Posts

Showing posts from October, 2023

Sanju & Shreya

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో  సంహిత సముపార్జనతో సేవలందిస్తూ  సేదదీరుతు సదా సంతోష స్వరూపుడై  ఉన్నంతంగా ఉంటాడని సర్వేశ్వరుని సుక్తిస్తూ   హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...   (ఆలస్యంగా) సంజు --------------  Shreya  She is the Energy for Father  She is the Way for Mother  She is the Naughtiness for Brother  She is the Happiness for Grand parents  She is the Relaxation for Relatives.  Shreya have the Gravitational Energy, it pulls us to see, concentrate, feel, and enjoy her  "Aesthetics Actions, Enthusiastic Eagerness, Inherent Innocence, Overwhelming Observation and Ultra Unconditional" qualities. Blissful Birthday Wishes Shreya   💭⚖️🙂📝@🌳  అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity 

MS Bharadwaj (Aarya)

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము గ్రంథాలయ గుండె,‌ కలిగి కుదురుకున్న నడిచే నైపుణ్యం సరస్వతి సుపుత్ర  "సతీష్ భరద్వాజ" (ఆర్య) బలమైన భాషతో భావనలను ప్రభావితం చేస్తూ ప్రవాహంలా ప్రకటనలపై  ప్రభావం చూపిస్తూ ప్రకాశిస్తున్న  ఆంధ్ర జ్యోతి అనువాద స్ఫూర్తి  ముటుకుల సతీష్ భరద్వాజ్ గారికి హృదయపూర్వక హార్దిక  పుట్టినరోజు పర్వదినాన  శోభమైన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity  

Swarna Atta

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము కమల తత్వం అవలంబించి,  గురువుగా గృహస్థిరాలిగా సంక్షేమాన్ని సంకల్పించి అన్నిటితో అనుసంధానమై  సాంఘిక శాస్త్రంలో స్టూడెంట్(విద్యార్థు)లను సపరివార సంధాన సారధిగా అందరికి ఆనందాన్ని అందిస్తూ కొవ్వొత్తిలా నిర్వహిస్తున్న కర్తవ్యాలు  అందరు ఆహ్లాదంగా ఆస్వాదిస్తున్నారు. (కమల తత్వం: కోమలత్వంతో ద్వంద్వాలకు అంటీ అంటనట్టు ఉంటూ మంచిని గ్రహించి ఆనందాన్ని అందించే రాజహంస).   స్వర్ణ కమల లక్షణాలు కలిగిన రాజహంస స్వర్ణత్తకు హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity

Determined Days (దివ్యమైన దినోత్సవం)

EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము దివ్యమైన దినోత్సవం  Determined Days  01 జనవరి (2022) శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల లభించినటువంటి నా వైన ఈ నిన్న‌ నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అనుభవించి, ఆనందాలను ఆస్వాదించి ఎన్నో  జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను.  ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటున్నాను. 02  జనవరి (2023) గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది. ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26 జనవరి (2023) "గణతంత్ర గుణం రక్షించే రాజ్...

Purification/శుద్ధీకరణ

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఈ ఫేస్బుక్ (ఇది మాత్రమే కాదు, చాలా అంశాలు కూడా అనగా వాట్సాప్/దినపత్రికలు/మాటలు వగైరా...) వంటివి బంగారం గనిలో బంగారం తవ్వకం లాంటిది. ముడి సరుకులో ఎక్కువ వ్యర్ధాలు ఉంటాయి, వాటిని శుద్ధి చేస్తేనే బంగారం తయారవుతుంది.‌ బంగారం కోసంగా ముడి సరుకును తీసుకోవలసి ఉంటుంది మరియు శుద్ధి చేయవలసి ఉంటుంది కూడా.  (బంగారం కంటే విలువైనవి కూడా ఉన్నాయి, వాటి మీద దృష్టి సారించలేకపోతున్నాను) This Facebook (not only this, but many other things like WhatsApp/Newspaper's/Talks, etc.) is like mining gold in a gold mine. Raw material contains more waste, and gold can be made only if they are refined. For gold, raw material (waste) has to be taken and refined. (There are more valuables than gold too, I can't concentrate on them)  💭⚖️🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity 

Gandhiji & Lal Bahadur Shastri

Image
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము 🙂 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి🙏 మహాత్మా గాంధీ   నాకు ఒక శాస్త్రం లాంటి వారు.  గాంధీజీ వ్యక్తపరిచిన అనుభవాలు ఒక సుదీర్ఘ ఉద్దేశపూర్వక ప్రయోగ ప్రమాణ ప్రయాణం.  ఆ ప్రయాణంలో ఆహింసలో హింసాకాండ,  శాంతిలో అభద్రతాభావం,  బ్రహ్మచర్యంలో చంచలత్వం,  నీతిలోని విమర్శలు ఉన్నా కానీ దాని ప్రమాణం సత్యాగ్రహ ఉద్దేశంతో  స్వరాజ్య లక్ష్యంగా సాగింది.  ఆ శాస్త్రం ఇబ్బంది పెట్టినా హుందాగా మధ్యస్థ సానుకూలంగా అనిపించింది. కొన్నిసార్లు నన్ను నేను వ్యక్తపరచడానికి ఆయన శాస్త్రంతో అనుసంధానం అవుతాను. --------- నిరాడంబరత, నిజాయితీకి  నిలువెత్తు నిదర్శనంగా  నిలిచిన నాయకుడు. జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత  నిండిన నినాదాలతో సైనిక  వ్యవసాయ వ్యవస్థలను  దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు" తన ఆదర్శాలను అవలంబించడానికి  త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడైన  లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ  వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. 💭 ⚖️ 🙂📝@🌳 అక్షర ఆనంద అస్తిత్వం Energy Enjoy Entity