Discussions on Uniqueness
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Aruna Sri :
ఒకొక్కసారి అనిపిస్తుంది మనం మనలా ఉండడం తప్పా అని.. తప్పేనేమో
Naga Bharghav Shyam Amancharla:
కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని తెలుసు, కానీ తినడానికి సంకోచిస్తాం ఎందుకంటే అది చేదు కాబట్టి.
సాహసం లాంటి చేదుకు అలవాటుపడ్డ మీరు, ఇబ్బంది పడుతున్నారంటే కారణం పెద్దది ఉండొచ్చు! కానీ... అలాంటి సమయాల్లో మనకు తెలిసిన విషయం స్మరణకు తెచ్చేందుకు, మన మాటలు వినేందుకు, తప్పులను సరిదిద్దెందుకు ఒక నిశ్చలమైన నమ్మకమైన వ్యక్తి అవసరం. (మీరు వారితో మాట్లాడండి)
మన నిర్ణయాలు ఎలా అభివ్యక్తీకరించాం, మనం మన తప్పు ఒప్పులను ఎలా స్వీకరిస్తున్నాం, అనేది ఈ సొంత వ్యక్తిత్వానికి చాలా ముఖ్యం. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది. మనం ఎప్పుడు సరిగ్గా ఉంటాం అనేందుకు లేదు, ఎందుకంటే మనం ఎవ్వరం పరిపూర్ణులం కాదు అది మానవ సహజ స్వభావం.....
ఇంకో విషయం మీరు అనుకుంటున్న మీలో మీరు ఒక్కరే లేరు.
విషయాలు మనకు తెలిసినవే, అవకాశం తీసుకుని నా శైలిలో వ్యక్తపరుస్తున్నాను...
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
Comments
Post a Comment