Violence Against Women (Telugu 18.08.2024)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అనాదిగా అబలలైన అతివల ఆక్రందన
మహిళల జీవితం ఓ కర్మాగారం కాదు
మగువ తనువు ఓ క్రీడాస్థానం కాజాలదు
మానవతకి జన్మనిచ్చు జన్మ స్థానం.
శిశువులుగా పుట్టి పశువులుగా మారి
మానవ రూపంలోనే మృగాలై మారితే
ప్రపంచం ప్రశాంతంగా పడుకుంటుందా!
మూలం: అరుణ పొత్తూరి
సవరణ: భార్గవ శ్యామ
-----------------------------
పురుషులందరూ లైంగిక వేధించే వారు కాదు.
నా స్నేహితుల్లో చాలామంది మగవారే.
నేను సంతోషంగా ఉన్నప్పుడు వారిని కౌగిలించుకున్నాను
నేను బాధపడినప్పుడు వారి భుజాలపై ఏడ్చాను,
నేను నున్యత భావనలో వారి ఇంట్లోనే ఉండిపోయాను.
ఒక కుటుంబంలా వారు నా గౌరవాన్ని కాపాడారు.
"తప్పులో వ్యక్తిని నిందించండి, వారి లింగాన్ని కాదు"
మూలం: సోనమ్ మహాజన్
అనువాదం: భార్గవ శ్యామ
💭⚖️🙂📝@🌳
📖18.08.2024✍️
Comments
Post a Comment