Amma Birthday

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
అనంత ఆకాశాన్ని అద్దం అందుకోలేదు.... అలాగే 
మాతృత్వాన్ని మైమరిపించడం 
మానవ మనసుకు
ఆలోచనపరమైన అవధులు 
పదాలపరమైన పరిధులు దాటి 
ఆవల అమ్మ అనురాగాలను 
అర్థంచేసుకోవడం అభివ్యక్తీకరించడం 
అభిమానుం ఆనందం కోసం చేసే 
పరిమిత ప్రయత్నమే 
ఆకాశాన్ని అందుకునే అద్దమైన మనసుది..

అందరితో అన్నింటితో  
అనుసంధానమైన ఆనందం 
అద్భుతం అమ్మ........

మౌలికమైన మనసులో 
ముగ్ధ మనోహరమైన మనం, మానవత్వం, మృదుత్వం, మమతా, మీమాంస... మిశ్రమంచి 
మోములో మోహన మందహాసంతో 
మాయి మాతృమూర్తి మాధవి......
సమతుల్యంతో సాధికారత సాధించిన సాద్వి.......

అమ్మకు ఆప్యాయతతో 
హృదయపూర్వక హార్దిక 
పుట్టినరోజు పర్వదిన
శోభమైన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)