🔔 Tangible Tales 🔥 (విశేష 🧘వృతాంతాలు)

1) 🐜 భారం.. 🤔👏👌🙆🤷🧘‍♂️🙂
ఓ ఆదివారం ఉదయం ఇంటి ముందు నీరెండకు కూర్చొని కాఫీ త్రాగుతూ సేద తీరుతున్న ఓ సంపన్నుడైన ఆసామి దృష్టి ఒక చీమపై పడింది.. ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు.

ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది. భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు అతనిని ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన అతనిని, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది..

భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు, విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను అధిగమించటం.. అతని కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని అవగతం చేసింది..

కొంత సేపటికి చీమ తన గమ్యం సమీపానికి చేరుకోవడం అతను చూసాడు.. అది ఒక చిన్న రంధ్రం ద్వారా భూగర్భం లోపలకి ప్రవేశించే చీమల నివాసస్థలం, అప్పుడా క్షణంలో అతనికి ఆ చీమ వ్యవహారంలో ఉన్న లోపం స్పష్టంగా అర్థం అయ్యింది..ఆ చీమ తాను ఎంతో జాగ్రత్తగా గమ్యం వరకు తీసుకు వచ్చిన ఆ పెద్ద ఆకును చిన్న రంద్రం ద్వారా లోనికి ఎలా తీసుకెళ్లగలదు? అది అసంభవం. ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టానికోర్చి, శ్రమపడి, నేర్పుగా ఎన్నో అవరోధాలనధిగమించి చాల దూరం నుంచి తెచ్చిన ఆ పెద్ద ఆకును అక్కడే వదలి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది..
తను మోస్తున్న ఆకు భారం తప్ప ఇంకేమి కాదనే ఆలోచన.. సాహసంతో కూడుకున్న ఆ ప్రయాణం మొదలు పెట్టె ముందు ఆ చీమకు రాలేదు.. చివరాఖరికి వేరే మార్గం ఏమి లేక దానిని అక్కడే వదలి ఆ ప్రాణి గమ్యాన్ని చేరుకోవలసి వచ్చింది.. దీని ద్వారా ఆ ఆసామి ఒక గొప్ప జీవిత పాఠాన్ని ఆ రోజు తెలుసుకున్నాడు. ఇది మన జీవితాలలోని 'సత్యతను' కూడా తెలియ చేస్తుంది..

మనం.. మన పరివారం గురించి, మన ఉద్యోగం, మన వ్యాపారం, ధనం ఎలా సంపాదించాలని, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి వాహనంలో తిరగాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి 'ఉపకరణాలు' ఉండాలి ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు చేస్తాము..కానీ చివరికి వాటన్నింటిని వదలి అంతిమముగా 'మృత్యువ'నే 'బిందువు' (full stop..) పెట్టబడడం ద్వారా మన గమ్యమైన 'శ్మశానం' చేరుకుంటాము. మన జీవన ప్రయాణంలో ఎంతో ఆపేక్షగా, ఎంతో భయంగా మనం మోస్తున్న భారమంతా అంతిమంలో ఉపయోగపడదని, మనతో తీసుకెళ్లలేమని మనకు ఇట్టే తెలుసిపోతుంది.. 

మరి మనం మోస్తున్న భారం..అంతా.....???
అందుకే భారాన్ని మర్చిపోండి..ఆ దేవుడు ప్రసాదించిన ఈ విలువైన జీవితాన్ని..మన చుట్టూ ఉన్న ఆనందకరమైన ప్రకృతిని..జీవజాలాన్ని ఎరుకలొ ఉండి..ఆనందించి, ఆస్వాదించండి..మన 'మజిలీ' చేరుకునేలోపే..అనవసర భారాలను..వదిలి.. 'మనం ఎప్పటికీ ఇలాగే, ఇక్కడే ఉండిపోలేమన్న విషయాన్ని..స్మృతిలో ఉంచుకుని జీవితాన్ని ఆనందంగా గడపటానికి..ప్రయత్నిద్దాం...
🤸‍♂️🚴‍♂️🐜🐌🕸️🎭🤹‍♂️💕🌼🌼🌼🦋🙏🙂

👁️‍🗨️👌🔖♻️@🌳


2) 🙏🦋🌷ధన్య జీవితం🌹🦢🙏

ఒక భవంతిని⛪ కూలగొట్టి కార్మికులు దాని భాగాలన్నీ విడివిడిగా పేర్చారు. ఆ ఇంటి నిర్మాణానికి వాడిన ఇసుక ఇటుక ఇనుము కలప...అన్నింటినీ ఒకచోట చేర్చారు. ఇంటికి కావలసినవన్నీ ఉన్నాయి. చూడ్డానికి ఇల్లు మాత్రమే లేదు.
మనిషి మరణించినప్పుడు ఆ మనిషికి చెందినవన్నీ అక్కడే ఉంటాయి. లోకం ఆ వ్యక్తిని ‘మనిషి’గా గుర్తించడానికి అవసరమైన అవయవాలు👁️💪🦵👂 కనపడుతూనే ఉంటాయి. మనిషి మాత్రం ఉండడు.
ఇల్లు ఇల్లుగా ఉన్నప్పుడు మనిషి మనిషిగా ఉన్నప్పుడు ఎంత మేలు జరిగింది, ఏ మాత్రం సద్వినియోగం అయిందన్నదే ప్రశ్న.
ఆ ప్రశ్నకు లభించే సమాధానమే- మనిషి విషయంలో ‘జీవితంలో శూన్యత’ అనేదాన్ని తేల్చి చెబుతుంది!
జీవితంలో శూన్యత గురించి ఈ ప్రపంచం చాలా చర్చించింది. దాన్ని వివరిస్తూ ఎన్నో పుస్తకాలొచ్చాయి. మరెన్నో ఆలోచనలు పుట్టాయి. అవన్నీ అభిప్రాయంగానే మిగిలిపోయాయి తప్ప తీర్పు చెప్పలేకపోయాయన్నది చాలామంది భావన.
కానీ సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత హెన్రిక్‌ ఇబ్సన్‌ రాసిన గొప్ప నాటకం ‘వెన్‌ ఉయ్‌ డెడ్‌- అవేకెన్‌’లో పై ఇతివృత్తం ద్వారా జీవితంలో శూన్యత విషయమై ఆ రచనతో హెన్రిక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేశాడు. అది సమాజం కన్నా చాలా ముందున్నాడని విశ్లేషకులు చెబుతారు.

👁️‍🗨️👌🔖♻️@🌳

3) 🆓 ఉచితంగా అంటే...??? ↘️

ఒక ఆర్థికశాస్త్ర ఆచార్యులు తన స్నేహితులతో ఇలా చెప్పారు...

నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక విద్యార్థి కూడా తప్పలేదు, కానీ ఈ మధ్య ఒక తరగతి మొత్తాన్ని తప్పించవలసి వచ్చింది....!!!

ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!!!

ఒక తరగతి వాళ్ళు ఇలా అడిగారు, తరగతి లో టాప్ ర్యాంకర్, లీస్ట్ ర్యాంకర్ అని వొద్దు, అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు, ఆచార్యులు సరే అన్నారు...
మీ అందరి మార్కులు జత చేసి, సగటు తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లో,అందరికి సగటు ర్యాంక్ B వచ్చింది, 2వ సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి F ర్యాంక్ వచ్చింది, ఫైనల్ పరీక్ష లో అందరూ తప్పారు. 

విద్యార్థులు అందరూ అవాక్కు అయ్యారు.

బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు... చదువు తక్కువ చదివే విద్యార్థులు ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా, ఇంకా మేము ఎందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు...

ఈ ప్రయోగంలో లో నాలుగు అంశాలు నేర్చుకోవొచ్చు...

1. చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము, కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు.

2. ఒకరు ఎమన్నా ఉచితంగా పొందురున్నారు అంటే  మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు.

3. ప్రభుత్వం ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది.

4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు. కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి.

సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,
అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే, మిగతా సగం కష్టపడి , ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు.

ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం, ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశ వినాశనానికి బీజం పడుతుంది..

ఒకటికి రెండుసార్లు ఆలోచించండి... నలుగురితో చర్చించండి... దేశం కోసం... రేపటి తరాల కోసం...
🙏🙏
👁️‍🗨️👌🔖♻️@🌳



Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao