Determined Days (దివ్యమైన దినోత్సవం)

⚛️🛞🪷

దివ్యమైన దినోత్సవం Determined Days 

01 జనవరి (2022)
శోకమైన, సంతోషమైన ఆశీస్సుల వల్ల లభించినటువంటి నా వైన ఈ నిన్న‌ నేడు రేపటి రోజులతో భాగమైన సంవత్సరంలో‌ మొదటి నుంచి చివరి దాకా‌ ప్రయాణించి.. అవరోధాలను అనుభవించి, ఆనందాలను ఆస్వాదించి ఎన్నో  జ్ఞాపకాలు మిగిల్చుకున్నాను. 
ఈ జ్ఞాపకాల గతం, బాధించేదిగా కాక బోధించే విధంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ.. ఈ సంవత్సరంలో సమన్వయ సమతుల్య ప్రయాణమే లక్ష్యంగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించుకుంటున్నాను.

02  జనవరి (2023)
గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతుంది.  ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల (సామాజిక దైనందిని) వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది.
ఈ అంతర్ముఖుల దినోత్సవం సందర్భంగా, సామాజిక మాధ్యమాలకు కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

26 జనవరి (2023)
"గణతంత్ర గుణం రక్షించే రాజ్యాంగం"
స్వాతంత్రం సాధించిన సాధికారతతో 
సార్వభౌమత్వానికి స్ఫూర్తిదాయక సమర్పణ.. 
రక్షించే రాజ్యాంగం 
అమలులోకి ఆసన్నమైన 
తాత్విక తరుణం గణతంత్రం

14 ఫిబ్రవరి (2018/2023)
స్వీయ ప్రేమ లేఖ
ప్రియ మరియు గౌరవ జీవన అస్తిత్వమా!!!
ఒక చిన్న తీవ్రమైన అంతరంగిక ఉత్సహంతో, భవిష్యత్తు దృష్టి ఉండి, ప్రస్తుతంలో నా గత వ్యక్తిగత అనుభవాలు ఆధారం చేసుకుని నైరూప్యమైన భావనలతో... స్పష్టమైన పదాలతో ఈ లేఖని రాస్తున్నాను.
నా హృదయం లో చాలా భాగం నీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ గడిచిన కాలాపు జ్ఞాపకాలు లేకుండా ఈ నిన్ను ఉహించలేకపోతున్నాను.... 
నీ గురించి ఆలోచించేటప్పుడు, గడిచిన కాలాన్ని గుర్తు చేసుకున్నప్పడు, నా మనసులో ఆలోచనలు/భావనలు చాలా అస్పష్ట ఆనందంతో మరియు స్పష్టమైన సమగ్రత సంతోషంతో అద్భుతంగా ఉంది. దాన్ని ఒక ఆతిశయంబైన సమతుల్య పారమర్దిక అనుభూతి గా నేను భావిస్తున్నాను. 
నాకు ఈ అస్పష్ట స్పష్ట అంతరంగిక అనుభవాల గురించి, వాటి కాల పరిమితి గురించి నాకు  తెలియదు. కానీ ఎందుకో, ఇది నీతో పంచుకోవాలి అని ఆరాటంగా ఉంది. నా ఆతిసయంబైన పారమర్దిక సమతుల్య అనుభూతికి ప్రేమ అని నామకరణం చేస్తూ “నేను నిన్ను ప్రేమిస్తున్నాను”.
నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. స్ఫూర్తిగా ఉంటే ఉత్సాహంగా నీ దగ్గర ఉంటాను. లేకపోతే ఉండాలి కాబట్టి ఉంటాను. ఉండడం కంటే ఆనందంగా ఉండడం శోభస్కరం కదా...  నువ్వు సమగ్రంగా ఉన్నావు, ఉంటావు కూడా...
నేను ఇప్పుడు నీకు ఈ విషయం చెప్పింది, ఇది  వరకు ఎలా ఉన్నావు అనే సమాధానంతో మాత్రమే కాదు ముందు ఎలా ఉంటావు అనే ప్రశ్నతో కుడా.....
భవిష్యత్తుని నీ చేతుల్లో లేదు కానీ ప్రస్తుతం ఉంది కదా అందుకే జాగ్రత్తలు చెప్పాలి కాబట్టి చెప్పాను... 
నువ్వు ఉంటే నేను ఉంటాను. 
Life Entity "I Love You" 
ఇట్లు
నీ ప్రియమైన 
స్వీయ సంహిత 

21 ఫిబ్రవరి (2022)
అందరికీ ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు...
మనందరం మాతృత్వాన్ని ప్రేమిస్తాం, కానీ మన తల్లి పట్లే ప్రేమ, బాధ్యతగా ఉంటాం.. అందరి తల్లుల బాధ్యత తీసుకోలేము కదా. గౌరవం ఉంటుంది అవసరమైనప్పుడు సహాయం చేయగలము అంతే.....
తెలుగు భాష నా మాతృభాష కాబట్టి అది అంటే ప్రేమ మరియు బాధ్యత. తెలుగు భాష విషయం కొద్దిసేపు పక్కన పెడితే భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం నాకు కొంచెం ఇష్టం.
ఈరోజు అవసరాలకు భాష సరిపోతుందా? సరిపోవట్లేదు. భాషతో ప్రయాణం చేస్తుంటే కొత్త పదాలతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త పదాలు రావాలి అంటే భాష మీద సాధికారత ఉంటే కొత్త పదాలు పుట్టించే మనో వైశాల్యం వస్తుందని నాకు అనిపిస్తుంది.
భాషల మధ్య వైరాలు నిధానంగా అయిన నశించాలి, సాహిత్య లోతులకు వెళ్లి మన భావ ప్రకటనను సులభతరం చేసుకోవాలి. సాహిత్య సౌందర్యాన్ని ఆస్వాదించాలి.
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది. చెట్టు వేర్లను అట్టి పెట్టుకున్నట్లుగా.. భాష కూడా సంప్రదాయాన్ని అట్టి పెట్టుకుని రూపాంతరం చేసుకుంటూ వెళ్ళాలి.  ఎన్నో కొత్త పదాలను  ఆ భాష కుటుంబం నుంచి దాని దగ్గర కుటుంబం నుంచి గాని చేర్చుకోవాలి.
ఆంగ్లము హిందీ భాషలు ఇతర భాషల నుంచి పదాలను స్వీకరిస్తూ వేగంగా ఎదుగుగుతున్నాయని నాకు అనిపిస్తోంది. జంగిల్ అనే హిందీ పదం నుంచి ఆంగ్ల జంగల్, మలయాళం నుంచి మాంగో... ఇలా ఎన్నో పదాలను ఇతర భాషల నుంచి ఆంగ్లం స్వీకరించింది.
మన భారతదేశంలో అధునాతన భాష హిందుస్తానీ (ఉర్దూ మరియు హిందీ), రెండిటి మాటలు చాలా వరకు ఒకటే లాగా ఉన్నా, వాటి లిపులు వేరు. సంస్కృతం నుంచి హిందీ, అరబిక్ నుంచి ఉర్దూ లిపులను స్వీకరించి కొత్త అస్తిత్వాన్ని సృష్టించుకుని ముందుకు వెళుతోంది. స్వీకరణ శక్తియే సమగ్ర ఎదుగుదలకు మూలం అని నాకనిపిస్తోంది.
ఇంకో చిన్న విషయం, నేను ఆంగ్ల భాష నేర్చుకునే కొద్ది నాకు తెలుగులో ప్రావీణ్యం పెరిగింది. ఇతర భాషలు మీద దృష్టి పెట్టికొద్ది బుద్ధి మరింత సచేతనంగా ఉండి అభిజ్ఞాశక్తిని పెంచుతుంది...

08 మార్చి (2018/2022)
"ప్రతిరోజు అందరిది, దాదాపు అన్నిటిది". కానీ ప్రతిరోజూ మనం ప్రతి వారిపై, విషయంపై స్పృహతో ఉండలేము. అందుకే దాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి, శ్రద్ధ పెట్టడానికి అభినందించడానికి ఒక రోజు అవసరమని నేను కూడా భావిస్తున్నాను.
నవంబర్ 19న, అధికారికంగా పురుషుల అస్తిత్వంపై, మార్చి 8న, మహిళల అస్తిత్వంపై స్పృహ కలిగి ఉండాలి.
ప్రపంచాన్ని ఆనందపరచడంలో ఇద్దరి పాత్రలు కీలకం మరియు పరస్పరం. వీరిలో ఎవరు మొదట/గొప్ప అంటే, నా అభిప్రాయం ప్రకారం, పురుషులు విత్తనం లాంటివారు మరియు స్త్రీలు చెట్టు-పండు లాంటివారు. విత్తనం/పురుషులు లేదా చెట్టు-పండు/స్త్రీలు వీరిలో ఎవరు ముందు/గొప్ప అని ఇప్పటి వరకు నిరూపించడానికి అనుభావిక ఆధారాలు లేవని  నేను భావిస్తున్నాను. అందరూ (రెండూ) పరస్పరంగా మరియు సమానంగా బలపరిచే శక్తి కలిగి ఉందని నేను భావిస్తున్నాను.
ఇప్పుడు మహిళలపై ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారి గొప్పతనాన్ని అభినందించడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఉంచడానికి ఈ రోజును అవకాశంగా తీసుకుని ఈ వేదికపై విలియం గోల్డింగ్ మాటల్లో మహిళల గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నాను, ప్రశంసించాలనుకుంటున్నాను.
విలియం గోల్డింగ్ మాటల్లో చెప్పాలంటే పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా, వారు దానిని గొప్పగా చేస్తారు.
1} పురుషులు స్త్రీలకు‌ ఓజస్సు ఇచ్చినప్పుడు, వారు దానిని శిశువుగా మారుస్తారు.
2} పురుషులు స్త్రీలకు కిరాణా సామాన్లు ఇచ్చినప్పుడు, వారు భోజనంగా మారుస్తారు.
3} అతను ఇల్లు ఇచ్చినప్పుడు, ఆమె దానిని గృహంగా మారుస్తుంది
 4} ఒకవేళ మగవారు చెత్త ఇస్తే, ఆమె అమేధ్యం ఇవ్వచ్చు జాగ్రత్త. 
పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా వారు దానిని గుణించి అధికం చేసి మనకు ఇస్తారు.
ఒక మాధ్యమంగా నేను మహిళలను ప్రాముఖ్యతను స్పృహలోకి తీసుకుంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

21 మార్చి (2023)
విషువత్తులో, సూర్యోదయం/సూర్యాస్తమయం ఖచ్చితమైన సమాంతర సమయంలో జరుగుతుంది తద్వారా పగలు మరియు రాత్రి సమానంగా ఉంటుంది. విషువత్తు సమయాన్ని సమానంగా సంతులనం చేసి సమంగా సంపూర్ణంగావీస్తుంది. 
జనన మరణాల మధ్య ఖచ్చితమైన ఆనంద మరియు ఆటంకాలను విషువత్తు వలె, రెండీటిని సమానంగా సమన్వయ పరిచి సంతోషం సాగాలని కోరుకుంటున్నాను...

21 మార్చి (2022)
కవిత్వ దినోత్సవం సందర్భంగా
కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం: 
ఖుషిగా ఉండే కృషితత్వం కవిత్వం..
"అందరికీ ఆసరా అయిన అక్షరంతో 
అనుసంధానమై ఆనంద అన్వేషణలో 
అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు 
సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం"

22 మార్చి (2022)
ఉచ్చస్థాయిలో ఉపయోగమైన
ఉద్రేకంతో ఉంటూ ఉత్తపుణ్యానికే 
ఉనికికి, ఊరికి.. ఊపిరిగా ఉండి
ఊతానికి ఉత్తమ ఉదాహరణగా ఉన్న 
"ఉదకమా" ఉండిపో.........

ఈరోజు ప్రపంచ జల దినోత్సవం. 
నీటిని (ఉదకం) ఎంత వృధా/కలుషితం 
చేస్తున్న అది నిత్యం అండగా ఉంటూ 
తనని మనకు సమర్పించుకుంటూ సదా సంరక్షిస్తుంది. 
ఆదా చేయాలి అనే ఆలోచన ఉన్నా 
ఆచరణ కష్టంగా ఉంది. 
అందుకే దానికి కృతజ్ఞతలు తెలుపుతూ
ప్రస్తుతానికి సంతోషపడుతున్నాను.
నీరు జీవితంలో సదా భాగం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.

07 ఏప్రిల్ (2022) 
అందరికీ ఆరోగ్యం అస్తిత్వంగా అంతర్లీనమై
ఆస్తిలా అందాలనే ఆలోచన ఆసరాతో 
ఆశగా ఆసక్తితో అక్షర ఆకారంలో 
ఆలోచన అనుభూతిని అభివ్యక్తీకరిస్తున్నాను

14 ఏప్రిల్ (2022)
నాకు అనిపించిన అభినవ పరుశురాముడు అంబేద్కర్....
వీరిరువురు ఏ ఒక్క తత్వానికి వ్యతిరేకులు కాదు. కేవలం పోరాటయోధులు. న్యాయం కోసం పోరాడారు తప్ప ప్రతీకారం కోసం కాదు.
కార్తవీర్యార్జుని కుమారులు ఒకానొక సమయంలో జమదగ్ని మహాముని తలను శరీరం నుంచి వేరుచేసి తీసుకెళ్లిపోయారు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షి పుత్రుడైన పరశురాముడు, ఆ పితృవియోగంలో కూడా లోతుగా తన తండ్రి మరణానికి గల కారణాలు ఆలోచించాడు‌. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది అని అన్వేషించాడు. క్షత్రియత్వంలో ఉన్న అధికార మదం కారణం అని తెలుసుకుని, ఆ అన్వేషణలో తను పడుతున్న బాధలు విస్మరించాడు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాధలను తన బాధలుగా మార్చుకున్నాడు. ఆధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను హతమార్చి సమస్త ఆర్యవర్తన్ని పరిశుద్ధం చేయడమే జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు.  తన తల్లి 21 సార్లు రోదించిందని, 21 సార్లు దండయాత్ర చేసి అధర్మాన్ని ఆచరించే క్షత్రియ రాజులను అంతమొందించాడు. పరశురామునిలో కేవలం ప్రతీకార వాంఛ ఉండి ఉంటే పరశురామ ప్రభువు అని మనం పూజించే వాళ్ళం కాదు. 
భార్గవ రాముని లానే అంబేద్కర్ కూడా అంటరానితనాన్ని వివక్షను అధికంగా ఎదుర్కొన్నాడు. తను ఎదుర్కొన్న వివక్షల గురించి ప్రశాంతంగా లోతుగా ఆలోచించాడు. ఈ క్రమంలో తన ఎదుర్కొన్న బాధలను విస్మరించి సమాజం పడుతున్న బాధలు గురించి ఆలోచించాడు. సమాజంలో ఎదుర్కొంటున్న వివక్షకు కారణం విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం అని గ్రహించి, విద్యకు సముచిత స్థానం ఇచ్చాడు. అందరూ అందుకునేందుకు వీలుగా లేదని, మరియు వారు తొందరగా అందుకోవడం కోసం రిజర్వేషన్ పెట్టాడని నాకు అనిపించింది. విద్య ఉంటే అందరూ సమానంగా ఎదగవచ్చు అన్న సంకల్పం తనది. 

16 ఏప్రిల్ (2023)
భారతీయ రైల్వే
సమైక్యత సిద్ధాంత సమగ్ర సంకల్పం 
సమాజ సౌలభ్యం  సామాజిక సేతు 
సాంకేతిక సమతుల్యం  సుందర సోయగం 
సాధించిన సాధికారత భవదీయ రాగం 
 
(భారతీయ రైల్వే దినోత్సవ శుభాకాంక్షలు)

22 ఏప్రిల్ (2022)
దివ్యమైన ధరిత్రి 
ధార్మిక ధోరణితో 
దయగల దీప్తిగా 
దారిచూపిస్తూ 
దప్పిక తీరుస్తున్న 
ధరణికి ధన్యవాదాలతో 
తన దినోత్సవం శుభాకాంక్షలు. 

31 మే (2022/2023)
ప్రభుత్వం పొగాకు సాగుకి, ఉత్పత్తికి, విక్రయించడానికి మరియు డబ్బు సంపాదించడానికి  అనుమతిస్తోంది మరియు మనకు "పొగాకు ఆరోగ్యానికి హానికరం" అని కూడా అ డబ్బాల మీద, చలనచిత్రాల్లో, ధారావాహికలో ప్రచారం చేయిస్తోంది.  అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వమే తాగమని చెప్పినట్లు కాదు, హానికరం అని ప్రచారం చేయిస్తుంది కాబట్టి వెంటనే ఆపండి అని చెప్పడం లేదు.
అంటే స్వేచ్ఛ ఇచ్చి మంచి చెడు రెండు ఒకరే చెప్తారు/చేస్తారు. అర్థం చేసుకోవడం, ఆచరించడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ పొగాకు రహిత (తక్కువ) దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

08 జూన్ (2022/2023)
మహాసముద్ర దినోత్సవ శుభాకాంక్షలు
సముద్రం ఒక సాక్ష్యం, ప్రపంచంలోని మ్యూజియంలలో ఉండే అరుదైన వస్తువుల కంటే సముద్రంలో ఎక్కువ అద్భుతాలు ఉన్నాయి.  సముద్రంలో కోటి జీవరాసులు ఉన్నాయి. నీరు లేకపోతే జీవితం లేదు. ‘‘నీటికి జ్ఞాపకశక్తి ఉంది. ఒక గ్లాస్‌ నీటిలో గులాబీ పువ్వును ముంచి తీస్తే, ఆ గ్లాస్‌లోని ప్రతి నీటి బిందువులో గులాబీ పువ్వు నిక్షిప్తం అయి ఉంటుంది. ఒక నీటి బొట్టుకే ఇంత గుర్తు ఉంటే, ఒక సముద్రానికి ఇంకెంత గుర్తు ఉంటుంది. మన మెదడులో 70శాతం నీరు ఉంది. అంటే మన జ్ఞాపకాలు కూడా నీటిలో నిక్షిప్తమై ఉన్నాయా? ఏమో! 
మన శరీరంలోను, సముద్రంలోనూ ఉండేది కూడా ఉప్పునీరే. అందుకే సముద్రంతో ఏదో బంధం ఉన్నట్లు భావిస్తాం. సముద్ర అలలు తగిలితే మన DNA ఆనందాన్ని భావిస్తుంది. సముద్రం ఎదుట కూర్చొంటే తల్లీబిడ్డల్లా సముద్రము మనసు రెండూ మాట్లాడుకుంటాయి అనుకుంటా’
సముద్రంలో ఉండే సైనో బ్యాక్టీరియా.. దీన్నే గ్రీన్‌ ఆల్వి అంటారు. అందరూ ఆ బ్యాక్టీరియా నుంచే వచ్చాం. ఇది సముద్రంలోనే పుట్టింది. 

14 జూన్ (2023) 
రక్తదానం అంటే మనకు కొన్ని నిమిషాల పని.. కానీ అది మరికొందరికి జీవితకాలం ఉపయోగపడుతుంది.

28 జూన్ (2023)
బహు ముఖప్రజ్ఞుడు భాషావేత్త;
విశేష విద్యావంతుడు;
స్వాతంత్ర్య సమరయోధుడు;
ముఖ్యమంత్రి - కేంద్రమంత్రి- ప్రధానమంత్రి;
భూసంస్కరణల కర్త, భూదాత;
విదేశీ వ్యవహారాల విలక్షణుడు;
దేశీయ వ్యవహారాల దక్షుడు;
నవోదయ విద్యాలయ నిర్మాత;
ఆధునిక అంతర్ముఖుడు;
అభ్యుదయ ఆర్థికవేత్త;
నిరాడంబర రాజకీయ నియోగి;
పాలమర్తి వెంకట నరసింహరావు గారిని 
వారి జయంతి రోజున తలుస్తూ ఆనందిస్తున్నాను.

30 జూన్ (2023)
సాధారణంగా నేను "అంతర్ముఖుడిని", ఈ సామాజిక మాధ్యమాల కారణంగా ఇప్పుడు నేను "అంత:బహిర్ముఖుడినై" భావాలను పంచుకుంటూ మరియు వ్యక్తీకరణను పెంచుకుంటూ పారదర్శకంగా మారే ప్రయత్నం చేస్తున్నాను.
గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతున్నట్లు ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులకు వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తోంది.
ఈ సామాజిక మాధ్యమాల దినోత్సవం నాడు వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

18 జులై  (2023)
వినే వారు వుండడం వ్యక్తికి వరం, వినడం వల్ల వ్యక్తుల విషయాలు వ్యక్తమవుతాయి...
వినే వారు వున్న వుండడం వల్ల వ్యక్తి వచ్చస్సు వికాసంతో వృద్ధిలో వుంటుంది ......
ప్రపంచ వినే దినోత్సవం

21 జులై (2022)
యోగిని కాదు కానీ దాని గురించి కొద్దిగా తెలిసిన యువకుడిని
ఉన్న స్థితిలో ఉదాత్తమైన ఉన్నత స్థితి ఉదంతాలు ఉపోద్ఘాతించ్చేది ఉప-"యోగలు" (యోగము లోని భాగాలు: ఉపనిషత్తులు, భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు) 
"దేహం దేవాలయం, దానిలోని దైవం ధీ-ఆత్మ దాని దర్శనం దారి ధ్యానం"
యోగం "యుజ్" అనే సంస్కృత పదం నుండి ఉత్పన్నమైంది. "యుజ్" అంటే కలయిక.
దేహాన్ని ఆత్మని కలిపే సాధన ప్రక్రియ యోగం‌.
దేహం పరిమితం, ఆత్మ అనంతం. శారీరక మానసిక స్వభావాలను ఏకీకృతం చేసి పరిమితాన్ని అనంతంతో అనుసంధానం చేసేది యోగం‌. యోగంలో కీలకమైనది ధ్యానం.
అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు

29 జులై (2021/2023)
అంతర్జాతీయ పులుల దినోత్సవం 
ప్రకృతి పులి అడవి మనుషులు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అడవులు ఉంటేనే స్వచ్ఛమైన గాలి, విస్తారమైన వర్షాలు పొందుతాం. అడవులు క్షీణిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. మానవ మనుగడ అడవులతోనే ముడిపడి ఉంది.
ఒక పులి ఉన్న పరిధిలో ఇంకొక పులి ఉండదు. ఒక్కొక్క పెద్దపులి అడవిలో నిత్యం సూమారు 40 నుంచి 70 కి.మీ. దూరం తిరుగుతుంది. పులులు ఎక్కువగా ఉన్నాయి అంటే అడవులు సమృద్ధిగా ఉన్నాయని అర్థం. 
అడవుల్లోని అరుదైన మొక్కలను చెట్లను కాపాడడానికి పులి శాకాహార జంతువులపై దాడి చేస్తూ వాటి సంఖ్యను నియంత్రిస్తుంది. పులులు శాకాహార జంతువులను నియంత్రించకపోతే అరుదైన మొక్కలు, వృక్షజాతులు అంతరించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. (పులి ఒక జంతువును వేటాడితే ఒకేసారి దాన్ని మొత్తం తినదు. ఒక స్థావరంలో భద్రపరుచుకుంటుంది. కొద్దికొద్దిగా వారం దాకా తింటుంది).

15 ఆగస్టు (2019)
"ఎందరో గుప్త మరియు బహిర్గత మహానుభావుల పోరాటం ద్వార సాయుధ మరియు అహింస పద్ధతుల మధ్యమంగా మన దేశానికి మనకు *రాజకీయ సామజిక స్వతంత్రం* వచ్చింది. ఆ స్వతంత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆ ఆనందంతోనే మీకు 73వ స్వతంత్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 
మనందరికీ రాజకీయ సామజికంగా స్వతంత్రం సిద్ధించింది.   వ్యక్తిగతంగా స్వతంత్రం రావాలంటే స్వతంత్రం అంటే ఏంటి తెలుసుకోవాలి (దానికి నేను మినహాయింపు ఏమి కాదు) 
స్వ అంటే సొంతమైన అని అర్దం; తంత్రం అంటే తర్కమైన పద్దతి అని ఆర్డం. "స్వతంత్రం అంటే మన సొంత పద్దతి తో మనలోని నైపుణ్యాలను బయటకు తీయడమే స్వతంత్రం అని నేను బలంగా భావిస్తున్నాను. 
ఈ స్వతంత్రం, దినోత్సవంగా ఎప్పుడూ అవుతుంది అంటే  మన నైపుణ్యాలను ఆభివ్యక్తీకరించడం (బయటకు తీయడం) గమ్య స్తానంగా కాకా  ప్రయాణంగా చేసుకున్నప్పుడే అవుతుంది‌.
అందరు నిత్య నూతనం గా  *"స్వ-తంత్ర* దినోత్సవాలు"  జెరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను."

19 ఆగస్టు (2023)  
కెమెరా తన కంటితో 
ప్రకృతిని ప్రేరణను,
మన కదలికలను,
మనవారి కళలను
కళ్ళకు కట్టినట్లుగా 
అంకాత్మకంగా అందించే 
సాంకేతిక సాక్ష్యం
అనుభవ అనుభూతి
చిద్విలాస చెరసాల 
"చిత్రం" మన చిత్తమయింది. 
"ప్రపంచ చిత్ర వివరణాత్మక శాస్త్ర దినోత్సవం"

21 ఆగస్టు  (2021/2023)
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం/
పెద్దవారితో సాన్నిహిత్యం చాలా అవసరం. వారు మనకు కిటికీ లాంటివారు, వారి పక్కన ఉంటే వారి ద్వారా మన భవిష్యత్తును మనం చూసుకోవచ్చు. జీవితంలో వారు అనుభవించినవే మనం కూడా అనుభవించవచ్చు. వారి సాంగత్యంలో కొన్ని సంఘర్షణలు మనం అనుభవించకుండానే అర్ధమవుతాయి. మన అపరిపక్వత మరియు అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే తప్పులను మనం పట్టించుకోము, వాటి పర్యవసానాలను భరించవలసి ఉంటుంది. మనం ఏ పొరపాట్లు చేయబోతున్నామో అదీ కూడా వారు చూసి ఉంటారు. వారు చూసిన తప్పులు మన ద్వారా పునరావృతం కాకుండా "జాగ్రత్త పాఠాలు" చెప్పే శక్తి వారికి ఉంది. తద్వారా తప్పులను మనం ఎదుర్కోవాల్సిన అవసరం రాదు.

11 సెప్టెంబర్ (2022)
స్వాతంత్ర సమరయోధుడు తత్వవేత్త సంఘసంస్కర్త  గాంధేయవాది ఆచార్య వినోబా భావే (వినాయక్ నరహారి భావే) జన్మదినం (11-09-1895) నేడు.
విప్లవాల నాందికి, వ్యక్తిగత జీవితాల్లో ప్రకాశాలు ప్రవేశించడానికి, సమస్యల పరిష్కారానికి, ఆధ్యాత్మిక ధోరణి అహింస మార్గం ‌సమాధానమని సమంజసమని విశ్వసించేవారు. 
స్థిరత్వం దృఢత్వలు అహింసకు శక్తి అని అది విజయానికి మార్గమని, పిరికితనం మెతకదనంతో కూడిన అహింస ఆటంకమని ఉపోద్ఘాటించేవారు.
గాంధీజీ ద్వారా స్ఫూర్తి పొంది స్వతంత్ర పోరాట సమయంలో సర్వోదయ ఉద్యమం ప్రారంభించారు. కాలక్రమంలో స్వాతంత్ర అనంతరం భూదానోద్యమం ప్రారంభించారు. 
భూదానోద్యమంలో భాగంగా దేశ పర్యటనతో దాదాపు ప్రతీ పెద్ద భూకామందులను వ్యక్తిగతంగా కలిసి, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా వీలు రాసి పంచి పెట్టాడు మరియు దానం పొందిన రైతులు కనీసం 10 ఏళ్ల వరకు అన్న సాగు చేయాలని నియమం విధించాడు. 
దేశం నలుమూలల కాలినడకన పర్యటించి, తాను పెట్టుకున్న లక్ష్యానికి అధిగమించి, తన జీవితం చరమాంకానికి చేరిందని గ్రహించి తన ఆశ్రమంలో నిరాహారదీక్షతో శ్రీరామనామా జపంతో తనువు చాలించిన ఆచార్య వినోబా భావేకు తలుస్తూ తన జన్మదినం నాడు నివాళులు అర్పిస్తున్నాను.

02 అక్టోబర్ (2022)
గాంధీజీ నాకు ఒక శాస్త్రం లాంటి వారు.  గాంధీజీ వ్యక్తపరిచిన అనుభవాలు ఒక సుదీర్ఘ ఉద్దేశపూర్వక ప్రయోగ ప్రమాణ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఆహింసలో హింసాకాండ, శాంతిలో అభద్రతాభావం, బ్రహ్మచర్యంలో చంచలత్వం, నీతిలోని విమర్శలు ఉన్నా కానీ దాని ప్రమాణం సత్యాగ్రహ ఉద్దేశంతో స్వరాజ్య లక్ష్యంగా సాగింది. ఆ శాస్త్రం ఇబ్బంది పెట్టినా హుందాగా మధ్యస్థ సానుకూలంగా అనిపించింది. కొన్నిసార్లు నన్ను నేను వ్యక్తపరచడానికి ఆయన శాస్త్రంతో అనుసంధానం అవుతాను.

02 అక్టోబర్ (2022)
నిరాడంబరత, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నాయకుడు.
జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత నిండిన నినాదాలతో సైనిక వ్యవసాయ వ్యవస్థలను దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు"
తన ఆదర్శాలను అవలంబించడానికి త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధపురుషుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.

07 అక్టోబర్ (2021)
చిరునవ్వును  ఒక శాస్త్రంలా తీసుకుంటున్నాను, అది నిశబ్దంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఆపదలో మనల్ని నిదానింప చేసి నివారణ వైపు నడిపిస్తుంది
😊చిరునవ్వు దినోత్సవ శుభాకాంక్షలు🙂

16 అక్టోబర్ (2022)
ఆరోగ్యానికి ఆలంబన ఆహారం 
ఆస్వాదించే ఆహ్లాదం ఆహారం
అలవాట్లకు అంకుశం ఆహారం
అందానికి అవకాశం ఆహారం 
ఆనందానికి అనుసంధానం ఆహారం

ఆకలికి అవకాశం అందించి, 
అభి'రుచితొ అందలం అక్కరకుచేరుస్తూ, 
అప్పుడప్పుడు ఆయాసం అందించి, 
ఆహా అనుభూతిని ఆహ్వానించే,  
ఆహారాన్ని ఆదరిస్తూ ఆ-దానికి 
అనుగుణంగా అనుసంధానం అవ్వాలని ఆశిస్తూ...
"అందరికీ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు"

14 నవంబర్ (2022)
అందరిలాగానే అప్పట్లో
అందరికీ ఆనందాన్ని 
అందించే అమాయకమైన 
అందాన్ని అస్తిత్వాన్ని.....!
అందరిలోను గుప్తంగా ఉన్న పసిపిల్లలకు జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు
------------
పారవశ్యంతో ప్రపంచానికి  (2021)
ప్రేమ పంచగల 
పిల్లల పసి హృదయం 
పరమానందంతో పావనమవ్వాలని ప్రార్థిస్తున్నాను

20 నవంబర్ (2022)
"బాల్యం బలాన్ని బహుకరించింది.
శైశవ స్వభావ శక్తి, శాంతింపజేస్తోంది.
పసితనం ప్రమాణా ప్రేమ పంచుతోంది"
(పిల్లల పసి నవ్వు  ప్రేమ (ఆహ్లాదానుభూతి) ఇస్తోంది మరియు వారి స్వభావం, శక్తి అయిన అమాయకత్వం మరియు తాజాదనం నన్ను శాంతింపజేస్తోంది)

వారికి విశదమైన వున్నత విశేష 
విద్య వినమ్ర వినోదంగా వుండాలని 
వుంటుందని విశ్వసిస్తూ.....
మనలో కూడా చిన్నగా ఉన్న చిన్నపిల్లలు మనస్తత్వానికి 
"విశ్వ బలల దినోత్సవ శుభాకాంక్షలు" తెలుపుతున్నాను

23 డిసెంబర్ (2022)
స్వేదంతో సేద్యాం సేస్తూ (వ్యవ)సాయంగా
సమాజానికి సమర్పిస్తూ
అనామకంగా అందరినీ 
ఆదరిస్తూ ఆహారాన్ని 
అందించే అన్నదాతలకు 
అభినందనలు 
అన్నదాత చిరంజీవా!!
ఆరిగించేవారు సుఖీభవ!!
వారిదైన ఈ వారాన 
కృషీవలులకు కేవలం 
మాటల మధ్యమంగా 
కృతజ్ఞతలు 

02 January  (2021)
The caterpillar grows its wings during the time of solitude. Like that in my solitude, with my understood transparency and Discretion I'm expressing my introvertional intents through the Social Media (Social Diary) platforms and it's helping for my incredible inherent insights.
On this introverts day, I'm expressing out my gratitude to Social Media (Social Diary).
Thank you Meta (Facebook/WhatsApp).

12 January (2019)
Happy Youth (Adult) Day, to you all. I am inviting you all to celebrate this naional Youth Day with Positive hope and responsibilities by thinking about our family and society.
Now I am going to enter into this day called "National Youth Day by recollecting Dr. A.P.J Abdul Kalam words, "Youth itself will become the criteria for National Development", because they have powerful present with strength, that will make a way for flourishing Future. As a youth (Adult) trying to know my abilities and recall my potential to build and rebuild my energetic strength for rebuilding a Positive nation.

26 January (2020)
The word "Re" means About/Concern
The word "Public" means "Treating your self by thinking about you as whole people"
By taking these definitions from different sources,  I'm interpreting Republic idea as "Having/Keeping concern on people in my thoughts and works.
When I focus on people's (Including nature) happiness, then I feel, I have right to wish you a Happy Republic Day.

30 January (2017)
How I born is not much important, how I die is also not important. But How I live is very much important. That living gives much importance to both Birth and Death. Human (My) character is not decided by birth and death (Actions between Birth & Death).
Gandhi was born in normal family but by his actions we the people called him Mahatma Gandhi. I think every leader raised from problem itself (The problem of dependence made Gandhi as a Great Leader). By this We can say that problem is a problem for society, but for Leaders problem is an opportunity. We (I) will try to be a Positive Leader to achieve happiness for society by considering self.

21 February (2022)
Happy International Mother-Tounge Day
We all love motherhood, but we will love and responsible towards our mother.. Can we take the responsibility of all mothers? There is respect and we can help when there is need..
Telugu language is my mother tongue, so I have love and responsibility. Leaving Telugu language aside for a while, I like to study Linguistics.
Is the language adequate for today's needs? Not enough. Traveling with a language leads to exposure to new words. I feel that if you have mastery over language, you will have the broad mind to create new words.
The enmity between languages ​​should be eradicated at least slowly. And we must go to literature depths to facilitate for our easy communication and can enjoy the beauty in literature.
The world is growing rapidly. Language, like the roots of a tree, must be touched to tradition and need to transform by adapting more words from its or near linguistic family.
It seems to me that English and Hindi are growing rapidly by adopting words from other languages. English Jungle came from the Hindi word jungle. Mango word came from Malayalam. English has adopted many such words from other languages.
The modern language in our India is Hindustani (Urdu Hindi), thise two dialects are very similar, but scripts are different. it adopts Urdu scripts from Sanskrit to Hindi and Arabic and goes on to create a new entity. It seems to me that the power of acceptance is the source of holistic growth.
Focusing on other languages ​​makes the mind more conscious and enhances cognition. When I learned English, my proficiency in Telugu increased..

08 March (2019)
Everyday is for Everyone and for mostly Everything. But Everyday we can't conscious on Every Subject. That's why I feel, there is a need for a day to acknowledge and appreciate it. 
On 19th November, formally need to concious, appreciate, acknowledge on Men's Id-entity. On 8th March, formally need to conscious, appreciate, acknowledge on women's Id-entity.  
Mutually, Men and women both have vital roles in making world happy. In them Who is the first/great means... I feel, Men is seed and Women is Tree-fruit. Till now I feel, there is no empirical practical evidence to prove who and which is first/great (Either seed/men, or fruit/women). All (Both) have their strengthening power mutually and equally.
Now it's time for me to acknowledge and appreciate women with William Golding's words, as a medium I want to praise the women and also want to consciously feel the importance of women in society. Whatever men/he give to women, she will make that thing great 
1} When Men give sperm to Women, she makes that into a baby.
2} When he gives groceries to her, she will make a meal
3} When he gives a house, she will make that as a home
4} Beware when men give a crap, she will gives shit.
Whatever Men gives to her she multiplies and gives to us.
Wishing you a very warm Women's Day wishes to you all women.
---------
Happy women's day to you. (2019)
This formal "International women's day" is triggering me to become the change in what I want to see on this gender issue
From this day onwards, I will try to increase my respect and concern towards  you all 
A letter to women

20 March (2021)
🙂 Smile 😊
A Delight Curve on face, can Level lot of Self's Subjects in Straight mode
Happy Happiness Day

21 March (2022)
In equinox, sunrise/sunset happens at exact parallel time So That Equal day and night comes. Equinox Balances Time Equally makes full with its elements. 
Between birth and death the delights and disturbances are definite. Like Equinox need to Equally Balance the Dualities. 
Wishing you an with Equilibrium harmonious and happiness relationship with Dualities. 

22 April (2020)
My Self-Social Note on Earth Day
I feel, This year, we the  majority of public is Embodied the Environment Protection by sitting in their homes. The Purpose of World Earth Day is Exemplified.
On 22 Apr 1970, 50 years back, to demonstrate support for Environment Protection,  UNO decided to conduct Earth Day Event in all over the world. 
Till in these 50 years,  some many minimal people Demonstrated Environment Protection. But this year, I feel, the world's majority people exemplify nature protection by sitting in  home.
Partly Enjoyed this Earth Day. As a Lover of my Nature mother. This is the best Positive Part of you Covid. Thank you very much

31 May (2023)
The government is allowing the cultivation, production, sale and monetization of tobacco and is also advertising on packets, movies and serials that "tobacco is injurious to health". It's not like the government itself told you to take tobacco just because it has given permission, it's not telling you to stop immediately because it's advertising that it's harmful.
It means giving freedom and saying/doing both good and bad.  Understanding, practicing depends on our discretion
Wishing for World of No Tobacco (Less) Day.

08 June (2022)
The ocean is a testimony, it has more wonders and the rare objects than in the world's museums. The water has a memory. If you dip a rose in a glass of water, every drop of water in that glass will have a record of that rose. If a drop of water remembers this much, how much more will an ocean remember. Our brain has 70% water. So our memories/knowledge are also stored in the water? Don't know!. 
Salt water is also found in our body and in the ocean also. That is why we feel that there is some connection with the ocean (sea).  Our DNA feels happy when the ocean waves hit it.  If we sit in front of the sea, we can feel that both the mind and the ocean are talking like mother and child.
The cyano bacteria present in the ocean (sea) are called green algae.  We all came from that bacteria. It was born in the ocean (sea).
Ocean Day Wishes to all 

14 June (2023)
Donating blood is a few minutes work for us but a Life Line for others in need. 

30 June (2023)
Basically I'm an "Introvert", and now I'm an 'In-Extrovert" because of this Social Media. 
I'm sharing my feelings and expressions through this and becoming transparent
The caterpillar grows its wings during the time of solitude. Like that In my solitude, with my understood transparency and Discretion I'm expressing my introvertional intents through the Social Media (Facebook/WhatsApp) platforms and it's helping in increasing my incredible inherent insights. 
On this social media day, I'm expressing out my gratitude to Social Media (Social Diary).
Thank you Facebook (WhatsApp).

01 July (2019)
Guardians of Health (Doctor) & Wealth (CA/Auditor)
I'm blessed to get services from you 
Happy Doctors & Charted Accountants Day

29 July (2023)
There is an inextricable relationship between nature, tiger, forest and humans.   If there are forests only.. we will get clean air and abundant rains.  Human survival becomes questionable if forests will degraded. Human survival is closely linked with forests.
Where there is one tiger in one  range, there is no other tiger.  Each tiger regularly travels about 40 to 70 km in the forest.  The distance wanders. If there are More tigers means there is more forests.
The tiger controls the number of herbivore by attacking other animals and to save trees and rare plants in the forest. If the tigers do not control the herbivores, the rare plants and flora will become extinct and the ecological balance will be disturbed.  (A tiger hunts an animal and does not eat it all at once. It stores it in a place. It eats bit by bit for a week).
--------
15 August (2020)
Our country has achieved Political Social independence, with armed battles and non violent practices by the medium of many open and secret great people. With that joy and happiness I wish you a happy 74th independence Day.
We got political social independence . But I feel personally self didn't get freedom (Emancipation). To get personal freedom I feel self need to understand the independence. 
Personally Self will get Independence when s/he participates in Freedom Movement. 
In this freedom movement self need to Move on with transformative manifestation of his/her unique capabilities by thinking about "Self in Society". 
As a Medium wishing Inner-Self (God) will give Energy for Transformative Manifestation of Self- uniqueness. 
With the thoughts of "manifesting of our own capabilities" wishing you Happy Independence Day
-----
(2014)
Due to the freedom fighters we got independence.
They did social change. By changing themselves.
They are many and many freedom fighters we have to remember them at least on Independence Day, Republic day & on their birthdays we have follow their rules for their satisfaction & welfare of our country also.

19 August (2023)
World Photography Day/
The "Photo" is Joyfull Jail of our Memories, it's the technical evidence that the camera with its eye digitally provides 'Innate (Nature), Inspiration, Our movements and our beloved art's"

21 August (2023)
World Senior Citizens Day
Relationship with elder people is very important for our life. They are windows to us. We can see our future from their side. We can experience what they experienced in life. In their company, some of the conflicts can be understood without us experiencing it. Due to our immaturity and inexperience we neglect our mistakes in life and have to bear the consequences. They would have seen what mistakes we were going to make. They have the Energy to teach us "Caution lessons" So that we do not need to face those mistakes. 

05 September (2020/2023)
Since infancy, in direct and indirect modes, through many people and subjects, by their active and passive positive contributions to life, they made me the person where I am Today. Thank you for your teachings,
Even though I didn't recognize many, In an "Abstract Broad" way I'm considering everyone and each subject of you as my teacher. 
Now It's worth remembering my institutional teachers of me. For their Professional Teaching throughout my schooling and onwards too....
The teachers whom I remember is 83...:

02 October (2022)
Gandhiji is like a science to me. Experiences, manifested by Gandhiji is a long deliberate standerd experimentation journey. In that journey there is violence in non-violence, insecurity in peace, restlessness in celibacy, criticism in ethics.  But for this strong base is Understanding Truth (Satyagraha) for freedom (Swaraj). His science is troubling but sobering,  medium optimistic. Sometimes I connect with Him to express myself through his science.

07 October  (2022)
I take, Smile as a science, that Silently signifies the steadiness, by making us slow to look at steps in strenuous situations. 
😊 Happy Smile Day 🙂

15 October (2020)
Dr. A.P.J.Abdul Kalam quote form "Wings of Fire" One Good book is equal to 100 friends, but one best friend is equal to a Library.
It is a Practical Experience for me with some many friendly people and institutions, that conversations and connections through the discourses and discussions made myself Immerse in the library of contentment.
Happy to be the student of some friendly people and institutions. 
On this World Students Day (Abdul Kalm Birthday). My Tangible Tributes to the International Intimate Teacher (Dr. A.P.J. Abdul Kalm) and other teachers. Thanks for teaching teachers. 
It's worth to mention some characters companionship with them I felt like I was/am in Library Vamsikrishna Anil Ashwin  Kumar Shyaama Gulshan Digeswar Meera Mahalakshmi Rinkesh Sukesh Kumar Shrikant Pradhan Pragya Megha, Sukanya.. 

31 October (2021)
On Birth Anniversary of Sardar Vallabhbhai Patel I'm remembering and sharing the motive of him to join in Freedom movement. This whole process is like a Butterfly effect with the friend words. 
In those days only, Sardar Vallabhbhai Patel through his legal career he earned millions and became rich. Initially he don't have any interest in Freedom movement and on Gandhi's methods
Oneday he is playing game in a rich club. A friend of him came and told Patel that Gandhi came to Ahmedabad to address the people for freedom of the nation. To that, Patel responded by saying "By listening the speech, we will not get Freedom". His friend countered Patel by saying "If we sit here and play the game, our country will get Freedom know?" 
Those words effected Patel and made him to attend Gandhi's speech, and there Gandhi's speech stimulated him, hence he joined in Gandhi's Non-violence path and helped in bringing independence to the country and later United the States to make India as union of States
--------
(2018)
Today is Birthday of our first "Home Minster" commonly referred as "Iron Man of India" Sarbar Vallabhbhai Patel.I want to call him as "Master of Integration for Unity of India" because of his aggressiveness towards our Indian solidarity, made me to call him like this "Master of Integration for Unity of India". Now if we feel that solidarity in between us (Family and Nation) I think, that unity will be our best birthday gift to him 

01 November (2022)
We are in federal form with Union Spirit. 
It's the spirit of Unity in Diversity....
Happy State Formation Day to the specific ones....
Andhra Pradesh, Chattisgarh,  Haryana, Madhya Pradesh,  Karnataka, Kerala,  Punjab, Tamil Nadu....

19 November (2020)
During BSW, In my social Work profession class, Sunanda Madam taught us on domestic violence against men. 
After hearing this term only we expressed our mirt. 
After our laugh, She told us "That's why they're (men) not expressing their depression. Domestic violence, sexual exploitation is there in every gender. As a social work professionals we need to maintain empathy." 
After hearing this issue from with reflections, I slowly started getting Rid from my Rigid stereotypical mind. 
For me, Men' Day is the Emblem of Empathy.
In my perception, Men is seed and Women is fruit. Mutually both have vital roles in making world happy. Till now there is no empirical practical evidence to prove who and which is first/great (Either seed/men, or fruit/women). All (Both) have their strengthening power equally and mutually.
On 19th November, formally we (I) need to conscious on Men's Id-entity. On 8th March, formally we need to conscious on women's Id-entity. Now it's time for me to conscious on men's identity. 
Happy Men's Day

22 December (2020)
On this "National Mathematics Day"
It's my Tangible Tributes to Marvelous Mathematical Master Srinivasa Ramanujan 
(https://youtu.be/GNIa7nLEVfs)
Date Month Century Year
D      M     C      Y
Y+1 C-1 M-3 D+3
M-2 D+2 Y+2 C-2
C+1 Y-1 D+1 M-1
It is the Magnificent Mathamatic Masterpiece of Srinivas Ramanujan.
In each straight and Diagonal columns and rows; Exact Corners and Middle Numbers if you sum it the net result will be the Same.
For example, I have taken one D.O.B 10 May 1995
10 05 19 95
96 18 02 13
03 12 97 17
20 94 11 04
In each Straight and Diagonal Coloums/Rows; In Exact Corners and in Middle Numbers if you sum it the net result is 129. 
Like the magic formula of Ramanujan. "God/Time/ has set the formula in life with additions and subtractions to get the well-organized NET result.  So, try to be the energy to trust and enjoy the process of additions and subtractions in life to get unique well organized result."

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao