Viveknanda Kendra Surya Namaskaram

⚛️🪷🌳
సూర్య నమస్కార సూచనలు: 

స్థితి:- రెండు పాదాల మడిమలు జోడించి "వి" ఆకారంలో పెట్టాలి, రెండు చేతులను నమస్కారం ముద్రలో జోడించి బొటనవేలును ఛాతి మధ్య భాగంలో ఆనించాలి. చేతులు భూమికి సమాంతరంగా ఉంచాలి. 
శరీరం నిటారుగా ఉంచి, దృష్టి నేరుగా ఉండాలి. 

1. (ఏకం) - నమస్కారం ముద్ర నుంచి చేతులు చెతులు పైకి తీసుకువెళ్లి, మన చేతులు చెవులను తాకే విధంగా రాసిఉంచాలి. తర్వాత నడుం పై భాగాన్ని వెనుకకు వంచాలి. మోచేతులు నిటారుగా ఉంటాయి, ఈ రెండు చేతులు చెవులను తాకుతూ ఉంటాయి. - శ్వాస తీసుకోవాలి

2. (ద్వే) - సాగి ఉన్న నిటారు చేతులతో నడుం పై భాగాన్ని కిందకు వంచాలి. మోకాళ్లు నిటారుగా ఉంచాలి. నుదురు భాగం మోకాళ్ళకు తాకించే ప్రయత్నం చేయాలి. 
 కాళ్లకు రెండు పక్కల రెండు చేతులు భూమిని తాకించి వరుసగా వేళ్ళు ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. - శ్వాస వదలాలి. 

3. (త్రిణి) - రెండు చేతుల వేళ్లు ఇంకా ఎడమ కాలు వేళ్ళు వరుసగా ఉంచి, కుడి కాలును వెనక్కు తీసుకువెళ్లి మోకాలు నేలకు ఆనించాలి, నడుము భాగాన్ని ముందు తోస్తూ దృష్టి ఆకాశం వైపు ఉంచాలి‌. శ్వాస తీసుకోవాలి.

4. (చత్వారి) - చేతులు కదల్చకుండా ఎడమ పాదాన్ని కూడా కుడి పాదం పక్కన జోడించాలి. శరీరం ఏటవాలుగా ఉంచి దృష్టిని చేతుల నుంచి సుమారు ఒకటిన్నర అడుగుల ముందు భూమి మీద ఉంచాలి. -శ్వాస వదలాలి

5. (పంచ) - చేతులు పాదాలు స్థితి మార్చకుండా మోకాళ్ళను నేలకు ఆనించి పాదాలు మడమల పైన వెనక కూర్చొని నుదురు భాగాన్ని నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. మోచేతులు నిటారు ఉండాలి. శ్వాస తీసుకోవాలి వదలాలి

6 - (షట్) - చేతులు కాళ్లు కదల్చకుండా శరీర పైభాగాన్ని ముందుకు తీసుకొని అరచేతుల మధ్యన చాతిని ఉంచాలి. రెండు పాదాలు, రెండు మోకాళ్లు, రెండు అరచేతులు, చాతి, నుదురు, ఈ ఎనిమిది భాగాలు నెలకు తాగే విధంగా సాష్టాంగ నమస్కారం పెట్టాలి. శ్వాస వదిలి ఆపి పెట్టాలి.

7. (సప్త) - నడుము పైభాగాన్ని పైకిలేపి, శరీరం సాగదీయబడి చూపు ఆకాశం వైపు ఉంచాలి. మోకాళ్ళను నెలకు తాకించకుండా ఉంచి. కాలి చేతుల మీద శరీరాన్ని సమతల్యంగా ఉంచుకోవాలి. శ్వాస తీసుకోవాలి

8. (అష్ట) - చేతులను కాళ్ళను కదల్చకుండా నడుము భాగాన్ని పర్వత ఆకారంలో శరీరాన్ని ఉంచాలి. దృష్టి నాభి వైపు పెట్టాలి. మడమలను నెలకు తాకించే ప్రయత్నం చేయాలి. శ్వాస వదలాలి.

9. (నవ) - చేతులు పాదాలు స్థితి మార్చకుండా మోకాళ్ళను నేలకు ఆనించి పాదాలు మడమల పైన వెనక కూర్చొని నుదురు భాగాన్ని నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. మోచేతులు నిటారు ఉండాలి. శ్వాస తీసుకోవాలి వదలాలి

10. (దశ)- కుడి పాదం ముందుకు తెచ్చి, రెండు చేతుల మధ్యన 15 వెళ్ళు ఒకే వరుసలో ఉండే విధంగా పెట్టాలి. నడుము భాగాన్ని ముందు తోస్తూ దృష్టి ఆకాశం వైపు ఉంచాలి‌. ఎడమ కాలి మోకాలు భూమికి తాకి ఉంటుంది శ్వాస తీసుకోవాలి.

11. (ఏకాదశ) - ఎడమ పాదం కూడా రెండు చేతుల మధ్య పెట్టాలి. ఇప్పుడు 20 వేళ్ళు ఒకే వరుసలో ఉంటాయి. మోకాళ్లు వంచకుండా నుదురు భాగంగా మోకాళ్ళకు తాకించే ప్రయత్నం చేయాలి. శ్వాస వదలాలి

12. (ద్వాదశ)- రెండు అరచేతులను నమస్కార స్థితిలోకి తెచ్చి బొటనవేలును ఛాతి మధ్య భాగంలో ఆనించాలి. చేతులు భూమికి సమాంతరంగా ఉంచాలి. శ్వాస తీసుకోవాలి.

వివేకానంద కేంద్ర సూర్యనమస్కార ఆసనాలు 
(1) హస్త ఉత్తానాసన
(2) పాదహస్తాసన
(3) అశ్వసంచాలనాసన
(4)తులాసన
(5) శశాంకాసన
(6)సాష్టాంగనమస్కారం
(7)భుజంగాసన
(8)పర్వతాసన
(9)శశాంకాసన
(10)అశ్వసంచాలనాసన
11)పాదహస్తాసన
(12)సూర్య నమస్కారం స్ధితి

హిరణ్మయేణ పాత్రేణ, సత్య స్యాపి హితమ్ ముఖం | 
తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే ॥

1. ఓం హ్రాం మిత్రాయ నమః
2. ఓం హ్రీం రవయే నమః
3. ఓం హ్రూం సూర్యాయ నమః
4. ఓం హ్రైం భానవే నమః
5. ఓం హ్రౌం ఖగాయ నమః
6. ఓం హ్రః పూష్ణే నమః

7. ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః
8. ఓం హ్రీం మరీచయే నమః
9. ఓం హ్రూం ఆదిత్యాయ నమః
10. ఓం హ్రైం సవిత్రే నమః
11. ఓం హ్రౌం అర్కాయ నమః
12. ఓం హ్రః భాస్కరాయ నమః





కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)