On Facebook- Reflection (Telugu 04.02.2026)

⚛️🪷☀️🍃@🌳 

ఈరోజు ఫేసుబుక్ ప్రారంభమైన రోజు. ఈ ఫేసుబుక్ నాకు ఒక వార్తాపత్రిక మరియు దైనందిని. ఇంకా విశ్లేషిస్తూ తాత్వికంగా చెప్పాలంటే నాలోని కవిని రచయితను బహిర్గతం చేసే ఒక బంగారం గని లాంటిది. 

ఈ ఫేసుబుక్ (వాట్సాప్) నేను రాసిన ఎన్నో సానుకూల రచనలు, కవితలకు వేదికగా ఉంది. నా రచనలకు వెచ్చించిన సమయం కంటే, వృధా చేసిన సమయమే ఎక్కువ. వృధాను ఆపేస్తే విలువైన విశేషమైనవి రావు అనిపించింది. 

బంగారం కోసం తవ్వినప్పుడు ముడి సరుకును బయటికి తీస్తాము, దానిలో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే స్వచ్ఛమైన స్వర్ణం తయారవుతుంది.‌ ముడి సరుకు లేకుండా బంగారం రాదు, కాబట్టి బంగారం కోసంగా ముడి సరుకును (వ్యర్ధాలను) తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేసి స్వచ్ఛమైనది తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఇలాంటి అంశాల నుంచి మంచి పొందాలంటే దుర్ఘుణాలను స్వీకరించి వదిలేయాలి. 

బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటిని సాధించాలని ఉంది.

💭⚖️🙂📝@🌳
📖04.02.2026✍️
 

Comments

  1. ముడి సరుకులో వ్యర్థం ఎక్కువ,
    శుద్ధి చేస్తే వెలుగుతుంది బంగారం.
    ఫేసుబుక్ గనిలో జ్ఞానం దాగి,
    వివేకం చేత వెలుగుతుంది సత్యం.
    బంగారం కన్నా విలువైనది మనసు,
    దానిని కాపాడితేనే నిజమైన సంపద.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Health Day (Telugu 07.04.2026)