Nanna
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
తండ్రులందరికీ పితృ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙂🎊.
ఈ రోజు మన ప్రియమైన తండ్రి నుంచి ప్రతి తండ్రికి కృతజ్ఞత వ్యక్తపరిచే ప్రయాణం. మన జీవితంలో అంతర్లీనంగా సదా మమేకమైన మన అస్తిత్వం తల్లిదండ్రులు.
(స్వర్ణమే ఆభరణం యొక్క అస్తిత్వం. ఆభరణం నుండి స్వర్ణం తొలగిస్తే, ఆభరణం అనేది శూన్యం. తల్లిదండ్రుల్ని నుంచి/ద్వారా పిల్లలు వస్తారు, పిల్లల నుండి తల్లిదండ్రుల్ని తొలగిస్తే పిల్లలు శూన్యం. తల్లిదండ్రులే పిల్లల అస్తిత్వం.)
ప్రతిక్షణం ప్రతి కణం తల్లిదండ్రులనే అస్తిత్వంపై ఆధారపడింది. దాన్ని మనం అచేతనంగా ఆస్వాదిస్తాం. మనకు ఆధారమైన అస్తిత్వం మీద స్పృహలోకి వచ్చినప్పుడు నిశ్శబ్దంగా స్మృతిలో తలుచుకుంటాం, ఆనందంగా ఉంటాం, కానీ ఇలాంటి రోజున ఇంకా శ్రద్ధగా కృతజ్ఞత తెలుపుతాము.
-----------------------
సమతుల్య శక్తి కలిగిన స్థితప్రజ్ఞునిగా
అపేక్షలేని తనంతో అజాతశత్రువుగా
మీ పరిధిలోని ప్రపంచానికి ప్రేమను పంచే
పుణ్యాత్మునిగా ఉన్న పూజ్య పితృదేవులకు
ఆంగ్ల పితృ దినోత్సవ శుభాకాంక్షలు.
నాన్న.....
నిండైన నిర్మల నవ్వుతో
నిత్యం నీడనిస్తూ
నడుస్తూ నడిపిస్తూన్న
నిశ్చలమైన నాన్నకు......
ధన్యుడినై ధన్యవాదాలతో
💭⚖️🙂📝@🌳
📖18.06.2023✍️
Great picture 💕
ReplyDeleteBhargav...నువ్వు మంచి కొడుకువురా....నీ ప్రేమ ను చక్కగా వ్యక్తం చేస్తావు...👏👏👏
ReplyDeleteSuuuper నాన్నా god bless u
ReplyDelete♥️
ReplyDelete