Holi Wishes

తేజస్సుకు దహనమై హోళికా
తేజం దాల్చిన ప్రహ్లాదుడు 
ప్రశాంత ప్రకాశంతో పర్వదినంగా 
పాల్గున పౌర్ణమి పండగ హోళీ....

రగిలే రవి.. రాల్చిన రవికిరణం 
రామన్.ప్రభావంపై రూపాంతరంచెంది 
రంజితమై రంగరించి రాల్చే 
రంగుల రూపం... రమణీయం

ఏకమై ఉన్న శరీరం
ప్రకృతి, ప్రపంచం, పరమాత్మ అనే 
పారమార్ధికమైన ప్రభావంపై పడి
రంగులతో రూపాంతరించెంది....... 
వివిధ విషయాలతో విభిన్న విధాలుగా 
ప్రసారమయ్యే ప్రయత్నాలు
ప్రమోదాన్ని ప్రమాదాన్ని
కలిగించి కడకు 
ప్రకాశంగా ప్రజ్వలిల్లుతుంది.... 

తేజస్సుకు దహనం కాకుండా 
ప్రభావంతో తేజో ధారణలు కలిగి 
సాగడమే సంసార సాగరం

అందరికీ హార్దిక హోలీ పండుగ 
శోభమైన శుభాకాంక్షలు...

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao