Sankranti (Telugu 15.01.2026)

⚛️🪷🌳

భగవంతుని భూషణ 
భూమికతో భద్రులైన 
భాగ్య భవదీయులుకు 
భోగి శుభాకాంక్షలు.

ఆకాశంలోని తారలును  
అవనిలో తనుజ
ఆలోచిస్తూ అనుసంధానం 
సేయు సొంపైన 
సంశ్లేషణ సంప్రదాయం 
రంగుల రమణీయం
అలంకార అస్తిత్వం 
ముచ్చటైన ముగ్గు.....

సూర్య సంచారాన్ని 
సమంగా సంస్కరించే 
సంక్రమణం సంక్రాంతి. 

సేద్య సంస్కృతికీ 
సౌభాగ్యానికి సంకేతంగా
"పట్టం పొందిన పండుగ"
సంక్రాంతి.

కనుమ కళగా 
రమణీయంగా రైతులు,
హార్దికంగా హరిదాసులు
గంగిగోవులు గంగిరెద్దులకు
కృతజ్ఞత కలిగి 
పశువుల పండుగగా 
జరుపుకునే జ్ఞాపకం.
పిల్లలు పెద్దలు 
ఏకమై ఎగురవేసే
గాలిపటాల గమనం
అందించే ఆనందం
కమనీయ కనుమ 

ముచ్చటైన మూడు 
రోజుల రమణీయ
సంక్రాంతికి సంతోషంగా
సకుటుంబ సపరివారం
సుఖంగా సేదదీరుతారని..
సహవాసులుగా సదా 
సమతుల్యంగా స్వశక్తితో  
సానుకూలంగా సాగాలని 
సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను.

💭⚖️🙂📝@🌳
📖15.01.2026✍️



Comments

  1. ఈ కవిత/సందేశం చాలా అద్భుతంగా ఉంది! సంక్రాంతి పండుగ యొక్క సారాన్ని, ఆంధ్ర సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. భాషా సౌందర్యం, అల్లితెరేషన్ (భ, స, గ వంటి పద్యారంభాలు), మరియు లయబద్ధత ద్వారా ఇది చదువుతున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. మొదటి భాగం భోగి శుభాకాంక్షలతో ప్రారంభించి, ముగ్గు, సంక్రాంతి, కనుమ వరకు పండుగ యొక్క మూడు రోజులను కవితాత్మకంగా వర్ణించడం గొప్పది.

    విశ్లేషణ
    - నేపథ్యం మరియు సందర్భం: సంక్రాంతి (పొంగల్/మకర సంక్రాంతి) యొక్క రైతు సంస్కృతి, పశువుల పండుగ (కనుమ), గాలిపటాల ఆట, ముగ్గు ఆలంకారాలు, సూర్య సంచార సంకేతం—ఇవన్నీ ఆంధ్ర/తెలుగు సంప్రదాయాలను ఉత్సవాత్మకంగా చూపిస్తాయి. "పట్టం పొందిన పండుగ" వంటి వ్యక్తీకరణలు సౌభాగ్యాన్ని సూచిస్తూ, పండుగ యొక్క ఆధ్యాత్మిక/కుటుంబ బంధాలను హైలైట్ చేస్తాయి.

    - భాషా ఆకర్షణ: అనేక అల్లితెరేషన్‌లు (ఉదా: "భగవంతుని భూషణ భూమికతో భద్రులైన", "సమంగా సంస్కరించే సంక్రమణం") పద్యానికి సంగీత స్పందన ఇస్తాయి. రిఫరెన్స్‌లు (తారలు-తనుజ సంశ్లేషణ, ముచ్చటైన ముగ్గు) దృశ్యాత్మకంగా మెరుస్తాయి. చివరి భాగంలో ప్రార్థనాత్మక శుభాకాంక్షలు ("సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను") ఇది మాత్రమే కవిత కాకుండా, హృదయస్పర్శిగా మారుస్తాయి.

    - బలాలు: సంక్షిప్తంగా కానీ సమగ్రంగా పండుగను కవర్ చేసింది. దీన్ని సోషల్ మీడియా పోస్ట్‌గా సరిగ్గా సరిపోతుంది. రైతులు, పిల్లలు, పశువులు—అందరి భాగస్వామ్యాన్ని చూపించడం సమతుల్యం.

    ఒక్కసారి చదివినా మళ్లీ చదవాలనిపిస్తుంది—సంక్రాంతి ఉత్సాహాన్ని నిండా పంచారు.

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)