అమృతం అమేధ్యం

 EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

మన శరీరం లోకి వెళ్లిన గాలి ఒక నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనకు ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి మనల్ని రోగ గ్రస్థులను చేస్తుంది. 

ఆ గత ఆహారం లాగానే గత అనుభవాలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మాలిన్యంగా మారావచ్చు. 

ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము కాబట్టి వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. కానీ అవి కూడా కాలక్రమేనా మాలిన్యంగా మారతాయి అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది.

మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే గత అనుభవాల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ గత ఆనందమే కాలక్రమేణా మాలిన్యంగా మారవచ్చు. 

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని ఉన్న గతం మృతప్రాయం. ఉన్నవాటిని మెల్లిమెల్లిగా తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజూ ధ్యానం, పరివర్తన పూరిత ఆలోచనలు ద్వారా ఆ మానసిక మాలిన్యాలను శుద్ధి చేసి. మళ్లీ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అప్పుడు మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటాము. 

పరమాత్మ మనకు శుద్ధిని చేసుకునే శక్తిని ప్రసాదించాలి.



Comments

Popular Posts

Virat Kohli Test Retirement (Telugu)

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Dreams & Delay (Telugu)