EnTREE ⚛️ 🪷🌳 కల్పవృక్షము పరీక్షల కోసం చదవడం అప్పుడు నాకు ఒత్తిడితో కూడిన వ్యవహారం లా అనిపించేది, పాటలు వింటూ నడవడం అనేది ప్రశాంతత కోసం నాకు నేను ఏర్పుచుకున్న ఒక అలవాటు. అప్పుడు నా పిజి మొదటి సంవత్సరం వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి, ఇక రెండో సంవత్సరం ఎంత కష్టంగా ఉంటుందో అని ఊహిస్తే భయం వేసేసింది, ఎలా దాన్ని ఎదుర్కోవడం అని మదన పడిపోయి, చింతలో ఉండిపోయాను. సరే ఇప్పుడు అన్ని మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా పాటలు వింటూ నడుద్దాం అనుకుంటూ బయటికి వచ్చి పాటలు వింటూ నడుసున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎల్లుండి కళాశాల ప్రారంభమవుతుంది, రెండు రోజుల్లో పాఠాలు చెప్పడం మొదలుపెడతారు, ఒకటిన్నర నెలల తర్వాత పరీక్షలు ఉంటాయి. అప్పుడు రాసే పరీక్షల కోసం ఇప్పటినుంచి ఎందుకు బాధపడాలి అనే ఆలోచన వచ్చింది. మనసు తేలికయ్యింది. మనం నిదానంగా చదువుతూ ఉంటే పరీక్షల్లో ఒత్తిడిని చిత్తు చేసి ఉత్తీర్ణులు అవ్వడం సులభం అనిపించింది. ఆ నడకలో ఇలా ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వచ్చాను. నిజంగా అప్పటి ఇష్టమైన అలవాటుతో వచ్చిన ప్రశాంతతో వచ్చిన ఆలోచనలు నా విద్యను వర్గీకరించ...