Meditation Day (Telugu 21.12.2025)
⚛️🪷🌳
ఎక్కడైనా ఏకాగ్రత
ఏర్పారిచిన ఏకాంతంలో
మనసు మౌనమై
అంతరంగం ఆనంతమై
అసలేమి ఉండని/
అన్ని ఉన్నాయి
అనే అనిర్వచనీయ
శూన్యంలో సమస్తం
సాధించే సిద్ధి
స్థితి సుసంపన్నంగా
అందించే అద్భుతమైన
దారి, ధ్యానం.
-----------------
ధ్యానం దారిలో
తక్కువగా తిరిగిన
కానీ, అదృష్టవశత్తు కలిగిన
తాత్విక తాదాత్మ్యమైన
భావనలతో బలంగా
అలా అట్టిపెట్టుకుని
సుదీర్ఘంగా సాగిన
వాడినై వున్నాను.
ఆ అద్భుత అనుభూతి
అనుభవపూర్వకంగా కాకపోయినా
ఆలోచనలతో కదిలిన
మదిలో మెదిలిన
స్పందనల సారాంశం
కవిత్వంగా కుదురుకుని
నిర్వచనంగా నిలిచింది.
అందరికీ అంతర్జాతీయ
ధ్యాన దినోత్సవ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖21.12.2025 ✍️

Comments
Post a Comment