Trivikram Srinivas

గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువయితే ఏం పర్లేదు అనుకోని పడేయ్యకుండా తింటాం, అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదంటూ ముందుకెళ్లాలి అంతే.

ఇక్కడున్న నలుగురికి ఒకే దేవుడు నచ్చట్లేదు, afterall నేను మనిషిని అందరికి నచ్చాలని rule లేదు కదా.. 

మనిషికి మనిషికి మధ్య ఉన్న ఒకే ఒక అవినాభావ సంబంధం కేవలం 'అవసరం' మాత్రమే.


⚛️🪷📧 

కృష్ణ శాస్త్రి గారు ఓ మాట అన్నరు నాయకుడు కానీ కవి కానీ ఎలా ఉండాలంటే, గుంపుతో నడుస్తూ ఉండాలి, కానీ గుంపు కంటే నాలుగు ఆడుగులే ముందుండాలి, నలభై మందు ఉంటే గుంపు ఏమి అనుకుంటుందో వినపడదు, గుంపుకు వారు కనపడరు. నాలుగు ఆడుగులు వెనక ఉంటే వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళని నడపలేరు . అదే నాలుగు అడుగులు ముందు ఉంటే, ముందు వచ్చే ముళ్ళు నీళ్లను చెప్పడనికి వాళ్లతోనే నడుస్తు వాళ్ళ మాటలు వింటు వారికి దారి చూపిస్తారు. 
Trivikram Srinivas 
👁️‍🗨️👌🔖♻️@🌳

పుస్తకావిష్కరణ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు:
"సాంకేతికతో పాటు ముందుకు వెళ్లాలని.. పుస్తకాలు చదివితే మనం వెనక్కు వెళ్తామని అందరూ అనుకుంటారు. కానీ, అది నా దృష్టిలో తప్పు. మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మాట్లాడతాం. అదే.. పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్లతో మాట్లాడడానికి కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవడం నేటి తరానికి చాలా అవసరం. అప్పుడే మన అభిప్రాయాలను వ్యక్తపరిచే విధానంలో మార్పు వస్తుంది. అవతలి వారు నొచ్చుకోకుండా మాట్లాడగలుగుతాం. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించే లక్షణం మనుషుల్లో తగ్గిపోయింది. చదవడం వల్ల ఆ ఆలోచన పెరుగుతుంది. అప్పుడు మనం ఉన్నతమైన వ్యక్తిగా మారతాం. నేను చదివిన చాలా పుస్తకాలు నాలో మార్పు తీసుకువచ్చాయి. 

పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని కూడా పుస్తకం శిల్పంలా మారుస్తుంది. చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి' అంటూ పుస్తకం గొప్పతనాన్ని చెప్పారు.
Trivikram Srinivas 
👁️‍🗨️👌🔖♻️@🌳
02.12.2022




నువ్వే నువ్వే

ప్రతీ కథ ఏదో ఒక చోట మొదలవ్వాలి, నారధుడు వాల్మికి ని ఈ ప్రపంచం లో అందరి కన్నా ఉత్తముడెవ్వరు అని అడగడం తో రామాయణం మొదలైంది. సూత మహర్షి తన శిష్యులకి మాటల మధ్యలో చెప్పిన కథ తో మహభారతం మొదలైంది. ఈ కథ ఓ వర్షాకాలం సాయంత్రం విశ్వనాథ్ అనే ఆయన ఇంటి టెరాస్ మీద మొదలైంది.

ఒక అమ్మాయిని ప్రేమించడానికి I Love You అని ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తే చాలు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చాలామందికి వెడ్డింగ్ కార్డులు ఇవ్వాలి. ప్రేమించడానికి డబ్బులు అక్కర్లేదు. కాని పోషించడానికి కావలి.

ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా మనం క్షమించగాలగాలి, లేదా మనం ప్రేమించటం లేదని ఒప్పుకోవాలి.

మనం తప్పు చేస్తున్నమె రైట్ చేస్తున్నమె మనకు తెలుస్తుంది.... మనకు ఒక్కరికే తెలుస్తుంది.

మనం నమ్మగలిగేవి (ఇష్టపడేవి) మాత్రమే నిజాలు 
భరించలేనివి అన్నీ అబద్దాలు ఐతే చాలా బాగుండేదమ్మా!!!

ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తారు 
పెళ్ళి చేసుకొని వెళ్ళేప్పుడు మనల్ని ఏడిపిస్తారు.

డబ్బుతో బ్రెడిని కొనగలరు, ఆకలిని కొనలేరు
బెడిని కొనగలరు, నిద్రని కొనలేరు.

ఎక్కడికి వెళ్ళాలో తెలిసినప్పుడు ఎలా వెళ్ళాలో చెప్పటానికి నేనెవర్ని..

అతడు
నువ్వు అడిగావు కాబట్టి చెప్పలేదు .. నేను నమ్మాను కాబట్టి చెప్పాను.
నిజం చెప్పే ధైర్యం లేనివాడికి అబద్ధమాడే హక్కు లేదు ... 
నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం ..

జల్సా
అందంగా ఉండటం అంటే మనకి నచ్చేల ఉండటం ఎదుటివాళ్ళకి నచ్చేల ఉండటం కాదు.

డబ్బు నాకు అవసరం, ఇష్టం కాదు.

కోపం ఒక మనిషికి ఉంటే ఆవేశం. అదే ఒక గుంపుకి ఉంటే ఉద్యమం.

ఆకలేసినప్పుడు తినడానికి తిండి ఉండి తినపోవడమే ఉపవాసం.. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా మంచం ఉండి పడుకోకపోవడమే జాగరం... కోపమొచ్చినప్పుడు చేతిలో కత్తుండి తెగనరకడానికి తలకాయ ఉండి కూడ నరక్కపోవడమే మానవత్వం...

యుద్ధంలో గెలవడం అంటే శత్రువులను చంపడం కాదు శత్రువుని ఓడించడం ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం చంపడం కాదు.

ఖలేజా
నీ నవ్వు వరం, కోపం శాపం, మాట శాసనం.

అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు .. జరిగిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరము లేదు.

నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కర లేదు ..

జులాయి
లాజిక్ లు ఎవరూ నమ్మరు, మేజిక్కులే నమ్ముతారు. అందుకే మనదేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఫేమస్.

"ఇష్టంగా అనుకునేదే అదృష్టం. బలంగా కోరుకునేదే భవిష్యత్తు”

ఆశ, కాన్సర్ ఉన్న వాడిని కూడా బ్రతికిస్తుంది.. భయం, అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది...

తరగతి గదిలో ఎవరైనా సమాధానం చెబుతారు
పరీక్ష గదిలో రాసేవారే ఉత్తీర్ణులు కాగలరు (క్లాసులో‌ ఎవరైనా చెప్పగలరు ఎగ్జామ్ లో రాసే టి టాపర్ అవుతాడు).

మనకు తెలిసిన పని free చేయకూడదు, "మనకు రాని పని try చేయకూడదు.

అత్తారింటికి దారేది
తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది.. 
వెళ్లిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుంది...

ఎక్కడ నెగ్గాలో కాదు
ఎక్కడ తగ్గాలో కూడా తెలిసే వాడు గొప్పోడు

S/o. సత్యమూర్తి
పనిచేసి జీతం అడగొచ్చు, అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు, కానీ సహాయం చేసి కృతజ్ఞతలు అడగ కూడదు.

మనం బాగునప్పుడు లెక్కలు మాట్లాడి 
కష్టల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు

తెలిసి చేసేది మోసం.. చేశాక తెలిసేది తప్పు.

అఆ
అవతలి వాళ్ల ఆనందం కోసం, మన పక్కనవాళ్లని బాధపెట్టకూడదు.

గడియారం ఉన్న ప్రతి వాడు సమయం వస్తుంది అనుకుంటాడు, కానీ సమయం తెలుస్తుందంటే
(వాచ్ ఉన్న ప్రతివాడు టైమ్ వస్తుందనుకుంటాడు... టైమ్ తెలుస్తుందంతే)

మాట్లాడకుండా వుంటే ముని అంతరానుకున్నాను. 
కానీ మూగోడు అంతరానుకోలేదు.

అజ్ఞాతవాసి
ఇది మనం కూర్చునే కూర్చీ! పచ్చటి చెట్టుని గొడ్డలితో పడగొట్టి, రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి, బెరడుని బ్లేడుతో సానబెట్టి, ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తారు. ఎంత హింస దాగుందో కదా! జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల, ఓ మినీ యుద్ధమే ఉంటుంది.

అరవింద సమేత వీర రాఘవ
దెయ్యాలున్నాయా సార్.. 
మనుషులకంటే భయంకరమైనవి ఎక్కడుంటాయండీ

పాలిచ్చి పెంచిన తల్లులు సార్
పాలించడం ఒక లెక్క వీళ్ళకి

అల వైకుంఠపురంలో
నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.

వంటోడికి, వెయిటర్ కి 'NO' చెప్పడం ఈజీ రా..POWERFUL గొప్పోడికి 'NO' చెప్పడం చాలా కష్టం. ఎంత పెద్దోడికి 'NO' చెప్తే, అంత గొప్పోడివి అవుతావ్.

Greatest battles are with closest people
గొప్ప యుద్ధాలు అన్ని నా అనే వారితోనే


💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao