May Day (Telugu 01.05.2026)

 ⚛️🪷☀️🍃@🌳

ముందుగా ఉద్యోగస్తులు కూడా కార్మికులే అనే విషయాన్ని తెలియజేయాలని అని అనుకుంటున్నాను. ఈనాడు ప్రతి ఉద్యోగస్తుడు అనుభవించే వారాంతర సెలవులు, 8 గంటల పని, గౌరవ వేతనాలు ఇంకా సంస్థ, అదనపు ప్రయోజనాలు (రవాణా, భోజనాలు వగైరా), భత్యాలు, ఇంకా సంస్థ, ప్రభుత్వం అందించే సంక్షేమాలు (ఆరోగ్యం మొదలైనవి) ఇవన్నీ అనేక దేశాల్లో, అనామకులైన లక్షలాది కార్మిక స్త్రీ పురుషులు, కమ్యూనిస్టులు, తదితరుల నిరంతర పోరాటంతో  లభించినవి. 

ఈ విజయాలు ఏ ఒక్కరో ఒక్క  సంస్థ నో సాధించినవి కాదు. అది మార్క్స్ గానీ,  కమ్యూనిస్టు పార్టీ గానీ ఇలా ఒక్కరికి లేదా ఒక్క సంస్థకు మాత్రమే కట్టబెట్టలేము. అలా చేయడం అనేది కార్మికుల సమిష్టి త్యాగాన్ని ఒకరికి పరిమితం చేసినట్లు అవుతుంది.

కార్మికులు
కాలంలో కలిసున్న
కరుణా కాఠిన్యాలతో
కడలిలో కదులుతూ 
కష్టం కొట్టినా,  
కరుణ కురిసిననా
కళ్ళు కాంతినన్వేషిస్తూ
కమనీయ కలలు కంటూ
కాళ్లతో కదులుతూ 
కట్టే కట్టడాలు
కృషిగా కనిపిస్తాయి.
ఉన్నత ఉద్యోగస్తులు 
కూడా కార్మికులే,
అందరూ అనుభవించే
సంతోష వారాంత సెలవులు
పద్ధతిగా 8 గం.ల పని,
గౌరవ వేతనంగా గణమొత్తం 
అదనపు అనుకూలతలు
సంస్థ/ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు
ఇవన్నీ ఇలా 
ఒక్క విధానం
ఒకరి వల్ల 
ఒకేసారి వచ్చేయలేదు &
వట్టిగా వచ్చేయలేదు
ఇవన్నీ ఇలా 
ఉండడానికి 
కమ్యూనిస్టులు కారణంగా
అనేక అనామక 
కార్మికులు కఠోర 
పోరాట పటిమ 
సమిష్టి సాధనగా
విలక్షణమైన విజయాలు
విశేషంగా వచ్చాయి.
అనేక అనామక 
పోరాట పటిమను 
స్మరిస్తూ సంతోషంగా 
కార్మికుల దినోత్సవ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖01.05.2026✍️




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Anil Ausha (English 01.06.2023)

Health Day (Telugu 07.04.2026)