PV Narasimha Rao (పాములపర్తి వెంకట నరసింహరావు)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
పాములపర్తి వెంకట నరసింహరావు
భూ సంస్కరణల చట్టం, జాతీయ ఆర్థిక సంస్కరణలు, విద్య విధానానికి సంబంధించిన ఆయన వ్యాఖ్యలు వినయ్ సీతాపతి రాసిన "నరసింహుడు" (Half Lion) పుస్తకం నుంచి చదివినప్పుడు దాచుకున్న విషయాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
ఈ భువిని మనం నందనవనంగా మార్చలేకపోవచ్చు, కానీ మనం నడుస్తున్న బాటలో కొంతలో కొంత కుళ్ళును కడిగివేస్తూ ఉండాలి. కొన్ని ముళ్ళనైనా తొలగించగలగాలి.
భూకామందులంతా మర్రి చెట్టులా పెరిగి పోయారు, వీళ్ళ నీడలో ఇంకే చెట్లూ పెరగకూడదు అనుకుంటున్నారు. ఇలాంటి మహావృక్షాల్ని పెకిలించి, మంచి మొక్కల్ని పెరగనివ్వాలి. అందుకని ఈ నూతన భూసంస్కరణల విధానాన్ని అమలు చేస్తున్నాను (ఈ సంస్కరణల ప్రధాన బాధితుడు తనే, ఎందుకు కంటే తనకున్న 1200 ఎకరాలనీ ప్రభుత్వ పరం చేశాడు).
ఇక భారతదేశపు ఆర్థిక పరిస్థితి ఒక వ్యక్తి చిన్న దుప్పటితో తనను తాను కప్పుకోవడానికి చేసే ప్రయత్నంతో చెప్పారు. తలమీద దుప్పటి కప్పు ఉంటే కాళ్లు బయట ఉంటాయి, కాళ్లమీదకు కప్పుక్కుంటే తల బయటపడుతుంది. "కావలసిన ఆ అదనపు నిడివి కోసం అంటే ఖాళీలను పూరించడానికి మనం ప్రైవేటు రంగం నుంచి సాయం తీసుకుంటున్నాం.
ఎన్ని సంస్కరణలు చేసి ప్రైవేటును ప్రోత్సహించినా! విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రభుత్వం నిర్వహించాలి. ప్రైవేటు రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించి, తద్వారా సమకూరిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి ముఖ్యంగా విద్య వైద్యం మీద వినూత్నంగా వెచ్చించే కొత్త మార్గాన్ని అనుసరించాలి. అదే ఈ జాతీయ నవోదయా పధకం.
(ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్త అమర్త్యసేన్ తదితరులదీ ఇదే అభిప్రాయం "ప్రైవేటును ప్రోత్సహించినా! విద్య, వైద్య రంగాలను మాత్రం ప్రభుత్వం నిర్వహించాలి").
+++++++++++++++
ఈ దేశపు మట్టికి తనకు కావలసివచ్చినప్పుడు తనకు అవసరమైన నాయకత్వాన్ని నిర్మించుకునే శక్తి వుందనీ, చరిత్ర తన కథ తానే రాసుకుంటుందనీ నిరూపించిన కథనం.
ఆయనకు ఎదురు తిరిగిన వారు కూడా ఏకాంతం లు ఆయన మార్గాలను అంగీకరించారు.
ఆయన జీవితంలో సినిమాకు కావాల్సినన్ని మలుపులు, పుస్తకం రాయడానికి కావాల్సినంత స్ఫూర్తి ఉన్నాయి.
సంకలనం: ఆనాభాశ్యా
("నరసింహుడు" మరియు "బతుకమ్మ" పుస్తకం నుంచి సేకరించినది).
-----------------
©️ నమస్తే తెలంగాణా 2021 (బతుకమ్మ పుస్తకం)
మన నరసింహారావు కథ కూడా సినిమాలకు సరిగ్గా సరిపోతుంది. ఆయన జీవితంలో కావలసినన్ని మలుపులున్నాయి. బోలెడన్ని భావోద్వేగ సన్నివేశాలున్నాయి. ఊహకందని విజయాలున్నాయి. ఓ తెరకెక్కించాల్సిన జీవిత చరిత్రకు కావాల్సిన అన్ని దినుసులూ ఆయన జీవితంలో అడుగడుగునా ఉన్నాయి. తెరకెక్కించడమే తరువాయి..
ప్రధమార్ధం:
అనగనగా ఓ కుగ్రామం. అక్కడ ఓ పసిబాలుడు. చదువుల్లో మహా చురుకు. బాల్యంలోనే దత్తతకు పోయి, తన తాతల ఆస్తితో కలిపి వెయ్యి ఎకరాలకు వారసుడయ్యాడు. చదువు కోసం ఊరు దాటాడు. జిల్లాలు దాటాడు. స్వరాజ్య ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. విద్యాభ్యాసం కొనసాగించడానికి రాష్ట్రం దాటాడు, ఆ భాష నేర్చాడు. న్యాయవాదిగా తిరిగొచ్చాడు. రాజకీయ రంగప్రవేశం చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు, ముఖ్య మంత్రి అయ్యాడు. భారీ భూ సంస్కరణలకు నాంది పలికాడు. ఆ క్రమంలో తన వెయ్యి ఎకరాల భూమిను దానం చేసి సిసలైన ప్రజాప్రతినిధి అనిపించుకున్నాడు.
రాజకీయ కుతంత్రాలు పదవిని దూరం చేశాయి. అయినా, ఆయన కించిత్ వెరవలేదు. రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే అందులో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. రాజకీయాలు చాలను కొని సొంతూరుకు వచ్చేద్దామనుకున్నాడు.
ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధ మయ్యాడు. ఇంతలో ఊహించని మలుపు. ఆయన మళ్లీ హస్తినకేగాడు. ఈసారి ఏకంగా దేశానికి ప్రధానమంత్రే అయ్యాడు. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వేసుకోవచ్చు..
అ'ద్వితీయార్ధం'
సాధారణంగా రాజకీయ జీవిత చరిత్రలు కథానాయకుడు ఉన్నత పదవిని అలంకరించడంతో సమాప్తం అవుతాయి. మన నరసింహారావు కథ మాత్రం అత్యున్నత పదవి అధిరోహించిన తర్వాత మొదలైంది. ఆయన చాణక్య నీతి ద్వితీయార్ధాన్ని కన్నార్పకుండా సినిమా చూసేలా చేస్తుందంటే అతిశయం కాదు. మైనారిటీ సర్కారును నడిపించటంలో చూపిన చాణక్యనీతి కథను రసకందాయంలో పడేస్తుంది. ఇక్కడి నుంచే నాటకీయ దులుపులు మొదలవుతాయి. ఊహించని ఆటంకాలు దురవుతాయి. పదవిలోకి వచ్చేసరికి దేశంలో ఉన్న పరిస్థితులు, వాటిని ఆయన చక్క దిద్దిన తీరు.. మన నరసింహారావు శక్తియుక్తులను భావి తరాలకు పరిచయం చేస్తుంది.
నాటకీయంగా చూపించడానికి దర్శకుడు కష్టపడాల్సిన పనీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా, నిజాయతీగా చూపించగలిగితే చాలు.. ఆ సన్నివేశాలు ఊహించనంతగా పండుతాయి. నరసింహారావు పదవీకాలం పూర్తవ్వడంతో సినిమా ముగించొచ్చు.
'అదేంటి సినిమా అన్నాక. సుఖాంతం ఉండాలి కదా!' అంటారా.. ప్రజలు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా ఎలా నిర్వర్తించాలో చెబుతుంది' నరసింహారావు జీవితం. పదవి వీడి ఆయన వస్తున్న ప్పుడు ఆ కళ్ళలో భావితరాలకు మేలు చేశాననే సంతృప్తి ని క్లోజప్ షాట్లో చూపిస్తే అంతకన్నా సుఖాంతం ఏముంటుంది !!
🙏🙏🙏
ReplyDelete🙏🙏🙏🙏🙏
ReplyDelete