Blissful Blossom Birthday Babaji
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
నాన్నఅమ్మల ద్వారా నాలో నైరుప్యంగా
నైతికత నింపిన నంద్యాల నాథ...
పరోక్షంగా పరమానందానికి ప్రీతి ప్రతి
సాయి శ్యామ సన్నిహిత సామ్రాట్....
శ్రీగురు శ్యామ్ చరణ్ బాబా 🙏🙂🙏
సాయి సహవాసంతో సమాధానాలు సాధించి
సత్సంగ సంగీత సాహిత్యంతో సాధారణ స్థాయివారికి
సంసార సాగరం సర్వేశ్వరునిలో సంగమం సేయుటకై
సాధన సేతువును స్థాపించిన సమర్థ సద్గురు
సాయి శిష్య శ్యామ గురు "శ్యామ్ చరణ్ బాబా"
💭⚖️🙂📝@🌳
📖13.12.2022✍️
శ్యామ సుధా పాటలు
1) నాకేది మంచిదో
నాకేది మంచిదో నా కేది చెడుపో
నా కంటే బాగుగా నా స్వామికెరుక
అతని చేరిన వారి కతడాయ తలితండ్రి
అతని బిడ్డను నేను ఇతరము నా కేల ||నా కేది||
స్వామి నది ఇది అడుగ దాసునకు ధర్మమా
అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే ||నా కేది||
2) పరాభక్తి
పరాభక్తి నా మదిలో నిలిపి నన్ను దయతోకావరా
శ్రీకరేశ్వర హే కరుణాకర కృపాకర ప్రభు గురువరా ॥పరా||
విశ్వధారా విశ్వరూప విమలచరిత గురువరా
ప్రాణాధారా ప్రాణిరూపా పతితపావన గురువరా ॥పరా||
జీవాధారా జీవరూప జగత్సాక్షి గురువరా
జ్ఞానాధారా జ్ఞానరూప జగత్ ప్రభో గురువరా ॥పరా||
నీ చరణములే శరణము శరణము
నీ నామామృతమే నాకు శరణము ॥పరా||
నీ కృపయే నాకు జీవనము
నీ కరుణయే శ్యామాదుల కభయము ॥పరా||
3) గురువరా నను
గురువరా నను కావరా
గురువరా నను బ్రోవర
శ్రీ గురు నీవే శరణము
సద్గురు నీవే దిక్కు ||గురు||
నీ నామము పలుక నీయుమా
నీ రూపము నా మదిలో నిలుపుము
నీ మార్గమునందు నడుపుము
నీ దరికే నన్ను జేర్చుము ||గురు||
ఎవరియందున ద్వేషముంచక
దేనియందును కోరిక యుండక
నీదు సూక్తుల కనుగుణముగా
నన్ను నడుపుము గురువరా ||గురు||
దోషములను జేయనీయకు
దురాలోచన రానీయకు
దుర్మార్గములోన ఉంచకు
నీ మార్గము నందు ఉంచుము ||గురు||
అణువు అణువున నీవు గలవను
అనుభవములను కృపతో నొసగుము
నేను నాదను భావములను
సమూలముగా పెరికి వేయుము ||గురు||
సత్యమును నను పలుక నీయుము
ధర్మ మార్గమునందు నడుపుము
పరమ ప్రేమతో నన్ను మలచుము
నీదు సేవలో నన్ను నిలుపుము ||గురు||
మాయలో పడి ఉన్నవాడను (దానను)
మాతవై నను పాలింపుము
నీ చెంతకు చేర్చుకొనుము
నీ లోనే నిలుపుకొనుము ||గురు||
దాసనాయకి దాససేవిత
దాసవందిత త్రినయనీ
దాససన్నుత సద్గుణాలయ
నీదు చరణములే శరణము ||గురు||
4) చిదంబరేశ్వరా శ్రీకరేశ్వరా
చిదంబరేశ్వరా శ్రీకరేశ్వరా
ఆదరమున కావరా
అరుణాచలేశ్వరా
అరుణాచల శివ అరుణాచల //2//
నమ్మినానురా నీ పద కమలముల
ప్రేమ మీద చేరదీసి కావవేమిరా //అరుణాచల//
జపము నెఱుఁగను నేను తపము నెఱుఁగను
మంత్రమెరుగను నేను తంత్రమెరుగను
ధ్యానమెరుగను సుజ్ఞాన మెరుగను
ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//
స్నేహమెరుగను నేను ప్రేమ నెరుగను
జీవమెరుగను నేను భావమెరుగను
దైవమెరుగను నేను దెయ్యమెరుగను
ఏమియు ఎరుగని నన్నేటుల భ్రోతువో //అరుణాచల//
ఏది ఎందుకెపుడు ఎటుల చేసినాడనో
దేనికెందుకిపుడు ఇటుల జరుగుచున్నదో
తెలియలేదురా తెలివిలేదురా
ధ్యాన రూప జ్ఞానరూప అరుణాచలేశ్వర //అరుణాచల//
నా కనులలో నీవు కరిగిపోవా
నా మనసులో నీవు నిండిపోవా
నా పలుకులో నీవు నిలచిపోవా
నాలోన లోలోన అణిగిపోవ //అరుణాచల//
నా లోన యిమిడి ఉన్నది నీవే కదా
నీ లోన నిలచి ఉన్నది నేనే కదా
నీవు నేను వేరు కాదు, కాదనుచు తెలుపవా
శ్యామనాథ రమణనాథ అరుణాచలేశ్వర //చిదంబరేశ్వరా//
5) వదలను నిను వదలను
వదలను నిను వదలను
నే వదలను వదలను
వదలను వదలను సాయి
వదలక నిను వదలక
నే వదలక వదలక వదలక వదలక
చేకొనుమయ్యా శ్రీతజన మాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ //2//
మానవ జన్మను నొసగితివయ్య
మనుసునొకటి కల్పించితివయ్య
మాయలోన నను ముంచితివయ్య
మహా చిత్రము చేసేదవయ్య //వదలను//
సంసారము యొకటి కల్పించితివి
సంఘములో పడవేసితివి
సమస్యలెన్నో సృష్టించితివి
సతమత అగుటకు చేసితివి //వదలను//
బాధ్యతలను భారీయించెదనంటివి
నిను శరణన్నచో గాచెదనంటివి
ఎప్పుడు భరించెదవో ఎటుల గచెదవో
శ్యామాదులకు శాంతి నొకగుమా //వదలను//
6) శ్రవణము లోపమా
శ్రవణము లోపమా
స్మరణము లోపమా
మననము లోపమా సాయి
శ్రవణ స్మరణ మన నాడులకందవు
ఇదేమి చిత్రమో సాయి సాయి //శ్రవణము//
పరాయణత్వముతో చేయని
పారాయణము లోపమా
ధ్యేయము నందలి ధ్యాస లేకయే
ధ్యానము చేయుట లోపమా
అవగాహనయే లేక యాంత్రికపు
పూజలు చేయుట లోపమా
అహమును వదలక అటు ఇటు చు చుచు
ఆర్చించుటయే లోపమా
సదా చరణయే సతతము లేకయే
అతిగా వాగుట లోపమా
సకల జీవులలో నిన్ను చూడకయే
నీవు గలవనుట లోపమా
నిన్ను గూర్చి నేనేమి ఎరుగయే
పరు అని దూరుట లోపమా
శరణు శరణుమను
శ్యామ చరణనుని కరుణతో బ్రోవ భారమా!! //శ్రవణము//
7) బాబా నామమే
బాబా నామమే భవ్య నామము
దీన జనులకు దివ్య నామము
సృష్టి స్థితి లయ తారక నామమ
ఇహపర సుఖముల నోసగెడి నామము
ఇప్సిత్తముల నెరవేర్చేడి నామము
బాధ్యతలను భరించేడి నామము
భవ బంధములను త్రేంచడి నామము
భక్తి జ్ఞానం నొసగేడి నామము
వైరాగ్యమును కలిగించండి నామము
ముక్తి పదమున చేర్చడి నామము
ఆత్మానందం నిలిపెడి నామము
భక్తుడు సతతము స్మరింపు నామము
యోగులు ధ్యానము చేసెడి నామము
సకల దేవతలు జపించు నామము
శ్యామాధులకు తారక నామము
8) మధురం మధురం
మధురం మధురం మన సంబంధం
జన్మజన్మల రుణానుబంధం
జన్మజన్మల విడివడిన బంధం
సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం //2//
విడదీసినను విడవలేనిది
కదిలించిన ను కదలలేనిది
తొలగించినను తొలగబోనిది
అమృతమయముగా నిలిచిపోయినది //మధురం//
మరవ దలచినను మరువనీయనిది
మాటల చేతల భాషల కందనిది
తను మన ధనముల మరువజేయునది
ఆనందామృత మందు నిలచునది //మధురం//
సంతస మోసగి రక్షించునది
సంతస మోసగి సంరక్షించునది
స్మరియించినచో కృప చూపునది అని
ఆత్మీయతతో అలరించునది
//మధురం// //సాయిరాం//
మధురం మధురం సాయి సంబంధం
మధురం మధురం సద్గురు బంధం //సాయిరాం//
9) ఈ జీవిత యాత్రలో
ఈ జీవిత యాత్రలో ఎన్నెన్నో పాత్రలు
ఏది ఎందులకు ఉద్భవించునో
ఏది ఎందులకు నిష్క్రమించునో
ఎప్పుడు ఉద్భవించునో ఎటుల నిష్క్రమించునో
తెలియదు తెలియదు తెలియదు మనకు తెలియదు
//ఈ జీవిత/
ఎవరికి వారే ఒంటరిగా
బ్రతుకలేరని ఎంచియు
రుణాను బంధములను పెంచి
సంబంధములకు స్పందించి
ఒకరినొకరుగా తొడు నీడగా
బ్రతుకులు లాగగ ప్రారబ్దమును అనుసరించు నడుచుచున్నా ఈ నాటక మందునా
//ఈ జీవిత//
జరిగెడి దానిని అనుభావించుచు
జరగబోవునది ఊహించుచు
తాను చేసినది విస్మరించుచు
పరులు చేసినది చూపించుచు
మంచికి తానే కారణమనుచు
చెడుకి ఇతరులు కారకులగుచును
కీచులాటలతో పెనుగులాటలతో
బ్రతుకును బరువుగా లాగు చుండెడి //ఈ జీవిత//
సత్యమేమిటో తెలిసినగాని
సంతసమన్నది అర్ధం కాదు
ఆశలు ధ్యాసలు అవేశములు
అర్ధరహితములనుచు తెలియదు
త్రికరణ శుద్దితో సత్యాన్వేషణ
మార్గాములో మునిగిన కానీ
బాధలు తొలగవు బంధములుడవు
జగదీశ్వరుడు గోచరించడు //ఈ జీవిత//
సత్సంగములో ఉండినగాని
సత్పురుషుల సేవించినగాని
సత్ గ్రంధాలములు చదివినగాని
సదాచరణతో ఉండినగాని
సత్యము తెలియదు సంతసముండదు
సదాలోచనలు అసలే కలుగావు
సత్యమునెరిగి చేసేడి సద్గురు
శ్యామ సాయిని సమాశ్రయింపుమా //ఈ జీవిత//
10) నీ కొరకై నిను
నీ కొరకై నిను ప్రేమింప నీయుమా
నీ కొరకై నను జీవింప నీయుము
అజ్ఞానమును ధ్వంసము చేయుమా
పతిత పావనా సాయి తండ్రి
పతిత పావనా శ్యామచరణా
పతిత పావనా వందిత చరణా
శ్రీ గురు నామమే భయమును బాపును
శ్రీ గురు సేవయే ముక్తి నొసగును
శ్రీ గురు కృపయే మన జీవితమూ
శ్రీ గురు సూక్తుల ఆచరణయే శ్రేష్ఠము
సద్గురు నామమే భవతారకమూ
సద్గురు స్మరణయే భయ నాశకము
శ్రీ గురు దేవా అని స్మరియించిన
నాలో నిలచి నను నడిపించును
తల్లి తండ్రి గురు దైవము తానై
శాంతి సౌఖ్యముల నాకందించును
శ్రీ గురు దేవా అని పిలిచినచో
పరుగు పరుగున నాదరి చేరును
బాధ్యతలన్నియు తానే భరించును
తన మార్గములో నను నడిపించును
నిను నమ్మినచో భయము నాకేల
సమర్థ సద్గురు సాయి దేవా
నిను భక్తితో సదా స్మరించగా
కృప చూపుము నా సాయి దేవా
పంచేంద్రియములు పంచప్రాణములు
అహంకారము మనసు బుద్దులను
నీ సేవలకై వినియోగింపగ
కృప జూపుము నా సాయి దేవా
నీ కొరకై నిను ప్రేమింప నీయుము
నీ కొరకై నను జీవింప నీయుము
నీ సేవలనే చేయ నీయుము
నీ కృపతో మము నడువ నీయుము
కరుణా భరణా కల్మష హరణా
ప్రేమ ప్రదాయక కల్మష నాశక
నిస్వార్ధముగా నడువ నీయుమా
శ్యామ పోషక శాంతి నొసగుమా
పతిత పావన శ్యామ చరణా
పతిత పవనా వందిత చరణా
11) నీ దయ గలిగిన
నీ దయ గలిగిన కాని దేముంది
ఇహ పరములలో సాయీ
నీ కృపగలిగిన రాని దేముంది
శ్యామాదులకు సాయీ ||నీ||
నీ లీలల కీర్తించిన గలుగును
అనంత ధైర్యము సాయీ
నీ నామము స్మరియించిన గలుగును
అమితానందము సాయీ ||నీ||
నిను పూజించిన నిశ్చలముగ
మది నీపై నిలుచును సాయీ
నిను సేవించిన నిశ్చయమౌ
మది నిష్ఠ సబూరులు సాయీ ||నీ||
నిను ఆరాధించిన నే తెలియును
అసలు తత్వము సాయీ
నిను ప్రేమించిననే దెలియును
పరమ సత్యము సాయీ ॥నీ॥
నిను నమ్మినచో కలుగును
భువిలో అష్టసిద్ధులు సాయీ
నిను శరణన్నచో ఆనందింతురు
అష్టభోగముల సాయీ ||నీ||
నమ్మిన వదలక శరణము నొసగుచు
కరుణింతువు గద సాయీ
నీ చరణములే శరణము శరణము
సంకట హరణా సాయి ||నీ||
🙏🙏🙏
ReplyDeleteఇది ఎప్పుడు రాశావు బంగారు తండ్రి మనసు పొంగిపోయేంత ఆనందంగా ఉంది తండ్రి
ReplyDelete💚 🙏🙏
ReplyDeleteJai Jai Shyam 🙏🏼🙏🏼
ReplyDelete