Discussion on Inspection (Telugu 18.04.2022)
⚛️🪷🌳
రంజిత్ రెడ్డి కర్ర:
విద్వేషం లేని మతోన్మాదం తలకెక్కకుండా రేపటి భావితరాల కోసం...
విద్యాశాఖ ఆకస్మికంగా తనిఖీలు చేసినప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుల 11 వాట్సప్ గ్రూపులు కూడా తనిఖీ చేయాలి... ద్వేషపూరిత మత సంబంధ రెచ్చగొట్టే మెసేజ్లు ఉంటే చర్యలు తీసుకుంటే రేపటి తరం ఆలోచనలు మలినం కాకుండా ఉంటాయి....
Mallesh Koruturi:
👍100%✅
Bharghav Shyam:
ఉద్దేశ్యం మంచిదైనా, ఈ మార్గం చట్ట ప్రకారం సాధ్యం కాదు. ఎందుకంటే వ్యక్తిగత గోప్యతా విధానానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి సాధ్యం కాదు. అధికారిక అవగాహన కార్యక్రమం ద్వారా, అధికారుల మరియు తల్లిదండ్రులు వ్యక్తిగత శ్రద్ధ ద్వారా ఇలాంటి స్థితిలో ఉన్న ఉపాధ్యాయులను నైతిక నీతి వంతులుగా చేయాల్సి ఉంటుందనిపిస్తోంది.
Kranthi Kar:
భావి తారాలని చెడు మార్గంలో తీసుకువెళ్ళే వాళ్ళని ఏం చేసిన తప్పు కాదు.. టీచర్లు అంటే మంచి చెప్పాలి అదే టీచర్లు విద్వేషాలని రెచ్చకొడుతూ వ్యాసాలు రాస్తుంటే ఏం చేయాలి వాళ్లని..
Bharghav Shyam:
మన అనుమానం ఇతరుల అవమానానికి కారణం కాకూడదు అని మాత్రమే నా ఉద్దేశం.
చట్ట ప్రకారంగా ఇలా గోప్యతా విఘాత చర్యలు తీసుకోలేము అని మాత్రమే చెప్పాను. వారి సామాజిక ఖాతాలు (Social Media accounts) అనేవి వ్యక్తిగతం. వ్యక్తిగతంగా అవకాశం ఉన్నప్పుడు అలా చెయ్యొచ్చు,
అధికారికంగా (చట్ట ప్రకారంగా) చేయాలంటే అవగాహన కార్యక్రమాలు మాత్రమే జరపాలి.
Kranthi Kar:
టీచర్ గా చేసే వాళ్ళు టీచర్ లా ఉండాలి గవర్నమెంట్ జాబ్ అవి పబ్లిక్ మనీ తో వచ్చే జీతాలు తింటూ పిల్లని తప్పు దిక్కులో తీసుకెళ్ళడం చట్ట వ్యతిరేకమే. స్వేచ్ఛ అనేది కొంత వరకు ఉంటది అదే టీచర్ మీరు నరకండి చంపండి అని నేర్పిస్తూంటే స్వేచ్ఛ అనాలా
Bharghav Shyam:
మీరు చెప్పిన దానికి పూర్తిగా అంగీకారం తెలుపుతున్నాను.
ఉపాధ్యాయులు అన్య మతాలు పట్ల పిల్లలలో విద్వేషాన్ని కలిగిస్తే ఖచ్చితంగా శిక్షార్హులే!!
కానీ, దానిని కేవలం వాట్సాప్ సందేశాలు చూసి నిర్ణయించడం అనేది చట్ట ప్రకారంగా విరుద్ధం అని అంటున్నాను.
Kranthi kar:
మీరు చెప్తున చట్టంలోనే ఉంది సమూహాలలో మతాల సందేశాలు పంపిస్తే నేరం అని act లోనే ఉంది..
Bharghav Shyam:
I feel, there is no such norm in democracy.
If any hatred message spread on Official WhatsApp group, then they can take action.
Not on personal groups.
Any way, you have good intentions, I'm happy for that 🙂
Kranti kar:
There is a special law in our Indian constituency no one should spread religion hatrated speechs and circulate the things in any manner.. law will not accept any norms if it is personal also he is punishable if he cross the lines..
Mallesh Koruturi: 👍 మీరు సూచించిన వాస్తవ ప్రత్యామ్నాయంకు అంగీకరిస్తున్నాను Bharghav Shyam సర్!!
Mallesh Koruturi: Kranti Kar 👍 మంచి మార్గాన్ని చూపించాల్సిన వారు చెడు మార్గం వైపు చూపేవారు గా అవ్వడం చాలా దురదృష్టకరం. ఏదేమైనా వీలయినంత త్వరగా సరియాయినా చర్యలు తీసుకొని సరిచేసే బాధ్యత తల్లి దండ్రులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ తీసుకోవాలి అని కోరుకుందాం క్రాంతి గారు.
💭⚖️🙂📝@🌳
📖 18.05.2022✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి