Posts

Showing posts from 2023

Ramana Maharshi (రమణ మహర్షి)

Image
⚛️🛞🪷 రమణ మహర్షి నేనెవరిననే నెపంతో తత్వమసి తత్వంలో అరుణాచలేశ్వరునికీ అంకితమై ఆధ్యాత్మిక అమృతవాహినిగా ప్రశాంత ప్రకాశాన్ని ప్రసరిస్తూన్న  ముగ్ధ మౌన ముని రమణీయ రమణ రుషి  రమణ తాతయ్యను‌ తన  జన్మదినోత్సవం నాడు  స్మరిస్తూ స్తుతిస్తూ సంతోషిస్తున్నాను  💭⚖️🙂📝 @🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity

శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan)

Image
⚛️🛞🪷 శ్రీనివాస రామానుజన్ ఈ "జాతీయ గణిత దినోత్సవం" నాడు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్‌కి నివాళులతో ఈ వ్యాసం రాస్తున్నాను. ఇది శ్రీనివాస రామానుజన్ శాస్త్రీయ గణిత సూత్రం.  రో- రోజు; నె- నెల; స- సంవత్సరం; శ- శతాబ్దం రో     నె    స    శ స+1 శ-1 నె-3 రో+3 నె-2 రో+2 స+2 శ-2 స+1 శ-1 రో+1 నె-1 D     M    C     Y Y+1 C-1 M-3 D+3 M-2 D+2 Y+2 C-2 C+1 Y-1 D+1 M-1) ఇది శ్రీనివాస్ రామానుజన్ యొక్క అద్భుతమైన శాస్త్రీయ గణిత కళాఖండం. వారి సూత్రాన్ని తీసుకొని ఉదాహరణకు నేను నా జన్మదినాన్ని తీసుకున్నాను 14 04 19 94 95 18 01 17 02 16 96 17 20 93 15 03 ప్రతి నిలువు మరియు అడ్డం కాలమ్స్ మరియు వరుసలలో; ఖచ్చితమైన మూలలు మరియు మధ్యలో ఉన్న సంఖ్యలను మనం కలిపితే నికర ఫలితం ఒకేలా ఉంటుంది‌. ప్రతి నిలువు మరియు అడ్డం కాలమ్స్/వరుసలలో; కచ్చితమైన మూలల్లో మరియు మధ్య సంఖ్యలలో మీరు దాన్ని మొత్తం కుడితే నికర ఫలితం 131. ---------- రామానుజన్ శాస్త్రీయ సూత్రం లాగా; మంచి వ్యవస్థీకృత నికర ఫలితాన్ని పొందడానికి దైవం/సమయం చేర్పులు మరియు తీసివేతలతో జీవితంలో ఒక సూత్రాన్ని ఏర్పాటు చేశాడనిపిం

ఈశ్వరోవాచలు

Image
⚛️🛞🪷 ఈశ్వరోవాచలు సహజ సాధారణ సాహిత్యాన్ని  సంపన్నంగా సశేషంగా సాగిస్తూ అందరికి అనుసంధానం అయ్యేలా  రచనలు రాయగల రత్న రుచి రచయిత ఈ శ్వ రం గారు  ఈశ్వరోవాచలను తలుస్తూ  హృదయపూర్వక హార్థిక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity 30 Aug 2022 విజ్ఞానానికి కేంద్రం వెలుగు. చూడాలనుకుంటే కళ్ళు తెరువు. భరించలేననుకుంటే మూసెయ్. చీకటిని వదలలేని నీ అంధత్వానికి బాధ్యులెవరూ లేరిక్కడ. 30 Oct 2022 జీవం అంటే మరేవిటో కాదు. ఆహారం. ఒక జీవకణానికి మరో జీవకణం ఆహారమవడమే సృష్టి. ఆకలి కలగడం అంటే జీవకణాల కలయికని కోరుకోవడం. 🤗. చివరికి మనిషి శవాన్నికూడా పురుగులు ఆహారంగా స్వీకరిస్తాయి. అదే సృష్టి ధర్మం. మధ్యలో మనం ఊహించుకునేవన్నీ భ్రమలే.  శాఖాహారం మాంసాహారం అనే ప్రత్యేక శాఖలేవి లేవు. అన్నీ సృష్టిధర్మాన్ని అనుసరించి జీవించేవే...  ఐతే ఇన్ని వైవిధ్యాలుగల జీవులెలా సృష్టించబడుతున్నాయనేదే సృష్టి రహస్యం. మనం ఫలితం మాత్రమే చూడగలం. రహస్యాన్ని ఛేదించలేం. ఛేదించాలని ఉవ్విళ్ళూరేది శాస్త్రం. ఛేదించాలనే ఆలోచన కలగక ఆ రహస్యానికొక పేరు పెట్టుకుని సరిపుచ్చుకునేది విశ్వాసం. అంతే.. మరేంలేదు.🤗 21 Decembe

Ravi Shekhar

Image
⚛️🛞🪷 తెలిక తత్వానికి తనయుడుగా తరుచూ ప్రకటనల తరగతిలో తిరుగుతూ తిరుగులేని  పసినవ్వుతో ప్రశాంతతను ప్రజ్వలిస్తూ తెల్లవారుజామున "రవి" కిరణంలా శాంతి "శేఖరం" అందించే Ravi Sekhar  రవి శేఖర్ గారికి హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి)

Image
⚛️🪷📧 🌳 Meeting Nature 🤝 (పరిచితమైన ప్రకృతి) 28 Aug 2020 Ancient Architecture  Nostalgic Nature  Gleeful with Greenery ------ 10 Sep 2020 In Greenery, Cool weather, Light wind, Tangible opulence of Gleefulness from nature. "Flying Flag in Forest From Fort" (Here greenery Kadapa Railway Station resembling the Forest. A picture from our appartments representing Fort.) ------------- 06 Oct 2020 Have a Bright Day ahead (A click from terrace - Palakondalu Hills Kadapa) ----------- 22 Oct 2020 Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. Going beyond Clouds/Thoughts is Tough Task.  Clouds/Thoughts are Chaos in seeing clean clear Sky/Self.  Albeit they help us through Rains/Regards for Self. 🙏 🌧️ 💭 🙏. ---------- 18 Nov 2020 I have set my focus on Sunset This Set is a Start for Shining 🔥 at another Side. 22 Nov 2021 Gleeful Green 😊 Seasonal Scenery  Wonderful Waterfall 🌊 Photography Paradise 📸 Palakondalu 🧡🤍💚 PC: Bharghav Shyam ------

Growth Circles & Finger Prints

Image
⚛️🛞🪷 ------------- 📷©️: అనామిక వృక్షంలో "వృద్ధి వృత్తాలు" & వ్యక్తుల "వేలిముద్రలు". (Tree "Growth Rings" & Human Finger Prints) సమానంగా ఒకదానికొకటి ప్రత్యేకంగా పోలి ఉన్నాయి. సమానత్వానికి సారూప్యతలను  చిహ్నంగా చూపిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity

Only Goodness

అరుణశ్రీ: అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమయిన వారు వేరొకరు లేరు…  భార్గవ శ్యామ:  అందరిలో కేవలం మంచి మాత్రమే చుడడం బలహీనతవుతుందేమో, కానీ మంచి చూడడం ఏమాత్రం బలహీనత కాదు... 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity  అక్షర ఆనంద అస్తిత్వం

KTR- Kalvakuntla Taraka Rama Rao

Image
నాకు అనిపించినంత వరకు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ లాంటి క్రియాశీలక, హుందాతనం గల మంత్రిని చూడలేదు అనిపించింది.  కేటీఆర్ అనే ఒక వ్యక్తి వల్లే సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పదవికే గౌరవం వచ్చిందనిపించింది. దాని వల్ల మంత్రిత్వ శాఖ స్థాయి పెరిగింది. రాష్ట్రాలకు అతీతంగా సామాజిక మాధ్యమాల సాయంతో సమస్యలకు "వ్యక్తిత్వం మరియు అధికారం" తో విద్య వైద్య వంటి విలువైన వ్యక్తిగత విషయాలలో వ్యక్తులకు నేరుగా నేనున్నానని భరోసా కలిస్తూ సేవలు అందించి చాలా మంది అభిమానం సంపాదించుకున్నారు. దృతరాష్టుడు లాగ కళ్ళు లేని వాళ్ళు అయితేనో, లేక గాంధారి లాగా కళ్ళు ఉండి కూడా కళ్ళకు గుడ్డలు కట్టుకుని చూడలేని వారు అయితేనో కనపడదు అనేంత విధంగా అభివృద్ధితో అభిమానాన్ని, ఆసరా ఇచ్చి అనుచరులను సంపాదించుకున్నారు. Thanks for your great tenure and development sir. 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity  అక్షర ఆనంద అస్తిత్వం

Sirivennela Sitaramasastri (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

Image
⚛️🪷📧 సిరివెన్నెల సీతారామశాస్త్రి  శ్రవణానికి శ్రావణం సంధి చేసి వాణిజ్య వినోద చలన చిత్రాలకు సాంప్రదాయ సామాజికాంశలను  కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని పద పాటలతో పాఠాలుగా పండించి  తెలియని తెలుగు తెలియజేసిన  సాహిత్య సమ్మోహన సామ్రాట్  సిరివెన్నెల సీతారామశాస్త్రి 30 నవంబర్ 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రి  సంవత్సరికాన్ని స్మృతిలో స్మరిస్తూ  సంతాప శ్రద్ధాంజలి మృత్యోర్మా అమృతంగమయ  ఓం శాంతి శాంతి శాంతి:  💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని  అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని  మారదు లోకం మారదు కాలం  దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని  మారదు లోకం మారదు కాలం గాలివాటు గమనానికి కాళీ బాట దేనికి  గొర్రె దాటు మందికి నీ జ్ఞానబోధ దేనికి  ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం  ఏక్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం రామభాణామార్చిందా రావణ కాష్టం  కృష్ణ గీత ఆపిందా నిత్యా కురుక్షేత్రం నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని  అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛహిన్ని  మారదు లోకం మారదు కాలం పాతా రాతి గుహలు పాలరాతి గృహాలయినా  అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా  వేట అదెయ్ వేటు అద

Deepavali

Image
దేదీప్యమానంగా దీపాల ధ్యుతిలు ఆనంద అంధకార అమావాస్యలో  దీప దీప్తులు జాబిల్లిగా జ్యోతితో   ప్రకాశత్వం ప్రసాదించింది చీకట్లలో చైతన్య  శుభ శోభావళి  దీపావళి తమసోమా జ్యోతిర్గమయా  అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity   అక్షర ఆనంద అస్తిత్వం

Vyshnavi Birthday

విద్యలో విషయ విశిష్టత వున్న విశేష వనితా వాణి వైష్ణవికి......  హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity  అక్షర ఆనంద అస్తిత్వం

Vamsi Annaya & Kavita Vadina

అన్నయ్య 🤝 వదిన దివ్యమైన దేవి దీవెనలతో ధీయుక్తి  ప్రసాదంగా పొంది, ప్రామాణిక వివాహ  ప్రేరేపితమై ప్రమాణ ప్రణయ ప్రయాణంలో ప్రాణమై  సాంప్రదాయ మరియు సాంకేతిక పద్ధతుల సమతుల్యం పాటిస్తూ ప్రకాశిస్తూ పయనిస్తూ  ఒకరికొకరుగా ఒక్కటైన ఇరువురికి ఇరవైవ (వింశతి-20వ) వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.... 💭⚖️🙂📝@🌳  Energy Enjoy Entity అక్షర ఆనంద అస్తిత్వం

States Reorganisation Act 1956

Image
⚛️🛞🪷 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం/  States Reorganisation Act 1956 స్వాతంత్ర్యానంతరం, భారతదేశంలో 1947 నుండి 2019 వరకు (వయా 1956) రాష్ట్రాల ఏర్పాటు ప్రయాణం. 01 నవంబర్ 1956 తరువాత భారతదేశ రాష్ట్ర  సరిహద్దులకు అదనపు మార్పులు చేసినప్పటికీ,  భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత  "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956" రాష్ట్ర సరిహద్దుల మార్పులలో విస్తృతమైనదిగా ప్రభావంతమైనదిగా మిగిలిపోయింది. హెచ్.ఎన్.కుంజ్రూ, ఫజల్ అలీ, కె.ఎం.పణిక్కర్ భాషనే ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు మన దేశం ఏకత్వ స్ఫూర్తితో సమాఖ్య రాష్ట్రాల రూపంలో ఉంది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ .... ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్ ఘడ్, హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ------- After Independence,  The Journey of States Formation,  In Indian Union From 1947 to 2019 (Via 1956) Although additional changes made for India's state boundaries after 01 Nov 1956, "The States Reorganisation Act 1956 " remains the most exte

Sanju & Shreya

Image
⚛️🛞🪷 సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో  సంహిత సముపార్జనతో సేవలందిస్తూ  సేదదీరుతు సదా సంతోష స్వరూపుడై  ఉన్నంతంగా ఉంటాడని సర్వేశ్వరుని సుక్తిస్తూ   హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...   (ఆలస్యంగా) సంజు --------------  Shreya  She is the Energy for Father  She is the Way for Mother  She is the Naughtiness for Brother  She is the Happiness for Grand parents  She is the Relaxation for Relatives.  Shreya have the Gravitational Energy, it pulls us to see, concentrate, feel, and enjoy her  "Aesthetics Actions, Enthusiastic Eagerness, Inherent Innocence, Overwhelming Observation and Ultra Unconditional" qualities. Blissful Birthday Wishes Shreya   💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity 

MS Bharadwaj (Aarya)

Image
⚛️ Medium🛞మాధ్యమం🪷 గ్రంథాలయ గుండె,‌ కలిగి కుదురుకున్న నడిచే నైపుణ్యం సరస్వతి సుపుత్ర  "సతీష్ భరద్వాజ" (ఆర్య) బలమైన భాషతో భావనలను ప్రభావితం చేస్తూ ప్రవాహంలా ప్రకటనలపై  ప్రభావం చూపిస్తూ ప్రకాశిస్తున్న  ఆంధ్ర జ్యోతి అనువాద స్ఫూర్తి  ముటుకుల సతీష్ భరద్వాజ్ గారికి హృదయపూర్వక హార్దిక  పుట్టినరోజు పర్వదినాన  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity  

Valli Akka

⚛️🛞🪷 విద్యావంతురాలై   విశదమైన విషయంతో  వంశీబావతో వివాహమై  'విద్య"తో విదేశం వెళ్లి  వృత్తితో వుంటు  వికసించిన వల్లి అక్కకు  పుట్టినరోజు పండగ శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳   అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity 

Swarna Atta

⚛️🛞🪷 కమల తత్వం అవలంబించి,  గురువుగా గృహస్థిరాలిగా సంక్షేమాన్ని సంకల్పించి అన్నిటితో అనుసంధానమై  సాంఘిక శాస్త్రంలో స్టూడెంట్(విద్యార్థు)లను సపరివార సంధాన సారధిగా అందరికి ఆనందాన్ని అందిస్తూ కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. (కమల తత్వం: కోమలత్వంతో ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉంటూ మంచిని గ్రహించి ఆనందాన్ని అందించే రాజహంస).   స్వర్ణ కమల లక్షణాలు కలిగిన రాజహంస స్వర్ణత్తకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity

Profile Pictures (Commemorative Captions)

Determined Days (దివ్యమైన దినోత్సవం)

⚛️🛞🪷 దివ్యమైన దినోత్సవం  Determined Days  01 జనవరి (2022) శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల లభించినటువంటి నా వైన ఈ నిన్న‌ నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అనుభవించి, ఆనందాలను ఆస్వాదించి ఎన్నో  జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.  ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటున్నాను. 02  జనవరి (2023) గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26 జనవరి (2023) "గణతంత్ర గుణం రక్షించే రాజ్యాంగం" స్వాతంత్రం సాధించిన సాధికారతతో  సార్వభౌమత్వానికి స్ఫూర్తిదాయక సమర్పణ..  రక్షి