Ambedkar Jayanti

⚛️🪷📧


నాకు అనిపించిన అభినవ పరుశురాముడు అంబేద్కర్....

వీరిరువురు ఏ ఒక్క తత్వానికి వ్యతిరేకులు కాదు. కేవలం పోరాటయోధులు. న్యాయం కోసం పోరాడారు తప్ప ప్రతీకారం కోసం కాదు.

కార్తవీర్యార్జుని కుమారులు ఒకానొక సమయంలో జమదగ్ని మహాముని తలను శరీరం నుంచి వేరుచేసి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు, ఆ పితృవియోగంలో కూడా లోతుగా తన తండ్రి మరణానికి గల కారణాలు ఆలోచించాడు‌. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది అని అన్వేషించాడు. క్షత్రియత్వంలో ఉన్న అధికార మదం కారణం అని తెలుసుకుని, ఆ అన్వేషణలో తను పడుతున్న బాధలు విస్మరించాడు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాధలను తన బాధలుగా మార్చుకున్నాడు. ఆధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను హతమార్చి సమస్త ఆర్యవర్తన్ని పరిశుద్ధం చేయడమే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు.  తన తల్లి 21 సార్లు రోదించిందని, 21 సార్లు దండయాత్ర చేసి అధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను అంతమొందించాడు. పరశురామునిలో కేవలం ప్రతీకార వాంఛ ఉండి ఉంటే పరశురామ ప్రభువు అని మనం పూజించే వాళ్ళం కాదు. 

భార్గవ రాముని లానే అంబేద్కర్ కూడా అంటరానితనాన్ని వివక్షను అధికంగా ఎదుర్కొన్నాడు. తను ఎదుర్కొన్న వివక్షల గురించి ప్రశాంతంగా లోతుగా ఆలోచించాడు. ఈ క్రమంలో తన ఎదుర్కొన్న బాధలను విస్మరించి సమాజం పడుతున్న బాధలు గురించి ఆలోచించాడు. సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షకు కారణం విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం అని గ్రహించి, విద్యకు సముచిత స్థానం ఇచ్చాడు. అందరూ అందుకునేందుకు వీలుగా లేదని, మరియు వారు తొందరగా అందుకోవడం కోసం రిజర్వేషన్ పెట్టాడని నాకు అనిపించింది. విద్య ఉంటే అందరూ సమానంగా ఎదగవచ్చు అన్న సంకల్పం తనది. 

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity



💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity 

Comments

  1. ఈరోజు చూశాను, చదివాను బాగా రాసావ్ అంబేద్కర్ పుట్టినరోజు రోజు భార్గవ రాముడే భార్గవ శ్యాముడు అనేటట్టుగా బాగా రాశావు

    ReplyDelete

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao