Yoga Day (యోగా దినోత్సవం)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
"యోగిని కాదు కానీ
యోగం గురించి కొద్దిలో కొద్దిపాటి
తెలిసిన యువకుడిని"
యోగం "యుజ్" అనే సంస్కృత పదం నుండి ఉత్పన్నమైంది. "యుజ్" అంటే కలయిక. దేహాన్ని ఆత్మని కలిపే సాధన ప్రక్రియ యోగం. దేహం పరిమితం, ఆత్మ అనంతం. శారీరక మానసిక స్వభావాలను ఏకీకృతం చేసి పరిమితాన్ని అనంతంతో అనుసంధానం చేసేది యోగం. యోగంలో కీలకమైనది ధ్యానం.
"దేహం దేవాలయం, దానిలోని దైవం ధీ-ఆత్మ
దాని దర్శనం దారి ధ్యానం"
యోగానికి ఇచ్చే కవితాత్మక నిర్వచనం
"ఉన్న స్థితిలో ఉదాత్తమైన
ఉన్నత స్థితి ఉదంతాలు
ఉపోద్ఘాతించ్చేది ఉప-"యోగలు".....
(ఉపయోగాలు- యోగము లోని భాగాలు: ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు).
అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖21.06.2023✍️
Comments
Post a Comment