Andhra Jyothi (ఆంధ్రజ్యోతి)

⚛️🛞🪷
ఆంధ్ర జ్యోతి జ్వలింప జేసిన జ్ఞాపకాల అస్తిత్వం 

09.01.2023: ప్రవేశ పరీక్ష (ముఖాముఖి)
23.01.2023: స్థానం సంపాదించడం (ఉద్యోగంలో చేరడం)
---------------------
"ఆంధ్రజ్యోతిలో ఆరంభ అనుబంధం"

ఆంధ్రజ్యోతి అవకాశంతో అనువాదకుడిగా 
అనుభవాలు అభివ్యక్తికరిస్తూ 
ఆంగ్లం అభివృద్ధి అవుతూ
తెలియని తెలుగును తెలియజేస్తూ
నైపుణ్యాలను నింపుతూ 
మరిచిపోలేని మంచి మనుషుల
సహవాసంతో సంస్థలో సాగుతున్న
జీవితానికి జ్ఞానం జీతం జారీచేస్తూన్న
ఆంధ్రజ్యోతికి అభినందనలు (ధన్యవాదాలు). 

(ముఖాముఖి మరియు ప్రవేశ పరీక్ష రాసి సంవత్సరమైన సందర్భంగా సంబంధిత భార్గవ భాష్యం) 
09.01.2024.
--------------------------

"ఆంధ్రజ్యోతి అనుబంధికులపై అభిప్రాయాలు"

సమతుల్య స్థితప్రజ్ఞతతో, 
ఉద్యోగస్తులకు ఉతంగా ఉంటూ
తగిన సమయం ఇస్తూ
విత్తనంలో వృక్షాన్ని చూస్తూ 
సహనంగా సామర్థ్యా 
వృద్ధికై సమయాన్ని వెచ్చిస్తూ
నిండైన నిర్వహణ 
శక్తితో, సందర్భాను సారంగా 
చాలా చక్కని చిద్విలాసంతో
విలువుల విధిని విలక్షణంగా 
నిర్వహిస్తూ, నిర్వహణకు 
నిర్వచనంగా నిలిచారు
రసూల్ సార్.

విభాగంలో వర్గాల మధ్య కొన్ని వైరుధ్యాలను 
సామరస్యంతో విష్ణుమూర్తి వాహన సూత్రంతో**  సమన్వయ పరిచే రసూల్ సార్ సమతుల్యానికి నిదర్శనం. (**విష్ణుమూర్తి వాహన (పాము-పక్షి) సూత్రం:- పాముల్ని తినేసే పక్షిని వాహనంగా, పక్షి గుడ్లును తినేసే పాము మంచంగా. తన క్రింద ఒకరంటే ఒకరికి పడని ఉద్యోగులున్నా పైనుండి వాళ్ళతో పనులు చక్కబెట్టించే విష్ణుమూర్తి సూత్రం)
-------
రసూల్ సార్, రవీందర్ అన్న మా సామర్థ్యాన్ని సమయాన్ని అంచనా వేసి దిగువ వారికి పనులు అందించే పరిపక్వత నేను ఆస్వాదించాను.
—---------
గ్రంథాలయ గుండె,‌ 
కలిగి కుదురుకుని
నడిచే నైపుణ్యం 
సరస్వతి సుపుత్రుడు 
"సతీష్ భరద్వాజ" (ఆర్య)
బలమైన భాషతో భావనలను
ప్రభావితం చేస్తూ, ప్రభావం చూపిస్తూ
ప్రవాహంలా ప్రకటనలతో 
పయనమవుతూ ప్రకాశిస్తున్న 
ఆంధ్ర జ్యోతి అనువాద స్ఫూర్తి 
ముటుకుల సతీష్ భరద్వాజ్ ఆర్య

రక్త దానంతో కొద్దిగా రక్త సంబంధాన్ని 
భావోద్వేగ భార్గవ బిరుదును భూషణంగా భావించాను
-—---------
మధు బాబాయ్ సమక్షంలో 
అమితమైన ప్రశాంతతను ఆస్వాదించాను. 
పరివార పరిధి తరువాత తాదాత్మ్య ప్రశాంతతను 
సంస్థలో తన సమక్షంలో సంతృప్తిగా పొందాను
నిబద్ధతను కష్టతత్వాన్ని 
క్రమశిక్షణను వారి దగ్గర అనుభవించాను. 
—-------------
సాంకేతిక ప్రచురణల (DTP)ను 
మనోవేగంతో మధు బాబాయ్, 
వాయువేగంతో రామకృష్ణ గారు మరియు భరద్వాజ ఆర్య వేగంగా చేస్తూ, సామర్థ్యానికి స్మారకంగా నిలిచారు
….
(ఇంకో మాటలో మధు బాబాయ్, భరద్వాజ ఆర్య రామకృష్ణ గారు ఆంధ్రజ్యోతికి ఆయుధం లాంటి వారు, ఇంకా ప్రత్యేకంగా బాబాయ్ గురించి చెప్పాలంటే బాబాయ్ ఉండడం ఆంధ్రజ్యోతి చేసుకున్న అదృష్టం)
—---
వేగంగా వంటపట్టించుకుంటూ వడివడిగా వృద్ధి చెందుతున్న వీరా.
(పునః సమీక్షకతో తప్పులను దిద్దడం, నాకు అండగా అనిపించింది)
-------
ఇక ప్రధానంగా నా వద్ద పనస పండులాగా పైకి కఠినంగా కనిపిస్తూ, లోపల మృదుత్వం (నా క్షేమం గురించి ఆలోచిస్తూ) ప్రవర్తించే రామా, వీరా, ఆర్య, రమేష్ (సొదర) విలక్షణత విలువైనది. 
—----
చిన్న పరిధిలో శ్రీకారం 
చుట్టిన చిరు ఉపహారలు 
(భవదీయులకు బిస్కెట్)
పంపిణీ పద్దతిని 
ద్వైమాసిక కాలంలో విస్తృతం చేసి 
అందరికీ అందిస్తూన్న 
సాయికి ధ్యనవాదాలు. 

ధైర్యం ధారణగావించి
సవాళ్లను స్వీకరిస్తూ
సాంకేతిక ప్రచురణతో సహవాసం (చేస్తూ) ప్రదర్శిస్తూ 
ఎదుగుతూ  ఎగురుతూ 
ఆంధ్రజ్యోతిలో సినిమా పేజీ 
రూపకర్తగా రాణిస్తున్న 
సాయి ఓ యువ శక్తి
----
రవి శేఖర్ గారు 
తెలిక తత్వానికి తనయుడుగా
తరుచూ ప్రకటనల తరగతిలో
తిరుగుతూ తిరుగులేని 
పసినవ్వుతో ప్రశాంతతను ప్రజ్వలిస్తూ
తెల్లవారుజామున "రవి" కిరణంలా
శాంతి "శేఖరం" అందించే 
రవి శేఖర్ గారి మృదు మధుర మందహాసం, పసితనం అనుభూతి పొందాను.
--------
నాగేశ్వరరావు గారి దగ్గర పారదర్శకత. 
--------
నాపై "సరదాగా" చేసే మిగతావారి ఆరోపణలకు 
నేను ఇచ్చే స్పందనకు అండగా నిలిచే నరేష్ అన్న.
------
భోజన సమయంలో ఆహారం అందించే అన్నపూర్ణేశ్వరులు రఘు గారు మరియు రామకృష్ణ గారు. ఆ సమయంలో మా అందరికీ పానీయ దాత కంఠ్లం గారు, వీరందరికీ కృతజ్ఞతలు.
--------
నేను అత్యధికంగా విమర్శించిన వారు వాటికి అంటున్నట్టుగా ఉంటు రఘు గారు నాకు క్రీడా స్ఫూర్తితో కమలం (తామరాకు) గా కనిపించారు.
----------
రఘు, సాయి, ఇరువురు రమేష్ లు, భరద్వాజ ఆర్య గారి దగ్గర నాలోని అపరిచితుడి లాంటి చిన్న పిల్లాడిని వ్యక్తపరుస్తూ అమాయకమైన కల్మషరహిత ఆనందాన్ని అనుభవించాను. 
------
రసూల్ సార్ పరిపక్వత 
రవీందర్ అన్న, రామకృష్ణ గారి హుందాతనం,
భరద్వాజ ఆర్య సమీపాన నడిచే నైపుణ్య జ్ఞాన జ్ఞాపకాలను
కరుణాకర్, నరేశ్ అన్నల దగ్గర స్నేహం... 
రామకృష్ణ కంఠ్లం దగ్గర సాన్నిహిత్యం,
బాబాయ్ కంఠ్లం గారి సాంగత్యంతో అహంకార రహిత నిస్వార్థ తత్వంలో తాదాత్మ్యం తగిలింది. 
---------
రామకృష్ణ, వీరా, భరద్వాజ ఆర్య దగ్గర పారదర్శక పొందాను. 
---------
ఫేస్బుక్ లో రాసే రచనలతో శ్రీధర్ 
గారు, శ్రీనివాస్ గారు వ్యాసేంద్రల అభిమానం సంపాదించాను అనిపించింది.
--------
వహీద్ అన్న అజాతశత్రు వైనం,‌ అనువాద విజ్ఞానం, విలక్షణత, విజ్ఞత, విశేషమైనవిగా వున్నాయి. 
----------
ఆంధ్రజ్యోతిలో నా ఆరంభ దశలో నాకు
అనీల్ అన్న అందించిన అండ అపురూపమైనది.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

---------------------------------------------------
సంవత్సర సారాంశం

2023-24 సంవత్సరంలో
365 రోజులలో 318 పని రోజులు 

ఇందులో నా పని రోజులు 288 
ఇక‌ సెలవు రోజులు 77
(సంస్థ: 47, స్వయం:30)
(పని రోజులు:288/318; సెలవులు: 47+30)

30 స్వయం సెలవు దినాలలో 
18 ఊరులో*, 8 అనారోగ్యం, 4 ఇతర కార్యక్రమాలు. 
(*ఊరు: కడప, నెల్లూరు, షిరిడి, కందుకూరు)
----------------
మనస్సాక్షిగా దైనందిన నమోదిత పట్టికలో (రిజిస్టర్) 
పుస్తకంలో లిఖించిన ప్రకటన వివరాల ప్రకారం. 
2023-2024 సంవత్సర  కాలంలో (జనవరి నుండి జనవరి వరకు) వచ్చిన అనువాద ప్రకటనలు -2109, అందులో భాగమైనవి -917 
(నమోదుకు పట్టికలో నమోదు కానివి ఇక్కడ పొందుపరచలేదు, దీనికి మించి ప్రకటనలు కూడా ఉన్నాయి)

(2023లో : 829/1901, 2024లో: 88/208)

-----------------

ఆంధ్రజ్యోతి: మా అక్షరం మీ ఆయుధం

సంధ్యా సమయాన 
సహోద్యోగుల సమక్షంలో

బృందంలో భరోసాగా

వరిష్ఠులతో విశేష విరామం 

Jan 23 బృందం Jan 24న 


Comments

  1. కవితాత్మకంగా చాలా బాగా రాశారు

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao