💌Edited Editions✍️ (సవరించిన సంచికలు)

24 Mar 2020
‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో వాయు, శబ్ద కాలుష్యాల తీవ్రత తగ్గింది"

మన జీవన శైలి వల్ల ఇన్నాళ్లు వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడిందని, కరోనా వైరస్‌ వల్ల అవన్నీ తగ్గుముఖం పట్టాయని కరోనా భయంతో ప్రజలు తమ కార్యకలాపాలు తగ్గించుకోవడంతో ఇది సాధ్యమైందంటూ ఓ ట్వీట్‌ చేశాడు టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ అన్నాడు.

‘‘ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిని నయం చేయడానికి భూమాత ఓ మార్గాన్ని ఎంచుకుంది. కొద్ది కాలంలోనే మన జీవనశైలిని మార్చుకునేలా చేసింది. వాతావరణ మార్పులను సరిదిద్దే చర్యల్లో మనం ఎప్పుడూ అలసత్వం వహిస్తూ వచ్చాం. కానీ, మన అందరం కలిసి చేసే పనులను రివర్స్‌ చేసి.. తనని తాను భూమాత నయం చేసుకుంటోంది’’

26 Mar 2020
"బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌, ఆ బలహీనుడి పక్కనా ఓ బలముంది"". 'జనతా గ్యారేజ్‌ ఇచట అన్ని రిపేర్లూ చేయబడును’

ఇదో సినిమా డైలాగ్‌ అని అందరికీ తెలిసిన సంగతే. కానీ ప్రస్తుత పరిస్థితులకు ఒక్కసారి అన్వయించి చూసుకుంటే......
విశ్వం సంగతెందుకు గానీ ఈ భూమ్మీద మాత్రం అత్యంత బలవంతుడు మనిషే. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉంది. ఆలోచించే తెలివితేటలూ ఉన్నాయి. 
కరోనా వైరస్‌ కంటికి కనిపించని ఓ సూక్ష్మక్రిమి. పరిమాణం ప్రకారం అత్యంత బలహీనం. ఇప్పుడా బలవంతుడినే బలహీనుడిగా మార్చేసిందది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తూ మానవాళి మనుగడకే సవాల్‌ విసురుతోంది కొవిడ్‌-19. బలహీనులమని భయపడుతున్న మనకిప్పుడు ఓ బలం అవసరం. అదే సంకల్పం, సంయమనం. ఇక స్వీయ నిర్బంధం ఇప్పుడు చేయాల్సిన మొదటి రిపేరు దీని వెనుక శాస్త్రీయత చాలానే ఉందంటున్నారు నిపుణులు.

05 Sep 2020
సమాజ వ్యవస్థలో ఒక లోపం ఉంది. 
కొత్తగా అధికారం వచ్చిన వెంటనే కొందరు అప్రయత్నంగా మన చుట్టూ చేరిపోతారు. కొత్త చోటు, వాతావరణంలోకి వెళ్లిన తర్వాత మొదట్లో అలాంటి వారు అవసరం అవుతారు. కానీ వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోతే బయటకు రావడం కష్టం. నాయకత్వం విజయవంతం కావాలంటే మీ కళ్ళకు వడపోత శక్తి కావాలి. అప్పుడు అవసరమైన అంశాలే మన మెదడు లోకి వెళ్తాయి అలా కాకుండా ఉంటే అనవసరమైన చెత్తంతా మీ లోపలికి పంపిస్తే ఎదుటివారికి మీరు చెత్తబుట్ట అవుతారు. 

ప్రజాప్రతినిధిని గౌరవించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ప్రజా ప్రతినిధి కి ప్రాధాన్యం ఉంటుంది వారితో విభేదించినా దానికి ఒక పద్ధతి ఉంటుంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో ఇప్పుడు మీకు శిక్షణ ఇస్తున్న అతుల్ నా భద్రత వ్యవహారాలను పర్యవేక్షించేవారు. అప్పట్లో చుట్టూ ఉండే పోలీస్ వాతావరణం నాకు నచ్చేది కాదు అప్పుడప్పుడు నిబంధనలు ఉల్లంఘించి భద్రతా వలయాన్ని బయటికి వెళ్లి ప్రజలను కలిసే వాడిని. ఒకసారి అతుల్ నా దగ్గరకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. జూనియర్ అధికారి అయినా ఆయన సీఎం కళ్ళలో కళ్ళు పెట్టి ఎలాంటి బెరుకు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి వెళ్ళకూడదు అని గట్టిగా చెప్పారు. నాకు కోపం వచ్చింది నా జీవితాన్ని మీరు నిర్దేశిస్తారా నేనేం చేయాలో ఏం చేయకూడదో మీరు ఏలా నిర్ణయిస్తారు అని అడిగాను. అందుకు ఆయన ఒక్క క్షణం కూడా భయపడకుండా ఇప్పుడు మీ జీవితం వ్యక్తిగతం కాదు మీరు ఇప్పుడు రాష్ట్ర ఆస్తి ఆ ఆ స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నిబంధనలు పాటించాలి అని నిర్మొహమాటంగా చెప్పారు.

ఆయన మాటల్లో ప్రజాస్వామ్యం ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కనిపించింది. నా రాజకీయ జీవితం తొలినాళ్లలో జరిగిన ఈ సంఘటన ఇప్పటికి నా మనసులో నాటుకుపోయింది. 

ఓ అధికారి దృఢ చిత్తం ప్రదర్శిస్తూనే ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రతినిధి ప్రాధాన్యాన్ని గుర్తించి వివరంగా చెప్పిన విధానం మనసులో ఉండిపోయింది.

24 Sep 2020
Reflective Writing is an Articulating of thoughts. It turns mere vague perceptions into descriptive theoretical vision through the process of Thinking.

It is a naked exercise of inner-self. It filters the emotive noise in self. Helps in hearing of intuitive thoughts. and makes bad piece (Situations) as better peace (Status) in mind process

Edited Content from Arpit Goel's Post.

26 Sep 2020
మన శరీరం లోకి వెళ్లిన గాలి ఒక నిముషంలో, వెళ్లిన నీరు 4 గంటల్లో,
ఆహారం 24 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనకు ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి రోగ గ్రస్థులను చేస్తుంది. 

ఆ గత ఆహారం లాగానే గత స్మృతులు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మాలిన్యంగా మారుతాయి. 

ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. కానీ అవి కూడా కాలక్రమేనా మాలిన్యంగా మారతాయి అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది.

మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే గత స్మృతుల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ గత ఆనందమే కాలక్రమేణా మాలిన్యంగా మారవచ్చు. 

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని జీవితాల్ని మృతప్రాయం
ఉన్నవాటిని మెల్లిమెల్లిగా తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజూ ధ్యానం, పరివర్తన పూరిత ఆలోచనలు ద్వారా ఆ మానసిక మాలిన్యాలను శుద్ధి చేసి. మళ్లీ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలి. 

అప్పుడు మనం జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటాము. 

పరమాత్మ మమ్మల్ని శుద్ధిని చేసుకునే శక్తిని ప్రసాదించు.

09 Oct 2020
Success will not lower its standard for you. We must raise our standard to success. 

This exam has always been unpredictable and will remain so. Yet, scores of students will clear it every year with relative ease.

Instead of seeking to find fault with the UPSC, which will serve no purpose, ask yourself what you can improve in your preparation.

Criticism does not empty tomorrow of its problems, it empties today of its resolve.

At the heart of every crisis there is the seed of its own resolution, one that expands our Self-awareness and opens us to new possibilities for greater Self-expression.

10 Dec 2020
అ: మీరేంటి ఇప్పుడు సంఘం, సేవ అంటూ బయల్దేరారు. ఒక మంచి ఉద్యోగం చూసుకోండి, మాంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యాక అప్పుడు మొదలెట్టండి ఇవన్నీ. ఏదో చెబుతున్నాం అని కాకుండా కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి గురువు గారు."
 
ఆ: నేను చేసే ఈ పనులకు నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టట్లేదు - రానూపోనూ సిటి బస్సు టికెట్ ఛార్జ్ తప్ప. మరి బీరు, సిగేరెట్ తాగుతున్నారే మీరందరూ వాటికి డబ్బు ఖర్చు అవుతోంది కదా. మరి మీరు కూడా ఇవన్నీ మీ పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యాక చేసుకోవచ్చు

15 Jan 2021
గాలికి ఎగురుతున్న ఎండుటాకు 
జీవం కోల్పోయిందని వాడు అంటాడు 

సంకెళ్ళేమీ లేకుండా ఎగురుతూ  
బంధనాలు తెంచుకుని 
స్వేచ్ఛగా ఉందని ఇంకోడు అంటాడు 

ఏది నిజం 🤷 🤔
--------------------
జీవం కోల్పోడం నిజం ప్రకృతిలో తిరిగి మమేకం అవ్వడానికి ప్రయత్నం మొదలయ్యింది అనుకోడం వాస్తవం. 

జీవం లేని స్వేచ్ఛ వ్యర్థం కదా!! స్వేచ్ఛ, రెక్కలు ఇవన్నీ మన కల్పనలు. కల్పనకు ఆధారం మనం చూస్తున్న వాస్తవాలు.

22 Mar 2021
మనుషులమైన మనందరికీ మనశరీరాలు, వాటి విధులు చిన్న చిన్న తేడాలతో ఒకేలా ఉంటాయి. కాని మారేవీ, చాలా విపరీతంగా విభిన్నంగా ఉండేవీ మన ఆలోచనా సరళులు మాత్రమే. 

నేను పుట్టినప్పుడు ఒక ఖాళీ మెదడుతో పుట్టాను. ఆ తరువాత నేను పెరిగిన వాతావరణం, నేను కలిసిన మనుషులు, నేను చదివిన పుస్తకాలు, నాకు ఎదురైన అనుభవాలు వగైరాలన్నిటి మూలాన నా తలలో నేను అనే ఒక ఆలోచనల సమూహం ఏర్పడింది.

నేను తెలుసుకున్న, అనుభవించిన పరిస్థితుల్నించి నేను నిర్ణయించు కున్న జీవన విధానం నుంచి నేను నమ్మే నా సిద్ధాంతం పుట్టుకొచ్చింది.

నా ఇష్టంలో 
రామ్ గోపాల్ వర్మ

07 May 2021
The attractive emotions of that time are not love it's sweet feelings in the memories. Which made me happy without physically and mentally hurting her. She has given those signs and disappeared I'm saying sad thanks to her. 

I'm satisfied, I have taken two pages of sweet feelings in the book of life. The writings written so far are dedicated to her with prayers that she will be well wherever she is.

జీవితం అనే పుస్తకంలో తనివి రెండు పేజీలని, అప్పటి ఆకర్షణాపూరిత ఉద్వేగాలు ప్రేమ కాదని చెలిమి అని, స్మృతిలొని మధురానుభూతులను నెమరు వేసుకుంటూ తననెప్పుడూ శారీరకంగా మానసికంగా బాధించకుండా సంతోషంగా ఉంచాననీ తృప్తిచెందే మగతనంతొ, ఆ గుర్తులు ఇచ్చి కనుమరుగైనందుకు చెప్పుకునే బాధాతప్త ధన్యవాదాలతో, ఆమె ఎక్కడున్నా బాగుండాలని బాగుంటుందని కోరుకునే ప్రార్థనలతో ఇప్పటివరకు రాసిన రాతలు ఆమెకు అంకితం. 

సేకరణ: Akbar 
సవరణ: Bharghav Shyam

12 May 2021
🙏 శ్రద్ధావాన్ లభతే (భక్తి) జ్ఞానం 🙏

శ్రద్ధతో చేసే ప్రతి పని దైవార్పిత కార్యంగా మారి ధ్యానమై మనసును శుద్ధి చేస్తుంది.

"జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం శ్రద్ధ లోపించటమే! తనకు అవసరమైన వస్తు/విషయాల పైన శ్రద్ధ పెట్టలేని మనసు, దైవం పైన శ్రద్ధ ఎలా పెడుతుంది?

ఎక్కడి నుండి తీసిన వస్తువును తిరిగి అక్కడ పెట్టే గుణం, శ్రద్ధను పెంచుతుంది. మనం అశ్రద్ధనే మతిమరుపు అని అంటున్నాం. శ్రద్ధతో పనిచేస్తే శాంతి కలుగుతుంది. 

ప్రతి చిన్నపనిలో శ్రద్ధ అలవడితే శాంతంగా మరి శుద్ధి అవుతాము.

స్వేచ్ఛ సవరణ- ఆనాభాశ్యా

01 Jun 2021
పలకరింపు మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది. 

మనుషుల మధ్య సంబంధాలకు ప్రాథమికమైన ప్రధాన వనరు, గొప్ప మానవాంశం ఈ పలకరింపు. పలకరింపుతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి 
నిదర్శనంగా నిలుస్తుంది.

03 Jun 2021
😇🙏 కృతజ్ఞత🙏❤️

సృష్టిలో ప్రతీది స్పష్టమైనది మరియు శక్తి కలిగినది. నీకు ఆనందాన్ని ఇచ్చిన ప్రతీ ఒక్క మనిషికి, వస్తువుకు, జంతువు, ప్రకృతికి ఇలా అన్నిటికీ హృదయం❤ లో కృతజ్ఞత సమర్పించి ప్రేమగా స్పృశించు. సున్నితంగా వాడు, ఈ విధానం నీకు, మరో ప్రపంచాన్ని🌏 పరిచయం చేస్తుంది.. 🌳🧘‍♀🦢🌷🦋🌈🙏

కళ్ళకు బాగా చూపించే అద్దాల 👓 కి 
అందంగా చూపించే అద్దాని 🪞 కి
వినోదాన్ని ఇచ్చే దూరదర్శిని 📺 కి
కూర్చోడానికి చోటు ఇస్తున్న కుర్చీ 💺కి
సమయాన్ని చూపిస్తున్న గడియారాని 🕔 కి
గాలిని ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్న చెట్లకి 🌳🌴,
ఇలా ఉపయోగించే వస్తువుల పట్ల కృతజ్ఞత ఉండడం దైవత్వం!

13 Aug 2021
People love me and also hate me. There is nothing to do with it directly, because it is their psychological acquisition property, it directly belongs to them itself. but Indirectly impact us.

ప్రజలు నన్ను ప్రేమిస్తారు, మరియు ద్వేషిస్తారు. దానితో నేరుగా ఏమి చేయలేము, ఎందుకంటే అది వారి మానసిక సముపార్జన, అది వారికే సొంతం. కానీ దాని ప్రభావం మన మీద ఉంటుంది.

08 Apr 2022
తొలి ఉద్యోగం ఎవరికైనా ప్రత్యేకమే! తొలి ఉద్యోగం ద్వారా వచ్చిన తొలి సంపాదన మనలో ఎక్కడలేని ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఎవరైనా సరే.. ఉద్యోగం చేసేది అంతిమంగా ఆదాయం కోసమే! ఆర్థిక స్వేచ్ఛ సాధించామని, వచ్చే ఆదాయంతో తమకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చని.. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఇలా ఎవరి ఆలోచనలు వారికుంటాయి. ఆర్థికంగా వెనకబడకుండా, డబ్బు సమస్యలు రాకుండా ముందస్తు ఆలోచనలే మనల్ని కాపాడతాయని గుర్తుపెట్టుకోండి. 

పని ప్రదేశంలో యూనిఫాం ఉండకపోవచ్చు.. కానీ హుందాగా డ్రస్సింగ్‌ వేసుకోవడం, చూడచక్కగా తయారవడం తప్పనిసరి. అదే మీ సభ్యతను, సంస్కారాన్ని ఎదుటివారికి తెలియజేస్తుంది. (మన సంస్కృతిని ప్రతిబింబించేలా నిండుగా ఉన్న దుస్తులు ఎంచుకోవాలి. ఒకవేళ వెస్ట్రన్‌ ఎంచుకున్నా.. మీకు నప్పినవి, మిమ్మల్ని హుందాగా చూపించే అవుట్‌ఫిట్స్‌కి ప్రాధాన్యమివ్వాలి.)

పరిజ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు చదవచ్చు. ఇలా మీరు ఏది చేసినా పరోక్షంగా మీ ఉద్యోగ ఎదుగుదలకు దోహదం చేసేలా చూసుకోవడం ఉత్తమం.

21 Aug 2023
మూలం: అనసూయ భరద్వాజ 
సేకరణ: ఈనాడు 
సవరణ: ఆనాభాశ్యా  
👁️‍🗨️👌🔖♻️@🌳

"విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ, ఒకరికొకరు సంతోషాన్ని.. సమాచారాన్ని.. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను.. జీవనశైలిను పంచుకోవడం కోసమే ఈ సామాజిక మాధ్యమాలు అనేవి వచ్చాయని అనుకుంటున్నా. 

కాకపోతే, ప్రస్తుతం ఉన్న రోజుల్లో సామాజిక మాధ్యమాలు వేదిక మీద మంచి కంటే చెడు ఎక్కువ ఉందనిపిస్తోంది. అన్ని ఇక్కడ నా జీవితంలో భాగమే. నా జీవితానికి సంబంధించిన అన్నింటినీ మీతో పంచుకున్నా. సమస్యలు ఎదురైనప్పుడు నేను కూడా బలహీనతకు గురి అవుతా. మనిషిగా అది సహజం"

"ఒక ప్రముఖవ్యక్తిగా తటస్థ భావాలు, దౌత్యభావాలు అనుసరించేందుకు నా పై ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది నా నిజమైన బలం కాదు. నా బలహీనతను పంచుకోవడం శక్తి, వ్యతిరేకతను అంగీకరించే ధైర్యమే నా బలం. సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఆ బాధనంతా పోగొట్టుకొని, ఒకట్రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో మళ్లీ సవాళ్లను ఎదుర్కోండి. #ltsOkaytoBeNotOkay విశ్రాంతి తీసుకుని.. మనల్ని మనం ఛార్జ్ చేసుకుని తిరిగి రావాలి. అంతేకానీ అక్కడి నుంచి పారిపోకూడదు"

"ఎదుటి వ్యక్తిపై మీరు చేసే వ్యాఖ్యలు వాళ్లను తీవ్ర ఇబ్బంది పెట్టొచ్చు. కాబట్టి దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండండి. ఈ విషయాన్ని నేను కష్టపడి నేర్చుకున్నా. గమనిక: ఇప్పుడు నేను బాగానే ఉన్నా. దాదాపు ఐదు రోజుల క్రితం నేను ఈ బాధను అనుభవించా. ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డ్ చేశా". 
--------
'మీరు త్వరగా ఓ నిర్ణయానికి రాకుండా ఉండాల్సింది. ఊహాగానాలను ముఖ్యాంశాలుగా పెట్టకుండా ఉండాల్సింది. నేను పంచుకున్న సమాచారం అర్థంకాకపోతే రెండుసార్లు చదువుకోవాల్సింది. అందరి దృష్టిని ఆకర్షించడం కోసం నేను ఈ పోస్ట్ పెట్టానని అంటున్నారు. మనం ఈ వేదికలో ఉన్నదే ఇతరుల దృష్టి పడేందుకు కోసమే. మీరు ఎవరిని నిందిస్తున్నారు. కనీసం నేను ఈ విషయాన్ని పారదర్శకంగా అంగీకరిస్తున్నా. అవును నాకు సంబంధించిన ప్రతి అంశంలోనూ నాకు మీ శ్రద్ధ కావాలి" .

"సామాజిక మధ్యమ ట్రోలింగ్ వల్ల నేను బాధపడలేదు. నా భావన ఏడుపుతో ఉండదు కోపంతో ఉంటుంది. నా జీవితానికి సంబంధించిన ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకున్నా. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదనుకున్నా 
.. 
సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే వ్యక్తం చేసే క్రమంలో మేము ఎంతో ఒత్తిడికి గురవుతాం. ట్రోలింగ్ వల్ల బాధపడే అంత బలహీన వ్యక్తి నేను కాదు" 

------
ద్వేషాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతా మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే బలంగా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇదే కదా కపటధోరణి అంటే.

ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే, నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా వ్యవహించి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.

ఏది ఏమైనా ఇంతకముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. ద్వేషులను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. 'మీరు నా బలం, శక్తి"

02-Oct-2023
ఎవ్వరూ సర్వోత్తముడు కారు.‌  మనిషి అంటేనే నలుగు మరియు తెలుపు కలిసిన బూడిద రంగు వ్యక్తిత్వంగా ఉంటుంది. ఏ ఛాయలు.
ఎక్కువగా ఉంది అనే దానిని బట్టి ఆ‌‌ వ్యక్తిత్వాన్ని మంచి అనో చెడు అనో భావిస్తాము.‌ 
సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకసారి అన్నాడు... మనుషులు చేసిన కొన్ని పనులు లేక వారి కొన్ని ఆవిష్కరణలు గొప్పవి కావచ్చు. అంత మాత్రాన ఆ మనిషిని గొప్ప వాడు అనుకోనక్కర్లేదు. మిగిలిన ఎన్నో విషయాలలో ఆ‌ మనిషి కూడా అందరిలాంటి వాడే.‌ ఆ ఒక్క గొప్ప విషయాన్ని పక్కన పెడితే మిగిలిన ‌విషయాలలో అందరికీ ఉన్నట్లే బలహీనతలు ఉంటాయి.‌ బూడిద రంగు ఛాయలు ఉంటాయి.
✍️: Rajesh Kumar 
⚙️: Bharghav Shyam 
------------------------------
30 Sep 2023
డా.తను జైన్ ప్రశ్న:
భారతదేశం అసహనంగా మారుతోందని మీరు అనుకుంటున్నారా?
జునైద్ సమాధానం:
లేదు, అసహనంగా ఉంది అని అనను, భారతదేశంలో విస్తృతమైన వైవిధ్యం మరియు బహుళదనం ఉంది కాబట్టి ఎప్పుడూ ఆలోచనల మధ్యన సంఘర్షణ ఉంటుంది. కానీ, చరిత్ర నుండి మధ్యయుగం నుండి ప్రస్తుత కాలం వరకు మనం చూస్తే ఈ ఆలోచనలు, అవి సంఘర్షణలో ఉన్నప్పుడు, అవి ఒక రకమైన అసహనం ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ వైవిద్యమైన ఆలోచనలు ఉండటమే భారతదేశ గొప్పతనం. వైవిధ్యమే విస్తృతమైన విషయాలను వ్యక్తపరుస్తుంది మరియు నేను ఒక సూక్తి చదివాను "భారతదేశం, ఎప్పుడూ గందరగోళం మరియు స్థిరత్వాల మధ్య ఎంపిక గురించి కాదు. ఇది ఎల్లప్పుడూ నిర్వహించదగిన మరియు నిర్వహించలేని గందరగోళం గురించి. కాబట్టి, మన గందరగోళం చాలా నిర్వహించదగినది..
-------
Dr. Tanu Jain Question: 
Do you think that India is becoming intolerant?
Jaunaid Answer: 
No, I will not say intolerant, I will say because there is huge diversity and pluralism in India, that's why there is always a conflict of ideas.
We can see from history to medieval to the present times. So, these ideas, when they are in conflict, they show up as if there is some kind of intolerant.
But this is the richness of India that the conflicting ideas are there for Strength.
And I read one quote that "In India, it is never about the choice between chaos and stability. It is always about manageable and unmanageable chaos"
So, our chaos is very much manageable.
----------
These lines are written from UPSC Mock Interview Video.

06 Oct 2023
ఈ సంభాషణలు ఆంగ్లంలోని UPSC సన్నాహక ముఖాముఖి చూస్తూ రాసి, తెలుగులోకి అనువదించినది.  

మదన్ మోహన్ ప్రశ్న: 
మీ గత జీవితంలో మీరు తీసుకున్న మూడు నిర్ణయాలను తొలగించే అవకాశం మీకు లభించిందని అనుకుంటే, మీరు వేటిని తొలగిస్తారు

వైశాలి జైన్ జవాబు: 
సార్, నేను ఏ తప్పుడు నిర్ణయం గురించి ఆలోచించలేకపోతున్నాను.

మదన్ మోహన్: అంటే, మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పుడు సరిగ్గా ఉన్నాయా?

వైశాలి జైన్:  
సర్, నేను తీసుకున్న నిర్ణయాలు పరిపూర్ణమైనవని అనను. నేను వాటిని తీర్మానించడం అన్యాయం అనిపిస్తోంది. నా గత నిర్ణయాలు అనేవి గత అనుభవాల ద్వారా తీసుకున్నవి, ఆ నిర్దిష్ట పరిస్థితిలో, నేను ఆ నిర్ణయాలు తీసుకున్నాను, నాకు నా గత నిర్ణయాల వల్ల ఇప్పుడు ప్రయోజనం కలిగింది మరియు వాటిని నేను స్వంతం చేసుకున్నాను కాబట్టి, నాకు ఎటువంటి పశ్చాత్తాపం లేదు. 

నేను ఎటువంటి నిర్ణయాలను మార్చుకోవడానికి ఇప్పుడు ఇష్టపడం లేదు

Madan Mohan Question: 
Suppose you are given a chance to erase three decisions that you have made in past in your life. What they would be?

Vaishali Jain Response: 
Sir, I am not able to think of any decision.

Madan Mohan Question:  
So, all the decisions taken by you has been perfect as per now.

Vaishali Jain Response:  
Sir, I won't call it perfect, it would be unfair for me to judge. My past decisions from the hindsight, because now I have the advantage of hindsight, but within that particular situation, I think I made those decisions and I own them. 

So, I do not have any regrets or I would not like to change any decisions.

These lines are written from UPSC mock interview video.

27 Dec 2023
గుండె ఎలా పని చేస్తుందో తెలిసినంత మాత్రాన దాని స్థానంలో వేరే దాన్ని ఉంచి జీవించలేము, అలాగే హృదయం ఎలా ప్రవర్తిస్తుందో తెలిసినంత మాత్రాన దాని ప్రవర్తనను అధిగమించి జీవించలేము.

Just because we know how the heart works cannot replace it and live, Just like this By just knowing how Mind behaves cannot overcome its behavior

మూలం: Prasad SR Bond 
సంస్కరణ: భార్గవ శ్యామ


Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao