గుండు హనుమంతరావు (ఆంజనేయులు)

గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే..‌‌.
అంజి అమృతం తాగకపోయినా,
అమృతం అందించిన అమరుడు
-Gangaraju Gunnam-
-----------------------------------
తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను.

తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది.

బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి చెప్పినట్టుగా నేను గుండు హనుమంతరావు గారి గురించి చెప్తున్నాను).

ఈరోజు గుండు హనుమంతరావు గారి పుట్టినరోజు, నా చిన్నప్పటి అద్భుత జ్ఞాపకం అమృతం ధారవాహిక మధురానుభూతుల స్ఫూర్తితో ఇది....

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

  1. అమృతం episode ఒకటి మన college canteen లో షూట్ చేసారు

    అప్పుడు నేను తనతో మాట్లాడాను

    చాలా బాగా మాట్లాడారు, down to earth

    Baaga depression lo unnaru appudu vaalla abbai చనిపోయారు a week lone

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Telugu language day (Poem on Telugu) (Telugu 29.08.2025)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)