Posts

Showing posts from 2024

Youth conference on Sanatan Dharma

Image
⚛️🪷📧  "సనాతన ధర్మంపై యువ సమ్మేళనం" కార్యక్రమంలో వేదికపై మాట్లాడిన విషయాలు ఇంకొంచెం సంస్కరణతో విశిదీకరించి ఇక్కడ పంచుకుంటున్నాను. (అక్కడి సందర్బం, ఈ ఉపన్యాసం, నా వేషధారణ కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు కానీ, పారదర్శకమైనది మరియు దీని ఉద్దేశం మాత్రం మంచే) "యువతకు ఎందుకు అన్న కారణం తెలిస్తే, ఎలా అనేది వారే చూసుకుంటారు" #అపరిచితుడు (యువతనే కాదు సాధారణమైన మనుషులది అదే లక్షణం).  నేను ఎందుకు సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడయ్యాను అంటే, ఆ పారామార్థికమైన విషయానికి నాకు మధ్య ఉన్న సంబంధం, మా అమ్మ నాన్నలకు నాకు మధ్య ఉన్న సంబంధం లాంటిది.  నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు పట్ల సదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే వారు అవసరమైనవి, కావలసినవి సమకూరుస్తుంటారు, అందిస్తుంటారు. అందుకు వారి పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాను. మన తల్లిదండ్రులకు మించిన తల్లితండ్రులు ఉంటారు, లేదా మనం మన తల్లితండ్రుల సంపూర్ణ సామర్ధ్యం మనకు తెలియకపోవచ్చు. తల్లితండ్రులు లాగా సంప్రదాయం కూడా అంతే.  ప్రతి ఒక్కరికి వారి పరిధి చాలా గొప్పగా ఉండాలి అనే ఆలోచన సదా ఉంటుంది, అది సహజం. మనం లేదా మన పరిధి గొప్పదైతే దాన్ని గుర్తించాలి గౌరవించాలి

Paralympics India Performance

Image
⚛️🪷📧 🧑‍🦼 84 క్రీడాకారులు,   ✅ 29 పతకాలు  🥇 7 స్వర్ణాలు, 🥈9 రజతాలు, 🥉13 కాంస్యాలతో పారాలింపిక్స్ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భారత ఖ్యాతిని పెంచిన ప్రపంచశ్రేణి క్రీడాకారులు కృషితో చేసిన చిరస్మరణీయ  అత్యుత్తమ ప్రదర్శనకు అభినందనలు &  దివ్యాంగురాల ధన్యవాదాలు  💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Bhimashankar

Image
⚛️🪷📧 గత ఏడాది ఇదే రోజున భీమశంకరంలో స్వామి దర్శన భాగ్యం కలిగింది.  భీమశంకరుని భాగ్యం  పొందుటకై ప్రయాణంలో  సందోహం స్థితిస్థాపకమై నిరీక్షణ నిరుత్సాహపరిచిన పరీక్షించిన పరమేశ్వరునికై ప్రయాణం, ప్రణవనాదంతో  సుదీర్ఘంగా సాగి  దర్శనానికి దారిచ్చే ప్రతి ముందుడుగు  ప్రకాశంగా మారి శివుని సమక్షంలో శంకరుని స్పర్శ, వీక్షణనే విజయంగా  మారి మనల్ని  పావన పరమానందం  కలిగించి కృతార్థులను చేసినది  💭⚖️🙂📝@🌳 📖09.09.2023(24)✍️ ENTREE కల్పవృక్షము

🙏 Vinayaka Caviti (వినాయక చవితి) (Revised)

Image
⚛️🪷📧 ప్రకృతి పదార్థం (పసుపు, పిండి),  మానవుడు, మృగం (ఏనుగు, ఎలుక)  దైత్యడు దేవత (మూషికసుడు మహేశ్వరి) ఇలా ప్రతికూల ప్రభావంలో  పరమార్ధం గల ప్రతిపదార్ధంతో  భవ్యంగా భావ్యంగా బాహ్యంగా  ఏర్పడిన భవ భగవంతుడు ఏకదంతుడు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంలా  చతుర్భుజ ఏకదంతునీ భావిస్తున్నాను. గణాధిపత్యం కోసం గజాననుడు కుమారస్వామితో   పాటు పోటీలో తల్లితండ్రులే సమస్తమని సంపూర్ణంగా విశ్వసించి, వారికి ప్రదక్షణ చేసి, భూ ప్రదక్షిణ ఘట్టంలో షణ్ముఖుడి కన్నా ముందు పుణ్యనదీ స్నానం పూర్తి చేసిన వాస్తవ విశ్వాస వ్యాఖ్యాన విగ్రహం వినాయకుడు....... ఉపమానం ఉపమేయ... అలంకారాలలోని అస్తిత్వాన్ని విశేషమైన విశ్వాసంతో  అభివ్యక్తీకరించి ఆశదృక్పధ "యద్భావం తద్భవతి" ఆనే‌  సానుకూల సరళ  సిద్ధాంతానికి, సాకారరూపంగా  గణపతిని గుర్తిస్తూ  ఆప్తులు అందరికీ  వినాయక చవితి  శుభాకాంక్షలు  💭⚖️🙂📝@🌳 📖07.09.2024✍️ (⚙️) EnTREE  కల్పవృక్షము పార్వతీదేవి ఒంటికి రాసుకున్న పసుపు ద్వారా మానవ దేహం, గజాసురునికి మూషికసురునికి వచ్చిన వరదానం ప్రకారం ఏనుగు మస్తిష్కం, ఎలుక వాహనం, దేవతల ఆశీస్సులతో ద్విజత్వం పొందిన దైవం వినాయకుడు ....... ప్రకృతి

Mukund & Pranitha BirthdaY

Image
⚛️🪷📧  చిన్నారి చిద్విలాస   చిట్టి చిరంజీవులారా సోదర సోదరీలుగా నంవత్సరాలలో తేడాలున్న తేదీల సారూప్యతతో  మీకు మీరు జరుపుకునే జన్మదినం నాడు, నా  హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు పండుగ  శోభమైన శుభాకాంక్షలు   💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Violence Against Women

⚛️🪷📧 అనాదిగా అబలలైన అతివల ఆక్రందన మహిళల జీవితం ఓ కర్మాగారం కాదు మగువ తనువు ఓ క్రీడాస్థానం కాజాలదు మానవతకి జన్మనిచ్చు జన్మ స్థానం.   శిశువులుగా పుట్టి పశువులుగా మారి  మానవ రూపంలోనే మృగాలై మారితే ప్రపంచం ప్రశాంతంగా పడుకుంటుందా! మూలం: అరుణ పొత్తూరి  సవరణ: భార్గవ శ్యామ ----------------------------- పురుషులందరూ లైంగిక వేధించే వారు కాదు.   నా స్నేహితుల్లో చాలామంది మగవారే.   నేను సంతోషంగా ఉన్నప్పుడు వారిని కౌగిలించుకున్నాను నేను బాధపడినప్పుడు వారి భుజాలపై ఏడ్చాను,  నేను నున్యత భావనలో వారి ఇంట్లోనే ఉండిపోయాను.   ఒక కుటుంబంలా వారు నా గౌరవాన్ని కాపాడారు. "తప్పులో వ్యక్తిని నిందించండి, వారి లింగాన్ని కాదు" మూలం: సోనమ్ మహాజన్ అనువాదం: భార్గవ శ్యామ 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

“Cultural Revitalization through Language Preservation: Tribal Language Programs In India”

Image
డా. బీ.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన జాతీయ సదస్సులో "భాష పరిరక్షణతో సంస్కృతిక పునర్జీవనం"- భారతదేశంలో ఆదివాసి భాషల పరిస్థితులు/కార్యక్రమాలు" ("Cultural revitalisation through language presentation"- tribal education programs in India) ఆంగ్ల భాషలో అది నా సాధారణ పరిశోధాత్మక వ్యాసాన్ని) వివిధ ఆచార్యుల సమక్షంలో నా వ్యాసం ఏ భాషలో వ్యక్తపరచాలో చెప్పండి అని సభా సదులను, సభ్యులను అడిగిన తరువాత అందరూ తెలుగు సౌకర్యమే అని అన్నప్పుడు తెలియకుండా మొహంలో వెలిగిన ఆ చిరునవ్వు అది. తెలియకుండా వచ్చిన చిరునవ్వుని నాకు తెలిసేలా తెలియజేస్తూ తీసిన చిత్రం చిత్రీకరించిన అపరిచితునికి ధన్యవాదాలు. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

On WhatsApp Forwarded Messages (Telugu)

Image
⚛️🪷📧 వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెని టైమ్స్) లలో దాదాపు 70-80% కాలం చెల్లినవి లేదా నకిలీవని మరియు అవి నిజమైన సమాచారం కాదు, అది వ్రాసే వారి వ్యక్తిగత విచక్షణ/వ్యాఖ్యానం/అపోహలు/ అభిప్రాయాలు మాత్రమే అని కొందరు చెప్తే విన్నాను. అది నాకు సరైనదని అనిపించింది.  అభిప్రాయాల సమాచారం ఎక్కువగా మెదడులోకి వెళ్లే కొద్దీ మనకున్న ప్రశాంతత చేజారుతోంది. వాట్సాప్ ఫార్వర్డ్ (మరీ ముఖ్యంగా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్) లను వీలైనంత వరకు తక్కువగా చదవడం లేదా చూడడం మంచిదనిపిస్తోంది. తీరికగా ఉండి చదివినప్పుడు, ఆసక్తి కలిగించేలా కనిపించినప్పుడు మనకున్న విచక్షణతో అభిప్రాయాల సమాచారాన్ని వడబోసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. ఎదుటివారికి ఉపయోగబడేదాన్ని/నచ్చే దాన్ని  బట్టి పంచుకోవడంకి సంబంధించి ఆలోచించవచ్చు.  చాలా మంది, వారి ఫోన్ స్టోరేజ్ దృష్ట్యా, ప్రశాంతత దృష్ట్యా ఫార్వర్డ్ లలో వచ్చే ఫోటోలు ఇంకా ఎక్కువుగా వీడియోల వల్ల లాభం కంటే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, కాబట్టి వారిపట్ల సహనుభూతితో ఉండడం ఉత్తమం అనిపించింది. ఒకవేళ వాట్సప్ ఫార్వర్డ్ పంచుకోవాలనుకున్న రాతలు పంచుకోవడం నయం, వీడియోలు పంచుకోవడం దాదాపు తగ్గిం

Rasool Sir

Image
⚛️🪷📧 సమతుల్య స్థితప్రజ్ఞతతో,  ఉద్యోగస్తులకు ఉతంగా ఉంటూ తగిన సమయం ఇస్తూ విత్తనంలో వృక్షాన్ని చూస్తూ  సహనంగా సామర్థ్యా  వృద్ధికై సమయాన్ని వెచ్చిస్తూ నిండైన నిర్వహణ  శక్తితో, సందర్భాను సారంగా  చాలా చక్కని చిద్విలాసంతో విలువుల విధిని విలక్షణంగా  నిర్వహిస్తూ, నిర్వహణకు  నిర్వచనంగా నిలిచారు రసూల్ సార్ కు ఆలస్యంగా అక్షర ఆకారంతో హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

T20 World Cup Win

Image
⚛️ 🪷 📧 క్రికెట్ క్రీడలో కీలకమైన కిరీటంతో  సామూహిక సంతోషాన్ని సిద్ధింపజేసిన భవ భారత జాతీయ జట్టు సామర్థ్యంతో సాధించిన సమిష్టి సాధనకు    శ్రావాణ శుభాకాంక్షలు విజయానందాన్ని వీడ్కోలు విచారాన్ని  ఒకేసారి ఒలకింపజేసి పాక్షికంగా పక్షానికి  దూరమవుతున్న ద్వయ  దిగ్గజాలకు ధన్యవాదాలు..  దీర్ఘకాలంగా దురదృష్టం దరిచేరుతూ  ధ్వజకేతనం దూరమవుతున్న, ధైర్యమైన దక్షిణాఫ్రికాకు ద్వితీయస్థాన ధారణనికి   ధన్యవాదాలు. ( గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ) 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity గెలిచిన వాళ్లకి ఓడిన వాళ్ళకి ఇద్దరికీ కన్నీళ్లు... ఇద్దరి పోరాట స్ఫూర్తి ⚡ ఇద్దరు బాగా పోరాడారు, ఒకరే గెలిచారు.... ఈ ఆనందంలో నాకు వచ్చిన బాధ రోహిత్ మరియు కోహ్లీ ఆటకు వీడ్కోలు పలకడం....

PV Narasimha Rao

Image
 ⚛️🪷📧 నిశ్శబ్ద నరసింహుడు విశేష విద్యావంతుడు బహు భాషవేత్త బహు ముఖప్రజ్ఞుడు స్వాతంత్ర్య సమరయోధుడు, మహా మేధావి మహామంచి (మంత్రి)నేత:  రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి -  కేంద్రమంత్రి- ప్రధానమంత్రి  భూసంస్కరణల కర్త, భూదాత; విదేశీ వ్యవహారాల విలక్షణుడు; నవోదయ విద్యాలయ నిర్మాత; ఆధునిక అంతర్ముఖుడు; అభ్యుదయ ఆర్థికవేత్త; నిరాడంబర రాజకీయ నియోగి. అయిన పాములపర్తి వెంకట నరసింహ రావు గారిని  వారి జయంతి రోజున జ్ఞానభూమి వద్ద నివాళులు అర్పిస్తూ ఆనందిస్తున్నాను  💭⚖️🙂📝@🌳 📖28.06.2022/24✍️  https://bharghavashyam.blogspot.com/2023/06/pv-narasimha-rao.html

అలవాటుకు సంబంధించి ఒక కథ...

⚛️🪷📧 పరీక్షల కోసం చదవడం అప్పుడు నాకు ఒత్తిడితో కూడిన వ్యవహారం లా అనిపించేది, పాటలు వింటూ నడవడం అనేది ప్రశాంతత కోసం నాకు నేను ఏర్పుచుకున్న ఒక అలవాటు. అప్పుడు నా పిజి మొదటి సంవత్సరం వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి, ఇక రెండో సంవత్సరం ఎంత కష్టంగా ఉంటుందో అని ఊహిస్తే భయం వేసేసింది, ఎలా దాన్ని ఎదుర్కోవడం అని మదన పడిపోయి, చింతలో ఉండిపోయాను. సరే ఇప్పుడు అన్ని మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా పాటలు వింటూ నడుద్దాం అనుకుంటూ బయటికి వచ్చి పాటలు వింటూ నడుసున్నాను. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది.  ఎల్లుండి కళాశాల ప్రారంభమవుతుంది, రెండు రోజుల్లో పాఠాలు చెప్పడం మొదలుపెడతారు, ఒకటిన్నర నెలల తర్వాత పరీక్షలు ఉంటాయి. అప్పుడు రాసే పరీక్షల కోసం ఇప్పటినుంచి ఎందుకు బాధపడాలి అనే ఆలోచన వచ్చింది. మనసు తేలికయ్యింది. మనం నిదానంగా చదువుతూ ఉంటే పరీక్షల్లో ఒత్తిడిని చిత్తు చేసి ఉత్తీర్ణులు అవ్వడం సులభం అనిపించింది. ఆ నడకలో ఇలా ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఇంటికి వచ్చాను.  నిజంగా అప్పటి ఇష్టమైన అలవాటుతో వచ్చిన ప్రశాంతతో వచ్చిన ఆలోచనలు నా విద్యను వర్గీకరించి సరళంగా బాగా చదవడం కోసం ఉపయోగపడ్డాయి, ఒక పరిష్కారం చూపించాయి. ఆ తర్వాత ను

Hari Babu Sir

Image
⚛️🪷📧 రోమికా రంగమున అధ్యాపకులకు అభ్యాసకులకు అధ్యయనాలు అందిస్తూ గ్రంథాలయ గుండెకలిగి హోదాతో హుందాగా హార్దిక హృద్య హృదయంతో వున్నహరి బాబు సర్ గారికి హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు పండుగ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Madhusudan Babai

ఖలేజా సినిమాలో రావు రమేష్ సిద్ధా పాత్రకు మహేష్ బాబు గురించి చెప్పే సమయంలో  "ఎవడిని చూస్తే భయం చస్తుందో" "ఎవడు తాకితే ధైర్యం వస్తుందో" "ఎవడు మన హృదయాల్లో నవ్వులు తెప్పిస్తాడో"  వాడిని తీసుకొని రా సిద్ధా అంటూ చెప్పే మాటలలా...   "ఎవరిని చూస్తే నాకు నమ్మకం వస్తుందో"   "ఎవరి మాటలు వింటే ధైర్యం వస్తుందో",  "ఎవరిని స్పృశిస్తే ఆనందిస్తానో " అతనె మా బాబాయ్. పరివార పరిధి దాటిన తర్వాత,  మీ  సమక్షంలో సమిష్టిగా ప్రశాంతతను సంతృప్తిగా పొందాను, ఆస్వాదించాను.  నిబద్ధతను నిర్మలత్వాన్ని క్రమశిక్షణను మీ  దగ్గర అనుభవించాను. మనోవేగంతో సాంకేతిక ప్రచురణల చేస్తూ  సామర్థ్యానికి స్మారకంగా నిలిచిన   మధు బాబాయ్ కు  హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Duo Couple

Image
⚛️🪷📧 ఆమంచర్ల అన్నదమ్ములు  సాయి పృథ్వీలకు భార్యలగా బాసటనిచ్చే స్నేహ ప్రవళికల రాకతో రూపాంతరంచెంది పరస్పర ప్రమాణాలతో ప్రమాణంగా ప్రయాణ బాధ్యతల బరిలో  భవ బంధ భావనగా  పెళ్లితో పరివర్తన  చెంది చక్కగా ఇద్దరుగా ఇరువురు ఈరోజునే స్నేహవత్సవ ప్రవళికనాథులుగా ఏకమైన ద్వి దంపతులు, సంతోషంగా సాగే సోదరులకు  వదినలకు ‌వివాహ వార్షికోత్సవ  శుభ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖09.06.2024✍️  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity --------------------------- Synergic Set Srivatsava and Sneha  (Annaiya and Vadina) 🤝 Aspirational Warm Wishes for Wedding Anniversary 👍 Maintain this Blissful Blossom Balanced Momentum Mutually in all Moments 🙂 Enjoy the Synergy 🌞🌹 ---------- Pleasant Pair  Prudhvinath Pravalika 👌  (Annaiya and Vadina) Auspicious Warm Wishes for 1st Wedding Anniversary 🤝 Blissful Beginning of Blossom Balanced Mutual Momentum:- Marriage 🙂 Enjoy the Energy 👍 💭⚖️🙂📝@🌳 📖09.06.2022✍️

Ramoji Rao (రామోజీ రావు)

Image
⚛️🪷📧 దివ్య దైనందిన దిన- పత్రికగా ప్రజలకు తెల్లవారుజామున తెలుగు మధ్యమంగా మనందరం చక్కగా చదివే వార్తలు, విశేషాలతో  అక్షరంగా అంతర్లీనమై  వుండిపోయిన ఓ విభూషణ  పాకశాస్త్రంలో "ప్రియ"గా  కొన్ని వేల కుటుంబాలకు "మార్గదర్శి"గా, ఈటీవీగా ఈనాటికీ  "కళాంజలి"గా కళకు  "మయూరి" మధ్యమంగా మంచి  చిత్రాలు, చిత్ర నగరం  రూపొందించి రాణిస్తూ  "ఈనాడు" పైవాడు  సమక్షానికి సమీపించిన  రామోజీ రావుకు నిర్యాణం నాడు నివాళులర్పిస్తూను ------ 📰 Eenadu.net 👌 ఈనాడు ఈతరానికి  అందించిన అక్షరయోధునికి నిర్యాణం నాడు నివాళులు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity https://enjoyingeditions.blogspot.com/2024/06/blog-post.html

కామేశ్వరరావు మామయ్య & లక్ష్మత్త

Image
⚛️🪷📧 క్రమపద్ధతుల కామేశ్వరరావు మామయ్య  లాలన లక్షణమైన లక్ష్మత్త  స్వీకరణ శక్తితో స్థిరంగా  సమతుల్యానికి సంపూర్ణత్వానికి   సంతకంగా సాగిన  ఆలుమగలు నా అత్తమామలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Anupam Kher's Incident for Inspiration

Image
📽️©️: Anonymous/అనామిక  ⚛️🪷📧 హిందీ నటుడు అనుపమ్ కేర్, ఒక ముఖాముఖిలో వైఫల్యం గురించి మాట్లాడుతూ, తన తండ్రి తనని ప్రోత్సహించిన చిన్ననాటి సంఘటనను ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు... అది నాకు చాలా బాగా నచ్చి ఆ వీడియోలోని మాటలను తెలుగులో అనువదించి ఇలా  కింద రాసి మీతో పంచుకుంటున్నాను.  నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను, ప్రతి తరగతిలోనూ మా రిపోర్ట్ కార్డును మా నాన్న దగ్గరకు తీసుకెళ్లాల్సి వచ్చేది. అందుకని నేను నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు సంతకం చేయండి అన్నాను.  అప్పుడు నాన్న నా మార్కులు చూసి, నువ్వు తరగతిలో 59 వ స్థానంలో ఉన్నవా? అని అడిగారు, దానికి నేను అవుననే అన్నాను.  మీ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? అని అడిగితే 60 అని చెప్పాను. అప్పుడు నాన్న నా విషయంలో దిగులు పడతారని అనుకున్నాను. కానీ నాన్న నాతో ఇలా చెప్పారు. నీకు తెలుసా, ఆటల్లో లేదా చదువులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ మొదట రావడానికి ఒత్తిడి ఉంటుందని, తనకు రెండో స్థానం వచ్చినా తనను తాను దిగజార్చుకున్నట్లు భావిస్తాడు. కానీ 59వ స్థానంలో వచ్చిన వ్యక్తి ఒత్తిడి లేకుండా 48, 37, 23, 16వ స్థానాల్లో రావచ్చు. కాబట్టి ఈసారి నువ్వ

Gundu Sudarshan Inspirational Words

Image
⚛️🪷📧 కృతజ్ఞతా దృక్పథం నా దృక్పథం. కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే. విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది. జీవితం ప్రశ్న అంటే, ఇంక జీవించడమే జవాబు అవుతుంది. కష్టాలు మన బలాలను తెలుపుతాయి,‌ సుఖంలో ఉన్నప్పుడు మన బలహీనతలు బయటపడతాయి. మెదడులో ఆ బాధలను అవమానాలు వచ్చినప్పుడు వాటిని వెలివేయాలి కానీ, వాటితో వ్యవహరించకూడదు. ----- Attitude of Gratitude is my attitude. Time comes means going along with time, that's all. In success there is our Worth, in victory others defeat is there. Life itself question means, living will be the answer. When hurt or insulted feelings come, the mind should not deal that it should delete those things. ---------------------------------------------------------------- Attitude of Gratitude is my attitude. విజయంలో మన విలువ ఉంటుంది, గెలుపులో ఇంకొకరి ఓటమి ఉంటుంది. కాలం కలిసి రావడం అంటే, కాలంతో కలిసి వెళ్లడమే. జీవితం ఒక ప్రశ్న అని తత్వవేత్త అన్నాడు, మరి దానికి జవాబు ఏంటి.? Life itself question means, living will be the answer కష్టాలు మన

In Journey

Image
⚛️🪷📧 ప్రస్తుతమున్న ప్రదేశం నుండి నా కనుచూపులో కనిపించే  దారిని దర్శిస్తూ, దూరం వెళ్లడంలో వుండే ప్రయాణాన్ని ప్రమోదంగా  పొందే ప్రయత్నంగా  చిద్విలాసమైన చరిత్రను  చింతన చేస్తూ సాగే సాధారణుడి  సందర్భ స్వగతం  💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Election Participation

Image
⚛️📧🪷 2014 - 2019 - 2024  ముచ్చటగా మూడో మారు 👆👆👆 వేసిన విలువైన వోటుతో  నేను సైతం ప్రజాస్వామ్యా ప్రపంచాగ్నికి  ఓటు రూపంలో సమిధనొక్కటి ఆహుతిచ్చాను. కారు వేగం నచ్చి వెళ్లిన  సైకిల్ దగ్గరికి ఆరోగ్యం కోసం వెళ్లిన  ఫ్యాన్ గాలి నచ్చి వెళ్లిన  గ్లాస్ అందం చూసి వెళ్లిన  కమలం వికసించిందని వెళ్లిన  గాలిపటం ఎగిరిందని అని వెళ్లిన  హస్తం హామీల వల్ల వెళ్లిన స్వతంత్ర స్వభావం నచ్చి వెళ్ళిన ఔన్నత్య ఓటుతో దేశానికి దోహదపడే చిరు ప్రయత్నానికి పాత్రుడునై చిద్విలాసం  చిందిస్తూ చేతి వేలికి విలువైన  చిక్కని చుక్క చిహ్నం ప్రబలమైన చిరు ప్రయత్నానికి  బలమని భావిస్తున్నాను. నా అస్త్రంతో నాకు నచ్చి నచ్చని వారి గెలుపోటములను నిర్ణయించలేను... కానీ యుద్ధంలో న్యాయంగా పాల్గొననే ప్రయత్నించాననే సంతృప్తి సదా ఉంటుంది.  💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Swathi Birthday

⚛️🪷📧 విద్యలో వికసించి  విచక్షణ విషయంలో  వృద్ధిచెందుతూ విలక్షణమైన  వ్యక్తిత్వంతో వున్న  సహోదరి స్వాతి  చక్కని చెల్లివై  అన్నయ్యకు అండగా  నిలుస్తూ నాపై  నాకు నమ్మకాన్ని  కలిగిస్తున్న కుట్టితల్లి  వ్యక్తిగతంగా వృత్తిలో  నాయకురాలిగా నమ్రతతో  నక్షత్రానివై నిలిచి  నామధేయమైన నాగ స్వాతిని సార్ధకం  చేసుకుంటావని చిద్విలాసమైన  చింతన చేస్తూ  హార్దిక హృదయపూర్వక పుట్టినరోజు పండుగ  శుభాకాంక్షలు అమ్ములు ----- My Strong Sibling, Smiling Sparkle, Stable Spirit  Supporting Strength,  Warm Blissful Blossom Birthday Wishes to you Ammulu. 💭⚖️🙂📝@🌳 అక్షర అనంద అస్తిత్వం  Energy Enjoy Entity ------- 10.05.2023 హార్థిక హృదయపూర్వక పుట్టినరోజు పండగ శుభాకాంక్షలు స్వాతి. స్వాతి అంటే సంజ్ఞ దేవి అని; సంజ్ఞ అంటే తెలివి, దారి చూపే వెలుగులు దేవి అని అర్థం ఈ జీవితం నీకు మరియు అందరికీ వెలుగులమయం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను... నేను ఆమె నుండి అందుకున్న "స్పా" (వెలుగు) 1) సహనం యొక్క శక్తివంతమైన ఆలోచన ప్రక్రియ, 2) నా నిర్ణయాలకు ప్రేరణ , 3) నా సామాజిక ఒత్తిళ్లు మొదలైన వాటి నుండి సడలింపు. 4) మొదలైనవి. &quo

My words in Counseling

⚛️🪷📧  My words in Counseling Don't feel bad that she gave signals and disappeared by saying thanks, In that her mistake is not there and please be happy, because without psychologically and physically hurting her, you treated her well. Pray for her wellness, wherever she is, and Remember, those attractive emotions of that time is not love, it's sweet feelings in the memories. తను సంకేతాలు ఇచ్చి తరువాత కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయిందని బాధపడకు, ఇందులో తన తప్పులేదు మరియు నీ ప్రవర్తన పట్ల సంతోషంగా ఉండు, ఎందుకంటే ఆమెను మానసికంగా మరియు శారీరకంగా బాధించకుండా, బాగా చూసుకున్నావు. ఆమె ఎక్కడున్నా బాగుండాలని ప్రార్థిస్తూ జీవితం అనే పుస్తకంలో తనివి రెండు పేజీలని, ఆనాటి ఆకర్షణీయ భావోద్వేగాలు ప్రేమ కాదు జ్ఞాపకాల్లో మధుర స్మృతులని గుర్తుంచుకో.  (ఈ ఆలోచనలు, నా ఆప్తుడు అక్బర్ నుంచి .. ) 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Babu Babai & Tulasi Pinni

Image
⚛️🪷📧 సంవత్సరాలు 31 రోజులు 11323 నెలలు 372 గంటలు (సుమారు) 271752 వారాలు 1617 నిమిషాల (సుమారు) 16305120   క్రితం కళ్యాణంతో కలిసిన భార్యాభర్తలు బాబు బాబాయ్ తులసి పిన్ని  సంభావ్య సంతానంతో  తల్లితండ్రులుగా తులసి పిన్ని బాబు బాబాయ్  ఏకమై ఎదిగిన  ఇరువురికి ఇంపైన  విధంగా వివాహ వార్షికోత్సవ  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Reflection on interactive video

https://youtu.be/FxcvAFUqzKc?si=SZcBm61UdHip102w ఉమా దేవి గారు:  ఈ వీడియోలో మీ అనుభవాలు విన్న తర్వాత నాకు అనిపించిన అభిప్రాయాలు ఇవి. గ్రామ వాసులు గ్రామాలలో ఉండడం మన అదృష్టం వారి దురదృష్టం. గ్రామ వాసుల జీవనం దాదాపు ప్రకృతితో ముదిపడి ఉంటుంది, దీనివలన పర్యావరణానికి చాలా మేలు జరుగుతున్న, కాలానుగుణంగా అవతరిస్తున్న సరికొత్త జ్ఞానానికి వారు దూరంగా నిరక్షరాస్యులుగా ఉండడం బాధాకరం. (తెలియక చేసిన పొరపాట్ల వల్ల అర్హత ఉండి ప్రయోజనం పొందలేని పథకాలకు సంబంధించి.) స్థానిక అవసరాలకు అనుగుణంగా స్థానికంగా ఐక్యత ఉండడం, నాయకుల సహకారం వారి సౌలభ్యానికి దోహదపడుతుంది. (స్థానిక పండగలకు సెలవు ఇచ్చేందుకు అధికారులకు ఉన్న విచక్షణ అధికారం చాలా బాగుంది) 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

On Wildlife Photographers

Image
⚛️🪷📧 అరణ్య జీవుల జీవితాన్ని అందంగా  చక్కగా చూపించే చాలా చిత్రకారులకు 🤝 అడవి అందాలను చక్కగా చూపిస్తూ  విలువైన సమతుల్యతను  సంరక్షించే విధంగా పరోక్షంగా ప్రేరేపిస్తూ కారణమవుతూ కాపాడుతున్న  వన్యజీవ చిత్రకారులకు కృతజ్ఞతాభివందనం  💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Veera & Sai Birthdays

⚛️🛞🪷 వేగంగా వంటపట్టించుకుంటూ వడివడిగా వృద్ధి చెందుతున్న వీరాకు (పునః సమీక్షకతో తప్పులను దిద్దడం, నాకు అండగా అనిపించింది) హార్దిక హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ------------- ధైర్యం ధారణగావించి సవాళ్లను స్వీకరిస్తూ సాంకేతిక ప్రచురణతో  సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ  ఎదుగుతూ  ఎగురుతూ  ఆంధ్రజ్యోతిలో సినిమా పేజీ  రూపకర్తగా రాణిస్తున్న  సాయికి  హార్దిక హృదయ పూర్వక  జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Garima Birthday

Image
⚛️🪷📧 At one Step, near the ocean, Even though it's fully not visible, that point in a scope of the part will be broad. Like that, these "G" characteristics in the image will applicable to you. Feeling & Reminding these "G" characteristics of you Garima. Blissful Blossom Birthday  Warm Wishes to you Garima Sharma  Hope Hype Happiness Hails in Heart. Enjoy your Energy. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Unity-Interpretation

⚛️🪷📧 Broad General Statement: Cosmos are Connected  Universe has Unity In Insightful interpretation  Interlinkage impression will be there.  స్థూలంగా సాధారణ వాఖ్య: అణువులు అనుబంధంతో ఉన్నవి. విశ్వానికి ఐక్యత ఉంది. అంతర్దృష్టి అనుసంధానమైన  వ్యాఖ్యానంతో వాటిని వీక్షించగలం. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Hanuman Jayanti

Image
⚛️🪷📧 బల భీమ భయనాశక బుద్ధిమంత బలవంత భవదీయ భజరంగబలి అంజనీపుత్రడు ఆంజనేయుని  అంతరంగమున అంతర్లీనంగా  అతులిత ఆత్మరాముడు‌  🙏🙏🙏 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Vipassana (విపాసన)

⚛️🪷📧 కాలంలో, ప్రస్తుతం ప్రధానమైనది. వర్తమానాన్ని గమనిస్తూ (ఏకాగ్రతగా) ఉండడం ఉత్తమమైనది. దానిని బౌద్ధంలో విపాసన  అంటారు. కానీ ఇప్పుడు, నా ప్రస్తుతంలో గతం మరియు భవిష్యత్తు కూడా ఉన్నాయి వాటి నుండి తప్పించుకోలేను. ఇది నాకు అసాధ్యమనిపిస్తుంది. కాబట్టి ప్రతిస్పందించకుండా గమనించే ఆలోచన (అది వర్తమానానికి గమనించమని చెప్తుంది, నేను గతం భవిష్యత్తు గల ప్రస్తుతం)కు ఉపయోగించి నా మానసిక సామర్ధ్య స్థాయిలో సత్యాన్ని (ఆనందాన్ని) అర్థం చేసుకునే ప్రయత్నానికి ప్రయత్నం తప్పక చేయగలను అనిపిస్తోంది. ------------------ In time, Present is the Prime. Observing (Concentrating) the present will give the best for sure. In Bhuddism it is called Vipassana. But now, in my present there is past and future too, from which I cannot escape. It is inevitable for me.  So the idea is to observe without reacting (In that said about the present, which I use for Past & future pertaining Present) to understand the truth (Happiness) at my cognitive level. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Dreams

⚛️🪷📧 కడపటికి కలలు  కార్యరూపంలోకి చేరకున్నా కమనీయ కలలు కన్నందుకు  చిద్విలాసం చిందిస్తూన్నాను --------- At Last Dreams didn't work out, but I'm glad to have them as memories. 💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం  Energy Enjoy Entity

Reflections on Subjective Gift

Image
7 years for a Belated Birthday Gift to Me by you all & My PPT Presentation  (Mutual Subjective Gifts) On this day in 2017 (18 Apr), Tuesday after Curriculum Studies Class, we have some free period. In that period I silently planned to present a Class PPT for to express some casual gratitude to you all.  After the class, when I'm going to say about that presentation, Suddenly as a representative Gagan entered on to the dias and informed about my Birthday presentation and welcomed me to receive the gift. You all cheered me up to receive the Priceless Spectacular Subjective gift.  It's the overwhelming cherished moment in my life to comemarate.  Since then to till now, whenever I feel down, I read your messages, it is acting as a Booster Dose for me to gain and regain energy..... This subjective gift, deals with two sides which enlarges Ego and enhances Esteem... You can see and hear my words... But I can only read my own thoughts, it's not visible to you to see otherside.