L.B. Sriram

బాధ్యతల బతుకుల్లో తీరనికోరికలు ఎన్నో!!
'విరమణ' అయ్యాక--ఆరోగ్యంబాగున్నా
మానసిక రోగిలా బతికేవాళ్ళెందరో!!
కొందరే!! అప్పుడే!! జీవిత మాధుర్యాన్ని 
తెగ అనుభవిస్తారు👌

03 Jun Bicycle Day
ప్రపంచంలో 
ఎన్నో 'అద్భుతాలు' 
కాల క్రమంలో చాలా 
సామాన్యం ఐపోతాయి!!  
రెండు చక్రాల మధ్య మనిషి 
అటు ఇటు పడిపోకుండా 
చకచకా ముందుకెళిపోడం- 
ఎంత అద్భుతం!? 

నో పెట్రోల్ నో పొల్యూషన్!
చిన్నసైజు- పెద్ద ఎక్సరుసైజు!
ప్రపంచ దేశాల్నే నడిపించే 
సత్తా ఉన్న వాళ్ళని సైతం 
తనపై మోస్కెళ్ళే 
స్కిల్ ఉన్నది!! బైస్కిల్!!

ఆరేళ్ళ క్రితం-పిల్లల్లో కల్సిపోయి!
మా స్కూలు---'స్వర్ణోత్సవాలకి'!

ఏ కొంతో 'ఏకాంతం' .. 
ఎం---తో 'ప్రశాంతం' ..

'మొక్కేకదా' 
అని పాతేస్తే--
బతి-కేస్తా!!

సినిమాల్లో కామెడీచేస్తే-డబ్బులు ఇస్తారు!
ఇంట్లో ఎంత కామెడీ చేసినా--
డబ్బులు 'అడుగుతారు' !!

దేవుఁడా🙏
నన్ను ఎక్కణ్ణించో తెచ్చేవు🙏
నాకు నచ్చిన జన్మనిచ్చేవు🙏
ఎప్పుడూ ఏదో ఒకటిచ్చేవు🙏
ఎప్పుడు ఏది ఇవ్వాలో అదిచ్చేవు🙏
నువ్వు కురిపిస్తున్న అద్భుత 
అనంత ప్రేమామృత వర్షంలో 
నా 'ఆనందభాష్పాలు'కూడా
ఉన్నాయని-'నీకు తెలుసు'🙏

'మనిషి'!!
ఎంత అద్భుతం!? 
తనచుట్టూ'ఇంత-సృష్టి'!?
ఇంకెంత అద్భుతం!?
---
దేశం అట్టడుగున--
మూడు సముద్రాలు ఏకమైన చోట--
నింగి-నేల-గాలి-నీరు-నిప్పు--నేను!!

అబద్ధం ఎందుకూ?
ఈ ఫొటో నాకు నచ్చింది!
మీకు కూడా నచ్చాలంటే-
నా బదులు- ఆ ప్లేసులో
మిమ్మల్ని ఊహించుకోండి!

చూడండి! నా ముఖంలో COVIDని జయించేసిన విజయ గర్వం కనపడ్డం లేదూ..? ఇంజెక్షన్ తీసుకున్నాక అరగంట వీళ్ళ Observationలో ఉండాలట.. ఆ Timeలో (ఇప్పుడే) హాయిగా ఈ post పెడ్తున్నాను! Injection తీసుకున్నాను కదా అని Covid నిబంధనలు పాటించను అనుకుంటున్నారేమో! ఆ ఛాన్సే లేదు! దేని పని దానిదే! మీరు కూడా అంతే! Take care..
మీ- ఎల్ife is బిeautiful

ఈ నిశ్శబ్దం వెనుక.. 
ఎన్నెన్ని అద్భుత శబ్దాలో..

జీవితంలో ఎన్ని మెట్లెక్కినా..
చిన్నప్పుడు చెట్లెక్కిన ఆనందం రాదు!

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao