(2) Sardar Vallabhbhai Patel (Telugu 31.10.2022)
⚛️🪷🌳
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించారు. ధనిక క్లబ్బులో ఏదో ఆట ఆడుతూ ఉండేవారు.
ఒకరోజు ఆ క్లబ్బులో ఆట ఆడుతూ ఉండే సమయంలో గాంధీ గారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఆయనకు గాంధీ అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.
ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాదుకు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు, దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంత మాత్రాన, ఉపన్యాసం విన్నంత మాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి తన స్నేహితుడు ధీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.
ఆ మాటల ప్రభావం ద్వారా కలిగిన అంతర్మథనంలో ఉన్న సమయంలో వల్లభాయ్ పటేల్ కు గాంధీ ఉపన్యాసంలోని మాటలు వినిపించి ప్రేరణ కలిగించాయి, అదే తనను గాంధేయ మార్గం వైపు నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది.
ఆ మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందో!! సీతాకోకచిలుక ప్రభావం అంటే అదేనేమో.
తన జయంతి నాడు తనని స్మరిస్తూ జన్మదిన నివాళులు అర్పిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖31.10.2022✍️

Comments
Post a Comment