సినిమా సంభాషణలు (Cinema Content)

సినిమా సంభాషణలు (Cinema Converzations)

"చెక్" సినిమా సంభాషణలు (15 May 2021)
చదరంగం కూడా జైలు గోడ లాగా నాలుగు అంచుల మధ్య  ఉంటుంది.
🐘 ఏనుగు దారి, రహదారి. అడ్డు వస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురు వెళ్లాలంటే దమ్ము కావాలి.
🐪 ఒంటె మీద ఎప్పుడు కన్నేసి ఉంచాలి. దీని ఓరా చూపుల నుంచి తప్పించుకోవాలి.
🐴 గుర్రానికి ఎప్పుడు కళ్లెం వెయ్యాలో తీయాలో తెలియాలి.
🤴 మంత్రికి బుద్ధి, జ్ఞానం, ఓపిక, వ్యూహం మొదలైన వాటితో అడుగు వేస్తాడు. ఈ చదరంగంలో అందరికంటే బలవంతుడు. 
♟️ యుద్ధం మొదలు పెట్టేది సైనికుడు, త్యాగానికి మారుపేరు ఈ సిపాయి. అడుగు ముందుకి వేయడం తప్ప వెనక్కి వేయడం తెలియదు. చిన్నగా ఉన్నాడని చిన్నచూపు చూడకూడదు. ఆదమరిస్తే రూపమే మారిపోతుంది.
👑 రాజు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. గడప దాకా ఆపద వస్తే తప్ప అడుగు వేయడు.
-ఎదురులేని ఏనుగు, ఓరచూపు ఒంటె, గంతు లేసే గుర్రం, మనో బుద్ధి అహంకారం కలిగిన మంత్రి, ముందడుగు తప్ప వెనకడుగు తెలియని సైనికులు, రాజు అతని రాజ్యం, ఈ ఏకాంతం లో చీకటి గోడల మధ్య, నా ఊహలలో నాతో నేనే రణరంగం ఆడాను. చదరంగం తో ప్రేమలో పడ్డాను.

ఇక్కడ ఏమి చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి
కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. ఆచితూచి అడుగు వేయాలి.

- ఒంటరి తనానికి ఏకాంతానికి తేడా ఉంటుంది.
ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆలోచనలకు పదును పెడితే ఏకాంతం అవుతుంది. చరిత్రలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఏకాంతం లోనే ప్రపంచాన్ని గెలిచారు.
-అ: చావే గమ్యం అని తెలిసి అడుగు ఎలా వేయాలి.
ఆ: అడుగు వేస్తే గమ్యం మారుతుందేమో.

-నేను నటించి ఓడిపోతే, తను విజయాన్ని నటించాల్సి ఉంటుంది.
-అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మను తప్పించుకోలేదు.
-మనిషికి మాయమయ్యే శక్తే ఉంటే అందరూ మాయం అవ్వాలని కోరుకుంటారు. జన్మించడం మరణించడం మాత్రమే మన చేతుల్లో ఉంటాయి, ఆ మధ్యలో అవసరానికి ఒక వేషం వేయాలి, ఇలా వేషాలు మార్చి మార్చి బతుకు భారం అవుతుంది. భారం నుంచి మాయం అవ్వాలని ప్రతి మనిషి అనుకుంటాడు!!
-నా ప్రపంచాన్ని మాయ చేసి, నా చుట్టూ తన ప్రపంచాన్ని అల్లేసింది.
-చప్పట్లు కొట్టిన చేతులు, చావును కోరుకుంటున్నాయి. 

- మనిషి ప్రేమలోని ద్వేషాన్ని, సుఖం లోని దుఃఖాన్ని, స్ఫూర్తి లోని అసూయని, తనలోని మృగాన్ని మోస్తూనే ఉన్నాడు.

- ఆవేశంలో ఆలోచనకి చోటు ఉండదు. అదే ఆవేశం ఆలోచనకి కారణమైతే తెలివికి చోటు ఉండదు
-ఏమి దిగులుపడకు దినదినానికి పరిస్థితులు మారిపోతాయి.
- ఇంత తెలివిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంత ఎత్తు ఎదుగుతావో తెలుసా ప్రపంచం ఆశ్చర్యపోయే అంతా!

- వెలుగులోకి వెళ్లాలంటే చీకటితో ఏకం అవ్వాలి.
అవధులు లేని ఆకాశం, గమ్యం లేని గాలి, సమిధలు లేని వెలుగు, ప్రవాహం ఆగని నీరు, కంచెలు లేని భూమి ఉన్న చోట ఉన్నాను. 

-నిశ్చయతు నియతిన్ భవాన్
- అహం నియతి నిశ్చామి.
-శుద్ధొసి బుద్ధొసి నిరంజనొసి.
ఈ రాతకు నీవే బాధ్యులు.

మనిషి పుట్టినప్పుడు స్వేచ్ఛ స్వచ్ఛత స్పృహతో మచ్చ లేకుండా పుడతాడు. పోయే లోపల ఒక్కసారైనా అలా ఉండాలని అని అనుకుంటున్నాను.
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"వకీల్ సాబ్"   సినిమా సంభాషణలు (25 Jun 2021)

-రాముడు అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటాడు. చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.

-కాలు కింద escalator ఉంది కదా అని నొక్కితే rules మాత్రమే కాదు bones కూడ break అవుతాయి.

-"ఆరోజు ఆ అమ్మాయి అలా కొట్టి పారిపోకుండా ఉండి ఉంటే దిశ, నిర్భయ లాగ అయి ఉండేది. అప్పుడు కడివెడు కన్నీళ్లు కార్చడానికి సమాజం సిద్ధంగా ఉంటుంది. మరో వారం రోజుల్లో అంతా మర్చిపోతారు. కానీ, ఆ పరిస్థితే రాకుండా అమ్మాయిలు ఎదురించి పోరాడితే ఇలా కోర్టుకు ఈడ్చి రచ్చ చేస్తారు"

-రాత్రులు అబ్బాయిలు బయటకొస్తే సరదా అమ్మాయిలు వస్తే తేడానా!!

-ఆడవారికైనా మగవారికైనా మధ్యం తాగడం హానికరం‌. మగవాళ్ళైతే పడిపోతారు ఆడవాళ్ళు అయితే పడుకుంటారు.

- సరే పెంచిన పెంపకం, ఉన్న సంస్కారం అలాంటిది.
జనానికి సృజనాత్మకత చాలా పెరిగిపోయింది. దానికి పన్నులు GSTలు కట్టాల్సిన పని లేదు కాబట్టి, ఎవరి ఇష్టానికి వారు ఊహించేసుకుంటున్నారు.

- జనం కోసం ఎన్నో కోల్పోయారు, కానీ మీరు దూరమై జనాలు జీవితాన్నే కోల్పోతున్నారు. మీలాంటి వాళ్ళ మౌనం శాపం కాకూడదు. 

- ఏ జనం కోసం అన్ని పోగొట్టుకున్నాడో, అదే జనం మాట మీద నిలబడ లేకపోయారు. ఎందుకంటే వాళ్ళు సామాన్యులు. ఒకరు ఇస్తాను అంటే ఆశపడతారు. బెదిరిస్తే భయపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి. వాళ్ళు నాకోసం వున్నా లేకపోయినా, నేనెప్పుడూ వాళ్ళకి అండగానే వుంటాను.

- నేను study చేయకుండా ఈ కేసు ఒప్పుకోను,  So నేను ఏ కేసు ఓడిపోను. I always want to win 
- ఎన్నాళ్లైనా ఎన్ని ఏళ్ళు అయినా ఆవేశం తగ్గదు, ఆశయం మారదు. 
- నీది ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, It's not your weakness its weapon. జాగ్రత్తగా ఉపయోగించు. ఆవేశం కన్నా ఆశయం గొప్పది.

-ఆశతో ఉన్న వాడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నవాడికి ప్రయాణం మాత్రమే. 

- పారిపోకు దాక్కోకు, ఎదురుకో ప్రపంచాన్ని. 
- నిజం కోసం నిలబడ్డప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని నిజాలు భయపడతాయి, అన్నిటికీ సిద్ధపడి ముందుకు వెయ్యి. 

-నిజం ఒంటరిదే, కానీ దాని బలం ముందు అందరు తగ్గాల్సిందే. 
- అబద్దానికి నిజానికి మధ్య కానీ అనే దానికి ఆస్కారమే లేదు. 
- ఓటమి అనేది ఎదుటి వాళ్ళు నిర్ణయించేది కాదు. మనం నిర్ణయించేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్లే. ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని  మనం గెలిచే అవకాశం.

👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"బెంగాల్ టైగర్"  సినిమా సంభాషణలు (28 Oct 2021)
-ఒక చిన్న రాయి ప్రశాంతంగా ఉన్న నీళ్లను కదిలించినట్లు, ఈ ఆరడుగుల నేను రాష్ట్రాన్ని కదిలించలేనా!!
-మనకు ఏమన్నా కావాలంటే వాళ్ళు (దేవుళ్ళను అడగాలి)
మనం ఏమన్నా కావాలనుకుంటే వీళ్ళు (గాంధీ వివేకానంద మదర్ తెరిసా)
-వ్యవసాయంలో సాయం ఉంది, Agriculture లో Culture ఉంది. ప్రపంచానికి సాయం చేసే Cultureను నేర్పింది రైతులు.

-దగ్గర అవ్వడం వేరు, దగ్గర ఉండడం వేరు.
ఈ రెండిటికీ Affectionకి Protectionకి ఉన్నంత తేడా ఉంది.
-ప్రపంచంలో వాడే కొద్దీ పెరిగేది బుద్ధి ఒక్కటే.
-ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా రంగులోనూ రూపులోనూ కాదు బుద్ధిలో ఉంటుంది.
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"భళా తందనాన"   సినిమా సంభాషణలు  (18.Jun.2022)

Journalists are watch dogs of Society. పాత్రికేయులు అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వారు. ఇంటికి దొంగ వస్తే మెరగాలి, అది విని యజమాని లేస్తాడా లేదా అన్నది తరువాత విషయం. అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనపై ఉంది. 

- వార్తలు అంటే నిజం, ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడం పాత్రికేయత్వం, కానీ ఇప్పుడు వార్తలు అంటే పాత్రికేయులు రాసిందే నిజమని జనాన్ని నమ్మించడం పాత్రికేయత్వం.

- ఎవరు స్పందించకపోతే రాయడం ఎందుకు. బెదిరింపులు లేకపోతే మనం నిజం రాయడం లేదని అర్థం. Risk is not about profession, its about Percent. 

- డబ్బు విలువ బాగా నాకు తెలుసు సులభంగా వచ్చే వారికి అది తెలియకపోవచ్చు . 
- డబ్బుతో ఏమి చేస్తామో అనేది దానికి ఇచ్చే విలువ. దీనితో వైద్యం చేస్తే దాని విలువ ప్రాణం, జూదం ఆడాం అనుకో ఒక గంట సరదా దాని విలువ. 
- Cash is the easist crime in this country.  
మాదకద్రవ్యాలతో దొరికితే 20 ఏళ్ళ జైలు శిక్ష, హత్య చేస్తే ఉరిశిక్ష పడచ్చు. అదే డబ్బులతో దొరికితే మాత్రం కొంత శాతం పన్ను కడితే సరిపోతుంది. 

- చేసేది మంచి అయినప్పుడు దానికి ప్రేరణ ఎంటి అని అడుగుతాం. అయిన చెడు చేసే వాళ్ళని ఎవరు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడగరు.
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"F3" సినిమా సంభాషణలు (28 July 2022)
- మన ఆశలే మన విలువలు. 
- తండ్రిగా నేను వాడికి ఇచ్చిన ఆస్తి విద్య మాత్రమే. 
కష్టం నిజాయతి అని నేను, Shortcuts, Smartness అని వాడు, డబ్బు విషయంలో ఎప్పుడు గొడవ పడేవాళ్ళం. 
- డబ్బు కోసం అడ్డమైన దారులు తొక్కి అడ్డంగా దొరికిపోయారు. నిజం లేని చోట సమాధానం ఉండదు, సంపాదించిన డబ్బు ఉండదు.

- నాకు అనిపించింది చేయాసింది సాయం కాదు,  ఇవ్వల్సింది జీవితం అని. 
- మీలో ఉన్న డబ్బు అనే బలహీనతను బలంగా మార్చాము.
- అస్తి మీద ఆశతో నిజాయితీగా కష్టపడి నెం1 గా సంస్థను నిలబెట్టారు. 
- మనిషి మారడం అంటే మళ్ళి పుట్టడం. మిమ్మల్ని  ఇబ్బంది పెడితేనో మీరు పడితొనే, మీరు మారుతారని ఇలా చేశాను.
- తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి, ఒడిపోతే గెలవడానికి జీవితం ప్రతిసారీ అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం తీసుకోవడానికి మనం ఉండాలి. జీవించి ఉండాలి.
-ప్రపంచంలో ఖాళీ జేబు ఉన్నవాడు ఉంటాడేమో గాని ఖాళీ బుర్ర ఉన్నవాడు ఉండడు.
- Billionaire అంటే మనకు వినబడే Billgates మాత్రమే కాదు. ఈ చిన్న బుర్ర వాడి గెలిచిన పేరు వినబడని వారు మన మధ్య చాలా మంది ఉన్నారు. అలాంటి చిన్న ఆలోచన తోనే అప్పుడు నేను, ఇప్పుడు మీరు కొన్ని కోట్లు సంపాదించారు.
- ఎన్ని కోట్లు ఉన్న మనం కొనలేనిది. ప్రశాంతమైన నిద్ర. ఆ నిద్ర నిజాయితీ ఉన్నవాడికి పడుతుంది
- డబ్బు ప్రాణం పోస్తుంది, తీస్తుంది.గౌరవం తెస్తుంది, పరువు తీస్తుంది ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మంచి చేస్తుంది, చెడు చేస్తుంది.
- ప్రపంచానికి తెలిసిన పంచ భూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది అదే మనిషి సృష్టించిన డబ్బు.
- ఒక చిన్న రంగు కాగితం, మనిషిలో ఉన్న అన్ని రంగులను బయటకు తెస్తుంది. డబ్బు ఉన్న వాడికి Fun, లేని వాడికి Frustration.
ప్రకృతితో ఎంత జాగ్రత్తగా ఉంటామో, డబ్బతోను అంతే జాగ్రత్తగా ఉండాలి.
Everybody should learn to Respect Money
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"రాజరాజచోరా"  సినిమా సంభాషణలు (20 Sept 2022)
నీకు ఉపయోగపడుతుందా లేదో తేలిదు కానీ నాకు అర్ధం అయ్యిదైతే.... చిన్నదైనా, పెద్దదైన చెప్పడానికి నిజం ఒకటే ఉంటుంది. ఎన్ని కాపీలు తీసినా అసలు అసలే, నకిలీ నకిలే. నకిలి చుపించుకోవడానికి ఉపయోగపడుతుందెమో కాని చెల్లదు. 
ఈ తప్పు చేయలేదు, కానీ అప్పుడు తప్పు చేశా, దానికి శిక్ష ఎవరు అనుభవించాలి. నేనే కదా! అందుకేనేమో ఇన్నాళ్లు పొలిస్ స్టేషన్ చుట్టు తిరగాల్సి వచ్చింది.
ఎప్పుడూ అయిన విషయం నలుగురి ముందరకు వచ్చిందంటే వాళ్ళ వాళ్ళకే మద్దతు ఇస్తారు.
ఏమి లేనివాడికి పెద్ద పోయేదేమి ఉండదు.
బటన్ నొక్కితే పని చేసే మిషన్ లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి.
అనుమానం లేకపోతే ఎపనైనా బలంగా చేస్తాం.
నువ్వు చెబితే నిజంలా ఉంటుంది. వేరే వాళ్ళు చెబితే మోసం లా ఉంటుంది.
----
ఏం సాధించావ్ అయ్యా?
దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావ్, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్ప పడ్డావ్, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావ్, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని అడిగారు బోయవాడిని.
మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమం లో వాల్మీకి మహర్షిగాహ అయ్యాడు 
దోపిడీ అంటే కేవలం దొంగతనాలేనా?
నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే ! కానీ నిన్ను నువ్వు చేస్కునే మోసం?
నువ్వు చేయగలిగే పని మానేసి డబ్బుకోసం ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రాకులాడడం దోపిడీ కాదా?
డబ్బు మీద వ్యామోహం తో నీ బాధ్యతలను విస్మయించడం దోపిడీ కాదా?
అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు వీటికన్నా నీచమైన దోపిడులు ఉన్నాయా ?
సంసారాన్ని సవ్యంగా చూస్కోకుండా గుడుల చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊర్లు తిరగడం ఎవర్ని ఉద్దరించినట్టు, ఇది ఒక విధమైన దోపిడీ నే…
ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీ కాకపోవచ్చు అందుకే తప్పు అని గమనించడమే కష్టం, ఇంకా శిక్ష సంగతి దేవుడే ఎరుగు.... కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునే వాళ్ళు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే“
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"కార్తీకేయ"  సినిమా సంభాషణలు (05 Oct 2022)
- నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం.
- ఇది నా చేతికెందుకొచ్చిందో నాకు తెలియదు, దీని వెనకున్న భాగవతమెంటో కూడా తెలియదు కానీ, నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది, అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది.
-నా కోరికే, నా అర్హత.
- మనకి కనిపించడం లేదు అంటే, మన కన్ను చూడలేకపోతుందని అర్దం. లేదని కాదు.
- విశ్వం ఒక పూసలదండ, ప్రతీదీ నీకు సంబందమే, ప్రతీదీ నీమీద ప్రభావమే సౌర కుటుంబం నుండి సముద్రగర్భం వరకు అంతా ఒక దారమే.
- ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండి తీరుతుంది. ఒక వేళ సమాధానం లేని ప్రశ్న ఐతే, సమస్య ప్రశ్నది కాదు … ప్రయత్నానిది.
- మన చరిత్ర ఎలా బ్రతకాలో మరిచిపోయిన మనకి, ఇలా బ్రతకాలి అని గుర్తు చేస్తుంది.
- ఇది నువ్వు ఆపలేని యాగం, నేను సమిధని మాత్రమే, అధ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే, దానిని పొందగలవు.
- కృష్ణుడు ఒక చిన్న విషయం అనుకుంటున్నవా, అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహాచరిత్ర.

శ్రీ కృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి,మనిషికి నేలకి దూరం చేయద్దు. ఆయన అపర మేదావి, ఉన్నత విలువులతో జన్మ తీసుకుని, ఈ నేలమీద నడిచిన మనిషి, అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం.

-గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువెవరు.
-రక్షణ కోసం సముద్రం మద్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప Architect ఎవరు.
-చూపుతోనే మనసులోని మాట చెప్పే అతని కన్నా గొప్ప Psychologist ఎవరు.
- వేణుగానంతో గోవుల్ని, గోపికల్ని కట్టి పడేసే అతని మించిన Musician ఎవరు
-విద్యారోగ్యంతో వుండే సూచనలు చెప్పిన అతనికి మించిన గొప్ప డాక్టర్ ఎవరు
- ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు.
-కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు ఎవరు.
-హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా పకృతిని అర్దం చేసుకున్న climatologist ఎవరు. 
-Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని నియంత్రించే అతని మించిన Kinetic engineer ఎవరు. 
అతనొక Writer, Singer, warrior.. what not he is everything, His aura is eternal, He is more than God to me, I worship his excellence

-దేవుని పూజించడం కన్నా అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
"కవిసామ్రాట్"  సినిమా సంభాషణలు (10 Dec 2022 )

అమ్మ ధైర్యం కోసం విభూతి రాసింది 
నాన్న నమ్మకంతో మాత్ర వేసాడు. 
కానీ ఆ ధైర్యం నమ్మకం రావలసింది నీలో. 
జ్వరం తగ్గిలని కొరుకొకు, తగ్గిపోవాలి అనే సంకల్పించుకో తగ్గి తీరుతుంది.

ఆశ జాతకన్ని నమ్మేలాచేస్తుంది
కోరిక దేవుడిని నమ్మేలాచేస్తుంది
బాద మనిషిని నమ్మేలాచేస్తుంది
కానీ ధైర్యం ఒకటే 
నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది..

ప్రతి దానినీ అనుభవంగా తీసుకోవాలి.. మనసుకు తీసుకోకూడదు..

"నిన్ను నేను అవమానిస్తే అక్షరాన్ని ఎందుకు తక్కువ చేస్తావు. అక్షరం అనేది నీకన్న, నాకన్న గొప్పది, అనుభవమే అక్షరం అవుతుంది.. ఎంత గొప్ప అనుభవాలను పోగేసుకోగలేగితే అంత గొప్పగా అక్షరాలను పేర్చగలం. అక్షరాల్ని పదంగా, పదాల్ని వ్యాక్యంగా రాయడం కాదు... ప్రతి వాక్యాన్ని కావ్యంగా రాయడం ప్రజ్ఞ.  ఒక్క రచయిత తను వాడిన పదాల్ని బట్టి తన స్థాయి తెలుస్తుంది."

మనసులో ఉన్న మాట నోటి దగ్గర ఆపేయండి. నోరు దాటి బయటికి వస్తే నేను మీ నాన్నకి ఉన్న రుణం, నేను చేసిన సాయంగా మారిపోతుంది. దాన్ని రుణంలాగే ఉండనివ్వు.

సన్మానాలు సత్కారాలు ఎవరికి వాళ్ళు చేసుకునేవి కాదు. మనలోని కళను గుర్తించి కళాకారునికి చేసేది.
👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------
Puri Jagannath's Letter (30 Dec 2022)

SUCCESS AND FAILURE, ఈ రెండూ OPPOSITE అనుకుంటాం, కాదు. ఈ రెండూ FLOW లో ఉంటాయి. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి. 

గుండెల నిండా ఊపిరి పిలిస్తే బతుకుతామని అనుకుంటాం. కానీ వెంటనే చెయ్యాల్సిన పని ఏంటి ? ఊపిరి వొదిలెయ్యటమే. పడతాం, లేస్తాం. ఏడుస్తాం, నవ్వుతాం. 

ఎన్నో రోజులు ఏడ్చాక NEXT జరిగేది ఏంటి ? పగలబడి నవ్వటమే .. ఇక్కడ ఏదీ PERMANENT కాదు .. లైఫ్ లో మనకి జరిగే ప్రతి సంఘటనని మనం ఒక EXPERIENCE లా చూడాలి తప్ప, FAILURE SUCCESS చూడకూడదు. 

నడిచా, మెట్లు ఎక్కా, పడిపోయా, కాలుజారింది, నదిలో పడ్డా, కొట్టుకుపోయా, వడ్డుకు చేరా, ఇంట్లో తిట్టారు, వూరి వేలేసింది, ఉరేసుకోవాలనిపించింది, ఎవడో కాపాడాడు, వాడు నేను కౌగిలించుకున్నాం, వాడే మోసం చేసాడు, ఇలా ఎన్నెన్నో జీవితంలో జరుగుతుంటాయి. అవన్నీ సీన్లే. 

అందుకే లైఫ్ ని సినిమా లా చూస్తే, SHOW అయిపోగానే మర్చిపోవచ్చు. మైండ్ కి తీసుకుంటే మెంటల్ వస్తాది. SUCCESS ఐతే డబ్బులొస్తాయి. ఫెయిల్ ఐతే బోలెడు జ్ఞానం వస్తాది. SO ఎప్పుడూ మనం MENTALLY, FINANCIALLY GAIN అవుతూనే ఉంటాం తప్ప, ఈ ప్రపంచంలో మనం కోల్పోయేది ఏదిలేదు. అందుకే దేన్నీ FAILURE గా చూడొద్దు. 

BAD జరిగితే మన చుట్టూ ఉన్న BAD PEOPLE మాయమైపోతారు .. వెనక్కి తిరిగి చూస్తే ఎవడు మిగిలాడో తెలుస్తుంది. మంచిదే కదా ? కానీ ఖాళీగా ఉండకూడదు. ఏదోకటి చెయ్యాలి .. అది రిస్క్ అవ్వాలి. LIFE లో RISK చెయ్యకపోతే అది లైఫే కాదు. ఏ RISK చెయ్యకపోతే అది ఇంకా RISK. 

LIFE లో నువ్వు హీరో ఐతే, సినిమాలో హీరో ఎన్ని జరిగాయో అవన్నీ నీకు కూడా జరుగుతాయి. పొగుడుతారు, నిందిస్తారు, బొక్కలో వేస్తారు, మళ్ళీ విడుదల చేస్తారు, అందరూ CLAPS కొడతారు, అక్షింతలు వేస్తారు. 

So ఇవన్నీ మీ LIFE లో జరగకపోతే, జరిగేలా చూడండి. లేకపోతే మీరు హీరో కాదేమో అనుకొనే ప్రమాదం ఉంది. అందుకే మనం హీరో లా బతకాలి. బతకాలి అంటే నిజాయితీగా ఉండాలి. నేను నిజాయతి పరుడుని అని చెప్పుకొనవసరంలేదు. నిజాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. నిజాన్ని నిజమే కాపాడుకుంటుంది. TRUTH ALWAYS DEFENDS ITSELF.

ఎవరినుంచి ఏదీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పొతే మనలన్ని పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడైనా మోసం చేస్తే, దగా చేస్తే అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న AUDIENCE ని తప్ప నేను ఎవరినీ మోసం చెయ్యలేదు. ACTULLY IM LIABLE TO MY AUDIENCE. మళ్ళీ ఇంకో సినిమా తీస్తా . వాళ్ళని ENTERTAIN చేస్తా. ఇక డబ్బు అంటారా? చచ్చినాక ఇక్కడనుండి ఒక్క రూపాయి తీసుకెళ్లిన, ఒక్కడి పేరు నాకు చెప్పండి, నేను దాచుకుంటా. ఫైనల్ గా అందరం కలిసేది స్మశానంలోనే.. మధ్యలో జరిగేది అంతా డ్రామా..

- మీ పూరి జగన్నాధ్

👁️‍🗨️👌🔖♻️@🌳

-----------------



Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao