Posts

Showing posts from January, 2023

Nanna (Telugu 31.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   నిశ్చలమైన నారాయణుని, రమణుని,శేషుని,  నయన నీడలో  నిండుగా నవ్వుతూ నడిచి  రామనామంతో నిర్మలంగా రామనాథునిలో  ఐక్యం అయిన నానమ్మకు  97వ పుట్టినరోజు నాడు నివాళర్పిస్తు........  నానమ్మ దివ్యమైన అస్తిత్వాన్ని  అంతర్లినం చేసుకొని  నానమ్మ జన్మించిన తేదీ నాడే  జన్మించిన నాన్న...... పూర్ణమైన పరమాత్ముని పారమార్థికమైన ప్రమాణాలు  ప్రేరేపించిన ప్రాణంతో ప్రపంచ పరస్పర ప్రయాణ పరిధిలో  పరమానందం పోందుతూ పావనమవుతున్న పితృదేవుని  పరికిస్తూ పరవశ ప్రమోదాన్ని పోందుతూ  పుట్టినరోజు పండగ పూట పలుకుతున్నా పదాలు........  ధన్యుడినై ధన్యవాదాలతో  జన్మదిన శుభాకాంక్షలు నాన్న 💭⚖️🙂📝@🌳 📖31.01.2023✍️

Republic Day (Telugu 26.01.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు  స్వాతంత్రం సాధించిన  సాధికారతతో సార్వభౌమత్వానికి  స్ఫూర్తిదాయక సమర్పణ.. రాజ్యాంగం రక్షించే రాజ్యాంగం  అమలులోకి ఆసన్నమైన  తాత్విక తరుణం గణతంత్రం గణతంత్ర గుణం రక్షించే రాజ్యాంగం  💭⚖️🙂📝@🌳 📖26.01.2023✍️ The word "Re" means About/ Concern. The word "Public" means "Treating yourself by thinking about you as whole people" By taking these definitions from different sources, I'm interpreting Republic idea as "Having/Keeping concern on people in my thoughts and works. May these intentions become innate in our inherent. Happy Republic Day 💭⚖️🙂📝@🌳 📖26.01.2020✍️

Shyam Mamaiya (20.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   మౌన ముని రమణుని రమణీయుడు  తిరువన్నమలైలో తిరిగే తిరు తపన తాపసి..  ప్రతి పౌర్ణమికి పర్వతానికి  ప్రదక్షిణం చేయు పాతపాటి వారు  తిరుపతికి తిరిగేవారు... నెల్లూరు నివాసి..  శ్యామ మామయ్య శాంతి మకుటంతో  స్వర్గంలో సేదతీరుతారని స్మృతిలో  సంతసంగా ఉంటు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఓం మృత్యుర్మా అమృతంగమయ్య  ఓం శాంతి శాంతి శాంతిః  💭⚖️🙂📝@🌳 📖20.01.2023✍️

Prakash Mamaiya (Telugu 19.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   హైందవ హుందాతనం...  లౌకిక లయ....  మిశ్రమంచిన మాధ్యమం  ఆధ్యాత్మిక ఆలంబనగా  ఆనందాన్ని ఆవాహనగావించిన  అనుష్టానపరుడు...  కోమల కాఠిన్యం  కలిగి కృపచుపే  కిరణం "కరణం..."   ప్రేమ ప్రేరణ  ప్రశాంతత పొందుపరిచిన  "ప్రకాశం..." (మామయ్య)   మీకు హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. 💭⚖️🙂📝@🌳  📖19.01.2023✍️

Blissful Birthday Bava (Telugu 16.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కరణం అభిరామ్ కారణ కిరణం అనంద అస్తిత్వం ------------------------ సుధాప్రకాశం సుపుత్రుడు  అఖిల అగ్రజుడు,  కళ్యాణంతో కలిసిన  కుటుంబ క్రాంతి కణం స్వాతి సహధర్మచారుడు కందుకూరు కడపను కలిపిన కృతుడు ఆర్థిక అభివృద్ధికి అవసరమైన అధికారి బ్యాంక్ బాధ్యత భరణి రూపాయి రక్షణ రథసారథి మిత్రుల మోహనడు అ-తులిత అభిప్రాయ అలంకారుడు  భీ-షణ భవ భావ భాగ్య బాటసారి  రా-జయోగ రమణీయ రాముడు  మ-ధుర మృదు మాటకారి  హార్థిక హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు బావ. 💭⚖️🙂📝@🌳 📖16.01.2023✍️ 🙂🙂🙂 We are Blessed to meet Being like you Bava, You are giving Best Blissful Memories beyond my assumptions. Whenever you are in or around me there is aroma of Blissfulness, Coolness. I am so excited to see your inclusive sustainable growth Bava 🥳🥳🥳

Sankranti Subhakankshalu (సంక్రాంతి శుభాకాంక్షలు) (Telugu 15.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము సంక్రాంతి దక్షిణాయనం ఉత్తరయానంగా  సంవత్సరంలో సూర్య సంచారాన్ని  సంస్కరించే సంక్రమణం సంక్రాంతి.  సేద్య సంస్కృతికీ  సౌభాగ్యానికి "సంక్రాంతి' "పట్టం పొందిన పండుగ" సంక్రాంతికి సకుటుంబ సపరివారం  సుఖ సంతోషాలతో  సేదదీరుతారని.. సహవాసులుగా  సదా సమతుల్య సంతోష స్వరూపుంతో  సుఖంగా  సాగాలని  సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 📖15.01.2023✍️ దక్షిణాయనం ఉత్తరయానంగా  (సంప్రదాయనుసారం) సంవత్సరంలో సూర్య సంచారాన్ని సంస్కరించే సంక్రమణం సంక్రాంతి. సంక్రాంతికి సకుటుంబ సపరివారం సుఖ సంతోషాలతో సేదదీరుతారని.. సహవాసులుగా సదా సంతోష స్వరూపుంతో సుఖంగా సాగాలని సర్వేశ్వరుని సూక్తిస్తున్నాను. 💭⚖️🙂📝@🌳 Energy Enjoy Entity  అమృత అనంద అస్తిత్వం

Sankranti Muggu (Telugu 14.01.2023)

Image
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము ఆకాశంలోని తారలను   అవనిలో తనుజ ఆలోచిస్తూ అనుసంధానం  సేయు సొంపైన  సంశ్లేషణ సంప్రదాయం  రంగుల రమణీయం అలంకార అస్తిత్వం  ముచ్చటైన ముగ్గు..... 💭⚖️🙂📝@🌳 📖14.01.2023✍️  

Kantam Tataiya (10.01.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ధైర్యం దైవభక్తి  ధీయుక్తి దీర్ఘదృష్టి  ధారణా గావించిన ధీరులు  దీర్ఘాయుష్మంతులు  పలుకుబడి పెద్దరికంతో  పరివార పరిధిని  పాలించి ప్రేమించిన  పాతపాటి పెద్దవారు కుటుంబంలో కురువృద్ధుడిగా  కాలం కొనసాగించిన కాంతి.....  కాంతారావు  తాతయ్యను తలుస్తూ  శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖10.01.2023✍️

Yogananda Yogi (Telugu 05.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము యోగానంద స్వామి మహావతార బాబాజీ, లహరి మహాశయుల  మంత్రశక్తి  బాల ముకుందుడు  పాశ్చాత్యులుకు పరంధాముని  పూర్వ ప్రామాణికతలను  పరిచయం గావించిన  పరమహంస యుక్తేశ్వరగిరి శిష్యులు  యోగాభ్యాస యోధుడు  యోగవిద్య గురువు  యోగానంద ఆత్మకథతో అందిన ఆధ్యాత్మిక ఆనందం ప్రేమావతార యోగి పరమహంస యోగానంద  పశ్చిమ భౌతిక వాదానికి,  ప్రమాణ భారతీయ విజ్ఞానాన్ని  సంధిచేసి సమన్వయపరిచి  సత్సంగ సమాజాన్ని  స్థాపించిన సన్యాసి స్వామిని స్మరిస్తూ స్తుతిస్తూ  స్మృతిలో సంతోషిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖05.01.2023✍️

Vykunta Ekadashi (వైకుంఠ ఏకాదశి) (Telugu 02.01.2023)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము తొలి ఏకాదశి, మరియు వైకుంఠ ఏకాదశి గురించి కోంచం తెలుసుకుని రాసినది ఈ వ్యాసం -------- మురాసురునితో యుద్ధ సమయంలో అలసిపోయినా విష్ణుమూర్తి.. విశ్రమించడానికి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి యెగనిద్రకు ఉపక్రమిస్తారు. అక్కడ విష్ణుమూర్తి కంటి చూపు నుండి ఒక శక్తి ఉద్భవించింది అదే ఏకాదశి. విష్ణుమూర్తి నిద్రపోవడం వల్ల, నిద్రిస్తున్న సమయంలో ఏకాదశి జన్మించడం వల్ల శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. ఆషాడమాసంలో ఏకాదశి ఉద్భవించింది కాబట్టి ఆషాడమాసంలోనికి ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. పుష్య శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి కంటి శక్తి (ఏకాదశి) మురాసురుని వధించి వైకుంఠం వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన ముక్కోటి దేవతలు, మరియు ఇద్దరు రాక్షసులు వైకుంఠ ప్రవేశానికి ప్రవేశం కోరగా వారిని ఆహ్వానిస్తారు. ఆలా పుష్య శుద్ధ ఏకాదశి రోజు వైకుంఠ/ముక్కోటి ఏకాదశి అయ్యింది. నా రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఏకాదశి కోరింది. విష్ణుమూర్తి తధాస్తు అన్నారు.  ఇది నేను అర్థం చేసుకున్న పురాణ వృత్తాంతాం --------------------- ఏకాదశి అంటే పదకొండు.  ఒక నమ్మ...

New Year Wishes (T/E 01.01.2023)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   శోకమైన, సంతోషమైన  ఆశీస్సుల వల్ల అందినటువంటి  నా వైన ఈ నిన్న‌ నేడు రే పటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అధిగమించి, ఆనందాలను ఆస్వాదించి, జ్ఞానం మరియు జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.  ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటూ... -------------------------------------- Entities..... Enjoy this Gregorian New Year Hope Hype Happiness Hails in our Hearts. Warmed with wishes Enjoying the new social time (Gregorian Calendar) beginning  🙂 💭⚖️🙂📝@🌳 📖01.01.2023✍️