VK Rachakonda Trip (Telugu 01.02.2026)

⚛️🪷🌳
సంఘ సభ్యులు 
(జ్ఞాన)సరస్వతీ సంస్థ
సంస్థాపకుడైన సదానందం
సహాయంతో సిద్ధమై 
వివేకానంద కేంద్ర 
వైభవంగా కృతిపరిచి
సామూహికంగా సాగిన 
పర్వతారోహణ ప్రయాణం 
రాచకొండ కోట 
రాతి కొండలనుకున్న
కానీ కనిపించని
చరిత్ర చూసి
ఆశ్చర్యం అనిపించింది.

కొంతకాలం కాకతీయ 
పరిపాలన పరిధిలో 
తదనంతరం తదనుగుణంగా 
రేచర్ల రాజుల
రాజధానై రాణించింది.
భాగ్యనగరానికి భాగంగా 
ఉండి ఉన్న 
తొలి తెలంగాణ 
రాజధాని రాచకొండ.
ప్రకృతిలో పొందుపరిచిన 
కొండలు కొనలు 
కార్తీకాన కాంతితో
వెలిగే వన్నెల
కోటపై కోవెలలు
స్థానిక సంస్కృతిని 
తతంగాలను తెలుపుతూ 
వచ్చిన వెంకటేశ్వర్లు,
సహావాసంగా సభ్యులతో
తృప్తిగా తిరిగాము.
💭⚖️🙂📝@🌳
📖01.02.2026✍️



కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం

Dreams & Delay (Telugu 20.06.2025)