Gandhiji & Lal Bahadur Shastri
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
🙂 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి🙏
మహాత్మా గాంధీ నాకు ఒక శాస్త్రం లాంటి వారు. గాంధీజీ వ్యక్తపరిచిన అనుభవాలు ఒక సుదీర్ఘ ఉద్దేశపూర్వక ప్రయోగ ప్రమాణ ప్రయాణం.
ఆ ప్రయాణంలో ఆహింసలో హింసాకాండ,
శాంతిలో అభద్రతాభావం,
బ్రహ్మచర్యంలో చంచలత్వం,
నీతిలోని విమర్శలు ఉన్నా కానీ
దాని ప్రమాణం సత్యాగ్రహ ఉద్దేశంతో
స్వరాజ్య లక్ష్యంగా సాగింది.
ఆ శాస్త్రం ఇబ్బంది పెట్టినా హుందాగా మధ్యస్థ సానుకూలంగా అనిపించింది. కొన్నిసార్లు నన్ను నేను వ్యక్తపరచడానికి ఆయన శాస్త్రంతో అనుసంధానం అవుతాను.
---------
నిరాడంబరత, నిజాయితీకి
నిలువెత్తు నిదర్శనంగా
నిలిచిన నాయకుడు.
జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత
నిండిన నినాదాలతో సైనిక
వ్యవసాయ వ్యవస్థలను
దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు"
తన ఆదర్శాలను అవలంబించడానికి
త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడైన
లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ
వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖02.10.2023✍️
❤️❤️❤️❤️
ReplyDelete