On Cricket (Telugu 03.11.2025)

⚛️🪷🌳
 
క్రికెట్ అనేది భారతదేశంలో భావాత్మకంగా మతంలాగ కొనసాగుతుందంటారు. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో దానిమీద సానుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా లేదా తటస్థంగా నైనా దృష్టి పెడుతూనే ఉంటాం. క్రికెట్ కేవలం ఆట కాదు అది ఒక సామూహిక అనుభూతి అనిపించింది.

కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో వచ్చిన ప్రపంచ కప్ విజయం, ధోని నేతృత్వంలో 2011లో ముంబైలో గెలిచిన ప్రపంచ కప్ కేవలం క్రీడా ఘట్టాలుగా మాత్రమే కాదు, ఇవి భారతీయుల జీవితాల్లో క్రికెట్ ద్వారా పొందిన ఒక భావోద్వేగ శిఖరం అనిపించింది. ఈ గెలుపులు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఒకే జెండా క్రింద ఆనందించగలిగారు. ఆ గెలుపు ఒక జాతీయ గర్వం, ఒక భావాత్మక ఉత్సాహం. భారతీయుల జీవితంలో ఒక దశాబ్దాల కాలానికి సరిపడ అద్భుతమైన ఉద్వేగ మధుర స్మృతిగా అనిపించింది. 

ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ సారధ్యంలో 2016 నుండి 2020 వరకు అగ్రగామ్య టెస్టు జట్టుగా ఉండడం అనేవి మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి.

ఇక వరిష్ట (సీనియర్) పురుషుల 2015 & 2019 ప్రపంచ కప్పు ఆటలో భారతదేశం సెమీఫైనల్ లో నిష్క్రమించడం, 2021 మరియు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లలో రెండవ స్థానంలో ఉండడం ఒక విధమైన నిరాశ బాధను మాత్రమే కలిగించింది, కానీ 2023 పురుషుల ప్రపంచ కప్‌ లో ఆఖరి వరకు అద్భుతంగా ఆడి తుది పోరులో తడపడి ప్రపంచ కప్ కోల్పోవడం అనేది మాత్రం ఉద్వేగమైన కటిక చేదు గుళిక అనిపించింది. ఆ ఓటమి ఒక మౌన గాయం.

2012లో అండర్ 19 ప్రపంచ కప్పు అనేది ఒకటి ఉంటుందని దానిలో యువ పురుషుల భారత జట్టు గెలిచిందని తెలిసిన తర్వాత 2011లో నేను పొందిన ఆనందం ఎందుకు పొందలేకపోయాను, అందరూ కూడా ఎందుకు ఆ విజయాన్ని అంత ఘనంగా ఆస్వాదించలేక పోయారనిపించింది.

అదే విధంగా‌ 2017లో సైతం దృష్టి సారించిన మహిళా ప్రపంచకప్ సమయంలో భారత జట్టు తుది పోరు వెళ్లడం పై ఎందుకు అంత దృష్టి సారించలేదు అనే నిరాశ మరియు భారత మహిళా జట్టు ఓడిపోవడం వల్ల బాధ అనిపించింది.

నేను 2011లో భారత పురుషుల ప్రపంచ కప్ విజయానికి ఇచ్చిన విలువ కంటే 2023 ఓటమికి ఇచ్చిన సమయం చాలా ఎక్కువ. ఆ ఓటమి కలిగించిన బాధ అనేక కోణాలలో నన్ను ఆలోచనలలో పడేసింది. అప్పుడు నాలో చాలా మేధోమథనం జరిగింది. 

ఆ ఓటమి తర్వాత అంతర్జాతీయ పురుషుల భారత జట్టు "ఇంకోసారి సారి గెలుస్తుంది" అనే ఆశ, "ఇంకా మంచి ఆటగాళ్లు ఉన్నారు" అనే నమ్మకం, "మన సమయం వస్తుంది" అనే ధైర్యం. దానికి తగ్గట్టుగానే ఉపసంహణం కలిగించే విధంగా పురుషుల ప్రపంచ కప్పు తర్వాత జరిగిన అంతర్జాతీయ వరిష్ట భారత పురుషుల 2024 టి20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లో విజయాన్ని సాధించడం మంచి ఉపశమనం కలిగించాయి.

ఇంకా ఓటమి తర్వాత ఇంకా ఇలా ఆలోచించాను "భారత క్రికెట్ ఆట ఇష్టం ఉన్నప్పుడు, అన్ని రకాల జట్ల (పురుషుల మహిళల, యువ, అంతర్జాతీయ, దేశీయ) అట పై సమాన భావం కలిగి ఉంటే బాగుంటుందని అనిపించింది" (కానీ అది అనుకున్నంత సులభంగా జరగదు, జరగలేదు. కానీ‌ మహిళల ప్రపంచ కప్ విషయంలో బలంగానే జరిగింది)

అంతర్జాతీయ పురుషుల 2024 టి20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లాగానే మహిళల ప్రపంచ కప్ 2025లో‌ భారత మహిళా జట్టు ఆడే ప్రతి ఆట మీద దృష్టిపెట్టాను.

లీగ్ దశలో భారత మహిళా జట్టు మొదట శ్రీలంక మరియు పాకిస్తాన్ పై గెలిచినప్పుడు అభినందించడం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా & ఇంగ్లాండ్ పై ఓడినప్పుడు సహనంతో ప్రోత్సహించడం చేశాను. మరియు కీలకమైన న్యూజిలాండ్ పై ఆటలో గెలిచి సెమీఫైనల్ లో అడుగుపెట్టడం భలే మంచిగా అనిపించింది. 

ఇక సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై గెలవడంతో ఎంతో ఆనందపడ్డాను. ఆ సమయంలో భారత అంతర్జాతీయ పురుషుల జట్టుపై అభిమానం గల ప్రతి ఒక్కరు భారత అంతర్జాతీయ మహిళల జట్టుపై ఆసక్తి కనబరిచారని తెలిసి ఆ ఆటలో నాతో పాటు చాలామంది గర్వంగా వేడుకల చేసుకోవడం, తుది పోరుకై ఆశగా ఆత్రుతగా ఎదురు చూడడం, చివరి ఆటను అభిమానులు మొత్తం వీక్షించడం భారత జట్టు గెలవడం, ఓడిన దక్షిణఆఫ్రికాపై మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం చాలా సంతృప్తినిచ్చింది. 
అందరిలాగానే నేను కూడా ఆలోచిస్తున్నానని, అభినందిస్తున్నానని తెలిసి ఓ చిద్విలాసం చిందించాను.
💭⚖️🙂📝@🌳
📖03.11.2025✍️
 
 -------
 సంక్షిప్త  వివరణ
క్రికెట్ అనేది భారతదేశంలో భావాత్మకంగా మతంలాగ కొనసాగుతుందంటారు. ఇప్పుడు అది అంత తీవ్రంగా లేకపోయినా ఏదో ఒక విషయంలో దానిమీద సానుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా లేదా తటస్థంగా నైనా దృష్టి పెడుతూనే ఉంటాం. క్రికెట్ కేవలం ఆట కాదు అది ఒక సామూహిక అనుభూతి అనిపించింది.

కపిల్ దేవ్ నాయకత్వంలో 1983లో వచ్చిన ప్రపంచ కప్ విజయం, ధోని నేతృత్వంలో 2011లో ముంబైలో గెలిచిన ప్రపంచ కప్ కేవలం క్రీడా ఘట్టాలుగా మాత్రమే కాదు, ఇవి భారతీయుల జీవితాల్లో క్రికెట్ ద్వారా పొందిన ఒక భావోద్వేగ శిఖరం అనిపించింది. ఈ గెలుపులు దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి. పేద, ధనిక, గ్రామీణ, పట్టణ ప్రజలందరూ ఒకే జెండా క్రింద ఆనందించగలిగారు. ఆ గెలుపు ఒక జాతీయ గర్వం, ఒక భావాత్మక ఉత్సాహం. భారతీయుల జీవితంలో ఒక దశాబ్దాల కాలానికి సరిపడ అద్భుతమైన ఉద్వేగ మధుర స్మృతిగా అనిపించింది. 

ధోనీ నేతృత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ సారధ్యంలో 2016 నుండి 2020 
వరకు అగ్రగామ్య టెస్టు జట్టుగా ఉండడం అనేవి మంచి జ్ఞాపకాలుగా ఉన్నాయి.

ఇక వరిష్ట (సీనియర్) పురుషుల 2015 & 2019 ప్రపంచ కప్పు ఆటలో భారతదేశం సెమీఫైనల్ లో నిష్క్రమించడం, 2021 మరియు 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లలో రెండవ స్థానంలో ఉండడం ఒక విధమైన నిరాశ బాధను మాత్రమే కలిగించింది, కానీ 2023 పురుషుల ప్రపంచ కప్‌ లో ఆఖరి వరకు అద్భుతంగా ఆడి తుది పోరులో తడపడి ప్రపంచ కప్ కోల్పోవడం అనేది మాత్రం ఉద్వేగమైన కటిక చేదు గుళిక అనిపించింది. ఆ ఓటమి ఒక మౌన గాయం.

2012లో అండర్ 19 ప్రపంచ కప్పు అనేది ఒకటి ఉంటుందని దానిలో యువ పురుషుల భారత జట్టు గెలిచిందని తెలిసిన తర్వాత 2011లో నేను పొందిన ఆనందం ఎందుకు పొందలేకపోయాను, అందరూ కూడా ఎందుకు ఆ విజయాన్ని అంత ఘనంగా ఆస్వాదించలేక పోయారనిపించింది.

అదే విధంగా‌ 2017లో సైతం దృష్టి సారించిన మహిళా ప్రపంచకప్ సమయంలో భారత జట్టు తుది పోరు వెళ్లడం పై ఎందుకు అంత దృష్టి సారించలేదు అనే నిరాశ మరియు భారత మహిళా జట్టు ఓడిపోవడం వల్ల బాధ అనిపించింది.

నేను 2011లో భారత పురుషుల ప్రపంచ కప్ విజయానికి ఇచ్చిన విలువ కంటే 2023 ఓటమికి ఇచ్చిన సమయం చాలా ఎక్కువ. ఆ ఓటమి కలిగించిన బాధ అనేక కోణాలలో నన్ను ఆలోచనలలో పడేసింది. అప్పుడు నాలో చాలా మేధోమథనం జరిగింది. 

ఆ ఓటమి తర్వాత అంతర్జాతీయ పురుషుల భారత జట్టు "ఇంకోసారి సారి గెలుస్తుంది" అనే ఆశ, "ఇంకా మంచి ఆటగాళ్లు ఉన్నారు" అనే నమ్మకం, "మన సమయం వస్తుంది" అనే ధైర్యం. దానికి తగ్గట్టుగానే ఉపసంహణం కలిగించే విధంగా పురుషుల ప్రపంచ కప్పు తర్వాత జరిగిన అంతర్జాతీయ వరిష్ట భారత పురుషుల 2024 టి20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లో విజయాన్ని సాధించడం మంచి ఉపశమనం కలిగించాయి.

ఇంకా ఓటమి తర్వాత ఇంకా ఇలా ఆలోచించాను "భారత క్రికెట్ ఆట ఇష్టం ఉన్నప్పుడు, అన్ని రకాల జట్ల (పురుషుల మహిళల, యువ, అంతర్జాతీయ, దేశీయ) అట పై సమాన భావం కలిగి ఉంటే బాగుంటుందని అనిపించింది" (కానీ అది అనుకున్నంత సులభంగా జరగదు, జరగలేదు. కానీ‌ మహిళల ప్రపంచ కప్ విషయంలో బలంగానే జరిగింది)

అంతర్జాతీయ పురుషుల 2024 టి20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ లాగానే మహిళల ప్రపంచ కప్ 2025లో‌ భారత మహిళా జట్టు ఆడే ప్రతి ఆట మీద దృష్టిపెట్టాను.

లీగ్ దశలో భారత మహిళా జట్టు మొదట శ్రీలంక మరియు పాకిస్తాన్ పై గెలిచినప్పుడు అభినందించడం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా & ఇంగ్లాండ్ పై ఓడినప్పుడు సహనంతో ప్రోత్సహించడం చేశాను. మరియు కీలకమైన న్యూజిలాండ్ పై ఆటలో గెలిచి సెమీఫైనల్ లో అడుగుపెట్టడం భలే మంచిగా అనిపించింది. 

ఇక సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా పై గెలవడంతో ఎంతో ఆనందపడ్డాను. ఆ సమయంలో భారత అంతర్జాతీయ పురుషుల జట్టుపై అభిమానం గల ప్రతి ఒక్కరు భారత అంతర్జాతీయ మహిళల జట్టుపై ఆసక్తి కనబరిచారని తెలిసి ఆ ఆటలో నాతో పాటు చాలామంది గర్వంగా వేడుకల చేసుకోవడం, తుది పోరుకై ఆశగా ఆత్రుతగా ఎదురు చూడడం, చివరి ఆటను అభిమానులు మొత్తం వీక్షించడం భారత జట్టు కలవడం, ఓడిన దక్షిణఆఫ్రికాపై మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం చాలా సంతృప్తినిచ్చింది. (అందరిలాగానే నేను ఆలోచిస్తున్నానని తెలిసి నవ్వుకున్నాను).

ఇది ఎందుకు ఇంత సమయం వెచ్చించి రాసానో స్పష్టంగా చెప్పలేను, దీనిలో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను కూడా తెలియట్లేదు. నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు ఈ రచనతోనే సహవాసం చేశాను.

💭⚖️🙂📝@🌳
📖03.11.2025✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)