Nannamma (Telugu 31.01.2026)

⚛️🪷🌳

కనుపూరు కొలను 

వద్ద విలక్షణంగా 

సైకతలింగం సృష్టిస్తూ 

శివారాధనను శ్రేయస్కరంగా

చేస్తూ చక్కగా 

కుశలంగా కపాల

మోక్ష మార్గంలో

పయనించిన పాతపాటి 

లక్ష్మీ నరసయ్యను 

గొప్పగా గౌరవిస్తూ 

వెంకట నరసయ్య

మహాలక్ష్మమ్మ 

దంపతులు దివ్యంగా

భావిస్తూ భాగ్యంగా

పుత్రికకు పితృదేవుని 

పేరుతో ప్రీతిగా 

లక్ష్మీనరసమ్మ 

పేరు పెట్టిన పెంచిన

తల్లితండ్రుల

ఆశల ఆకారమైన 

తాదాత్మ్య తనయ


పద్నాలుగేళ్ళ ప్రాయంలో

ఆమంచర్ల ఆదిశేషునితో

కమనీయంగా కళ్యాణంతో

కలిసి కదిలి 

ఇల్లాలుగా ఇంట్లోకి 

ప్రవేశించి ప్రశాంతతతో

భరోసాగా భర్త

వృత్తిరీత్యా విస్తృతంగా   

పయనించిన ప్రదేశాలలో  

బాసటచ్చిన భార్య


పుత్రులు పుత్రికలు 

సప్త (షట్) సంతానానికి

తల్లిగా తత్వాలతో

ప్రయోజకులుగా పెంచి

పిల్లలకు ప్రేరణైన

మంచి మాత


నియమ నిర్వహణ

పరోపకార ప్రేమాభిమానాల

ఆధ్యాత్మిక ఆలంబనలతో

ఆనందరూపినిగా అజాతశత్రువైన 

గొప్ప గృహలక్ష్మి


కడకు కడపలో 

రామ నామంతో

రామ నాథునిలో

సంగమించిన సాధ్విమణి


శోభమైన శతజయంతి 

(1926-2026)

సందర్భంగా స్మృతిలో 

లక్షణమైన లక్ష్మీ 

నరసమ్మ నానమ్మకు 

నివాళులర్పిస్తున్నాను

💭⚖️🙂📝@🌳

📖31.01.2026✍️

-------&&&&------


మాతృ పరంపరలోని 

నానమ్మ లక్ష్మీనరసమ్మ (100)

మేనకోడలు ధృతి (1)

జన్మదినం ఒకేసారి

వచ్చిన సందర్భంగా....


తరాలకు తార్కానంగా 

మృదువైన మాతృస్వామ్య 

ఏడు తరాలను ఏకం చేసిన 

వారసత్వ వారధిగా

ఉన్న ఉన్నతమైన

ఈ చిరస్మరణీయ చిత్రాన్ని 

(1.సీతమ్మ, 2.మహాలక్ష్మమ్మ, 

3.లక్ష్మీ నరసమ్మ, 4.అన్నపూర్ణమ్మ, 

5.మాధవమ్మ, 5.స్వాతమ్మ, 7.ధృతమ్మ)

పంచుకుంటున్నాను.

💭⚖️🙂📝@🌳
📖31.01.2026✍️



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Dreams & Delay (Telugu 20.06.2025)