🔔 Tangible Tales 🔥 (విశేష 🧘వృతాంతాలు)
1) 🐜 భారం.. 🤔👏👌🙆🤷🧘♂️🙂 ఓ ఆదివారం ఉదయం ఇంటి ముందు నీరెండకు కూర్చొని కాఫీ త్రాగుతూ సేద తీరుతున్న ఓ సంపన్నుడైన ఆసామి దృష్టి ఒక చీమపై పడింది.. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు. ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు అతనిని ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన అతనిని, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది.. భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను అధిగమించటం.. అతని కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని అవగతం చేసింది.. కొంత సేపటికి చీమ తన గమ్యం సమీపానికి చేరుకోవడం అతను చూసాడు.. అది ఒక చ...