Shaik Akbar

12 Jun 2021
ఆ ప్రేమకు అంతు, అడ్డూ, అదుపు ఉండవు
ఆ ప్రేమకు తనువును దూరం ఉంచడం తెలీదు
ఆ ప్రేమకు చితులు, స్మృతులు ఉండవు
ఆ ప్రేమకు హంగూ ఆర్భాటాలు నచ్చవు
ఆ ప్రేమలో తుచ్ఛ నీచాలు ఉండవు

ఆ ప్రేమలో అర్థంలేని త్యాగాలకు తావుండదు

23 Jan 2019

జీవితంలో మనిషి అన్నీ గెలవకూడదు గెలుపు సంతృప్తి ఇస్తుంది కాదనలేదు కానీ పొందినదాని అవసరం అయిపోయిందనిపిస్తుంది.

ఏదైనా దొరకకుండా అలాగే మిగిలిపోతే ఆ అసంతృప్తి ప్రతి నిమిషం గుర్తొచ్చి ఆ కోరిక ఆ జ్ఞ్యాపకాలు అలాగే పదిలంగా సజీవమై ఉంటాయి ఆ అసంతృప్తి ప్రేమలో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. 

23-JAN-2019
మొదటిసారి నీ ఒడిలో తలపెట్టి పడుకున్న ఆ క్షణంలో నీలో తల్లిని చూసాను నీతో ఉన్నంతకాలం నా తల్లి లేదనే బాధను మరిచాను

నీ ప్రేమను నీ కోపాన్ని నీ లాలనను చూసిన నేను, నువ్వు నాతోనే ఉండిపోతే జీవితాంతం అదృష్టవంతుణ్ణి అనుకున్నాను

07 Mar 2021
The attractive emotions of that time are not love it's sweet feelings in the memories. Which made me happy without physically and mentally hurting her. She has given those signs and disappeared I'm saying sad thanks to her. 

I'm satisfied, I have taken two pages of sweet feelings in the book of life. The writings written so far are dedicated to her with prayers that she will be well wherever she is.

జీవితం అనే పుస్తకంలో తనివి రెండు పేజీలని, అప్పటి ఆకర్షణాపూరిత ఉద్వేగాలు ప్రేమ కాదని చెలిమి అని, స్మృతిలొని మధురానుభూతులను నెమరు వేసుకుంటూ తననెప్పుడూ శారీరకంగా మానసికంగా బాధించకుండా సంతోషంగా ఉంచాననీ తృప్తిచెందే మగతనంతొ, ఆ గుర్తులు ఇచ్చి కనుమరుగైనందుకు చెప్పుకునే బాధాతప్త ధన్యవాదాలతో, ఆమె ఎక్కడున్నా బాగుండాలని బాగుంటుందని కోరుకునే ప్రార్థనలతో ఇప్పటివరకు రాసిన రాతలు ఆమెకు అంకితం. 

సేకరణ: Shaik Akbar 
సవరణ: Bharghav Shyam

08 Mar 2022
Everytime Women Doesnt Mean 
Pink Color, Chocolates, Weakness, Teddies, Sarees, Butterflies, Long hair
But also a Heartful Human Like you

01 Jan 2022
స్నేహితుడికి ఎప్పుడూ అప్పులాగా డబ్బు ఇవ్వకూడదు. అప్పుగా ఇస్తే అది స్నేహం కాదు. అసలు బదులు కోరుకునేది స్నేహమే అవ్వదు చేతనైతే తొందరగా తిరిగి ఇచ్చే గుణం వాడికి ఉండాలి, తీసుకునేంత వరకు వీడికి ఓపిక ఉండాలి.





26 Apr 2022
జీవితగాధని చదువుతున్నంత వరకు ఆమె నాతో నేరుగా తన అనుభావాలను చెబుతున్నట్టే అనిపించింది 
సహజంగా ప్రతి వారికి ప్రత్యేకమైన భావోద్వేగాలు వుంటాయని అవి అందరికీ అర్థం కావని భావోద్వేగానికి బాహ్య ప్రపంచానికి మధ్య జరిగే అంతర్యుద్దమూ 
ఆ అంతర్యుద్ధానికి రేవతి గారు తయారైన విధానం ఆ తయారీలో అందివచ్చిన అవకాశాలు, ఆ అవకాశాల అంధకారంలో కూరుకుపోయిన జీవనం 
మనిషి తన జీవితంలో ఎటువైపు నుండి ఏ ఉపద్రవం ఎదురవుతుందో తెలినపుడు తనకంటూ ఒక గుర్తింపుకై పోరాడుతూ ఆ పోరాటంలో తనవారి నుండే ఎదురయ్యే కష్టాలను ఆమె ఓర్పుతో అనుభవించిన తీరు అభినందనీయం. పుస్తకం చదివే పాఠకుడి హృదయాన్ని కలిచివేస్తాయి, ఇన్నాళ్ళు మనలో వుంటూ మనకు ఎంతో దూరంలో బతుకుతున్న వీరి జీవన విధానాన్ని ఏమాత్రం అంచనా వేయలేము.

30 May 2017
Do not accept statements uncritically. ask questions. You may not find all the answers but you will learn more.


Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao