On Aesthetics by Metaphor (Telugu 30.12.2025)

⚛️🪷🌳

సాధారణంగా ఆభరణాలు అన్ని స్వర్ణంతో చేస్తారు, కొన్ని మాత్రమే ఇతర లోహాలతో చేస్తారు, లోహాల్లో కొన్ని స్వర్ణం కంటే ఉన్నతమైనవి, కొన్ని కావు. కానీ ప్రతి ఆభరణం విలువైనదే. ఆభరణాలు కొన్ని సాంప్రదాయంగా, కొన్ని ఆధునికంగా, కొన్ని సరళంగా, కొన్ని సున్నితంగా, కొన్ని స్థూలంగా, కొన్ని తేలికగా ఉంటాయి. ఇలా ప్రతి ఆభరణం ప్రత్యేకమైనదే. 

దాదాపు అందరూ స్వార్జితంతో ఆభరణాలను పొందుతారు, ఇది చాలా మేలైన మార్గం, ఉత్తమమైనది. కొందరికి వంశపారంపర్యంగా లభిస్తుంది, ఇది వారి యోగ్యత ఆధారంగా ఉంటుంది. ఇది ఆమోద యోగ్యమైనది. కొందరు వేరే వారికి చెందిన దానిని తెలివిగా, ఒక రకమైన గౌరవంగా సమ్మతితో అనుభవిస్తారు అది వారి లౌక్యం, ఇది మధ్యమమైనది. కొందరు దౌర్జన్యంతో దోచుకుంటారు అది దోపిడి, ఇది హేయమైనది.

ఎప్పుడైనా ఎక్కడైనా ఆభరణాలు సంస్కృతిని చాటడానికి, విలువను చూపించడానికి, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి, అందాన్ని పెంచుకోవడానికి, గౌరవాన్ని పొందడానికి, గొప్ప అనే గర్వాన్ని ప్రదర్శించడానికి, ఇలా కొన్ని కారణాలు చేత ఆభరణాలు ప్రదర్శనలలో ఉంచబడతాయి, అప్పుడు ఆ సమయంలో ప్రదర్శనకు ఉంచిన ఆ ఆభరణాలను ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది.

కొన్నిసార్లు మనకు తెలిసిన లేదా తెలియని వాళ్ళ దగ్గర ఆభరణాలు కంటబడతాయి, అప్పుడు చూడడంలో ఆమోదయోగ్యం కాకపోయినా తప్పు కాదు. కానీ చూసినప్పుడు వారికి సోంతమైనది పొందాలనుకోవడం తప్పు. అయినా సరే నచ్చింది పొందాలి అనుకుంటే గౌరవంగా సమ్మతితో పొందాలి.

కొన్ని నగలు వ్యాపారశాల దగ్గర ఉంటాయి, అందులో కొన్నిచోట్ల ఆకర్షింపజేసేందుకు ప్రదర్శనకు ఉంచుతారు, కొన్ని చోట్ల భయం లేదా అనుమానం వల్ల ప్రదర్శనకు ఉంచరు, కానీ లోపలికి వెళ్లి చూడవచ్చు. వ్యాపారశాల్లో అనుమతితో వాటిని పరీక్షించవచ్చు, బేరసారాలు చేయవచ్చును. డబ్బు చెల్లించి సొంతం చేసుకోవచ్చు లేదా అద్దె చెల్లించి  కొంత కాలం పాటు ఉపయోగించుకోవచ్చు. చాలా కొన్ని సార్లు నచ్చితే ఉచితంగా అయినా నగలు ఇస్తారు.  వ్యాపారశాల ప్రదర్శనలు, ప్రకటనల వలన సొంతం కానీ ఆభరణాలను ఎక్కువ మంది ఉచితంగా చూసి  ప్రేరణ పొందుతారు, ఉత్సాహం చెందుతారు, ఉద్దీపులవుతారు, ఉద్రిక్తలవుతారు. ఇక్కడ పొందే వారి‌ విచక్షణ ముఖ్య భూమిక పోషిస్తుంది.

ఇలా ఆభరణాలను కొన్ని నిర్ణీత నియమాలతో చూపడంలో, చూడడంలో, పొందడంలో తప్పు లేదు. కానీ అర్హత, యోగ్యత, సమ్మతి, లౌక్యం, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవం లేకుండా వాటిని పొందాలని అనుకోవడం తప్పు, కొన్ని సార్లు నేరం కూడా.

స్థూలంగా, మనకు చెందని ఆభరణాలు, స్త్రీ అందం ప్రదర్శన కూడా ఇలాంటిదే! కానీ స్త్రీల అందం ప్రదర్శనలో స్థిర నియమాలు ఏమి లేవు. అవి వ్యక్తిగతమైనవి, వాటికి ఇష్టం, సౌకర్యం, ధైర్యం, గౌరవం, గుర్తింపు, ఒప్పందం లాంటి కారణాలు ఉంటాయి. పరిధి దాటి పొందాలనుకోవడం అత్యాశ. ఎవ్వరైనా ధైర్యం చేయాలంటే పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలి.

ఇక్కడ స్త్రీలను వస్తు రూపేణా చూపడం, స్తోమత ఉందని బహుళత్వాన్ని ప్రేరేపించడం ఏ మాత్రం నా ఉద్దేశం కాదు. ఇష్టం, సౌకర్యం, ధైర్యం, సమ్మతి, స్వేచ్ఛ, గౌరవం అనేవి నిర్వివాదంగా పరస్పరంగా ఉంటాయి. 

సున్నితమైన విషయాన్ని అర్థమయ్యే విధంగా వ్రాయాలనుకునే ప్రయత్నంలో రూపకాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ వ్యాసం వ్రాశాను.
సంపాదకీయం 
💭⚖️🙂📝@🌳
📖30.12.2025✍️



Comments

  1. బావుంది మీ వ్యాసం- సంపాదకుడు గారు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)