Kanneganti Brahmanandam (Telugu 01.02.2026) కన్నెగంటి బ్రహ్మానందం
⚛️🪷☀️🍃@🌳
వడ్రంగి వృత్తిలో వున్న
(నాగ) లింగాచారి, లక్ష్మీనరసమ్మ
దంపతులకు దైవానుగ్రహంతో
చక్కగా చాగంటివారిపాలెంలో
పురుడు పోసుకుని
సత్తనపల్లి శరభయ్య
పాఠశాలలో పదవతరగతి
వరకు విద్య
పొంది, పశ్చిమగోదావరి
భీమవరంలో బసచేసి
ఇష్టంగా ఇంటర్మీడియట్
డిగ్రీ దాక
పూర్తిచేసుకున్న పిమ్మట
గాఢంగా గుంటూరులో
తెలుగు సాహిత్యంలో
ఎంఏ పట్టా పొంది
అత్తిలిలో అధ్యాపకునిగా
కుదురుకున్న కాలంలో
కళాశాల కార్యక్రమాలలోని
సాంస్కృతిక బృందాలలో
స్వర అనుకరణలు
చేస్తూ చురుకుగా
పాల్గొంటూ, ప్రశంసలు పొంది
స్నేహితుడి సిఫార్సుతో
దూరదర్శన్ ధారావాహిక
“పకపకలు”లోని ప్రదర్శనతో
ప్రేక్షకాదరణ పొంది,
గాఢమైన ప్రతిభను గుర్తించిన
చలనచిత్ర దర్శకులు
“సుబ్రహ్మణ్య శాస్త్రి (జంధ్యాల)”
“వేజళ్ల సత్యనారాయణ”
చెల్లిన దారిలో
తొలిసారిగా శ్రీ తాతావతారంలో
నరేష్ నలుగురు నేస్తాలలో
ఒక్కడిగా ఒదిగి నటించినా…
మొట్ట మొదట
విడుదలైన విశేష
చిరస్మరణీయ చిత్రం
“ఆహనా పెళ్ళంట”తో
అరగుండుగా అద్భుతమైన
ప్రశంసలు పొంది, పరిశ్రమలో
సుస్థిర స్థానానికి శ్రీకారంచుట్టి
త్రిమూర్తులని తలిచే
జంధ్యాల, రామానాయుడు, చిరంజీవి
చెంత చేర్చుకొని చక్కగా
అందించిన అవకాశాలతో
సుసంపన్నంగా సరళమైన
సంతోషాన్ని సులభంగా
హార్దికమైన హాస్యంతో
అందించేందుకు అహర్నిశలు
కృషిగా కష్టపడి
కొద్ది కాలంలోనే
శీఘ్రంగా శోభాయమానంగా
1200 పైగా చలన చిత్రాలలో
500 పైగా కథలోని కథానాయకులతో
400 పైగా దర్శకుల దారిలో
నటించిన నటుడు
నవ్వించిన నరేశ్వరుడు,
బ్రహ్మాండమైన బ్రహ్మానందం
గారికి గాఢమైన
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖01.02.2026 ✍️


♥️
రిప్లయితొలగించండి♥️🙏
రిప్లయితొలగించండి👏
రిప్లయితొలగించండి♥️
రిప్లయితొలగించండిChala Bagundhi 👍
రిప్లయితొలగించండిబ్రహ్మానందం గురించి బాగా రాశావు
రిప్లయితొలగించండి👌
రిప్లయితొలగించండి👏
రిప్లయితొలగించండి