి స్వంతమైన వాడవు."

Guru (The Form), Guru's Name and Guru's Picture are equally powerful. So chant their name with love and gratitude. How I mean " that name belongs to you, and you own it." 

—    

శ్రీ శారదా శ్యామ సందేశం: 31 Oct

సద్గురుని సేవించుట అనగా గురువు మనకు విధించిన దినసరి కర్తవ్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా పరిపూర్ణముగా ఆచరించి ఆత్మ సంతృప్తి పొందుటయే.

Serving Sadguru means a way to get self satisfaction by working on Guru's assigned daily duties throughly without expecting any reward.

—    

శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Nov

సాధన అంటే ఎవరికి వారే వాళ్లే చేసుకోవాలి. సాధనలో భజనలుకీర్తనలువిశ్వాసము కలిగిన దాని యొక్క నామ జపమురూపచింతన కలిగి ఉంటాయి. మన ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు నామము గట్టిగా చెప్పుకోవాలి. చాలా మందిలో ఉన్నప్పుడు మానసికంగా చేసుకోవాలి. సాధన మానకూడదు.

Sadhana (Practice) means that they have to do it themselves. The Sadhana Have form thinking which includes chorus (Bhajans), hymns (Kirthanaas), faithful chanting (Japam). When we are alone in our house, we need to say the name loudly. Mentally to do when there are many arround. Sadhana should not be stopped.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Nov

భగవంతుని ప్రేమను గురించి కానీదయ గురించి కానీతత్వాన్ని గురించి కానీ ఈరోజు చింతన చేశానా అని రోజు అనుకోవాలి.

Think daily that, whether we are thinking about the God's love, mercy or principle. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Nov

ఆవలింత,, అపానవాయువుతుమ్ము వచ్చినప్పుడు కుడి చెవిని మూసి భగవన్నామం చెప్పుకోవాలి. (ఎందుకంటే కొన్ని అనుసంధాలు ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాయి)

When yawning, fart, sneezing are coming close your right ear and chant God name. (Because some connections are always make remember). 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Nov

మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురువుకు చెప్పుకుని ధ్యానం చేసుకోవాలిభావనతో నామము చేస్తూ ఉండాలి . తర్వాత మనకే సమాధానం దొరుకుతుందిలేదా ఎవరైనా ఆ సమయానికి వచ్చి మనకు సమాధానం చెప్తారులేదా ఏదైనా పుస్తకంలో సమాధానం దొరుకుతుంది.

When we have any problem, we should convey that problem to the Gurudev. and meditate and keep chant with feel. Later we find the answer by ourselves or someone will come at that time and answer us, or find the answer in any book. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Nov

సత్యధర్మధైర్యతృప్తినియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ గురు కృపకు పాత్రులు.

Those who live according to truth, dharma, courage, satisfaction, rules and not causing problems to others are the ones deserve the grace of the Divine Guru. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Nov

నిరంతరం నామం చెప్తుంటే గురుసేవ చేస్తున్నట్టే.

Constantly chanting the name is like serving the Guru. 

  

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Nov

సద్గురుని సేవించుట అనగా గురువు మనకు విధించిన దినసరి కర్తవ్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా పరిపూర్ణముగా ఆచరించి ఆత్మ సంతృప్తి పొందుటయే.

Serving Sadguru means, performing the daily duties assigned to us by the guru perfectly without any reward to get self satisfaction. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Nov

ఈ జీవితము మీదిఈ జీతము (అంటే డబ్బులు) మీది అని చెప్పి భగవంతుని ముందర పెట్టినా అవసరాలకు ఖర్చు చేసుకుంటానుధర్మ కార్యాలకు వినియోగిస్తాను అని భగవంతునికి చెప్పుకోవాలి. 

I have to tell God that "This life is yours", this salary (i.e. money) is yours and I will spend it for my needs and use it for righteousness deeds. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Nov

ఈ శరీరము నాది కాదు గురువుది లేదా భగవంతుని అని నిరంతరము చింతన చేయాలి.

We should always think. This body is not mine, it is Guru's or the God's one. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Nov

సద్గురువు దగ్గర వినయముగా ఉండవలెను. వినయము వలన వివేకమువివేకము వలన విచారణవిచారణ వలన చింతనచింతన వలన సాధన ఎక్కువ అవుతుంది. నిరంతర చింతనే సాధన.

One should be humble near Sadguru. Humility leads to wisdom, 

wisdom leads to inquiry, 

Inquiry leads to thought, 

thought leads to practice. 

Continuous thinking (On one subject) is the Divine Practice. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Nov

గురుపౌర్ణమి రోజు అయినా గురువుకి దగ్గరగా ఉండాలి. ఎవరిని నిందించరాదుఅనవసరంగా మాట్లాడ కూడదు. ఈ ఒక్క రోజు అయినా నన్ను నీ నామాన్ని చేసుకోనివ్వు తండ్రి అని ప్రార్థించాలి.

Atleast on the day of Guru Purnima, Must be close to Gurudev. Pray to divine father that At least for this one day, I don't blame anyone, don't talk unnecessarily, I have chant your name. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Nov

నీ గురు పాదపద్మములపై దృఢ దృష్టి నిలుపు. అమృత పానానందము కొరకై భక్తి ప్రపత్తులతో వారి పవిత్ర నామ సంకీర్తనం గావించు.

Stay focused on your Guru lotus feet. For Elixir Enjoyment, sing the hymn of holy name with devotion.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 13 Nov

భగవంతుని మీద భక్తి కావాలి అని భగవంతుడినే ప్రార్థించాలి. నీ సేవ చేసుకుని నిన్ను మరిచిపోకుండా చెయ్యి అని ప్రార్థించాలి.

We should pray to God that we need devotion on God. I have to pray that let me do your service and do not make me forget you.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 14 Nov

నైతికమనేదిమనల్ని మనం ఎలా సంతోషవంతులుగా చేసుకోవాలో తెలియజెప్పే సిద్ధాంతం కాదు. మనం ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని ఎలా అర్హులుగా చేసుకోవాలో తెల్పేదే అది. సంతోషము భౌతికమైనది మరియు ఇంద్రియాధీనమునశించేది. ఆనందము పారమార్థికమైనదిఇంద్రియాతీతముశాశ్వతమైనది. కావున దైవాన్ని స్మృతియందుంచుకొని ప్రార్థించు.

 

Morality is not a theory that tells us how to make ourselves happy. It tells us how to qualify ourselves to experience happiness.  

Gleefulness (Santhosham) Material and sensual, perishable.  

Happiness (Anandam) Transcendental, phenomenon, eternal. So remember God and pray.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 15 Nov

నీలో దైవం కొరకు ప్రేమ ఎంతెంతగా పెంచుకుంటూ పోతే అంతంతగా కామక్రోధాదులు వెనుదిరిగి పోతాయి. కనుక ఆయన్ను ప్రేమించడానికి నిన్ను ఆశీర్వదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి

The more you grow the love for God in you, the more the lust angry will go away from you. So pray to God to bless you to love him.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 16 Nov

అన్ని అవరోధములను అధిగమించుటకు మానసిక మౌనమే అత్యున్నతమగు సాధనము.

Mental silence is the supreme tool for overcoming all obstacles.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 17 Nov

సత్యధర్మధైర్యతృప్తినియమ నిబంధనలకు అనుగుణముగా బ్రతుకుచు ఇతరులకు ఇబ్బందులను కలిగించక జీవించువారు దైవ/ గురు కృపకు పాత్రులు.

Those who live according to the virtues of truth, righteousness, courage, contentment and discipline without causing trouble to others, deserve the grace of God/Guru.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 18 Nov

నామం పావనమైనది. అఖండ నామ స్మరణ తీరానికి చేరుస్తుంది అని నమ్మకం ఉంటే వేరే ఇతర సాధనాలు అవసరం లేదు. నామం మోక్షాన్ని కలిగిస్తుంది. నామముయందు శ్రద్ద గల వారికి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. నామాన్ని సదా జపించెడివాడు గుణవంతులలో గుణవంతుడు.

The name (Chant) is sacred. If you believe the Integrity Chant will reach the shore, No other tools are needed. The chant brings salvation. All sins will be purged of those who pay attention to the chant. The one who always chants the name is the best among the virtuous.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 19 Nov

అందరూ చెప్పినదాన్ని వినిమంచిని గ్రహించి ఆచరించవలెను.

Listen to everyone, realize the good and practice it. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 20 Nov

ఎల్లప్పుడు సత్సహవాసం ఏర్పరచుకో. మిత్రులనుపుస్తకాలను జాగ్రత్తగా ఎన్నుకో. పవిత్రులతోగొప్పవారితో సంబంధం కల్పించుకో. అన్ని విధాలా చెడు సహవాసాన్ని విసర్జించు.

Always establish good companionship. Choose friends and books carefully. Connect with the saints, the great. Abandon bad association by all means.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 21 Nov

నీ గురువర్యుని బోధనలను అనుభవమునకు తెచ్చుకుంటేనీలోనే దాగియున్న ఆధ్యాత్మిక సంపదలను కనుగొనగలవు.

If you experience the teachings of Gurudev, you can discover the hidden spiritual treasures within yourself.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 22 Nov

సమర్ధుడైన సద్గురువు సరైన శిక్షణ ఇచ్చి పరిరక్షణతో గమ్యం చేర్చును కానీ ప్రయత్నం అంతయు ఆయా బుద్ధిజీవులదే. తీవ్రమగు జిజ్ఞాసతో సద్గురువు మార్గదర్శకములో పయనించిన సత్ఫలితములు త్వరగా చేకూరును. జిజ్ఞాస ధ్యాస తీవ్రతను బట్టి ఫలితములు త్వరగానో ఆలస్యంగానో సంప్రాప్తించును.

A Competent Gurudev will give proper training and guide to achieve the goal with protection but all the effort is on the respective intellectuals. The good results of the journey are under the guidance of the Gurudev with intense knowledge, this will not come soon. The results will be achieved sooner or later based on the intensity of cognitive meditation. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 23 Nov

ఓర్పు రావాలి అంటే తనకు ఇష్టమైన దైవమును/గురువును విశ్వసించి జరిగేదంతయూ దాని సంకల్పమేనని అది మన మేలునకేననిప్రతి విషయములోని మంచిని గ్రహించడానికి తీవ్రముగా ప్రయత్నించిమంచిని గ్రహించగలిగే వివేకమును సంపాదించుకొనుట వలన భగవత్తత్వము/గురుతత్త్వము యొక్క శక్తిని గుర్తించుటకు వీలు అగును.

To be patient, one must trust his/her loving God/Guru and have the perception of "Everything happened was for our good with the will of God/Gurudev". Try hard and realize the good in everything happens. The perception of gaining the recognition of good helps in understanding the power of the Divine/Guru philosophy.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 24 Nov

ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించిఈ శరీరం నిద్రలేచిందినేను చేసే ప్రతి పనిలోనూప్రతి మాటలోనూప్రతి చూపులోనూ నీవే అనంతశక్తి రూపముగా ఉండినన్ను నడిపిస్తున్నావు తండ్రి అని అనుకొని ప్రార్థించి లేవాలి.

When I wake up in the morning I close my eyes and pray to loved God, and think "Father this body waken up, And in its every work, in every word, in every look, you (God) are in the form of infinite power and making me to move." 

—   

శ్రీ శారదా శ్యామ సందేశం: 25 Nov

నిద్రపోయే ముందు నామము చెప్పుకుంటూ నిద్రపోయిమెలుకువ రాగానే అంటే కళ్ళు తెరవక ముందే నామము గుర్తుకు వస్తే రాత్రి అంతా నామము చేసినట్లే అవుతుంది.

Before going to sleep chant the name, When you wake up with remembering the name, means it will be like doing the chant for whole night.

     

శ్రీ శారదా శ్యామ సందేశం: 26 Nov

ఈ శరీరము నిద్ర లేచింది తండ్రి మీ ఆశయాలకు ఆదర్శాలకు అనుగుణంగా నన్ను నడిపించు తండ్రి అని నిద్రలేవాలి.

This body is awakened from sleep. Divine Father guide me in accordance with your ambitions and ideals should sleep. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 27 Nov

ఈరోజు నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించి ఆ తప్పులు మళ్లీ చేయకుండా చేయి తండ్రి. ఈ శరీరము నిద్రపోతోంది తండ్రీ అని చెప్పుకొని నిద్ర పోవాలి.

Divine Father, forgive me if I have done any mistakes today and also make me to not do them again. Say to Divine father that, this body is going to sleep. 

      

శ్రీ శారదా శ్యామ సందేశం: 28 Nov

నిరంతర దైవ స్మృతి సంపూర్ణ శరణాగతికి దారి తీస్తుంది. దీనివల్ల మనసు ఉన్నతి చెంది దైవ చేతనతో శృతి కలుపుతుంది.

Constant divine remembrance leads to complete surrender. This causes the heart to be elevated and harmonized with the divine consciousness.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 29 Nov

విశ్వాసంతో భగవంతుని నామం గానం చెయ్యి. ధైర్యం కలిగి ఉండు. ఆ దైవానికి నీ సర్వస్వం అప్పగించు. మనకు ఏమీ తెలియదు. ఆయనే సర్వజ్ఞుడు. కనుక ఆయన్నే ప్రార్ధించు.

Sing the name of God with faith. Have the courage. Surrender your all to the God. We know nothing. He is the Omniscient. So pray to Him. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 30 Nov

ప్రార్థనలోభక్తిలేని మాటలకన్నా మాటలులేని భక్తియే శ్రేష్టము.

In prayer, the devotion without words is superior than the words without devotion. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 1 Dec

అంతా దైవం మీదే ఆధారపడివున్నదన్నట్లుగా ప్రార్ధించు. అలానే అంతా మనిషి మీదే ఆధారపడివున్న అన్నట్లుగా శ్రమించు. నమ్రత కలిగి ఉండు. నీ ప్రార్ధన అన్ని అడ్డంకులను చీల్చుకొని భగవంతుని చేరుతుంది.

Pray as, everything depends on God. And work as everything depends on you. Be humble. Your prayer breaks every obstacle and reaches God. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 2 Dec

అనవసరమగు ఆలోచనలే అశాంతికి కారణములు: గతించిన దానిని గురించిభవిష్యత్తును గురించి గానీ ఆలోచించకవర్తమానాన్ని గురించి ఆలోచిస్తూ చేయవలసిన కార్యక్రమాన్ని త్రికరణ శుద్ధిగా చేస్తూ గతాన్నిభవిష్యత్తును శ్రీ గురునికి అప్పగించివర్తమానంలో శ్రీ గురు స్మరణతో జీవించడమే శాంతికిఆనందమునకు మార్గములు: తృప్తి అపారమగు శాంతికి నిలయము.

Unnecessary thoughts are the cause for disturbance: without thinking about past and future, think about present and work whole heartedly. Submit your past and future Sri Guru. In present live with Sri Guru's memory. This is the pathway to endless peace and satisfaction.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Dec

వద్దనుకున్నావిదలించినావదలించుకుందామనుకున్నా తప్పించుకోలేక తలకుకాళ్లకు చుట్టుకున్నట్లు ఉండే స్థితియే ప్రారబ్ధము. శ్రీ గురుని కృపతో (శరణాగతి చెందిన వారి విషయంలో) ఆ ప్రారబ్ధము కూడ దగ్ధమై పోతుంది. (అనేక రీతులలో).

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 4 Dec

త్రుప్పును లేదా మైలను తుడిచివేసి మెరుగు పెట్టే "పాలిష్" ప్రతి దానికి ఉంది. అలానే హృదయానికి ఆ “పాలిష్” దైవ స్మృతి.

Each has its own "Polish" that wipes away rust or dust. Like all things Heart also "Polish" that is "Divine memory". 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 5 Dec

లోక కోరికలనుఆశలను కొనసాగనివ్వక ఆనందాన్ని ప్రసాదించే పరమాత్మునికి సంబంధించిన కార్యక్రమములలో మనస్సును లగ్నం చేస్తే శ్రీ గురుని కృప అనుభవమునకు వస్తుంది.

Without perpetuate the desires and hopes of the world. Engage the mind in activities related to the Supreme Lord, which bestows happiness. then you will experience the grace of Sri Guru. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 6 Dec

వ్రాసినదానినిచదవడం వలనవినడం వలన మన పరిమిత బుద్ధికి తోస్తుంది కొంత. అది మాత్రమే నిజం కాదు. నిజమేమిటో అనుభవజ్ఞుల వలనశ్రీగురుని సన్నిధిలోన మాత్రమే అనుగతమౌతుంది. అవగాహన ఆచరణ రూపం ధరించినప్పుడే ఆనందమును అనుభవించడం తరించడం సుసాధ్యము.

By reading and listening to what is written, pushes the intellect limitedly. That is not the only truth. The truth will be perceived only by the veterans, in the presence of Sri Guru. It is possible to experience happiness only when awareness is applied to practice.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 7 Dec

లోక విషయాలయందు మనకు ఆసక్తి నశించిభగవతీతి కరములగు కార్యక్రమముల యందు ఆసక్తి జనించినపుడే మనకు బాగుపడే అవకాశము కలుగుతున్నదని గ్రహించాలి.

We should realize that, there is a chance to recover, when we lose interest in worldly affairs and interested in God's activities.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 8 Dec

దేవుడు గొప్ప దయాళువు. దైవ ప్రార్ధన మన అర్హతను బట్టి ఆయన సంకల్పాన్ని బట్టి మంచి ఫలితాలనిస్తుంది. ఉత్తమ ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం. కనుక నిర్భయంగా ఎంతటి కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొ.

God is Great Kind hearted. "Prayer gives good results according to Our eligibility and His will. The prayer is the most powerful weapon, so bravely face any difficulty with courage.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 9 Dec

ఏకాగ్ర హృదయంతో అచంచలంగా నన్ను ఎవరైతే స్మరిస్తూ ఆరాధిస్తారోవారికి నేను రక్షణ పొందే శక్తిని ప్రసాదిస్తాను.

If you admire me with progressive concentrated heart I will grant them the power of protection. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 10 Dec

సత్సంగము (నిజమగు సత్పురుషులతో వుండటం) నిరంతర భగవన్నామ జపముప్రేమతో దైవాన్ని రూపముతోగానిరూపము లేకుండా గాని పూజించడం త్వరగా తరించడానికి మార్గములు.

Good Companionship (being with true virtuous men), Constant Chanting of divine name, With Love worshiping God, with or without form, is a quick way to emancipation.

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Dec

నిన్ను నీవు ఎన్నటికీ చులకన చేసుకొనకుదైవ సూచనలను పాటించునీ అంతర్వాణి ప్రభోధాన్ని ఆలకించి నడచుకోనీవిధులను సక్రమంగా నిర్వర్తించు. నీ భావాలను అశాశ్వత విషయాల నుండి మరల్చి శాశ్వత విషయాలపై నిలుపుసర్వులు దేవుని బిడ్డలేఎవరు ఎవరిని శాసించ జాలరుతటస్థ పద్ధతి ఉత్తమమైనది. మనం దైవానుగ్రహానికిబ్రహ్మానందానికి పాత్రులం కావాలి. సత్యముసహాయ స్వభావముమాతా పితరుల సేవపరుల దోషాలు మన్నించి మరచుటఅనేవి దైవగుణములు.

 

Never underestimate yourself, obey God's instructions, listen to your intuition and go, and perform your duties properly. Turn your feelings away from the impermanent and hold on to the eternal. All are children of God, No one can judge anyone, neutral method is the best.We all should be part of God's grace and bliss. Truth, helpful nature, service to parents, forgiving and forgetting the faults of others are the divine qualities. 

 

శ్రీ శారదా శ్యామ సందేశం: 12 Dec

ఈ నెలలు చాల విశేషమైనవి. పవిత్రమైనవి. ఫిబ్రవరి వరకు తలచిన ఉద్దేశాలు పలు ఫలితాలనిస్తాయి. దయచేసి మీ సంకల్పాలనుచర్యలనునిర్మలంగా వుంచుకొండి. దైవంతో గాని గురువుతోగాని సత్సంబంధాన్ని ఏర్పరచుకోండి. భవిష్యత్తుకు పథకం వేసికోండిఅవసరమైన సద్గుణాలని సంతరింపచేసికోండితల్లిదండ్రులను మరువకండి అందరిని సేవించండి.

These months are very special and sacred. Intentions that are set up until February will yield many results. Please keep your intentions, actions, serene. Establish a happy relationship with God or Guru. Plan for the future, cultivate the necessary virtues, do not forget the parents and serve everyone. 

    

శ్రీ శారద శ్యామ సందేశం: 13 Dec

నీ అంతరాత్మ ఎవరి సమక్షంలో నిశ్చయంగా స్పందిస్తుందో మరియు ఆయన నీ బాధ్యతలను స్వీకరించి నిన్ను సంతోషపరుస్తాడన్న విశ్వాసం నీకు కలుగుతుందో ఆయన్నే నీ గురువుగా అంగీకరించుఆయన సలహాలనుసూచనలను అర్థంచేసుకొంటూనీ సందేశాలు నివృత్తి చేసుకొంటూ వినమ్రతతోనువిశ్వాసంతోనుసహనంతోను వాటిని అనుసరించు. దైవ నామాన్ని లేక గురు నామాన్ని స్మరించునీదేమీ కాదని అంతా ఆయనే అనీ ఆయనకు ఆత్మ సమర్పణంగావించుకో. అంతట నీవు నీ గురురక్షణనుదైవానుగ్రహాన్ని పొందగలవు.

In whose presence, your conscience responds firmly, you have the confidence that he will accept your responsibilities and make you happy,. accept him as your Guru. Under him make clear your doubts, Understand his counsel and suggestions, follow them with humility, faith and patience. Chant the Divine/Guru name, 

Feel that everything is not yours and Guru is everything and offer your soul to him. Then you will receive Guru's protection and God Grace.

     

శ్రీ శారద శ్యామ సందేశం: 14 Dec

మన జీవితాలు దైవ సంకల్పంతో నడపబడ్డవి కనుక మన కోర్కెల మేరకుమన సంకల్పం మేరకుమన భావాల మేరకు నెరవేరాలని కాంక్షించకు.

Our lives were driven by divine will, so we do not wish to fulfill our life, according to our desires, according to our will, according to our feelings. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 15 Dec

కర్తవ్య కర్మలన్నీ నీ గురువే నీకు అప్పగించారనీఆయన నిరంతరాయంగా నిన్ను కనిపెట్టుకొని వుంటున్నారని భావించు.

Assume that all the duties are given to you by your Guru and he is constantly watching over you. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 16 Dec

ఈ దివ్యసందేశాలను ఆసక్తితో అధ్యయనంచేస్తూ వాని అంతరార్ధాన్ని అవగాహన చేసికొను శక్తిని ప్రసాదింపుడని గురువును ప్రార్దించు.

Study the divine messages with interest, and Pray the Guru to get power of understanding the intuition of it. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 17 Dec

నీ గురువు నీతోవుంటున్నాడని భావించి సాధనలో ధైర్యంగా ముందుకు సాగిపో.

Feel that your Guru is with you and confidently move forward in the practice.

      

శ్రీ శారద శ్యామ సందేశం: 18 Dec

దైవానుగ్రహాన్ని అనుభవించడానికై నీకై నీవు శరణాగతితో ఆదైవ ఉపకరణంగా అనుభూతినొందు. అప్పుడు దైవంలేక గురు సేవకునిగ నీకునీ అభిప్రాయములకునీకార్యాలు మొదలైన వానికి స్వేచ్ఛస్వాతంత్య్రం ఉండదు. ఆ అనంత శక్తి సలహాలను నిరంతరం అన్ని విధాల విధేయతతో అనుసరించడం ఒక్కటే నీకు మిగిలివున్న స్వేచ్ఛ.

 

In order to Enjoin in the Divine Euphoria, Surrender yourself and experience as a divine tool. Then as God/Guru servent, You have no freedom for you, for your opinions, your deeds, etc. The only freedom you have left is to constantly follow in those infinite power suggestions obediently in all ways.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 19 Dec

ఆత్మ విశ్వాసం కలిగివుండునీ గురువు యొక్క మార్గదర్శకత్వంలో ధైర్యంగా సరైన మార్గంలో సాగిపో.

Be confident, walk boldly on the right path under the guidance of your Sri Guru.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 20 Dec

భౌతిక వస్తువులను ధనంతో పొందవచ్చు కాని దివ్యానుభూతి ఒక్కరుగ మాత్రమే పొంద వీలగును.

Material things can be obtained with money, but the divine feeling can be obtained by one only.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 21 Dec

విశ్వాసంతోనుసహనంతోను మనం వేచివుండగలిగితేమహాత్ములయెడపెద్దలయెడగురువులయెడ మనము చూపు వినమ్రపూర్వక గౌరవములుమన పరిశుద్ధ భావములుమనశరణాగతిసరైన సమయంలో మనకు అనిర్వచనీయమైన ఆనందానుభూతిని గలుగజేస్తాయి.

If we will wait with faith and patience, 

Our humble honors, our surrendering and our pure perceptions we show to sages, elders, Guru will give us indescribable blissfulness at the right time. 

 

శ్రీ శారద శ్యామ సందేశం: 22 Dec

నీ అనుభూతులనుఆవేశాలనుఅణచవద్దుఎవరి వద్ద నీవు స్వేచ్చగామనగల్గుదువో ఆయనతో హృదయంలోని భావాలను పంచుకో.

Don't suppress your feelings, your anger, share your feelings with whom you feel free.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 23 Dec

ఎవని మనస్సువాక్కుపరిశుద్ధమై అతని అధీనంలో ఉంటాయో అతడు వేదాంత ఫలాలను పొందుతాడు. మహాత్ముల చరిత్రలు మనలను మంచి బాటలో నడిపి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. 

(వేదాంత (ఉపనిషత్తులు) ఫలం అద్వైత స్థితి పొందటం)

Whose mind, words are under his control and pure. Those get the fruits of Theology (Vedanta). Studying the histories of the Divine People (Mahatmas) guide us on a good path and impart knowledge.

(Vedanta is Upanishads, fruits of is of Non Duality/Uni State).

 

శ్రీ శారద శ్యామ సందేశం: 24 Dec

సవ్యమైన భావాలను కలిగివుండు. దానివల్ల నీ జీవితం అన్ని విషయాల్లోనూ విజయం పొందగలదు. దేవుని ప్రార్థించు ఆయనకు పూర్ణ శరణాగతుడవు కమ్ముఆ తర్వాత నీ పరీక్షలను నీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కో.

Have the sense of decency. In that way you will be successful in all aspects in life. Pray to God and completely surrender to Him, then face your problems and challenges with courage.

  

శ్రీ శారద శ్యామ సందేశం: 25 Dec

దైవనామం విశ్వాసంతో ప్రతిరోజు త్రికాలాల్లోను చప్పట్లు చరుస్తూ బిగ్గరగా పలుకు అది నిన్ను చక్కగా మలుచును.

Everyday in the three quarters, Loudly by clapping praise the name of God and it will make you feel good. 

—    

శ్రీ శారద శ్యామ సందేశం: 26 Dec

సృష్టికర్మయైన దేవుడు మన తల్లి కనుకఆయన్నే సుఖంలోనుదుఃఖంలోను నిష్కపటంగానిలకడగా అర్ధించు.

God is the Creator mother, pray to her sincerely and steadfastly in happiness and sorrow. 

—    

శ్రీ శారద శ్యామ సందేశం: 27 Dec

సమగ్ర దైవ భక్తిలోనే అత్యున్నత స్వేచ కూడి ఉంటుంది. నీ సాధనను దైవంతో ఆరంభించిదైవంతోనే ముగించు

In the inclusive devotion towards God, the highest freedom is found. Begin your practice with God and end with God.

శ్రీ శారద శ్యామ సందేశం: 28 Dec

ఆత్మ నిగ్రహం గల వ్యక్తి 1. క్షమా గుణం 2. సాధుస్వభావం కలిగి ఉంటాడు. ప్రార్థన దేవుని మార్చదు. "ప్రార్ధన" చేసే వారినే మారుస్తుంది.

One with self restraint is has 

1. Forgiveness 2. Holy Nature. 

Prayer does not change God. It changes those who “pray”.

 

శ్రీ శారద శ్యామ సందేశం: 29 Dec

దైవ కృపలేనిదే నీవు ఏమీ సాధించలేవు. కనుక ఆయన అనుగ్రహం కొరకై హృదయ పూర్వకంగా ప్రార్థించు. అందుకు అనుగుణంగానే ఆయన ప్రతిస్పందన ఉంటుంది.

Without divine grace, you can achieve nothing. So pray wholeheartedly for His grace. His response will be accordingly.

శ్రీ శారద శ్యామ సందేశం: 30 Dec

శారీరక మానసిక బలహీనత ప్రమాదకరంశ్రద్ధతో భగవంతుని ప్రార్థించు ఆయన నీ రక్షణకు రాగలడు. గతాన్ని మరచిపోభవిష్యతుకు ప్రణాళిక వేసికోనీవు మహాత్ముడవు కాగలవు.

Physical and Psychological weakness is dangerous, pray to God diligently and He will come to rescue. Forget the past, plan for the future, and you can be great.

శ్రీ శారద శ్యామ సందేశం: 31 Dec

నిన్ను నీవు తెలిసికొనదలతువాపరిపూర్ణమైన ప్రేమగా మారిపోఅంతట నీవు నిన్ను కనుగొందువు. దేవుని ప్రేమించుపరులను సేవించు.

Do you want to know yourself? Change to perfect love and you will find yourself. Love God, serve others. 

 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao