Mother's Day Letter
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙂🎊
ఈ రోజు మన ప్రత్యేకమైన తల్లి నుంచి ప్రతి తల్లికి కృతజ్ఞత వ్యక్తపరిచే ప్రయాణం. ప్రతిరోజూ మనకు ఆసరా ఆయన అస్తిత్వాన్ని (తల్లి) నిశ్శబ్దంగా ఆనందిస్తాము కృతజ్ఞత తెలుపుతాము, కానీ ఈ రోజున ఇంకా ఎక్కువ ఆనందిస్తాము, కృతజ్ఞత తెలుపుతాము.
-----
అనంత ఆకాశాన్ని
అద్దం అందుకోలేదు.... అలాగే
మాతృత్వాన్ని మైమరిపించడం
మానవ మనసుకు
ఆలోచనపరమైన అవధులు
పదాలపరమైన పరిధులు దాటి
ఆవల అమ్మ అనురాగాలను
అర్థంచేసుకోవడం అభివ్యక్తీకరించడం
అభిమానం ఆనందం కోసం చేసే
పరిమిత ప్రయత్నమే
ఆకాశాన్ని అందుకునే
అద్దమైన మనసుది..
అందరితో అన్నింటితో
అనుసంధానమైన ఆనందం
అద్భుతం అమ్మ........
మౌలికమైన మనసులో
ముగ్ధ మనోహరమైన మనం,
మానవత్వం, మృదుత్వం,
మమతా, మీమాంస... మిశ్రమంచి
మోములో మోహన మందహాసంతో
సాధికారత సాధించిన సాద్వి.......
మాయి మాతృమూర్తి
మాధవి మా (అమ్మకు)......
అమ్మకు ఆప్యాయతతో
హృదయపూర్వక హార్దిక
మాతృ దినోత్సవ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖14.05.2023✍️
Comments
Post a Comment