Vivekananda Kendra KPS (Telugu 14.05.2026)

⚛️🪷🌳 

వివేకానంద కేంద్ర కన్యాకుమారి వారు 
దేశ ధార్మిక సేవకై సంకల్పంగా
నియమాలతో నిశ్చలంగా నిర్వహించే 
కార్యక్రమాల ప్రస్ఫుట శిక్షణకై 
“కార్యకర్తల ప్రశిక్షణ శిబిరం”లో
పరస్పర పరిచయాలతో 
సమూహ స్ఫూర్తితో
అహం ఆదమరిచి అండదండగా
వినమ్రంగా విలక్షణంగా
ఒకరికొకరుగా ఒక్కటై 
తెల్లవారుజామన తొందరగా 
లేచి, లయగా
ప్రాతఃకాల ప్రార్థనలు
వివిధ వ్యాయామాలు, 
నియుద్ధ నైపుణ్యాలు,
యోగాసనాలను యత్నించి,
సమిష్టిగా శ్రమ సంస్కారాలు 
గీతా గానం
భగవద్గీత పారాయణం, 
భజనలు పాడడం
తాత్విక తరగతులు 
చింతనల చర్చలు 
ప్రకటిత ప్రదర్శనలు 
ఉల్లాసంగా ఉత్సాహంగా
ఆనందపరిచే ఆటలు,
ధారావాహికగా దాఖలు 
చేసిన చారిత్రాత్మక 
కథా కథనాల
తీరుతో తృప్తిగా
సంతోషంగా సాగింది. 
--------
కేంద్ర కౌశలంలో
నిర్వహణాధికారిగా నిల్చుని
రాణిస్తూ రామకృష్ణగారి
ఆధ్వర్యంలో జరిగినకానీ
సమక్షంలో జరిగినట్లుగా
నిశ్శబ్దంగా నిర్విరామంగా 
శ్రమించే శ్రామికడు. 

కేంద్ర కౌశలానికి 
సగర్వంతో సగౌరవంగా 
హార్థిక అతిథులుగా హాజరైన
ఆహ్వానించిన అతిథులు 
అరుణ్ జీ, అమరేష్ 
విశ్రాంత న్యాయమూర్తి వెంకటరాములుజీ
శ్రీనివాసులుజీ, సామ్రాజ్యమ్మ గారు
విశేష దాత వల్లి దేవసేన గారు 
కడప నుంచి కదిలి వచ్చి
మమేకమైన మల్లికార్జునరావుగారు

నిర్వహణ వ్యవస్థలో నిల్చుని 
శిబిర ప్రముఖునిగా శాస్త్రిగారు 
ఆతిథ్యానికి అవసరమైనవన్నీ 
జతచేసిన జయరాంగారు  
శిబిరంలో శిక్షకులై 
నడవడికతతో నిర్మలంగా 
అగ్రజులు (రవిగారు) అందించిన
సంతసమైన స్ఫూర్తి, 
ముఖేష్ గారి మార్గదర్శనం 
శ్రీనివాసులుజీ శాస్త్రవిషయాలు 
సోదరీ కీర్తి కృతిపరిచిన క్రీడలు 

ఆర్థిక అంశాలకై
పాదర్దర్శకత పాటిస్తూ 
పర్యవేక్షిస్తూ, పరిరక్షించేందుకు 
ఖాతాల ఖచ్చితత్వానికై 
నిర్వహణతో  
అనీల్ జీ,
బాగలింగంపల్లిలో భాగమైన 
రైల్వేఉద్యోగి ఖాకడేజీ, రంగాచార్యులు
భాగ్యనగర్ యువ ప్రముఖ్ సురభిదీదీ.
-------------
ఉన్నత ఉద్యోగులుగా ఉంటూ/ఉండి 
విరామం తీసుకుని/విశ్రాంత తనంలో 
యశస్సు గడించి మరచి మరి 
మరింత మీమాంసతో
తెలుసుకోవాలనే తాపత్రయంతో 
విజయవాడకు ప్రాతినిత్యం వహిస్తూ
వివేకానంద కేంద్ర కౌశలానికి వచ్చి
పిల్లలైన పెద్దవారు 
రాధాకృష్ణ హరిప్రకాష్ రమణమూర్తి గార్లు

ఉత్తరాంధ్రలో ఉన్న
విశాఖపట్నం వాసి
కామేశ్వరశర్మ గారు కూలంకషంగా,
న్యాయవాద వృత్తిలో 
రాజమహేంద్రవరం నుంచి రాకతో
కళ్యాణ్ గారు కుతుహలంగా…

భవసాగరంలో బాధ్యతలతో
సహవాసం చేస్తూ 
సమన్వయం చేసుకుంటూ
(బాగలింగంపల్లి బాధ్యతలు 
చూసుకుంటూ చక్కగా)
భాగస్వామురాలైన భాగ్యలక్ష్మి గారు, 
తన తనయ రిషితతో రావడం,
ఇరువురు ఇంపుగా
పాలుపంచుకోవడం…

తేలికతనం అలాగే తపనతో
విశ్వతేజ, శ్రీపాద, నితిన్ విద్యార్థులుగా
వుంటూ వచ్చిన వారు 

ఉద్యోగంలో ఉంటూ 
సెలవు తీసుకుని సంకల్ప 
చింతనతో శిబిరానికి చేరిన 
సోదరులు 
శివప్రసాద్ కళ్యాణ్ శ్యామ్.
—---
కేంద్రలో కొద్దిగా 
తల్లి తండ్రులతో 
కలిసి కాలం 
గడిపి, గడించిన 
అనుభవాలు అన్ని అలా 
జాబిల్లి జ్ఞాపకంగా 
జాలువారుతున్నాయి వాటిని జప్తు 
చేసేందుకు చక్కగా 
కవిత కృతిలో 
రచించి రమణీయంగా
పంచుకుంటున్నాను.
💭⚖️🙂📝@🌳
📖14.05.2026✍️






కామెంట్‌లు

  1. Ramakrishna15 మే, 2026

    🕉️ మల్లెల, సంపెంగల మాల చూడ
    /విన ముచ్చటగా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. Shiva Prasad15 మే, 2026

    Thank you very mach sir so happy

    రిప్లయితొలగించండి
  3. Valli Devasena15 మే, 2026

    Excellent dear brother. God bless u. Tq so much for sending 👌👍🤝💐🙌

    రిప్లయితొలగించండి
  4. వేదుల కామేశ్వర శర్మ15 మే, 2026

    చాల చక్కగ వ్రాసారు. చిన్న సూచన .
    దీనికే మంచి శీర్శిక పెట్టి వివేకానంద కేంద్రానికి ప్రాముఖ్యతనిస్తూ, (స్థాపన,లక్ష్యాలు సంబంధిత సేవా కార్యక్రమాలు, శిక్షణ ప్రశిక్షణ కార్యక్రమాలు గూర్చి వ్రాస్తూ యువకులను ఆహ్వానిస్తూ ఒక చిన్న వ్యాసం వ్రాసి శ్రీయుతులు శ్రీనివాస్, రవిగార్లకు చూపి రేపటి అంధ్రజ్యోతి ప్రధాన సంచికలో అచ్చయేలా చూడగలరు.

    రిప్లయితొలగించండి
  5. Shiva Prasad15 మే, 2026

    Super bhargav garu kameswar rao sir ku mater bagundi.
    kavitha Thank you very mach
    Iam very happy. Dhanyawad 🙏🙏

    రిప్లయితొలగించండి
  6. Ramana Murthy15 మే, 2026

    Dhanyavad. Excellent kavita from your thoughts 👍

    రిప్లయితొలగించండి
  7. అద్భుతం మహాద్భుతంగా రాశావు చాలా ఆనందంగా ఉంది శ్యామ

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Earth Day (Telugu 22.04.2026)

Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం