Telangana Formation Day (Telugu 02.06.2026)
⚛️🪷☀️🍃@🌳
ద్రవిడ ఆధారాల ద్వారా
దేశంలోని దక్షిణ (తెన్)
పీఠం పై
ఉండి ఉన్న
భౌగోళిక భూమి,
సంస్కృతం సాక్ష్యంగా
శ్రీశైల భీమేశ్వర కాలేశ్వర
మధ్యన మమేకమైన
త్రిలింగ నేపథ్యంతో తెలుగుగా
ఏకీకృతంగా ఏర్పడిన
భవ్యమైన భాష
తెలుగు.
తెలుగు తెలిసిన
వారందరు వున్న
ప్రదేశంగా
ప్రఖ్యాతిగాంచిన పదం
తెలంగాణ.
భవ్య భారతదేశం
స్వాతంత్ర్యం సాధించిన
తరువాత, తెగువతో
కేంద్ర ప్రభుత్వం కొన్ని కారణాలతో
నిజాం నవాబు నుంచి
సైనికచర్యతో సాధించి
విలక్షణంగా విలీనంచేసి
“హైదరాబాద్ రాష్ట్రం”గా
సాగుతున్న సమయాన,
భాష ప్రాతిపదికన భవ్యంగా
భారతప్రభుత్వం రూపొందించిన బృహత్
“రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టంతో”
“ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రం”
అనుసంధానమై అవతరించిన
“ఆంధ్రప్రదేశ్”లో సూమారు 58 సం.ల అనుబంధం
తర్వాత “తెలంగాణ”
కొన్ని కారణాలతో
రాష్ట్ర ఏర్పాటుకై
సాగిన సాధనలో
పాల్గొన్న ప్రజలు,
నేతలు, నాయకుల
సంకల్పంగా సాధించి,
రాష్ట్రంగా ఏర్పాడి రాణిస్తున్న
తెలంగాణ వారందరికీ తీపిగా
రాష్ట్ర అవతరణ దినోత్సవ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖02.06.2026✍️
ద్రావిడ భాషల్లో 'తెన్' అంటే 'దక్షిణం' అని అర్థం. భారతదేశ దక్షిణ పీఠభూమి (దక్కన్ ప్లాట్యూ) పై విస్తరించి ఉన్న భౌగోళిక భూమిపై నివసించే ప్రజలు మాట్లాడే భాష కాబట్టి, దీనికి 'తెన్-గు' లేదా 'తెలుగు' అనే పేరు వచ్చింది అని ద్రవిడ భాషా వాదుల వాదన.
మరోవైపు, పురాణాలు మరియు సంస్కృత ప్రకారం తెలుగు పదానికి పౌరాణిక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. శ్రీశైలం (మల్లికార్జున స్వామి) కాలేశ్వరం, ద్రాక్షారామం (భీమేశ్వర) క్షేత్రాల మధ్య ఉన్న ప్రదేశాన్ని త్రిలింగ దేశం అనే వారు, ఆ త్రిలింగమే కార్యక్రమంగా తెలుగు అయింది అని చరిత్రకారుల వాదన.
తెలుగు తెలిసిన వారందరూ ఉన్న ప్రదేశం (తెలుగు + అంగణ = ప్రదేశ్) “తెలంగాణ” కాలక్రమంగా పదంగా అవతరించింది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సామరస్య స్థాపనకై ఎటు కాకుండా ఉన్న సంస్థనాలను సంభాషణలతో వందలాది వాటిని విలీనం చేసి, విలీనం కానీ కొన్ని సంస్థానాలపై కొన్ని కారణాలు (ప్రజల భావాలకి విరుద్ధంగా పాలకుల నిర్ణయాలు) వలన దేశ గృహ మంత్రి నేతృత్వంలో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం నవాబు నుంచి సైనికచర్యతో హైదరాబాద్ ను సాధించి విలక్షణంగా భారత దేశంలో విలీనంచేసి “హైదరాబాద్ రాష్ట్రం”గా ఏర్పడి సాగుతున్న సమయాన, భాష ప్రాతిపదికన భారత ప్రభుత్వం రూపొందించిన బృహత్ “రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ చట్టంతో”“ఆంధ్ర రాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రం” అనుసంధానమై అవతరించిన “ఆంధ్రప్రదేశ్”లో సూమారు 58 సం. ల అనుబంధం తర్వాత “తెలంగాణ” రాష్ట్ర ఏర్పాటుకై సాగిన సాధన, సమ్మెలో పాల్గొన్న ప్రజలు, పాత్రికేయులు, నేతలు, నాయకుల సంకల్పంగా సాధించిన రాష్ట్రం తెలంగాణ.
తెలంగాణ వాసులు అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖02.06.2026✍️

❤️
ReplyDelete👍
ReplyDelete🌺🌺
ReplyDelete🎉
ReplyDeleteబావుందండీ భార్గవ్ గారు.
ReplyDelete