పరమాచార్య వినోబాభావే

స్వాతంత్ర సమరయోధుడు తత్వవేత్త సంఘసంస్కర్త  గాంధేయవాది ఆచార్య వినోబా భావే (వినాయక్ నరహారి భావే) జన్మదినం (11-09-1895)

విప్లవాల నాందికి, వ్యక్తిగత జీవితాల్లో ప్రకాశాలు ప్రవేశించడానికి, సమస్యల పరిష్కారానికి, ఆధ్యాత్మిక ధోరణి అహింస మార్గం ‌సమాధానమని సమంజసమని విశ్వసించేవారు. 

స్థిరత్వం దృఢత్వలు అహింసకు శక్తి అని అది విజయానికి మార్గమని, పిరికితనం మెతకదనంతో కూడిన అహింస ఆటంకమని ఉపోద్ఘాటించేవారు.

గాంధీజీ ద్వారా స్ఫూర్తి పొంది స్వతంత్ర పోరాట సమయంలో సర్వోదయ ఉద్యమం ప్రారంభించారు. కాలక్రమంలో స్వాతంత్ర అనంతరం భూదానోద్యమం ప్రారంభించారు. 

భూదానోద్యమంలో భాగంగా దేశ పర్యటనతో దాదాపు ప్రతీ పెద్ద భూకామందులను వ్యక్తిగతంగా కలిసి, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా వీలు రాసి పంచి పెట్టాడు మరియు దానం పొందిన రైతులు కనీసం 10 ఏళ్ల వరకు అన్న సాగు చేయాలని నియమం విధించాడు. 

దేశం నలుమూలల కాలినడకన పర్యటించి, తాను పెట్టుకున్న లక్ష్యానికి అధిగమించి, తన జీవితం చరమాంకానికి చేరిందని గ్రహించి తన ఆశ్రమంలో నిరాహారదీక్షతో శ్రీరామనామా జపంతో తనువు చాలించిన ఆచార్య వినోబా భావేకు తలుస్తూ తన జన్మదినం నాడు నివాళులు అర్పిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖11.09.2022✍️

Comments

Popular Posts

Virat Kohli Test Retirement (Telugu)

Hindu Arabic Numeric System (English/Telugu)

Ego- Eco Centric (Telugu)