⚛️🪷🌳 విరాట్ కోహ్లీ విషయాలలోని వాస్తవికత, విజ్ఞానం, వినయం క్రికెట్టుకు మించి విశేషంగా ఉంది. దానిలోని సారాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం. ఒకరు గెలిస్తే, మరొకరు ఓడిపోతారు. కానీ, మనం చేసే పనిని నమ్మకంగా, నిజాయితీగా చేస్తే, ఫలితం ఎలా ఉన్నా సంతృప్తి ఉంటుంది. బాగా కష్టపడతాం, తర్వాత జరగవలసినవి జరుగుతాయి, కష్టపడి ప్రయత్నించడమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో లేదు. మనం ప్రతి సారి ఉత్తమ ప్రదర్శన చెయ్యడం సాధ్యం కాదు, దానికి అర్హులం కూడా కాదు, ఎందుకంటే ఎదుటివారికి బాగా రాణించాలనే ఆకాంక్ష ఉంటుంది, వారు చాలా కష్టపడతారు, వారికి కుటుంబం ఉంటుంది, వారికి స్నేహితులు ఉంటారు, వారు బాగా రాణించాలని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. వారు మనతో ఈ వేదికను పంచుకున్నారు, మనకు గెలవాలన్న ఆకాంక్ష ఎంత ఉంటుందో, వారికి కూడా అంతే ఆకాంక్ష ఉంటుంది. ఎప్పుడూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం సాధ్యం కాదు, ఒడుదుడుకులు ఉంటాయి, వారి స్థానం కంటే మన స్థానం గొప్పదనే విషయానికి ఎటువంటి హామీ లేదు. నిజానికి దానికి ఎటువంటి ప్రాధాన్యత లేదు, ఎందుకంటే ఎంత అనుభవం ఉన్న ఆ రోజు మన మ...