పోస్ట్‌లు

Nikhil Kumar Birthday (Telugu 29.06.2025)

చిత్రం
⚛️🪷🌳 రోడమిస్ట్రి రథంపై సామాజిక కార్యాక్రమ  విద్య విషయంలో  ఉత్తీర్ణుడవై ఉండి, వెను వెంటనే  టిస్ టంకారంతో గ్రామీణాభివృద్ధిపై గొప్పగా నేర్చుకొని, నేరుగా  కొన్ని కోట్ల మంది కలలు కనే కేంద్ర ప్రభుత్వ కొలువుకై నిర్వహించిన, నెహ్రూ  యువకేంద్రకై యుక్తి పోటి పరిక్షలలో పాసై డిగ్రీ నుండి ఢిల్లీ  వరకు వెళ్ళి  మౌఖిక ముఖాముఖిలో  ఉత్తమంగా ఉత్తీర్ణుడై ఒడిస్సా ఒడిలో  ఉన్నత ఉద్యోగిగా  ఎంపికై ఎదిగి ఎగురుతూ విజయం వినయం కలిసి కుదురుకుని బాబా భక్తుడివై ఒదిగున్న నిర్మలమైన నిఖిల్ నీకు  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖29.06.2025✍️

Ashwin Birthday (Telugu 24.06.2025)

చిత్రం
⚛️🪷🌳 (అందరు = మా పూర్వ తరగతి సభ్యులు అందరూ) (రోమిక- రోడా మిస్ట్రి కళాశాల) అశ్విన్ తో అందరూ ఇప్పుడు ఇలా  మౌనంగా మాట్లాడుకుంటున్న  అశ్విన్ అనగానే అందరికీ ఘనమైన గతం గుర్తులు కలిగి కొనసాగుతున్న  వారందరం మనం.  రోమిక రోజులలో  ఆలస్యంగా ఆరంభమైన  మా మధ్య  స్నేహం, సానుకూలంగా సాగుతూ నిన్ను తెలుసుకుంటూ  నేను తన్మయత్వం చెంది చిద్విలాసుడనైనాను.  నోట్లో నాలుకగా తరగతి తరుపున తిరిగావు విద్యార్థి దశలో విలువైన దిశగా  ఇతరులకై ఇమిడి అందరికీ ఆప్తుడై  అందరితో అనుసంధానమై స్థిరంగా స్థిమితంగా సాగావు  కష్టాలలో, కమ్మని  మాటలతో మెల్లగా  భయం నుంచి బయటపడేసి మమ్మల్ని ఎత్తిచూపకుండా   మాకై ఎదురునిలిచి  సంకల్పంగా సాగావు. కేరళ క్షేత్రానికి  సాగిన సుదూర  ప్రయాణంలో ప్రజ్వలించిన  అనుభవాలు ఆనందమయం. గుర్రపుతాండా గ్రామీణ  బసకై భవదీయులందరితో కలిసి కొనసాగిన కార్యక్రమాలలో జ్ఞాపకాలు జ్ఞప్తికి  వచ్చినప్పుడు వచ్చే  అనుభూతులు అద్వితీయం.  భాగ్యనగరంలో బాలవిద్య నుండి  బ్రహ్మచార పట్ట భద్రత,  టిస్ టైంలో కృషితో...

Dreams & Delay (Telugu 20.06.2025)

చిత్రం
⚛️🪷🌳 లక్ష్యానికి లంకించే లక్షణం కలిగి కొనసాగే క్రమంలో  మన బీజాలు, భయం మూలాన  వాయిదాల వలన సామాజిక మాధ్యమాలు సరసన  పడి పడిపోతున్న  బరువైన ఈ బాటలో  అడ్డంకులను అధిగమించాలని ఆలోచన సంకల్పించినంత సులువుగా సాగకున్న ఓర్పుతో ఓటమిని ఒప్పుకోకుండా  నిదానంగా నైనా నిలిచి  నిర్మలంగా నడవాలని  కోరుకుంటూ కొనసాగుతున్నాను. 💭⚖️🙂📝@🌳 📖20.06.2025✍️

Ahmedabad Aeroplane Accident (Telugu 12.06.2025)

చిత్రం
⚛️🪷🌳 విమానం విహంగమైన  వెంటనే వైఫల్యం వల్ల  వైద్య కళాశాలపై కూలి వందల్లో  ప్రయాణికులు వారి ప్రాణాలు  కోల్పోవడం విషాదం కలిగిస్తోంది.  ఓం శాంతి శాంతి శాంతిః  💭⚖️😐📝@🌳 📖12.06.2025✍️

Dhruti Naming Ceremony (Telugu 08.06.2025)

చిత్రం
⚛️🪷🌳 స్వాతిఅభిరామ సుపుత్రికగా  మాధవి మల్లికార్జున, సుధ ప్రకాశ్ పౌత్రురాలిగా, ప్రేమతో మేనకోడలిగా అఖిల చైతన్యల, మేనమామ భార్గవ మధుర మమతలతో బుజ్జి బంగారం అంటూ అందరి  ఆశీస్సులను, ఆప్యాయతను  ఆనందంగా అందుకున్న  నేను, నా నామకరణ మహోత్సవానికి మిమ్మల్నందరిని "కడప"కు కుతూహలంగా ఆనందంతో ఆహ్వానించి  వేడుక వేళ ధృతిశ్రీ నామ ధారణతో  పేరును  ప్రకటించారు 💭⚖️🙂📝@🌳 📖08.06.2025✍️

Hyper Aadi (Telugu 06.06.2026)

చిత్రం
⚛️🪷🌳  ⚡హైపర్ ఆది 🌞  😁 హాస్యపు ఆనందం 🙂 ఫేసుబుక్‌లో పవన్ కళ్యాణ్ అత్తారింటికిదారేది అనే అనుకరణాత్మక లఘుచిత్రంతో లీలగా  అదిరే అభికు దగ్గరై, దక్షతతో నీడన నడిచి  జనరంజకమైన జబర్దస్తులో  ప్రవేశం పొంది, రిక్షా లాగుతూ  హాస్య ప్రహసన (కామెడీ స్కిట్)ల వేదికపై వచ్చి  కొద్దిసేపు కనపడి  కనుమరుగై, క్రమంగా బహుముఖ ప్రజ్ఞా బ్రహ్మానందం  “అతడు” సినిమా స్ఫూర్తితో కష్టంతో కృషిగా ప్రస్తుత పరిస్థితుల సహజమైన సామాజిక అంశాలతో అనుకూలంగా  రసజ్ఞతమైన రచనలు రాసి చక చకా చమత్కారపు  ప్రాసల పదాలు పలుకుతూ హైపర్ ఆది  బిరుదుతో భవ్యంగా రైసింగ్ రాజుతో బృందనాయకుడై బ్రహ్మాండంగా సమూహాన్ని సృష్టించుకుని సమతుల్యంతో సమన్వయంగా  పేల్చే పలుకులు (పంచులు) అదరహో అనిపిస్తుంది.  తనుకు తాను తయారుచేసిన  స్వంత సంపాదకీయం(స్క్రిప్ట్)లో  మొదట మోసం చేయాలనుకుని  మొదటికే మోసపోయేవిధంగా చూపిస్తూ నిగూఢంగా నైతికను  నేర్పించే నేర్పరి. తారస్థాయికి వెళ్లిన  తనతోటి వారికి   ఉద్దీపనగా ఉండడం  పెద్దవాళ్ల పక్కన వినమ్రంగా వుండడం అద్భుతంగా అభినందించే ...

Letter to ICC & BCCI (IPL) English (05.06.2025)

చిత్రం
⚛️🪷🌳 Dear ICC - International Cricket Council & IPL - Indian Premier League  I want to propose an new approach i;e introducing a medal system to replace the traditional 1st to 4th position rankings. And also want to upgrade the previous positions with new medal system. This system will elevate the prestige and competitiveness of ICC tournaments, including the World Cup, World Test Championship, Champions Trophy, and T20 World Cup. The ICC Medal System- A Symbol of Excellence: Gold Medal:  Awarded to the winner of each tournament, symbolizing the ultimate achievement in international cricket. Silver Medal:  Presented to the runner-up, acknowledging their exceptional performance and sportsmanship. Bronze Medal: Awarded to the third-placed team, recognizing their outstanding efforts and dedication. Copper Medal:  Awarded to the Fourth Placed team in Tournament.  Benefits of the ICC Medal System Enhanced Prestige: Medals will add a new level of prestige to ICC...

RCB: Rajat, Kohli & Co. (Telugu 03.06.2025)

చిత్రం
⚛️🪷🌳 పద్దెనిమిది సార్లు పడిన, పోటీగా  పతాక స్థాయికి ప్రయాణం సాగించి నిదానమైన నిశ్చయంగా నిలిచి  నిరీక్షణను నిలిపి నిర్మలంగా,  భావోద్వేగ భావాలను  మలచి మురిపెంగా బాగా బాధి భవ్యంగా  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు  రజత్ అడుగుజాడల్లో రూపొందిన ఆటలో  కొనసాగుతున్న కోహ్లీ కోసం కృషితో కష్టపడి కప్పును కుతూహలంగా  అందుకున్న ఆనందంతో వున్న వారికి  హార్దిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖03.06.2025✍️ బెంగళూరులో బాధ  కలిగించిన ఆ కుతూహల  సందర్భమున సంభవించిన తొక్కిసలాటలో పోయిన  ప్రాణాలను తలచుకుంటూ  చీకుచింతా చెందుతున్నాను  ఓం శాంతి శాంతి శాంతిః 💭⚖️😐📝@🌳 📖04.06.2025✍️

Vivekananda Kendra PKPS (Telugu 29.05.2025)

చిత్రం
⚛️🪷🌳 భక్తితో బొమ్మలను  ఘనంగా గీసిన  చిత్రకారిణికి చిద్విలాసంతో  ఆదర అభినందనలు    💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ------- Standing people:   Surabhi didi, Bhagyalakshmi aunty ji, Amaresh ji, Arun ji,  Hari prakash ji, Srinivas ji,  Mukesh ji, Radhakrishna ji,  Bhargav ji,  Ravi ji. Sitting people: Rishita akka, Uma akka, Matru shree akka, Hindu akka, Snehalata akka, Sahil, Anish, Nithin. ------- కేంద్ర కార్యక్రమాలలో ఆత్మీయతతో అమ్మలు  అందించిన ఆహారం  అన్నిరోజులు ఆరగిస్తూ  అందిన ఆనందంతో  కృతజ్ఞతగా కుతూహలంతో  తీసుకున్న తాదాత్మ్య  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ -------- ఉన్నత ఉద్యోగులుగా ఉంటూ/ఉండి  విరామం తీసుకుని/విశ్రాంత తనంలో  యశస్సు గడించి మరచి మరి  యోగ గురించి మరింత మీమాంసతో తెలుసుకోవాలనే తాపత్రయంతో  వివేకానంద కేంద్ర కౌశలానికి వచ్చి పిల్లలైన పెద్దవారు  హరి ప్రకాష్ గారు/రాధాకృష్ణ గార్లలో  చక్కని చిత్రం 💭⚖️🙂📝@🌳 📖29.05.2025✍️ ----- సద్వినియోగంగా సమయాన్ని  సార్...

NTR Birthday (Telugu 28.06.2025)

చిత్రం
⚛️🪷🌳 నటన తారా రాజు నట తత్త్వ రమణీయత నందమూరి తారక రామారావు తెలుగు తెరకు తేజస్సు  తెచ్చిన తాత్త్వికుడు  తలుపులు తెరిచిన  నిండైన నటనా నిఘంటువు.. అశేష అభిమానుల్ని అందుకుని అలరించిన అలనాటి అభినయం రాజకీయాల్లో రాణించిన  సంక్షేమ స్వాప్నికుడు NTR 💭⚖️🙂📝@🌳 📖 28.05.2025✍️

Rama Narasimhulu Marriage (Telugu 23.05.2025)

చిత్రం
⚛️🪷🌳 కళ్యాణం కుదిరిన కుతూహలంతో  పెళ్లి పత్రికతో   ఆహ్వానాన్ని అందించడానికి  వచ్చిన వాడు  నా నేస్తం  రామ నరసింహులుకు  అభినందనలను అందించి  తర్వాత తీసుకున్న చిత్రం‌.  💭⚖️🙂📝@🌳 📖23.05.2025✍️

Vivekananda Kendra Summer Camp (Telugu 22.05.2025)

చిత్రం
⚛️🪷🌳 వివేకానందకేంద్ర తరపున  వ్యక్తిత్వవికాస తరగతులకు స్వచ్ఛందంగా సూర్య  నమస్కారాలు నేర్పించడానికి వేసవి శిక్షణ శిబిరానికి వెళ్లి  నేర్పించి నేర్చుకొని  పిల్లలు పంచిన‌  ఆనందంతో ఆహ్లాదంగా  ఇరవై మూడు రోజులు  ఇప్పుడు మిగిల్చిన రమణీయ  జ్ఞాపకాలను జప్తూ జేయగలిగే చక్కని చిత్ర ఇతివృత్తం ఇది.  💭⚖️🙂📝@🌳 📖22.05.2025✍️

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

చిత్రం
⚛️🪷🌳 విరాట్ వీడ్కోలు వర్ణించడానికి  పదాలు పలకలేకపోతున్నాను కానీ క్రికెట్టుకు మించి, ఓ మంచి మహా మనిషి  ------ శ్వేతవస్త్రంలో శౌర్యంగా  క్రికెట్ క్రీడా క్షేత్రమున పొరాట పటిమతో  నిదానంగా నిలకడగా  పరాక్రమంతో పరుగుల  ప్రవాహం పారించి  మైదానంలో మార్గదర్శిగా  సహచర సభ్యులకు స్ఫూర్తిగా జ్వలించే ఆ జయగర్జనుడు విరాట్ కోహ్లీ వీడ్కోలుకు  భావోద్వేగంతో భావాలను  విచారంతో వ్యక్తపరుస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

Naresh - Sailaja Marriage (Telugu 11.05.2025)

చిత్రం
⚛️🪷🌳 నరేషన్న నీ నీడలో నడిచే  అర్ధాంగి అడుగుపెడుతున్న  సందర్భంలో సంతోషంగా  వివాహ వేడుకకు  హార్దిక హృదయపూర్వక  శోభమైన శుభాకాంక్షలు.. కుదిరిన కళ్యాణంలో కన్యాదానం కుతూహలంగా పొంది  శైలజా శకంతో  శైలిగా నీ జీవితం జాబిల్లి జ్ఞాపకంగా  మారుతుందని మనసులోననుకుంటూ అక్షరాన్ని అందుకుని  మరో మారు పెళ్లి పండుగ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖12.05.2025✍️

1) Rajeshwari Pedda Amma (Telugu 10.05.2025)

చిత్రం
⚛️🪷🌳 పాతపాటి నుండి పలుకూరికి పెళ్లితో పయనమైన  భర్తకు భరోసాగా,  పుట్టింటికి ప్రాముఖ్యతనిస్తూ పుత్రికలను పరివారాన్ని ప్రవృత్తిని  అద్భుతంగా అనుసంధానం చేసి  కిరణక్క కల్పనక్కలకు  విద్య వికాస విషయాల వంటి వాటిలో శిక్షణ ఇస్తూ, శిక్షకురాలిగా విశేషమైన వృత్తిలో విద్యార్థులకు  ఉతంగా ఉంటూ ఉన్నతంగా  పాఠశాలలో పాఠాలతో  విషయాలను విశేషంగా  నేర్పించి నేపథ్యాన్నందించి ప్రేరేపించిన పెద్దమ్మ  హార్థిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖10.05.2025✍️

Ramesh Jyothi (Marriage) (Telugu 08.05.2025)

చిత్రం
⚛️🪷🌳 పరిచయ ప్రయాణం  ప్రేమై పరమానందంతో  కళ్యాణాన్ని కుతూహలంగా  స్థిరమైన సరళ సరళిలో  సఫలమైన స్నేహానికి సాక్షిగా  పెళ్లి పీటలపై పెళ్లయిన  వధూవరులను వీక్షించి  దాంపత్య దారిలో ధైర్యంగా అడుగులిడే ఆలుమగలును  అభినందించి ఆశీర్వదించి అనంతరం, ఆంధ్రజ్యోతి  సహఉద్యోగులతో సరదాగా  తీసుకున్న తీపిచిత్రం.  💭⚖️🙂📝@🌳 📖08.05.2025✍️

Operation Sindoor (Telugu 07.05.2025)

చిత్రం
⚛️🪷🌳 పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు హరించిన  ఉన్మాద ఉగ్రవాద తీవ్రవాదులు తీరుకు  ప్రతిఘటనగా ప్రభుత్వం  ఆరంభించిన ఆపరేషన్  సింధూర్ ను సాయుధ బలగాలు బాధ్యతాయుతంగా  పాకిస్థాన్ పౌరులు &  సైనిక స్థావరాలపై  కాకుండా కేవలం ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదంతో  వ్యవహరిస్తూ వస్తున్న  సైన్యానికి సంపూర్ణ  మద్దతుగా మాట్లాడుతూ  జై జవాన్ అంటూ జేజేలు  పలుకుతున్నాను  💭⚖️🙂📝@🌳 📖07.05.2025✍️

Pandu Gari (VIP) Birthday (Telugu 06.05.2025)

చిత్రం
⚛️🪷🌳  ఆంధ్రజ్యోతిలోకి ఆనందంగా ప్రవేశించి ప్రవాహంగా  ప్రకటనలను ప్రీతిగా పోటీగా  రమణీయంగా రచిస్తూ  అలకరాని, అలసిపోని  అనువాదాన్ని  అందించే అస్తిత్వం వేముల పాండుగారికి హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పర్వదినాన శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖06.05.2025✍️

Kumarswamy Birthday (Telugu 05.05.2025)

⚛️🪷🌳 జన్మదినాన్ని జరుపుకోకుండా  పుట్టిన పర్వదినాన్ని  సాధారణమైనదిగా భావించే  స్థితప్రజ్ఞ్య భావనతో వయసులో పెద్దవాడైనా పసివాడిగా వికసిస్తూ  బాబాయ్ ని బబ్బిగా  పిలిచే పిల్లవాడు కానీ పిల్లవాడు  యవ్వనంగా కనిపిస్తూ  యుక్తంగా కదిలే  కుమారస్వామి అన్నకు  కుతూహలంతో అక్షరరూపంలో హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు.  💭⚖️🙂📝@🌳 📖05.05.2025✍️

Viewer-ప్రశాంత ప్రేక్షకుడిని (Telugu 20.04.2025)

⚛️🪷🌳 నేను అజేయుడని కాదు, విజేయుడను కాదు, పరాజేయుడను కాదు, అసలు పోరాట యోధుడునే కాదు నేను ఒక ప్రశాంత ప్రేక్షకుడిని.  విజయం వల్ల కలిగే విలాసాలు వైఫల్యం వల్ల కలిగే విషాదాలు  విలీనం చేసి వీక్షీంచే వాడిని 💭⚖️🙂📝@🌳 📖20.04.2025✍️

My Impact (Telugu 20.04.2025)

⚛️🪷🌳 నా ప్రతికూల ఆలోచనలను ఎవ్వరూ చూడలేరు (అసలు ఏ ఆలోచనలు నా నియంత్రణలో లేనివి) కానీ దాని ప్రభావం నా పైన ఉన్న  కానీ  మాటలు నా పరిధిలో ఉండేవే నా మాటలు వినగలరు, దానికి  నా విచక్షణ తోడుగా ఉంటుంది అందుకే మంచివాడిగా చలామణి అవుతున్నాను.  అలాగని నేను పూర్తిగా ప్రతికూలమైన వాడిని కాదు,   నకిలీ మనిషిని అంతకన్నా కాదు సాధారణమైన వాడిని,  ఉత్సాహంతో ఉద్వేగంతో కొన్నిసార్లు తెలిసి తెలియక కొన్నిసార్లు తప్పులు చేసేవాడిని,  ఒప్పుకునే వాడిని దాచుకునేందుకు దిద్దుకోనేందుకు ప్రయత్నించే వాడిని. 💭⚖️🙂📝@🌳 📖19.04.2025✍️

Train Window (Telugu 20.04.2025)

చిత్రం
⚛️🪷🌳 వెలుపలి నుంచి వెలుగును వేగంగా వీచే గాలిని గణనీయంగా  రప్పించే రైలు కోచులోని కిటికీ  సమీపాన సంతోషంగా కూర్చుని కంటికి కనిపించే  నీలాకాశం, నేలపై పచ్చని పైరు చూస్తూ చిద్విలాసంగా చింతనతో  తోటి ప్రయాణికుని ప్రతిఫలంగా తీసుకున్న  తాజా తాదాత్మ్య చక్కని చిత్రం  💭⚖️🙂📝@🌳 📖20.04.2025✍️

On Waiting to Write (Telugu 31.03.2025)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము అలసిన అక్షరాస్యుడనై అలసటను అంటించుకోక  ఆశతో ఆలోచనలను  ఆలకిస్తు, అక్షరాన్ని  అందుకోవాలని అనుకుంటున్నాను 💭⚖️🙂📝@🌳 📖31.03.2025✍️

Karnakar-Akhila Marriage (Telugu 16.02.2025)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము అఖిల నీకు అందిన నక్షత్రం నీ భాగ్య భాగస్వామి తను అనుబంధాన్ని అందాన్ని  ఆనందాన్ని అందించే అర్థాంగిగా అదృష్టం అవుతుంది అనిపించింది. తల్లి తండ్రులు తలిచి తెరిచిన తొలి పరిచయ పలకరింపుతో ప్రేమ ప్రయాణం ప్రారంభించి కళ్యాణంతో కలిసిన  భార్యాభర్తలగా బాధ్యతలు  పంచుకుని ప్రేమ పెంచుకుంటూ  సంతోషంతో సాగాలని కోరుకుంటున్నాను కర్నకర్ 💭⚖️🙂📝@🌳 📖16.02.2025✍️ కృష్ణగారి కారులో  కర్ణాకర్ కళ్యాణం  కోసం కదిలిన  కార్యాలయ కుతూహలం  (సభ్యుల సంతోషం). 💭⚖️🙂📝@🌳 📖16.02.2025✍️