Poem on Past Memories (Telugu 22.07.2025)
⚛️🪷🌳
గడచిన గత
క్షణాల కాలం
మధురంగా మురిపించాయి,
అవి మళ్లీ మన ముందుకు
తిరిగి రావని తెలిసిన,
జ్ఞాపకాలు జ్ఞప్తికి
వచ్చినప్పుడు వచ్చే
భావనలు భలే
ఊతంగా ఉంటాయి.
ప్రస్తుతంలో వారు ప్రత్యక్షంగా
కనిపించినప్పుడు కలిగే
భావనలు భవ్యంగా
మనసుని మురిపెంగా
చల్లబరిచే చినుకులై
తడిపి తాదాత్మ్యం
చేసి చిద్విలాసాన్ని
కమ్మగా కలిగిస్తాయి.
💭⚖️🙂📝@🌳
📖22.07.2025✍️
------
మన జీవితంలో గడిచిన మధుర క్షణాలు మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన జ్ఞాపకాలు ఎప్పటికీ మధురంగా మన హృదయంలో పదిలంగా ఉంటాయి.
గత స్మృతులు భావోద్వేగాలను కేవలం నియంత్రించగలవు. కానీ ఆ భావోద్వేగాలకు సంబంధిత వ్యక్తులను ప్రస్తుతంలో కలవడం వల్ల మనసు సంతృప్తి పడుతుంది.
ఆ ఆనందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ శక్తి పొందాలని భావిస్తూన్నాను.
💭⚖️🙂📝@🌳
📖 22.07.2022 ✍️
Comments
Post a Comment