Abigyna-Amukta (Telugu)
⚛️🪷🌳
మోహన కిరణాల క్రాంతి మీమాంసతో
సుమధుర సాహితీ సాంస్కృతిక స్ఫూర్తితో
అభిజ్ఞానశాస్కుంతలం ఆముక్తమాల్యదల
నేపథ్యంతో నామకరణం
జరిగి జాబిల్లిలా
చిగురించిన చిన్నారుల్లారా,
చక్కగా చదువుతూ
చల్లని చిద్విలాసంతో
అంతర్శక్తి అభివ్యక్తీకరణతో
ఆసక్తులను ఆస్వాదిస్తూ,
అనంతమైన ఆనంద
అనుభవాలతో అనుసంధానం
అవ్వాలని ఆకాంక్షిస్తూ,
పసి పిల్లలు కవల కోడల్లకు
హార్థిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభప్రద శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖30.12.2024(22/23)✍️
Comments
Post a Comment