SriRama Navami (శ్రీరామ నవమి)

⚛️🪷📧
SriRama Navami (శ్రీరామ నవమి)

మహా సముద్రాన్ని ఒక అడుగు ప్రదేశంలో నిల్చుని అందులోని చిన్న భాగం, మన పరిధి మేరకు ఎంత పెద్దగా కనిపిస్తుందో, అలానే దైవత్వమనే మహాసముద్రంలో "శ్రీరామ" అనే ఒక చిన్న ప్రదేశంలో ఉండి, ఆ దైవత్వాన్ని (మతాలకతీతంగా) అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

ఒకే ఒక్క 
ప్రజ్వలించే ప్రభాకరుడు
అనంత అపరిమిత
కాంతి కిరణాలు 
చాలా గోళ గ్రహాలపై చెల్లె
ప్రకాశ ప్రసారం
లాగా.... 

దైవత్వం అనే సూర్య తత్వం, గ్రహాల లాంటి మతాలపై వెలుగును వెదజల్లుతోంది. వాటి సంచారం వలన వాటికి చీకటి కూడా ఉంది.  (సహజంగా మతంలో ఉన్నందున దాని ప్రభావము మనపై పడుతుంది, కానీ చీకటి నుంచి బయటకు వస్తేనే వెలుగును ఆస్వాదించగలం, లేకపోతే వెలుగు విలువ తెలియదు). 

ఒకే ఒక్క 
సంభావ్య సూర్యుడు 
పృథ్వి పై ప్రసారంచేయు 
అనేక అసంఖ్యాత
కాంతి కిరణాలలో 
(సముద్రంలో నీటి బిందువంత) 
వాటిని భూతద్దం ఏ విధంగా సంగ్రహించి ఆ కొన్ని కిరణాలలోని శక్తిని ఏకృతం చేసి అగ్నిని రప్పిస్తుందో..... అలాగే మహోన్నతమైన దైవత్వం ప్రసారం చేయు అసంఖ్యాత కాంతి కిరణాలు (అణువులో అణు అణువంత) భూతద్దం లాంటి ఉపకరణం తో ఏకీకృతం చేయు మాధ్యమం నాకు శ్రీరామ నామ జపం....

💭⚖️🙂📝@🌳 
ఆనంద నాధ భావ శ్రేణి
Nostalgic Balance Smile Articles


Comments

  1. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష🙏🏻🙏🏻🙏🏻 Remembering ASK taatha ( I used to call him kandukuru taatha 🙈😆 as I remember him seeing first time as a kid in Kandukuru)

    ReplyDelete
  2. శ్యామ తండ్రి చదవంగా చదవంగా బాగా అర్థమవుతుంది నీ సాహిత్యం, ఒకసారి చదివితే అర్థం కాదు అని అర్థం అయింది, సూపర్ గా ఉంది.

    ReplyDelete
  3. జై శ్రీరామ్

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao