Introvert's Day (English/Telugu)

⚛️🪷🌳

భవ భావజాల భావనలతో, స్వీయ సంచారంలో ఉన్నవాడిని. చాలా వరకూ, మాటలలో అంతర్ముఖుడిని రాతలలో బహిర్ముఖుడిని. 

గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతున్నట్లుగా, ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను కొంచెం కవితాత్మకంగా వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులను వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తొంది.

ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

గమనిక: నా స్వాభావిక అంతర్దృష్టులు, నాలో నాకు అనిపించిన ఉత్తమ ఆలోచనలు క్షణికమైన కానీ, వాటిని కొంచెం మేధోమథనంతో దీర్ఘకాలం ఉండేలా, అక్షర రూపంలో అపురుమైన ఆకారం ఇస్తుంటాను.‌ రాసేటప్పుడు భావించిన భావాలలో ఉన్న గాఢతను, మంచిని, సౌందర్యాన్ని, అతిశయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. రాసిన తరువాత అనిపించిన ఉత్తమ స్థితి నుంచి సాధారణ స్థితికి అంటే మంచి పాత్రలు పోషించి బయటకు వచ్చే నటుల లాగానే వచ్చేస్తాను. వచ్చిన తరువాత నేనేనా అలా రాసింది అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తాను. 

💭⚖️🙂📝@🌳
📖02.01.2025✍️

The caterpillar grows its wings during the time of solitude. Like that in my solitude, with my understood transparency and Discretion I'm expressing my introvertional intents through the Social Media (Social Diary) platforms and it's helping for my incredible inherent insights. 

On this introverts day, I'm expressing out my gratitude to Social Media (Social Diary).

Thank you Meta (Facebook/WhatsApp).


Comments

  1. 👌👌👌 ప్రతీ ఇంట్లో ఎక్కువగా అంతర్ముఖులే వుంటారు

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

PV Narasimha Rao