Toli Ekadashi (తొలి ఏకాదశి)

⚛️🪷📧

తొలి ఏకాదశి, మరియు వైకుంఠ ఏకాదశిల తెలుగు వికిపీడియా పేజీలు చదివి సంగ్రహించి కొని రాసినది ఈ వ్యాసం.
--------
మురాసురునితో యుద్ధంలో అలసిపొయి గెలవలేక విష్ణువు‌, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి యోగనిద్రకు ఉపక్రమిస్తారు. అక్కడ విష్ణుమూర్తి కంటి చూపు నుండి ఒక శక్తి ఉద్భవించింది అదే ఏకాదశి. విష్ణుమూర్తి నిద్రపోవడం వల్ల, నిద్రిస్తున్న సమయంలో ఏకాదశి జన్మించడం వల్ల శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. ఆషాడమాసంలో ఏకాదశి ఉద్భవించింది కాబట్టి ఆషాడమాసంలోనికి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు.

పుష్య శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి కంటి శక్తి (ఏకాదశి) మురాసురుని వధించి వైకుంఠం వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన ముక్కోటి దేవతలు, మరియు ఇద్దరు రాక్షసులు వైకుంఠ ప్రవేశానికి ప్రవేశం కోరగా వారిని ఆహ్వానిస్తారు. ఆలా పుష్య శుద్ధ ఏకాదశి రోజు వైకుంఠ/ముక్కోటి ఏకాదశి అయ్యింది. నా రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఏకాదశి కోరింది. విష్ణుమూర్తి తధాస్తు అన్నారు. 

ఇది నేను అర్థం చేసుకున్న పురాణ వృత్తాంతాం.
---------------------
ఏకాదశి అంటే పదకొండు. 
ఒక నమ్మకం ప్రకారంగా.... అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన ఉపవాసంతో అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ దేవునికి నివేదన చేయాలి అనేది ఓ సందేశం.

వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. వానకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. లంఖణం పరమ ఔషధం అని.. ఒక్కరోజు ఉపవాస దీక్షకు ఈ ఏకాదశి నాడు నాంది పలుకుతారు.

భక్తి నిద్ర ఉపవాసం శక్తులను ఉపోద్ఘాటించేది తొలి ఏకాదశి అని నేను భావిస్తున్నాను.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత ఆనంద అస్తిత్వం

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao